నాగర సర్వస్వం/అంగసంకేతములు

వికీసోర్స్ నుండి

మొదలు తిరుగ సూర్యోదయం అయ్యేవరకు ఉన్నకాలం 24 గంటలు కదా! ఈ కాలాన్నే ఎనిమిది జాములుగా విడదీస్తారు. అందుచే జాముఅంటే మూడు గంటలకాలం అవుతుంది.

ఈ జాములలో మొదటి జామునకు- 'శంఖము', రెండవ జామునకు-'మహాశంఖము', మూడవ జామునకు-'పద్మము', నాల్గవ జామునకు-'మహాపద్మము', ఐదవ జామునకు-'రాముడు' సంకేతాలుగా వినియోగింపబడతాయి.

ఆరవ జామునకు—'విరామశబ్దము', ఏడవ జామునకు—'ప్రవరశబ్దము', ఎనిమిదవ జామునకు—'ప్రత్యూష శబ్దము' సంకేతాలుగా నాగరజనం ఉపయోగిస్తారు.

"ఓతుమ్మెదా! విరామ సమయంలో (రాత్రి 9-00గం. దాటిన మీదట 12 గం.ల వరకు) నల్ల కలువపూవులోని మాధుర్యాలను (మంత్రికుమారికయొక్క సొగసులను) అనుభవిస్తూ-ప్రవర సమయాన్ని (రాత్రి 12 గం. మొదలు 3 గం. వరకు) కూడ అక్కడే గడపి ప్రత్యూష సమయానికి (తెల్లవారు జాము 3 గంటలు దాటిన మీదట సూర్యుడుదయించేవరకు ఉన్నకాలం) మాలతీ కుసుమం మీదకు (రాజకుమారి) వచ్చి వ్రాలిన నీ రసికత కొనియాడదగినది"-ఇత్యాదిగా ఈ సంకేతాలు వినియోగింపబడతాయి.


అంగసంకేతములు

వెనుక ప్రకరణంలో భాషాసంకేతములు వివరింపబడ్డాయి. అవి యెంత సాంకేతికంగాఉన్నా వానిని ఉపయోగించడానికి కొంతవీలుచిక్కితేకాని కుదురదు. ఏమంటే-సందర్భం ఏమీ లేకుండా-ఓతుమ్మెదా! నీ రాకకై ఈ మాలతీ పుష్పం ఎదురుచూస్తోంది.'- అనడం కుదరదు కదా! అదీకాక కేవలం ఆ భాషా సంకేతాలవల్ల కొంత పరిమితమైన కార్యం మాత్రమే నెరవేరుతుంది. ప్రియుడుకాని, ప్రియురాలుకాని ఎదుటబడినప్పుడు మాటాడవలసినవి ఎన్నో వుంటాయి.

చిరకాలానికి ప్రియుడు కంటబడినపుడు ముందు—"కులాసాగా ఉన్నావా? నేను కులాసాగానే ఉన్నాను" ఈ మొదలైన కుశల ప్రశ్నలు ఏమీలేకుండా-"నేను నిన్ను కలియగోరుతున్నాను, ఫలానా సమయానికి రావలసినది"-ఇత్యాది విషయాలను సాంకేతికంగా చెప్పినా, అది నాగరకత అనిపించుకోదు. అందుచే భాషా సంకేతములే కాక ఇతర సంకేతములుకూడ అవసరం అయ్యాయి.

శరీరంలోని అవయవాలతో చేయబడి సంకేతాలనే అంగ సంకేతాలు అని అంటారు.

'చిరకాలానికి ప్రియుడు కనిపించాడు—కాని అతడు పదుగురిలో ఉన్నాడు-కులాసాగా ఉన్నావా? అని అడగాలని ఉన్నది—కాని అందరియెదుట అలా ప్రశ్నిస్తే నవ్వుతారు—ఆ ప్రియుడుకాక భర్తకాక పరపురుషుడే అయితే నలుగురిలో నవ్వులపాలు కావడమేకాక అత్తయింట కాపురంచేసికొనే వయసుకత్తె తన కాపురానికే నీళ్ళు వదులుకోవలసి వస్తుంది. ఆ బాధలు ఏమీ అక్కడలేకుండా ఈ సంకేతాలు వినియోగపడతాయి.

"కులాసాగా ఉన్నావా?" అని ప్రశ్నించడానికి చేతితో తన చెవిని తాకడం— సంకేతముగా చెప్పబడ్డది.

తా నెరిగిన మదవతియైన యువతి సాభిప్రాయంగా తనవంకకు చూస్తూ చెవిమీద చేయివేసుకొనడం జరిగితే-ఆమె నీవు కులాసాగా ఉన్నావా? అని ప్రశ్నిస్తూ వున్నదని నాగరకుఁడైన పురుషుడు గుర్తించాలి.

అలా గుర్తించి తాను కులాసాగా ఉన్నట్లు సూచించడానికి—తన చెవిని తనచేతితో తాకాలి. అనగా కుశల ప్రశ్నలకు, కుశలంగా యున్నానన్న సమాధానానికి రెంటికికూడ చేతితో చెవిని తాకుట సంకేతమైయున్నది. ఎవరైనా ఒకయువతి ప్రియవిరహంతో మ్రగ్గిపోతూ ఎట్టకేలకు కంటబడిన ప్రియునితో—"నేను కామాతురనై ఉన్నాను".—అని చెప్పదలచినపుడు కచదంశం (జుట్టు లేక జడను వెనుకనుండి ముందుకు తెచ్చి మునిపంటితో కొరకడం) సంకేతముగా చెప్పబడ్డది.

భార్య, పరిచిత, లేక అపరిచిత అయిన యువతి తన్ను సాభిలాషంగా చూస్తూ 'కచదంశం' ఆచరిస్తే-ఆమె కామాతురయై ఉన్నదని తన్నుకోరుతూన్నదని పురుషుడు గ్రహించాలి.

"గుండెమీద చేయివేసి ప్రదర్శించడం"-"నాకు నీమీద మిక్కిలి ప్రేమఉన్నది"—అనడానికి సంకేతముగా చెప్పబడ్డది. ఎవరైనా మదవతియైన యువతి తన గుండెమీద చేయి చేర్చుకొన్నదై సాభిలాషంగాచూస్తే—పురుషుడామె తన ప్రేమను వెల్లడిస్తూన్నదని గ్రహించాలి.

"నేను నిన్ను ఆరాధిస్తున్నాను"—అని సూచించడానికి-తలమీద చేయిచేర్చి ప్రదర్శించడం—సంకేతముగా చెప్పబడ్డది.

ప్రియురాలు చేతిని తలపై చేర్చినదై సాభిలాషగాచూస్తే—పురుషుడామె తన్ను ఆరాధిస్తూన్నదని గ్రహించాలి.

ఇలా ఆమె తన్నుకోరుతూ ఆరాధిస్తూన్నదని తనకు తెలిసినా, ఆమెను కలియడానికి అది తగిన సమయం అగునో కాదో తెలిసికొనకుండా ముందడుగువేస్తే పురుషునకు పరాభవం తప్పదు.

అందుచే "ఇది తగిన సమయం అవునా కాదా? అని ప్రశ్నించడానికి వేరేసంకేతము చెప్పబడ్డది. అట్టి ప్రశ్నకు-చాపిన చూపుడు వ్రేలిమీద నడుమవ్రేలిని ఎక్కించి ప్రదర్శించడం—సంకేతముగా చెప్పబడినది.

ప్రియుడు తనవంకకుచూస్తూ—చూపుడువ్రేలిని చాచి దాని మీదకు నడుమవ్రేలిని ఎక్కించి ప్రదర్శిస్తే—ఇది తగిన సమయం అగునా కాదా? అని ప్రశ్నిస్తున్నాడని యువతి గ్రహించాలి. అలా గ్రహించినమీదట-'ఇది తగిన సమయమే'-అని చెప్పదలచినపుడు 'అంజలి బంధం' (దోసిలి పట్టుట) సంకేతముగా చెప్పబడ్డది.

తన వంకకు చూస్తూ ప్రియురాలు 'అంజలి బంధం' ఆచరిస్తే-ప్రియుడు ఆమెను కలియడానికి ఇది తగిన సమయమేనని గ్రహించాలి. తగిన సమయం కాదనుటకైతే "ప్రాకారముద్రాసంకేతము" వెనుక చెప్పబడ్డది కదా! దానిని వినియోగించాలి.

అయితే తగినసమయం అని చెప్పినా-పురుషుడు వెంటనే ముందడుగు వేయడానికి తగినంత ఆదరపూర్వకమైన ఆహ్వానం ఉండాలికదా! అట్టి ఆహ్వానం చేయదలచినప్పుడు 'అంజలీ కుంచనం' (దోసిలిని మూయడం) సంకేతమై ఉన్నది.

ప్రియురాలు 'అంజలీ కుంచనం' ఆచరిస్తే ప్రియు డామెరమ్మని ఆహ్వానిస్తూన్నదని గ్రహించాలి.

అయితే ఆమెరమ్మని ఆహ్వానిస్తోందేకాని ఎక్కడకు రమ్మంటూ ఉన్నదో అన్న విషయం ఈ పురుషునకు తెలియాలికదా! అందుచే దానికి వేరే సంకేతాలు చెప్పబడినాయి.

చేతివ్రేళ్ళు బొటనవ్రేలుకాక 1 చూపుడువ్రేలు, 2 నడిమివ్రేలు, 3 ఉంగరపు వ్రేలు, 4, చిటికెనవ్రేలు అని నాలుగు వ్రేళ్లున్నాయికదా! ఈ వ్రేళ్ళు నాలుగు క్రమంగా తూర్పు-దక్షిణము-పశ్చిమము-ఉత్తరము అనబడే నాలుగు దిక్కులకు సంకేతాలై వున్నాయి.

అనగా ప్రియురాలు 'అంజలిబంధం-అంజలికుంచనం' ఆచరించి-తన బొటనవ్రేలితో చూపుడువ్రేలిని 'ముక్కుపొడుము పట్టినట్లు' పట్టుకొని ప్రదర్శిస్తే పురుషుడు-ఆమె తూరుపు దిశయందున్న సంకేతస్థలానికి (అక్కడ ఏతోటయో, చెఱువో, దేవ్యాలయమో, లేక మరియొక జనంలేని స్థలమో ఉండవచ్చును. దానిని పురుషుడు ఊహించి తెలిసికొనాలి.) రమ్మంటూన్నదని గ్రహించాలి. అట్లే బొటనవ్రేలితో నడుమవ్రేలిని తాకినప్పుడు దక్షిణ దిక్కనియు, ఉంగరపువ్రేలిని తాకినప్పుడు పశ్చిమదిక్కనియు, చిటికెనవ్రేలిని తాకినప్పుడు ఉత్తర దిక్కనియు గ్రహించాలి.

ప్రియుని లేక ప్రియురాలిని ఫలానా తిథినాడు రమ్మని చెప్పడానికి వేరే సంకేతాలు వున్నాయి.

పాడ్యమినుండి పూర్ణిమకు లేక అమావాస్యవరకువుండే తిథులు మొత్తం పదునైదు. శుక్ల పక్షము (వెన్నెలరాత్రులు) కృష్ణ పక్షము (చీకటి రాత్రులు) అనే రెండు పక్షాలలోనూ అవే తిధులు పునరావృత్తం అవుతాయి. అంటే తిధులు పదునైదు—పక్షాలు రెండు అయివున్నాయి.

శుక్ల పక్షమునకు ఎడమచేయి, కృష్ణ పక్షమునకు కుడిచేయి సంకేతాలుగా చెప్పబడినాయి. చేతివ్రేళ్ళను పరిశీలిస్తే ప్రతి వ్రేలు మూడు కణుపులుగా వుండి ఒక్కొక్క వ్రేలికి మూడేసి రేఖల చొ॥న మొత్తము పదునైదు రేఖలు కలవై యుంటాయి. ఈ రేఖలు పదునైదూ పదునైదు తిథులకు సంకేతాలై వున్నాయి. ఎడమచేతి రేఖలు శుక్లపక్ష తిధులను సూచిస్తే కుడిచేతి రేఖలు కృష్ణపక్ష తిథులను సూచిస్తాయి. అయితే యే రేఖ యే తిథికి సంకేతము? అన్న విషయం తెలియదుకదా!

చిటికెనవ్రేలి దిగువరేఖ (గోటిదగ్గరదికాదు) మొదలు వరుసగా ఈ పదునైదు రేఖలు పదునైదు తిధులకు సంకేతాలై వున్నాయి.

చిటికెనవ్రేలియొక్క దిగువరేఖ పాడ్యమితిధి, మధ్యరేఖ విదియకు మూడవదైన పై రేఖ తదియకు సంకేతాలు. ఆ తరువాత వుంగరపు వ్రేలియొక్క పై రేఖనుండి క్రిందికి గణించాలి.

ఉంగరపువ్రేలియొక్క పై రేఖ చవితికి, మధ్యరేఖ పంచమికి, దిగువరేఖ షష్టికి సంకేతాలై ఉన్నాయి. పిమ్మట ఆరంభమయ్యే నడిమివ్రేలి రేఖలను దిగువ రేఖనుండి లెక్కించాలి. నడిమివ్రేలి దిగువరేఖ సప్తమికి, మధ్యమరేఖ అష్టమికి, పై రేఖ నవమికి సంకేతాలై యున్నాయి. ఆ తరువాత చూపుడువ్రేలియొక్క పై రేఖనుండి గణించాలి.

చూపుడువ్రేలియొక్క పై రేఖ దశమికి, మధ్యరేఖ ఏకాదశికి, దిగువరేఖ ద్వాదశికి సంకేతాలు. పిమ్మట బొటనవ్రేలి దిగువరేఖ నుండి లెక్కించాలి.

బొటనవ్రేలియొక్క దిగువరేఖ త్రయోదశి, మధ్యరేఖ చతుర్ధశికి, పై రేఖ పూర్ణిమకు లేక అమావాస్యకు (ఆ బొటన వ్రేలు ఎడమచేతిదైనపుడు పూర్ణిమకు, కుడిచేతిదైనపుడు అమావాస్యకు) సంకేతాలు.

ఇలా వున్న యీ సంకేతాలలో ప్రియురాలు స్పృశించిన సంకేతాన్ని గమనించి పురుషుడు ఫలానా తిధినాడు రమ్మంటూ వున్నదని గ్రహించి—వెనుక భాషాసంకేతాలలో జాములకు చెప్పిన "శంఖ-మహాశంఖాది సంకేతాలతో జామునుకూడ ఆమె సూచిస్తే- ఆ తిధినాడు-ఆ జామున-ఆమె సంకేతంద్వారా తెలిపిన దిశయందు ఆమెను కలిసికొనాలి.

ఈ సంకేతాలను పురుషులు, స్త్రీలు ఇద్దరూకూడ వుపయోగించ వచ్చును. వీనిద్వారా నాగరజనం యొక్క వర్తనం ఇతరులు తెలిసికొనడానికి వీలులేనిదై-దుర్భేద్యమై-నిరపాయమై-సుఖదమై వుంటుంది. భాషా సంకేతాలు మాట వినబడదగినంత దూరంలో వున్నప్పుడు వినియోగింపబడతాయి. ఈ అంగ సంకేతాలు ప్రియుడు లేక ప్రియురాలు ఒకరినొకరు చూడదగినంత దూరంలో వున్నప్పుడు వినియోస్తాయి.


పోటలీ సంకేతములు

ఈ లోకంలో కామినీ కాముకులు స్వచ్చా విహారాలు అసంఖ్యాక విధానాలలో సాగుతూంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక విధమైన సంకేతాన్ని వుపయోగించడానికి వీలు కుదురుతుంది. అందుచే