నాగర సర్వస్వం/ఉత్తానకరణభేదములు

వికీసోర్స్ నుండి

4. ఉత్థితకరణము :- భార్య నిలచిఉండగా, పురుషుడామె నే గోడకో స్తంభమునకో ఆన్చి రమించుట 'ఉత్థితకరణము' అనబడుతుంది.

5. వ్యానతకరణము :- 'వ్యానతము' అనగా మిక్కిలి వంగినది. భార్య తన చేతులను పాదములను క్రింద ఆన్చి యుంచినదై నాలుగుకాళ్ళ జంతువువలె వంగియుండగా పురుషుడామెను వెనుకనుండి కూడి రమించుట 'వ్యానతకరణము' అనబడుతుంది.

ఇట్లేర్పడిన ఈ కరణ భేదములందు తిరుగ అవాంతరభేదము లెన్నియో ఉన్నాయి. ఆ భేదములకే చౌశీతి బంధములు (84 బంధములు) అని లోకములో వాడుక వచ్చినది. కాని అవి అన్నియును శిష్టజన సమ్మతములు కానందున నాగరిక జనతలో ఆచరణలో ఉన్న బంధభేదములు మాత్రమే (35) ఇందు తెలుపబడుతున్నాయి.

ఉత్తానకరణ భేదములు

భార్య శయ్యపై వెల్లకిలా శయనించియుండగా పురుషుడామెను గూడి రమించు విధానము ఉత్తానకరణము. దీనియందు శిష్ట సమ్మతతైన భేదములు ఇరువది. వానిలో మొదటిది స్వస్తిక బంధము.

1. స్వస్తిక బంధము :- భార్య శయ్యపై వెల్లకిలగా (నడుమును శయ్యపై ఆన్చినదై) శయనించినదై తన కుడితొడను తన ఎడమతొడమీద చేర్చియుండగా భర్త ఆమెనుకూడి రమించుటకు స్వస్తికబంధ మనిపేరు. ఇట్లు ఎడమతొడపై తన కుడితొడను చేర్చియున్నవేళ స్త్రీయొక్క యోనియందు కొంతబిగువు ఏర్పడి, ఆస్థితిలో చేయబడిన రతిక్రీడ ఆమెకు భర్తకుకూడ ఒక వింత ఆనందాన్ని కలిగిస్తుంది.

2. మాండూకబంధము :- భార్య శయ్యపై వెలకిలగా శయనించినదై తన్ను కలియవచ్చిన భర్తయొక్క తొడలమీద తనతొడలను చేర్చగా భర్త ఆమెనుగూడి రమించుట 'మాండూక బంధము' అనబడుతుంది. ఈ బంధమున స్త్రీ శయనించియుండగా పురుషుడు కూర్చుండియుండును. 'మాండూకము' అనగా కప్ప. కప్పయొక్క రతిక్రీడవంటి దగుటచే దీనికీపేరు వచ్చినది.

4. అనుపాదబంధము :- చెక్కిలి (బుగ్గ) యొక్కమీది భాగమునకే హనువని పేరు. భార్యశయ్యపై వెలికిలగా శయనించి యుండి తనకాళ్లను పైకెత్తి - తన్ను కలియవచ్చి తనయోనియందు సంసక్తమైన పురుషాంగముకలవాండై, శయ్యపై తనకెదురుగా కూర్చుండియున్న భర్తయొక్క భుజములమీదుగా - పైకెత్తిన తనకాళ్ళను పోనిచ్చి - తనపాదములతో అతని చెక్కెళ్ల మీది భాగములను తాకుచుండగా రమించు స్థితికి "హనుపాదబంధము" అనిపేరు. భర్తయొక్క చెక్కెళ్ళ మీదభాగమునందు భార్యయొక్క పాదములస్పర్శ ఏర్పడుటవలన ఈబంధమనబడెను.

5. పద్మాసనబంధము :- భార్యశయ్యపై వెలికిలిగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళ దగ్గరమడచి, ఎడమకాలి పిక్కపై కుడికాలి పిక్కకుచేర్చి (బాసికపట్టువేసి కూర్చున్నట్లు) ఉండగా - భర్త ఆమెయొక్క ఈ ఆసనస్థితిని విడదీయకయే ఆమె కాళ్ళను పైకెత్తి ఆమెయొక్క రెండుమోకాళ్ళయొక్క సందులలోనుండి తనచేతులను పోనిచ్చి - ఆమె కంఠమును గ్రహించినవాడై రమించుట 'పద్మాసనము' అనబడుతుంది. బాసికపట్టువేసి పరుండియున్న భార్యయొక్క రెండుమోకాళ్ళ సందులలోనుండియు చేతులనుపోనిచ్చి కంఠమును గ్రహించుటవలన భార్యయొక్క పాదపీఠము (తొడలతో సహా) సహజముగనే పైకిలేచి పురుషాంగము యోనియందు ప్రవేశించుటకు వీలుకలుగును. ఆ సమయమున భార్య తనమీదకు వ్రాలియున్న భర్తను మడువబడియున్న తనకాళ్ళయొక్క మధ్య భాగముతో ఇంచుక వెనుకకు నెట్టుచుండగా - చేతులతో గ్రహించిన భార్య కంఠమాధారముగా భర్త ఆమెమీదకు తూగుచుండును.

6. అర్థపద్మాసనము :- వనిత శయ్యపై వెలికిలిగా శయనించియుండి - తన యొక్క ఒక్కకాలినిమాత్రము మోకాలి దగ్గర మడచి పైకెత్తి యుంచగా - పురుషుడామెను గూడి క్రీడించు స్థితికి 'అర్థపద్మాసనము' అనిపేరు. ఇందు పురుషునియొక్క ఒక్క చేయిమాత్రము - స్త్రీయొక్క మడచియుంచిన మోకాలియొక్క సందునుండి ముందుభాగమునకు చొచ్చుకొనివచ్చును. తనమీదకు వ్రాలియున్న భర్తను భార్య తనయొక్క మడచివుంచిన ఒకకాలితోడనే వెనుకకు నెట్టుచుండుట ఇందేర్పడును. పద్మాసనస్థితి పూర్తిగా కాక సగముగాఏర్పడుటచే దీనికి అర్థపద్మాసనము అని పేరువచ్చెను.

7. పిండితబంధము :- వనిత శయ్యపై వెలికిలిగా శయనించియున్నదై తనకాళ్ళను పైకెత్తి - తన్ను కలియవచ్చిన భర్తయొక్క వక్షముపై తన పాదములను రెంటిని ఆన్చియుండగా భర్త ఆమెనుకూడి రమించుటకు పిండితబంధమని పేరు.

8. అర్థపిండితబంధము :- ప్రియురాలు తన రెండుపాదములను గాక ఒక పాదమును మాత్రమే ప్రియునివక్షమునందు ఆన్చియుండగా (అనగా ఒకకాలు పూర్తిగా చాచియుంచబడును) ప్రియుడామెను గలసి రమించుట 'అర్థపిండితమనబడును'.

9. జృంబితబంధము :- శయ్యపై వెలికిలిగాశయనించి యున్న యువతి తన తొడలను పైకెత్తి, తన్ను కలియవచ్చి తనకు అభిముఖుడై కూర్చుండియున్న భర్తయొక్క భుజములమీద చేర్చగా ఏర్పడు కూటమికి 'జృంభితబంధము' అనిపేరు. రతిరహస్యమునందీ బంధము భిన్నముగా చెప్పబడెను. భార్య తన తొడలనుపైకెత్తి, చేతుల సహాయమునుగూడ అవలంబించి రెండుతొడలను బాగుగావిఁడదీసి - రెండుకాళ్ళను రెండు వైపులకుచాచి యుంచగా - ఆవులించిన నోటివలె విడియున్న భార్యయొక్క యోనియందు - భర్త తనపురుషాంగమును సంవిశితముగావించి రమించుట జృంభితబంధమనియు, జృంభ అనగా ఆవులింత, ఇందు యోని ఆవులించిన నోటివలె నుండుటచే దీనికీపేరు తగియున్నదనియు రతిరహస్యకర్త చెప్పెను. చూ. రతిరహస్యం.

10. వేణువిదారణ బంధము :- జృంభితబంధమునందువలె భార్య తన రెండుతొడలను పైకెత్తి భర్తయొక్క భుజములపై నుంచుటకు మారుగా - తన ఒక కాలిని శయ్యపై పూర్తిగా చాచి ఉంచినదై - ఒక కాలినిమాత్రము పైకెత్తి తొడను భర్తయొక్క భుజమునందాన్చియుంచి కూడుటకు వేణువిదారణబంధమని పేరు. వేణు వనగా వెదురు. విదారణమనగా చీల్చుట. వెదురును చీల్చువేళ ఒక పాయను నేలపై త్రొక్కిపట్టి, ఒక పాయను చేతఁబట్టి పైకెత్తి చీల్చుట లోకసాధారణము. సరిగా దానిని పోలిన ఆకృతి స్త్రీయొక్క కాళ్ళకు ఈబంధమునం దేర్పడును. అందుచే దీనికి 'వేణువిదారణ' మను పేరు వచ్చెను.

11. ఇంద్రాణీబంధము :- వనిత శయ్యపై వెలకిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళయొద్ద మడచి - ఆ మడత చెడకుండ తొడలయొద్ద కూడ మడచి - మోకాళ్ళు తనయొక్క స్తనపార్శ్వభాగములను తాకుచున్నస్థితియందుండగా - పురుషుడామెయొక్క మోకాళ్ళకు తనమోకాళ్ళు తాకుచున్నస్థితిలో ఆమెను పైకొని రమించుట 'ఇంద్రాణీబంధము' అనబడును.

12. సూచీబంధము :- ఇంద్రాణీబంధమునందువలె వనిత తన రెండుకాళ్ళను కాక, ఒకకాలిని మాత్రమే - మోకాలు స్తన పార్శ్వదేశమును తాకునట్లుమడచి - వేరొకకాలిని సరళముగా చాచి యుంచగా - పురుషు డామె కంఠమును కౌగలించుకొని రమించుట 'సూచీబంధము' అనబడును.

13. నాగరకబంధము :- పురుషుడు శయ్యపై వెలికిలగా శయనించియున్న భార్యయొక్క రెండుతొడలమధ్యకును చేరి, ఆమె తొడలను తన పాదములమీదుగా చేర్చి రమించుటకు నాగరకబంధమని పేరు. ఇందు స్త్రీయొక్క తొడలు పురుషుని కటిభాగమునకు (నడుమునకు) బహిర్భూతములగును. ఈ బంధమునందు స్త్రీ సుకుమారముగా చూడబడుటచే దీనికి నాగరకబంధమని పేరువచ్చెను. రతిరహస్యమునందీ బంధము కొంత భిన్నముగా చెప్పబడెను. చూ. రతిరహస్యం.

14. గ్రామ్యబంధము :- నాగరకబంధమున వనితయొక్క తొడలు పురుషుని పాదములయందుండునేకాని, పురుషుని మోకాళ్లు వంచబడి ఆమె శరీరమునందానుట జరుగదు. అట్లుకాక పురుషుడు తనపాదములపై భార్యయొక్క తొడలను జేర్చి రమించుచు, తన మోకాళ్ళను ఆమె తొడలమీదుగా వాల్చి ఆమె కటిభాగమును (నడుమును) తన మోకాళ్ళతో పీడించుచు రమించుట గ్రామ్యబంధమనబడును. దీనియందు స్త్రీయెడ పురుషునివర్తనము నాజూకైనది గాక కొంత మోటదనముతో కూడినదై యున్నందున దీనికి గ్రామ్యబంధమనుపేరు వచ్చెను.

15. కార్కటబంధము :- వనిత శయ్యపై వెలికిలగా శయనించి తన పాదములను భర్తయొక్క నాభిదేశమునందు (బొడ్డు) ఉంచగా ఏర్పడు రమణమునకు కార్కటబంధమని పేరు. ఇందు భార్య యొక్క పాదములు భర్తయొక్క నాభీదేశమును తాకుచుండగా - భర్త ఆమెను కూడవలెను గనుక ఆమె తనకాళ్ళను మడచి ఇంచుక పైకెత్తవలసియుండునని గ్రహింపవలెను. కర్కటమనగా పీత. పీతల కలయిక ఇట్టిదగుటచే దీనికి కార్కటబంధమను పేరువచ్చెను.

16. ప్రేంఖణబంధము :- "ప్రేంఖణము" అనగా విసరుట. కార్కటబంధమునందువలెనే భార్యాభర్తలుకూడి రమించుచుండగా - భార్య భర్తయొక్క నాభిదేశమునందుంచిన తనపాదములతో నాతనిని పైకెత్తి విసరుచు కూడినచో ఆ స్థితి 'ప్రేంఖణబంధము' అనబడును.

17. మార్కటకబంధము :- భార్య శయ్యపై వెలికిలగా శయనించియుండగా - పురుషుడును చాచబడిన కాళ్ళుకలవాడై ఆమె శరీరమును తనశరీరముతో నాక్రమించుకొని - తన ఎడమచేతి నామె నడుముక్రిందనుండి పోనిచ్చి - ఆమెను గాఢముగా కౌగలించుకొని - కుడిచేతితో ఆమెయొక్క స్తనమునుగ్రహించి కూడగా - భార్య తన చాచబడిన కాళ్ళను భర్తయొక్క కాళ్ళక్రిందనుండి తొలగించి - అతని పిక్కలపై తన పాదములను జేర్చి మెలివేసినట్లు పట్టి యుంచినచో ఆ స్థితి మార్కటకబంధము అనబడుతుంది.

18. ఉద్భుగ్నబంధము :- ఉన్నతముగానుండి కొంచెము వంగియుండుటను ఉద్భుగ్నము అంటారు. శయ్యపై వెలికిలగా శయనించియున్న భార్యయొక్క తొడలను భర్త తనచేతులతో పైకెత్తి - క్రిందకు వంచియుంచి - చేతులతో నొక్కుచు రమించుట ఉద్భుగ్నబంధమని పేరు. ఇందు భార్యయొక్క తొడలు పైకెత్తబడి వంచబడును గనుక దీనికీపేరు వచ్చెను.

19. ఆయతబంధము :- భార్యశయ్యపై వెలికిలగా శయనించినదై - భర్తయొక్క శిరస్సుమీద తనకాలి నొకదానిని (కాలిపిక్క శిరమునకు తగునట్లు) చాచి, వేరొకదానిని శయ్యమీదనేచాచి యుంచగా ఏర్పడు కూటమికి ఆయతబంధ మనిపేరు. రతిరహస్యకారుడు ఈ బంధమును 'శూలచితబంధము' అను పేరుతో పేర్కొనెను. 20. నాగపాశబంధము : యువతి శయ్యపై వెలికిలగా శయనించినదై తనకాళ్ళను మోకాళ్ళదగ్గర మడచి, తిరుగ వానిని తొడలయొద్ద మడచి - తన మోకాళ్ళు తన స్తనములయొక్క పార్శ్వభాగములను తాకుచున్నస్థితిలో తన రెండుచేతులను తన రెండు మోకాళ్ళ సందులలోనుండియు రానిచ్చి - ఆ చేతులను రెంటిని తనయొక్క కంఠముయొక్క దిగువభాగమున ఉగ్గిలిపట్టుగా బంధించి యుంచినపుడు పురుషుడామెను కూడుట నాగపాశబంధ మనబడును. రతిరహస్యమునందీ బంధము భిన్నముగా చెప్పబడెను. చూ. రతిరహస్యం.

తిర్యక్కరణ భేదములు

భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా పురుషుడామెను కూడి రమించుట తిర్యక్కరణమనబడునని వెనుక చెప్పబడినది. ఈ స్థితియందేర్పడే ఉత్తమబంధ భేదములు ఏదు. అందు మొదటిది సంపుటబంధము.

1. సంపుటబంధము : భార్య శయ్యపై ప్రక్కవాటుగా శయనించియుండగా భర్త ఆమె కభిముఖముగా ఆమెవలెనే ప్రక్కవాటుగా శయనించినవాడై ఆమెనుకూడి రమించుటకు 'సంపుటక బంధము' అనిపేరు. ఇందు ఆలుమగల శరీరములు ప్రక్కవాటుగా నున్నను సరళముగా చాచబడి యుండును. దీనిని రతిరహస్యకర్త 'ఉత్తానకరణ భేదములందు' 'పార్శ్వసంపుటక బంధము' అను పేరుతో పేర్కొనెను. చూ. రతిరహస్యం.

2. పీడితబంధము : ఆలుమగలు సంపుటబంధమునందువలెనే ప్రక్కవాటుగా శయనించినవారై రమించుచుండగా - భార్య తన తొడలతో భర్తయొక్క తొడలనునొక్కి పీడించుట జరిగినచో - ఆ స్థితి 'పీడితబంధము' అనబడుతుంది.