నమామి దత్త సద్గురుం

వికీసోర్స్ నుండి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి:
నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం 
నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం 

చరణం:

అహో మనోహరాకృతిం మహా మనోజ సంహతిం
మనోమలైక హారిణిం మనోలయైక కారణం
గుణత్రయైక వర్తినం గుణత్రయాతి వర్తినం
నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం

విమార్గగామి సంహరం స్వమార్గగామితాదరం
తమోహర స్వవిగ్రహం తపోభర స్వవిగ్రహం
విలాసిలోక దూరగం వివేకిలోక తీరగం
నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం 

చిరాయుషం పురాతనం దినే దినే ధునాతనం
సదా ఘనం సనాతనం క్షణే క్షణే చిరంతనం 
స్వభక్త హృన్నికేతనం యుగేయుగేపి కేతనం
నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం

కృపీట పాత్ర మాలికే తథా త్రిశూల ఢక్కికే 
విశుద్ధ శంఖ చక్రికే కరేషు షట్సు చోద్వహన్
విభాసితం త్రిశీర్షకం సతాళి భాగ్య వర్షకం 
నమామి దత్త సద్గురుం కృపామృతైక సాగరం

అఘత్రయైక సంప్లవం తథానఘాంభికాధవం
తమష్ట సిద్ధి పుత్రకం విశిష్ట భోధకారకం 
సితేతరాష్టమీ నుతం నతోదితేష్ట కామితం 
నమామి దత్త సద్గురుం సచ్చిదానంద సాగరం