నను విడనాడుట - న్యాయమా సామి
స్వరూపం
పల్లవి:
నను విడనాడుట - న్యాయమా సామి
న్యాయమా సామి - న్యాయమా సామి ॥నను॥
చరణ:
కనికర మేల లేదు - కారణ మేమిర
కారణ మేమిర - కారణ మేమిర ॥నను॥
నను మరుబారి ద్రోయ - న్యాయమా సామి
న్యాయమా సామి - న్యాయమా సామి ॥నను॥
విను తోట్లవల్లూరి - వేణుగోపాల
వేణుగోపాలా - వేణుగోపాలా ॥నను॥
ఘన దాసు రామావన - కరుణింప వేమిరా
కరుణింప వేమిరా - కరుణింప వేమిరా ॥నను॥