Jump to content

నాగర సర్వస్వం/తిర్యక్కరణ భేదములు

వికీసోర్స్ నుండి

20. నాగపాశబంధము : యువతి శయ్యపై వెలికిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళదగ్గర మడచి, తిరుగ వానిని తొడలయొద్ద మడచి - తన మోకాళ్ళు తన స్తనములయొక్క పార్శ్వభాగములను తాకుచున్నస్థితిలో తన రెండుచేతులను తన రెండు మోకాళ్ళ సందులలోనుండియు రానిచ్చి - ఆ చేతులను రెంటిని తనయొక్క కంఠముయొక్క దిగువభాగమున ఉగ్గిలిపట్టుగా బంధించి యుంచినపుడు పురుషుడామెను కూడుట నాగపాశబంధ మనబడును. రతిరహస్యమునందీ బంధము భిన్నముగా చెప్పబడెను. చూ. రతిరహస్యం.

తిర్యక్కరణ భేదములు

భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా పురుషుడామెను కూడి రమించుట తిర్యక్కరణమనబడునని వెనుక చెప్పబడినది. ఈ స్థితియందేర్పడే ఉత్తమబంధ భేదములు ఏదు. అందు మొదటిది సంపుటబంధము.

1. సంపుటబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా భర్త ఆమె కభిముఖముగా ఆమెవలెనే ప్రక్కవాటుగా శయనించినవాడై ఆమెనుకూడి రమించుటకు 'సంపుటక బంధము' అనిపేరు. ఇందు ఆలుమగల శరీరములు ప్రక్కవాటుగా నున్నను సరళముగా చాచబడి యుండును. దీనిని రతిరహస్యకర్త 'ఉత్తానకరణ భేదములందు' 'పార్శ్వసంపుటక బంధము' అను పేరుతో పేర్కొనెను. చూ. రతిరహస్యం.

2. పీడితబంధము : ఆలుమగలు సంపుటబంధమునందువలెనే ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - భార్య తన తొడలతో భర్తయొక్క తొడలనునొక్కి పీడించుట జరిగినచో - ఆ స్థితి 'పీడితబంధము' అనబడుతుంది. 3. ముద్గకబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించి - తన తొడలను దగ్గరగాచేర్చి - యోని ద్వారమును బిగించియుంచగా - పురుషుడామె కభిముఖుడై ప్రక్కవాటుగా శయనించి రమించు స్థితికి ముద్గకబంధమనిపేరు. సంపుటకబంధమున యోని ముఖము బిగింపబడియుండదు. దీనియందు బిగింపబడియుండును - అని గ్రహింపవలెను.

4. పరావృత్తకబంధము : యువతి శయ్యపై భర్తకు అభిముఖముగా కాక పెడమొగమై ప్రక్కవాటుగా శయనించి తన తొడలను దగ్గరగాజేర్చి యోనిముఖమును బిగించియుంచగా భర్త ఆమెను వెనుకనుండియే కూడి రమించుటకు పరావృత్తకమని పేరు.

5. వేష్టితకబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియున్నదై - ఆస్థితియందు తనకభిముఖుడై శయనించి తన్ను గూడిన భర్తయొక్క పిక్కలతో తనపిక్కలను మెలివేయుట జరిగినచో అది 'వేష్టితకబంధము' అనబడుతుంది. 'వేష్టనము' అనగా చుట్టుట. పిక్కలను పిక్కలతో చుట్టుట యిందేర్పడును గాన దీనికి వేష్టితబంధమను పేరేర్పడెను.

6. బాడబకబంధము : ఆలుమగలు ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - స్త్రీ తన యోనిముఖముచే పురుషాంగమును బిగియ నొక్కినచో ఆ స్థితి 'బాడబికము' అనబడుతుంది. బడబ అనగా ఆడగుఱ్ఱము (ఆడగుఱ్ఱము రతివేళ ఇట్లాచరిస్తుంది) అందుచే దీనికీపేరువచ్చినది.

7. యుగ్మపాదము : ఆలుమగలు శయ్యపై ప్రక్కవాటుగా శయనించి రమించుచుండగా - వనిత తనయొక్క తొడ నొకదానిని భర్తయొక్క కటిభాగమునకు క్రిందుగాపోవనిచ్చి - వేరొకదానిని ఆతని కటిభాగమునకు పైనుండి పోవనిచ్చి తన పాదములను రెండింటిని భర్తయొక్క వెన్నుపూస చివర కలిపియుంచినదై రమించుచో ఆస్థితి 'యుగ్మపాదము' అనబడుతుంది. యుగ్మము అనగా జంట. పాదములజంట ఇందేర్పడుచున్నది. అందుచే దీనికీ పేరువచ్చినది. రతిరహస్యమునందు బాడబక-వేష్టితబంధములు ఉత్తానకరణము నందు పేర్కొనబడ్డాయి. యుగ్మపాదము నాతడు దీనికి కొంత భిన్నమైన రీతిలో ఆసీనకరణములందు పేర్కొన్నాడు. చూ. రతిరహస్యం.

ఆశీనకరణ భేదములు

భార్య శయ్యపై కూర్చుండియుండగా భర్త ఆమెనుకూడి రమించుట ఆసీనకరణము. ఈ కరణమునందు భార్య నెమలి మున్నగువానివలె కూర్చుండగా పురుషుడామెను ముందునుండియే కాక వెనుకనుండి కలిసి రమించుటకూడ లోకమందున్నది. ఇక్కడ ఆశీనకరణభేదములందు 'లలితబంధము' అను ఒక్క బంధముమాత్రమే తెలుపబడుచున్నది.

1. లలితము :- యువతి శయ్యపై కూర్చుండియున్నది. పురుషుడామెకెదురుగా తానును కూర్చుండియే ఆమెను కలియుటకు సంసిద్ధుడయ్యెను. అప్పుడాయువతి తనతొడలను విడదీసియుంచి భర్తకు తావిచ్చుటయేకాక భర్తయొక్క వెన్నుపూస తుదిభాగమున తన యొక్క అందెలతో మెరసే పాదములనుజేర్చి, ఆతనిని తనకు మిక్కిలి సమీపముగా లాగుకొనెను. భర్తయు ఆమెకంఠమును గాఢముగా కౌగలించుకొని రతిక్రీడకు ఉపక్రమించెను. ఇదుగో ఇట్టి ఆసీనబంధము 'లలితము' అనబడుతుంది. ఆశీనకరణము లన్నింటియందును ఇది ఉత్తమమైనది.