Jump to content

నాగర సర్వస్వం/వ్యానతకరణ భేదములు

వికీసోర్స్ నుండి

పేరు. విలంబితము అనగా వ్రేలాడునది. ఇందు భార్య భర్తయొక్క కంఠమును గ్రహించి వ్రేలాడుచు రమించును. అందుచే దీనికీ పేరువచ్చెను.

6. జానుకూర్పరబంధము :- భార్యఏగోడనో ఆనుకొని కొంచెము ఏటవాలుగా నిలచియుండగా - భర్తఆమెను సమీపించి - చేతులతో ఆమెకంఠమును కౌగలించుకొని - తనకాళ్ళతో ఆమె మోకాళ్ళను పెనవైచి ఉన్నతమైన పురుషాంగము కలవాడై రమించుచో ఆస్థితి 'జానుకూర్పము' అనబడుతుంది. జాను, కూర్పర శబ్దములకు రెండిటికి మోకాలు అనియే అర్థము, ఇందు ఆలుమగల మోకాళ్ళు పెనవైచుకొని ఉంటాయి. అందుకే దీనికీ పేరువచ్చినది.

వ్యానతకరణ భేదములు

వనిత తనచేతులను తనపాదములపై ఆన్చి వంగినిలచియుండగా (ఈస్థితియందామె పై శరీరము మిక్కిలిగా వంగుతుంది, దిగువ శరీరము నిటారుగా నిలచి ఉంటుంది) పురుషుడామెను వెనుకనుండి సమీపించి చేతులతో ఆమె కడుపును పట్టుకొని వెనుకనుండియే అంగమును యోనియందు సంవిశితముగావించి రమించుటకు 'వ్యానతకరణము' అనిపేరు. పశువుల రతిక్రీడవంటిదగుటచే దీనిని 'పశుకరణము' అని కూడ పేర్కొంటారు.

ఇట్టిదైన రతిక్రీడ మరుదేశమునందును (నేటిరాజస్థానము) సింధుదేశమునందును (నేటి పంజాబుదేశము, పశ్చిమ పాకీస్తానము) కురుదేశమునందును (నేటి కురుక్షేత్రమునకు సమీపదేశము) మిక్కిలిగా ఆచరణలో ఉన్నది. ఇవికాక మిగిలిన ప్రాంతములయందిట్టి రతిక్రీడ అరుదుగా కానవస్తుంది. ఈ కరణభేదములు ధేనుకబంధము (ఆవువలె కలయుట) ఐభబంధము (ఏన్గులవలె రమించుట) మొదలగు పేర్లతో ప్రసిద్ధములై ఉన్నాయి. కాని ఇందు 'వ్యాఘ్రస్కందము ' అనే బంధభేదము ఒక్కటి మాత్రమే తెలుపబడినది. 1. వ్యాఘ్రస్కందబంధము : ఈ బంధము వ్యానతకరణములలో చేరినదైనను ఆలుమగలు శయ్యను విడువనక్కరలేదు. వనిత శయ్యపై వెలికిలగా శయనించి యున్నదై తన పార్ష్ని భాగములను (తొడలయొక్క ప్రక్కభాగములు, చట్టలు) చేతులతో గ్రహించి తన జఘనభాగమును (మొలయొక్క ముందుభాగమును, యోనిద్వారదేశమును) బాగుగా వెల్లడియగునట్లు చేయగా - పురుషుడామెను తొడలను ఆమె ముఖము మీదుగా బాగుగావంచి రమించుటకు వ్యాఘ్రస్కంద మనిపేరు. దీనియందు - స్త్రీకి క్లేశము ఎక్కువ. అయినను అభ్యాసముచే సుసాధ్యం అవుతుంది. పులుల రమణ మిట్లుండుటచే దీనికీ పేరు వచ్చినది.

ఇట్టివైన ఈ ఐదు కరణములయందు మొదటిదైన ఉత్తానకరణమునందే స్త్రీకి ఆనందము ఎక్కువ. ఎందువల్లననగా ఉత్తానకరణమునందు పురుషాంగముచే యోనియు పురుషుని చేతులచే స్తనాదులు కూడ ఒకేసమయమున మర్ధింపబడతాయి. అంతేకాక దీనియందు స్త్రీకి క్లేశముకూడ తక్కువ. నీచరతులయందు సర్వదా ఉత్తానకరణమే ఆచరింపదగినది.

ఇక రెండవదైన తిర్యక్కరణమునందు భార్య ప్రక్కవాటుగా శయనించి ఉంటుంdi. అందుచే ఆమెయొక్క పిరుదుల బరువుచే యోని ముఖమునందొక బిగువేర్పడి, ఆ స్థితియందు భర్త కలియగా అతని పురుషాంగము యోని పార్శ్వములను మిక్కిలిగా ఒరుసుకొనుటచే ఏదో తెలియని వింత ఆనందము కలుగుతుంది. స్త్రీ యోని కంటె పురుషాంగము పెద్దదైన ఉచ్ఛరతుల యందిది మిక్కిలి సుఖాన్ని అందిస్తుంది.

మూడావదైన ఆసీనకరణమునందు ఆలుమగలు కూర్చుండి రమించుట జరుగును. గనుక - ఒకరికొకరు కౌగలించుకొనుటకు చుంబన - దంతక్షత - నఖక్షతాదుల నాచరించుటకు సౌకర్యం ఎక్కువగా ఉండి రతిక్రీడ ఆనందప్రదం అవుతుంది.

ఇక ఉత్థాతకరణములు క్లేశకరములగుటయేకాక తగినంత నేర్పులేక ఆచరించుట వలన రోగకారకములుకూడ అయిఉన్నాయి. అందుచే వానిని లోకము ఎక్కువగా ఆచరింపదు.

ఐదవదైన వ్యానతకరణము లేక పశుకరణము స్త్రీ తనయొక్క కటిభాగమును మిక్కిలిగా సంచలింపజేయుటకు, యోని ముఖమును మిక్కిలిగా వెల్లడించుటకు వీలు కలదగుటచే స్త్రీ యోనికంటె పురుషాంగము చిన్నదైన నీచరతులయందు ఆనందప్రదం అవుతుంది.

రతిక్రీడయందు పురుషుడు అలసినపుడు స్త్రీ పురుషునిమీద అధిరోహించి స్వయముగా పురుషునివలె ప్రవర్తిస్తుంది. దీనిని ' పురుషాయితము ' అంటారు.

ఈ చెప్పబడిన వానికంటె భిన్నములైన రతిభేదములు ఎన్నియో ఉన్నాయి. అవి ఉత్తమములు కాకుండుటచే నాగరకజనం వాని యందాసక్తి చూపరు. అందుచే అవి యిందు పరిహరింపబడ్డాయి. కాని ఏకరణభేదమును అవలంబించినా పురుషుడు క్రమం తప్పకూడదు.

శ్లో|| దర్శనేన రతిం కృత్వాస్త్రియః స్పర్శన మాచరేత్ |
    స్పర్శేన ద్రవ ముత్యాద్య శవై స్సంభోగ మాచరేత్ ||

అనగా పురుషుడు స్త్రీవంకకు చూచే చూపులోనే ఆమెకు తనయందు ప్రీతి కలిగించాలి. అలా ప్రీతి కలిగించిన మీదటనే ఆమెను స్పృశించాలి. తనయొక్క స్పర్శచేతనే ఆమె యోనియందు ద్రవించేలా స్పృశించాలి. అనంతరం నెమ్మదిగా సంభోగానికి ఉపక్రమించాలి. ఇది క్రమం. ఈ క్రమం తప్పకూడదు. మరియొక క్రమం కూడ చెప్పబడ్డది.

శ్లో. అశ్లేషం ప్రధమం కుర్వాత్ ద్వితీయం చుంబనం తధా!
    త్వతీయం నఖఘాతశ్చ దంతఘాత శ్చతుర్ధకమ్!
    క్షేపణం పంచమం ప్రోక్తం షష్ఠం ప్రహరణం తధా
    సప్తమం కంఠ శబ్దశ్చ వధ్వాఖ్యం చాష్టమం రతమ్!

అనగా మొదట ఆలింగనము, తరువాత చుంబనము. చుంబనమునకు పిమ్మట నఖక్షతము, దాని తరువాత దంతక్షతము. ఈ నాలుగు ఆచరింపబడినమీదట ఐదవక్రియ పురుషాంగము యోనియందు సంవిశితము చేయుటయై ఉన్నది. ఆరవది ప్రహరణము. ప్రహరణము అనగా కొట్టుట. ఆలుమగలు రతిక్రీడ నాచరించేవేళ హేలగా పురుషుడు భార్యను కొట్టుటకూట (అనగా గట్టిగా కాదు) జరుగుతుంది. దానికే ప్రహరణ మనిపేరు. సంభోగము ఆరంభము కాకపూర్వమే పురుషుడు భార్యను ప్రహరించుట కూడదు. అట్లాతడు ప్రహరించినమీదట భార్య తనకు నొప్పి తోచినను తోచకున్నను 'అబ్బ! అమ్మా! ఇస్ ' ఇత్యాది ధ్వనులను ఆచరిస్తుంది. వీనికి కంఠశబ్దములనియు నిరుతములనియు పేరు. ఈ కంఠశబ్దములు ఏడవక్రియగా ఆచరించబడాలి. ఆలుమగలు ఈ క్రమాన్ని గుర్తించి రతిక్రీడాపరులై ఆనందించాలి.

ఇక్కడ వేరొక విషయము కూడ తెలిసికొనవలసి ఉన్నది. పురుషుని రతిక్రీడాదక్షతకు అతని వీర్యము కారణము. మానవుడు స్వీకరించు ఆహరము మొదట రసముగా మారుతుంది. ఆ రసమే నెత్తురుగా మారుతుంది. నెత్తుటినుండి మాంసము, మాంసమునుండి మేధస్సు, మేధస్సు నుండి మజ్జ, మజ్జనుండి ఎముక, ఎముక ద్రవించి వీర్యము జనిస్తాయి. రస - రుధిరమాంస మేధస్ - మజ్జా - అస్థి - వీర్యములనే ఈ ఏడింటికి ఏడు ధాతువులనిపేరు. ఈ ఏడు ధాతువులయందు ఉత్తమమైనది వీర్యము. ఈ వీర్యము పురుషుని అండములయందు జనిస్తుంది. సంభోగ సమయమునందీ వీర్యము పురు షుని పురుషాంగమునుండి బయటకు వస్తుంది. అట్లు వీర్యము విస్సృతమైనపిమ్మట పురుషాంగమునందు శిధిలత ఏర్పడుతుంది.

పురుషుడు రతిక్రీడకు అభిముఖుడైనపుడాతని పురుషాంగము ఉత్థితం అవుతుంది. దానివలన అతని రతిక్రీడాభిముఖత, ఆతనిలోని ఆవేశము వ్యక్తం అవుతాయి. కాని ఈవిధంగా స్త్రీయొక్క రతిక్రీడాభిముఖతను సూచించే లక్షణములేవీ బయటకు కనబడవు అయినను యోనియందు పురుషాంగము ప్రవేశించినంతనే వారియందు కూడ రతిక్రీడాభిలాష జనిస్తుంది.

ఇక సంభోగసమయమున పురుషుని ఆనందమునకు స్థానము ఆతని పురుషాంగముయొక్క అగ్రభాగమే అయిఉండాగా వనితకు గర్భాశయముఖము ఆనందస్థానమై ఉన్నది. ఆ గర్భాశయ ముఖము చించాప్రసూనము (చింతపూవు) వలె ఉంటుంది. పురుషాంగముయొక్క అగ్రభాగము ఆ గర్భాశయ ముఖమును తాకినంతనే వారికి కలుగు ఆనంద పారవశ్యము ఇంత అని చెప్పడానికి వీలులేనిదై ఉంటుందని ' రతికల్లోలిని ' అనే ప్రాచీన కామశాస్త్రకర్త అభిప్రాయమై ఉన్నది.

సంభోగారంభదశయందు భార్యతో రతికి తగిన ఆవేశమును కలిగించుటకు మదనచ్ఛత్రమును చేతితో కలచవలెనని వెనుక చెప్పబడినది. అట్లు కేవలము వ్రేలితో మదనచ్ఛత్రమును కలచుటయేకాక పురుషుడు తనచేతివ్రేళ్ళను భార్యయొక్క యోని యందు ప్రవేశపెట్టుటకూడ జరుగుతుంది. దానికి అంగుళీ ప్రవేశమనిపేరు. అది యీ దిగువ వివరింపబడుతోంది. ఈ పేజి వ్రాయబడియున్నది. యందు తనచేతి వ్రేళ్ళను ప్రవేశపెట్టుటకూడ శాస్త్ర సమ్మతమై యున్నది. దీనికే అంగుళీ ప్రవేశమనిపేరు. ఈ అంగుళీ ప్రవేశ విధానములు మొత్తం ఆరు. అందు మొదటిది కరణము.

1. కరణము:- భర్త భార్యయొక్క యోనియందు తన చూపుడు వ్రేలిని ప్రవేశపెట్టినచో దానికి ' కరణము ' అనిపేరు.
2. కనకము:- భర్త తన చూపుడువ్రేలిని తన నడిమి వ్రేలిమీద కెక్కించి భార్య యోనియందు ప్రవేశపెట్టినచో అది ' కనకము ' అనబడుతుంది.
3. వికనము:- కనకమునందువలెనే భార్యయొక్క యోనియందు ప్రవేశపెట్టిన వ్రేళ్ళను (చూపుడువ్రేలు, నడిమివ్రేలు) యోనియందేయుంచి మార్చుట - (అనగా నడిమి వ్రేలిమీదనున్న చూపుడువ్రేలిని దిగువచేసి నడిమివ్రేలిని చూపుడు వ్రేలిమీదకు ఎక్కించుట) మాటిమాటికి జరిగినచో అది ' వికనము ' అనబడుతుంది.
4. పతాక:- భార్య యోనియందు ప్రవేశపెట్టబడిన రెండు వ్రేళ్ళను ఒకదానికొకటి ఎడమగా విస్తరింపజేయుట ' పతాక ' అనబడుతుంది.
5. త్రిశూలము:- చూపుడువ్రేలు, నడిమివ్రేలు మాత్రమే కాక ఉంగరపువ్రేలిని కూడా భార్య యోనియందు ప్రవేశపెట్టి వానిని యోనియందే ఒకదానికొకటి ఎడము కావించినచో ఆస్థితి ' త్రిశూలము ' అనబడుతుంది.
6. శనిభోగము:- పైన చెప్పినవిధముగా భార్యయోనియందు ప్రవేశపెట్టిన మూడువ్రేళ్ళను ఎడముగాకాక దగ్గరగా చేర్చినచో ఆస్థితి ' శనిభోగము ' అనబడుతుంది.

ఈ అంగుళ ప్రవేశ విధానముల నారింటినికూడ పురుషుడు క్రమముగనే ఉపయోగించాలి. ఇట్లు అంగుళ ప్రవేశము చేయుటవలన వనిత ఎట్టిదైనను రతికి అభిముఖి అవుతుంది. ఆమెయందు సంభోగము కొరకైన ఒక పరమమైన విహ్వలత ఏర్పడుతుంది. ఈ అంగుళ ప్రవేశమువలన ఆమెయందు రతికొరకైన విహ్వలత ఏర్పడుతుందేకాని తృప్తి ఏర్పడదు. స్త్రీకి తృప్తి పురుషాంగ సంయోగముచేతనే లభిస్తుంది. ఈవిషయం పురుషుడు గ్రహించాలి. కేవలం అంగుళీ రతంతో మాత్రమే ఆచరించేవాడు పురుషాధముడు. రతిక్రీడయందు మిక్కిలి ఉత్సుకతను కనబరచని స్త్రీలవిషయమునందు మాత్రమే ఆవశ్యకత నెరిగి పురుషుడీ అంగుళీ ప్రవేశ విధానమును ఆచరించాలి.

క్రీడా తాడనము

సంభోగసమయములో స్త్రీపురుషులు సంయుక్తయంత్రులై రమించుచున్నవేళ భార్యను ప్రేమతో పురుషుడు ప్రహరించుట (కొట్టుట) కూడ జరుగుతుందని వెనుక చెప్పబడ్డది. ప్రహరణ తాడన శబ్దములు సమానార్థకములు. సుందరములై స్త్రీయొక్క నాడీమండలమును స్పందింపజేయగలవైన తాడనభేదములు పదునొకండు ఇందు తెలుపబడుతున్నాయి. ఈ తాడనభేదములయందు మొదటిది శబ్దకర్తనము.

1. శబ్దకర్తనము :- శబ్దకర్తనము అనగా కత్తిరింపు శబ్దము. భార్యయొక్క శిరస్సు ఈ తాడనమునకు స్థానమై ఉన్నది. పురుషుడు భార్యను కలిసి సంభోగాసనాసీనుడైయుండి ఆమె శిరస్సు మీద క్రీడగా తాడనముచేయ నెంచినపు డీ శబ్దకర్తన విధానమును అవలంబించాలి. చేతివ్రేళ్ళు నాల్గింటిని గుప్పిడిగా ముడవకయే కొంచెము వదులుగావుంచి చిటికెనవ్రేలియొక్క పార్శ్వభాగము శిరస్సునకు తాకునట్లుకొట్టగా - మిగిలిన మూడువ్రేళ్లును వదలుగా ఉన్నందున ఒక దానిమీద ఒకటి పడినవై ఒక శబ్దమును జనింపజేస్తాయి. ఆ శబ్దము ' టాత్ - టాత్ ' అన్నధ్వనికి సమీపంగాఉంటుంది. దీనియందు వ్రేళ్ళయొక్క స్థితి కత్తెరయొక్క స్థితి సన్నిహితంగా ఉంటుంది. పుట్టేశబ్దముకూడ కత్తిరింపుశబ్దాన్ని పోలిఉంటుంది. అందుచే దీనికీ పేరువచ్చినది.

2. ముష్టితాడనము : భార్యతో కలిసి రమించుచు భర్త తనచేతివ్రేళ్ళను పూర్తిగా గుప్పిడిగా మడచి ఆమెను తాడించినచో ఆ తాడనము 'ముష్టితాడనము' అనబడుతుంది. భార్యయొక్క పిరుదులు పృష్టము ఈ తాడనమునకు అర్హస్థానములై ఉన్నాయి. ముష్టి అనగా పిడికిలి. పిడికిలిలో చేయబడే తాడనమైనందున దీనికీ పేరువచ్చినది.


3. విద్ధకము : ఒకదెసగా ప్రయాణం చేస్తూవున్న వస్తువు (ఏకాంతికిరణమో) మరియొకదెసగా ప్రయాణంచేసే వేరొక వస్తువును (ఏకాంతికిరణమునో) ఢీకొనుట జరిగితే దానికి వేధ అనిపేరు. అట్టిదైన వేధాలక్షణముతో కొట్టుటకే విద్ధకమని పేరు. భర్త తనయొక్క కాలిబొటనవ్రేలితో భార్యయొక్క బుగ్గను వేధించుట విద్ధకము అనగా దీనికి భార్యయొక్క చెక్కిలిస్థానమనియు, పురుషుడు తనకాలి బొటనవ్రేలితో ఈతాడనం ఆచరించాలని గ్రహించాలి. కొన్ని సంభోగాసనములయందు భార్యయొక్క తొడలు పైకెత్తబడియుండగా పురుషుడామెను కూడువిధానములు చెప్పబడినవి. అట్టిస్థితియందు భార్య కొంత నిరుత్సాహముగాగాని, మరేకారణముచేతగాని తనముఖమును ఒకవంకకు వ్రాల్చియుంచుట సంభవించినచో - పురుషుడు సంభోగాసనమును వీడకయే ప్రయత్నపూర్వకముగా తనపాదము నామె ముఖము వద్దకు గొనిపోయి కాలి బొటనవ్రేలితో ఆమెముఖమును తనకు అభిముఖమగునట్లు మీటుట ' విద్ధకము ' అనబడుతుంది.

4. ఆదీపితము : ఆదీపితము అనగా అంతటను ప్రజ్వలింపసేయబడినది. పురుషుడు తన పిడికిలితో భార్యయొక్క సర్వశరీర మునందు కామాగ్ని జ్వలించునట్లు ఇచ్చట, అచ్చట అనక అంతట మర్దించుట, కొట్టుట జరిగినచో ఆతాడనము 'ఆదీపితము' అనబడుతుంది. కామము సర్వత్ర దీప్తమగుటకై చేయబడు తాడనమగుటచే దీనికీ పేరు వచ్చినది.

5. స్పృష్టకము : భార్యయొక్క శరీరమునందు భర్త కేవలము తన అరచేతితో అల్పముగా తాడించినచో అది 'స్పృష్టకము' అనబడుతుంది. స్పృష్టశబ్దమునకు స్పృశింపబడినదని అర్థము. ఈ తాడనము స్పర్శాప్రధానముగా ఆచరింపబడుతుంది. అందుచేదీనికి 'స్పృష్టకము' అనుపేరువచ్చినది.

6. కంపితకము : కంపనమనగా వడకుట. భార్యాభర్తలు కలిసి రమించుచుండగా భర్త ఒకానొక ఉత్కటావేశమునకు లోనై - ఆ అధికావేశము కారణముగా వడకుచున్న చేయికలవాడై - అట్లు వడకుచున్న చేతితో భార్యాశరీరమునం దచ్చట తాడించుట జరిగినను - ఆ తాడనము 'కంపితకము' అనబడుతుంది. భార్య తన సౌందర్యం ద్వారా భర్తయందు జనించిన అధికావేశాన్ని ఈ తాడనం ద్వారా గ్రహించినదై తానుకూడ దీస్తదీపంలా మెరుస్తుంది.

7. సమాక్రమము : పురుషుడు భార్యను కూడియుండి ఆమెయొక్క శరీరమునందు మాంసలములైన భాగాలను కేవలము చేతితో అల్పముగా నొక్కుట జరిగితే అది 'సమాక్రమము' అనబడుతుంది. పురుషుడు చేతితో భార్యాశరీరమును తాడించుటకాక ఆక్రమించుటమాత్రమే ఇందు జరుగుతుంది. అందుచే దీనికీపేరువచ్చినది.

8. బద్ధముష్టి : సమాక్రమమే మరికొంత గట్టిగా భార్యా శరీరము బాగుగనొచ్చునట్లు ఆచరింపబడితే అది 'బద్ధముష్టి' అనబడుతుంది. భార్యాశరీరమును చేతితో గ్రహించి గట్టిగా పిడికిలి బిగించుటకో అన్నట్లు వ్రేళ్లు నొక్క బడుటవలన దీనికీపేరువచ్చినది. భార్య దేహమునం దెచ్చటనైనను ఈ బద్ధముష్టి నాచరింపవచ్చును. 9. వేష్టితకము :- వేష్టనము అనగా చుట్టుట. తుమ్మెదలవలె నల్లగాఉండి, సువాసనలు విరజిమ్ము పూవులతో అలంకరింపబడిన భార్యయొక్క జడను చేతికి చుట్టుకొని లాగుట లేదా జుట్టులోని ఒక పాయను మాత్రము తనవ్రేలికి చుట్టి లాగుట- 'వేష్టితకము' అనబడుతుంది.

10. కృతగ్రంథ^ :- గ్రంథి అనగా ముడి. భర్త భార్యయొక్క చేతివ్రేళ్ళ సందులనుండి తన చేతివ్రేళ్ళను పోవనిచ్చి ఆమెచేతివ్రేళ్ళతో తన చేతివ్రేళ్ళను ముడివైచినట్లుంచి నొక్కుటజరిగినచో - ఆస్థితి 'కృతగ్రంథి' అనబడుతుంది. ఆలుమగల చేతివ్రేళ్ళు ముడివేయబడినట్లుండుటచే దీనికీపేరు వచ్చినది.

11. సమాకృష్టి :- ఆకర్షణ మనగా లాగుట. భార్యను గూడి రమించుచున్న భర్త ఆమెయొక్క చనుమొనను లేదా మెడమీది పలుచని చర్మమును తన చూపుడువ్రేలితోడను, బొటనవ్రేలితోడను (రెండువ్రేళ్ళతో మాత్రమే గ్రహించి లాగుట జరిగినచో అది 'సమాకృష్టి' అనబడుతుంది.

ఇట్లున్న ఈ తాడనభేదములయందు ఏడవదైన సమాక్రమము మొదలు పదునొకండవదైన సమాకృష్టివరకు చెప్పబడిన తాడనము లైదును నిజమునకు తాడనములు (కొట్టుటలు)కావు. అయినను వీనిచే భార్యయొక్క శరీరము తాడనమునందువలెనే నొచ్చుట జరుగును. అందుచే ఇవి ఇందు చేర్చబడ్డాయి. ఈ తాడనములన్నియు ఉచితవేళ ఉచితరీతిని ఆచరింపబడినప్పుడు భార్యాభర్తల సంభోగసౌఖ్యాన్ని పెంపొందిస్తాయి.

వీనివలన భార్యకు కొంచెంభాధకలిగినా తన శరీరావయవాలతో ఈవిధంగా భర్త తాడనపూర్వకంగా ఆడుకొనడం ఆమెకు ఆనందాన్నే కలిగిస్తుంది. అయినా ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి బదులు నొప్పినే అభినయిస్తూ 'ఇస్-అమ్మ-అబ్బ' మొదలగు ధ్వనులతో తన బాధను వ్యక్తంచేస్తుంది. ఈ ధ్వనులకు విరుతములని పేరు. అవి ఈదిగువ ప్రకరణములో వివరింపబడుతున్నాయి.

విరుత భేదములు

విరుతము అనగా విశేషధ్వని. సంభోగవేళ భార్యను తాను హేలగా తాడించగా ఆమె 'అమ్మా-ఇస్‌' మొదలగు విరుతాలను ఆచరిస్తే వానిని వినుటచే భర్తయొక్క హృదయములో ఏదో తెలియని ఆనందరేఖ నర్తిస్తుంది. అట్టి ఆనందమును కలిగించున దగుట చేతనే విరుతము ఆలింగన మాదిగాగల రతిభేదములయం దేడవ రతి భేదముగా చెప్పబడినది. ఈ విరుతభేదములు మొత్తము ఏడు. వానిలో మొదటిది స్తనితము.

1. స్తనితము :- స్తనితము అనగా మేఘధ్వని. అనగా ఉరుము. సంభోగసమయమున భర్త భార్యకు కొంచెము నొప్పి తోచునట్లు వర్తించినపుడు కృతకమైన కోపముతో ఆమె "ఊ, ఊ" అని పలికితే ఆధ్వని విశేషము స్తనితము అనబడుతుంది. అలా కోపసూచనకై ఉచ్చరించే ఊకారము జఠరదేశమునుండి ఊర్ధ్వశ్వాసతో వ్యక్తం అవుతుంది. ఈధ్వని మేఘధ్వనిని పోలినదగుటచే దీనికి 'స్తనితము' అను పేరేర్పడినది.

2. కూజితము :- పక్షులు ఆచరించే ధ్వని విశేషములు కూజితము అనబడుతాయి. కూత అను శబ్దము కూజిత శబ్దము నుండియే జన్మించినది. రతివేళ భార్య తృప్తిచెందినపుడామె కంఠమునుండి ఆమెకు తెలియకయే - మిక్కిలి ఉత్సాహముగానున్న పావురముయొక్క "కువకువ" ధ్వనిని పోలినధ్వని జనిస్తుంది. ఈధ్వని విశేషము ఆమెయొక్క పరితృప్తిని సూచించునదగుటచే భర్తయొక్క ఆనందాన్ని తరంగితం చేస్తుంది. తమకు రతియందు తృప్తికలిగినపుడు స్త్రీలు గొంతు సవరించుకొంటారు. ఆ సవరించుకొనుటలో ఇట్టిధ్వని ఏర్పడుతుంది.

3. శ్వసితము : - శబ్దము వినబడునట్లు నిట్టూర్చుటయే శ్వసితము. రతివేళ (ఏ పురుషాయితమునో ఆచరించి) అలసినదై భార్య సశబ్దముగ నిట్టూర్చుట జరిగితే అది 'శ్వసితము' అనబడుతుంది.

4. సీత్కారము :- బాధను అలసటను సూచిస్తూ 'ఇస్‌' అని కొంచెం దీర్ఘంగా పలుకబడే ధ్వని విశేషమునకే సీత్కారమని పేరు. రతివేళ అలసిన భార్య ఒక్కొక్కప్పుడు తన అలసటను సూచించుటకును, భర్త తన శరీరముమీద తీసుకొనే దోరనను నిషేధించుటకును ఈవిధమైన ధ్వనిని ఆచరిస్తుంది.

5. పూత్కారము :- మండని పొయ్యిని మండించుటకు 'ఉఫ్ ఉఫ్‌' అని ఊది మండించుట లోకవిదితమే. మానవుడు బాగా అలసినపుడుకూడా సరిగా ఇట్లే దగ్గరగాజేర్చిన పెదవుల మధ్యనుండి గాలిని విసర్జిస్తాడు. రతిసమయంలో బాగా అలసిన భార్య దగ్గరగాజేర్చిన తన పెదవుల మధ్యనుండి గాలిని విసర్జిస్తూ 'ఉఫ్‌' అన్నధ్వనిని ఆచరించుట 'పూత్కారము' అనబడుతుంది. పూత్కారమన్న పేరులోనే దాని లక్షణం ఇమిడిఉన్నది. రతిరహస్యమునందు పూత్కార లక్షణము భిన్నముగా చెప్పబడినది. చూ. రతిరహస్యం.

6. హింకృతము :- "హిక్" అను అక్షరములను ఉచ్చరించునపుడు జనించు ధ్వనివంటి ధ్వనియగుటచే దీనికి 'హింకృతము' అనిపేరు వచ్చినది.

రతివేళ భార్యలో ఒక తీవ్రాదేశము జనించి, ఆమె తన భర్తను ముద్దిడుకొనే వేగంలో ఈ హింకృతం పుడుతుంది. అనగా భర్తయొక్క ముఖము భార్యాముఖానికి కొంతదూరంలో ఉన్నది. ఆమెలో భర్త ముఖాన్ని చుంబించాలన్న కోరిక జనించింది. ఆమె తన ముఖమును భర్తయొక్క ముఖమునకు దగ్గరగా కొని వెళ్ళుటకు పూర్వమే నోరుతెరచి గాలిని లోపలికి పీల్చుచు - వేగముగా తన పెదవుల నాతని ముఖముపై చేర్చి చుంబించినది. అట్టి స్థితియందీ 'సింహకృతము' జన్మిస్తుంది. ఎట్లనగా ఆమె గాలి పీల్చువేళ జన్మించిన "హకార" ధ్వనివంటి ధ్వని. పెదవులు ఒక్కసారిగా భర్తయొక్క ముఖముమీద ఆన్చినంతనే "క్" అన్న ధ్వనితో సమాప్తం అవుతుంది. అందువలననే దీనికి 'హింకృతము' అన్న పేరేర్పడినది. రతిరహస్యకారుని హింకృతధ్వని లక్షణము దీనికంటె భిన్నమైనది. చూ - రతిరహస్యం.

6. దూత్కృతము :- మంచిముత్యము చేయిజారి మట్టినేలపై పడినపుడు "దత్" అన్న శబ్దం పుడుతుంది. సరిగా అట్లే రతివేళ భార్య భర్తను కృతకంగా "ధత్, దత్" అన్న శబ్దాలను పలుకుతుంది. అయితే అది రతిసమయముకనుక, ఎవరైనా వింటారన్న సంకోచముతో ఆమె ఆ శబ్దాలను చాలా అల్పధ్వనితో ఉచ్చరిస్తుంది. అపుడా శబ్దము "ఊత్, ఊత్" అనే శబ్దాలవలె వినిపిస్తుంది. ఇదుగో! భార్యాకంఠ నిర్గతమైన ఇట్టి ధ్వని విశేషము 'దూత్కారము' అనబడుతుంది.

రతిరహస్యమునందు "కూజతము" చెప్పబడలేదు. దానికి బదులుగా "రుదితము" (భర్తయొక్క చేతవలన నొప్పితోచి భార్య ఏడ్చుట) చెప్పబడినది.

ఈధ్వని విశేషములన్నియు సతీపతుల రతిక్రీడయందు ఆనంద వర్ధకాలై ఉన్నాయి.

చంద్రకళ

మన్మధునకు స్త్రీయొక్క సర్వశరీరము నివాసస్థలమే అయి ఉన్నప్పటికి ఒక్కొక్కరోజున ఒక్కొక్క ప్రత్యేకావయవమునం దాతనియొక్క స్ఫూర్తి అధికంగా ఉంటుంది. కామభానముయొక్క దైనరూపమే మన్మధుడు. అందుచే స్త్రీశరీరంలో ఒక్కొకరోజున ఒక్కొక అవయవంలో అధికస్ఫూర్తికలదై ఉన్నకామాగ్ని అచ్చట భర్తయొక్క స్పర్శ కలిగినంతనే భగ్గున ప్రజ్వలించి ఆమెయొక్క సర్వశరీరమునందు విద్యుద్వలయాలను సృష్టిస్తుంది. దానితో ఆమె విహ్వలయై వివశయై భర్త చేతులలోనికి ఒరిగిపోతుంది. ఇలా దినదినము స్త్రీ శరీరావయవములందు మార్పుచెందే కామము ఆకాశముమీద మనము నిత్యము దర్శించే చంద్రకళయొక్క వృద్ధి క్షయముల ననుసరించి వృద్ధిచెంది క్షీణించేదై ఉన్నది. అందుచే ఈమార్పుచెందే కళను చంద్రకళ అన్నారు. నిజమునకిది కామకళ.

ఈకామకళకు, స్త్రీయొక్క శరీరములో వామభాగము మాత్రమే నివాసస్థానమైఉన్నది. చంద్రుడు శుక్లపాడ్యమి మొదలు పూర్ణిమవరకు వృద్ధిచెంది, తిరుగ కృష్ణపాడ్యమినుండి అమావాశ్య నాటికి క్షీణదశకు వస్తాడు. అట్లే ఈ కామకళకూడ శుక్లపాడ్యమిరోజున వనితయొక్క వామపాదాగ్రమునం దున్నదై పూర్ణిమ నాటికి శిరస్సును చేరుకొని, తిరుగ కృష్ణపాడ్యమినుండి క్రిందకు దిగుటకు ఉపక్రమించి, అమావాస్యనాటికి మరల యధాస్థానమునకు అనగా వామ పాదాగ్రమునకు చేరుకొంటుంది. అనగా తిధులనుబట్టి యీ కామకళా స్థానాలను గుర్తించాలి.