ద్విపద భారతము - మొదటిసంపుటము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

వ్యాస ప్రోక్తమగు సంస్కృత మహాభారతము మాతృకగా గవిత్రయకృతమైన ఆంధ్ర మహాభారతమవతరించినట్లే, కాలాంతరమున, ఆ కవిత్రయ భారతము మాతృకగా నీ ద్విపద భాగవతమవతరించినది. ఇది యపరకవిత్రయకర్తృకము.

తిమ్మయ, సోమన, బాలసరస్వతి అనెడి యీ ద్విపద భారత కర్తలు మువ్వురిలో తిమ్మయ నన్నయభట్టు వంటి వాడు. ఈ మహానుభావుడు భారతము ద్విపదీకరించవలెనని సంకల్పించి ఆదిపర్వము మొదలు ద్రోణపర్వాంతమువఱకు గల యేడు పర్వములలో సభాపర్వముదక్క దక్కిన యాఱిటిని నిర్వహించి కొంతవఱకు సిద్ధసంకల్పుడయ్యెను. కర్ణపర్వమాదిగా మిగిలినపర్వములను రచించి గ్రంథమును బూర్తిచేసినవాడు సోమన. మధ్య మిగిలిపోయిన సభాపర్వమును వ్రాసినవాడు బాలసరస్వతీశ్వరుడు. ఈ సభాపర్వకర్త, ఈ మహాకావ్య నిర్మాణములో నీకొంచెపుపాలుడక్కగొనుటకు తిమ్మనార్యుననుగ్రహమే కారణమని తోచుచున్నది. తనకు శిష్యప్రాయుడో మిత్రుడో అయిన బాలసరస్వతి ప్రార్థన నంగీకరించి తిమ్మనార్యుడీచిన్ని పర్వమును అతని పరము చేసియుండును. లేకున్న దీని తరువాత మఱియైదుపర్వములు కొనసాగించిన ఆదిపర్వకర్త, రెండవపర్వమును స్పృశింపక వదలుటకు హేతువు కానరాదు. ఆదిపర్వరచనతోనే యాతడస్తమించియున్నచో బరిశిష్టభాగమును బూరించిభారము బాలసరస్వతి తానైవహించెననవచ్చును గాని, అదియట్టిది గాక యాపై నైదుపర్వములు తిమ్మయకృతములుగా గానవచ్చుటచే, ఈ సభాపర్వము పరశిష్టభాగమనుటకు వలనుపడదు. పూర్వకాలము రామాయణ రచనకుపక్రమించిన భాస్కరుడు తన పుత్త్రుడనెడను శిష్యునెడను ఇట్టి యనుగ్రహమునే చూసి కొన్ని కాండములు వారిపరము చేయుటయు, ఈ కాలమున శ్రీతిరుపతి వేంకటేశ్వరకవులు దేవీభాగవతమున రెండుస్కంధములుతమ కవిమిత్రులచే వ్రాయించుటయు ఈ సంప్రదాయమునకే దృష్టాంతములుగా బేర్కొనవచ్చును. భాగవతమున వెలిగందలనారయాదులపేర గొన్నస్కంధములు కానవచ్చుటయు నీయాచారమునుబట్టియనియే నాయూహ.

తిమ్మయకవి వల్లభసూరికుమారుడు; కాశ్యపసగోత్రుడు. అన్నియాశ్వాసములతుదిని గద్యస్థానీయములైన ఈ క్రింది ద్విపదపంక్తులు పైవిషయములకాధారము :

ఇది సదాశివభక్త హితగుణాసక్త - సదయస్వరూప కాశ్యపగోత్రదీప

శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్త్ర - మతిమద్విధేయ తిమ్మయనామధేయ

రచిత... సర్వ నిర్మలకథయందు - నుచితమై యాశ్వాస....మయ్యె``

ఈ కవి నివాసస్థలము నెల్లూరు మండలములోని బట్టేపాడు గ్రామమనియు, ఇంటిపేరు బట్టేపాటివారనియు నూహించుటకు గొంతయాధారము దొరకినది. పుష్పగిరి తిమ్మయకు సమకాలికుడును సహశ్రోతియునగు తేకుమళ్ళ రంగశాయియను కవి తన ద్విపద భాగవతములో (అముద్రితము) పూర్వ కవిస్తుతి యొనర్చు సందర్భమున, ఈ ద్విపద భారత కర్త యెడ సంస్మరణ రూపమగు భక్తి ప్రకటించియున్నాడు. ఆ స్తుతి వాక్యములో, ఈ కవిపేరు తిరుమలభట్టనియు, ఇంటిపేరు బట్టేపాటివారనియు గలదు : పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/6 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/7 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/8 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/9 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/10 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/11 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/12 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/13 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/14 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/15 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/16 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/17 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/18 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/19 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/20 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/21 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/22 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/23 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/24 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/25 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/26 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/27 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/28 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/29 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/30 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/31 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/32 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/33 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/34 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/35 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/36 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/37 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/38 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/39 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/40 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/41 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/42 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/43 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/44 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/45 పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/46 గుణమును బట్టియే దీని నాదరింపఁజూచుసరసులకు, ఇదిమెచ్చుగొల్పునేగాని నిరసనభాజనముగాదు. ఈతిమ్మయవంటివారే భారతభాగవతాదులను బాటలుగా ఆటలుగాఁ బదములుగా శతకములుగా వెలయించి, వానిపరమార్థమును సంఘమున నెవరికిఁ దగినట్టు వారికిఁ బంచిపెట్టిన నిష్కామయోగులు. ఆరచనలన్నియుఁ బామరములనియు నప్రౌఢములనియు దోషభూయిష్ఠములనియు, నిపుడు వానిసంస్మరణముసైతము మఱచిపోయితిమి కావుననే మనవాఙ్మయశరీరమున నొకపార్శ్వము పక్షవాతపీడితమై చచ్చుపడినది. దానినిఁ బునరుజ్జీవింపజేయుట మనకు మానరానికర్తవ్యము. ఇదియొకప్పుడు పేరుపడినగ్రంథమే యనియు, దీనిప్రతులు ఆంధ్రదేశమెల్లెడలఁ బ్రాకినవనియుఁ జెప్పుటకు సందియములేదు. కానిచో విరాటపర్వపుఁబ్రతి యొకటి తంజావూరిలో, నింకొకటి నైజామురాష్ట్రములో నెట్లులభింపఁగలవు! కావ్యజీవమునకు వ్యాప్తియేకదా పరమప్రమాణము! ఇది యాంధ్రదేశమెల్లెడలను సంచరించుచు సజీవమైయున్నది. కవిత్రయభారతముముందుఁ దలయెత్తుకొని యిది నిల్చియుండుటలోఁగల విశేషమేమో సహృదయులే యూహింతురుగాక. ప్రాచీనతాళపత్రగ్రంథములను సంస్కరించి ముద్రింపఁబూనుకొనువారికిఁ గావలసినసదుపాయములలో మొదటిది ప్రత్యంతరలబ్ధి. వివిధప్రతులసాహాయ్య మున్నచో వానియందలి పాఠాంతరములఁ బరిశీలించి, "యేది నాధువు - ఏది యనాధువు, ఏది కవిది - ఏది కాదు" అనువిషయములను నిర్ణయించుకొని, గ్రంథమునంతయుఁ గవి హృదయానుసారముగా నొకసూత్రమునకుఁ దెచ్చుటకు వీలగును. ఆసాయము లేనినాఁడు సంపాదకుఁడు పడు క్లేశము ఆతనికే యెఱుక. ఈద్విపదభారతసంస్కరణమున నాబుద్ధి కట్టిశ్రమయే గలిగినది. ఒక్కతంజావూరిలోఁదప్ప నీయాదిసభాపర్వములకు వేఱొకప్రతి యెచ్చటను దొరకలేదు. దానికిఁదోడు ఉన్నయొక్కప్రతియు వివిధలేఖనప్రమాదములతో నిండియున్నది. అందుచే ననేకపదముల స్వరూపము, వాక్యముల యన్వయముఁ దాఱుమాఱైయున్నది. వానిని సాధ్యమైనంతవఱకు సురూపములుగను అన్వితములుగను జేసితిని. ఒక్కొకచోట ఆలేఖనప్రమాదము అగమ్యగోచరమైనప్పుడు విడదీయరాని గ్రంథులవలెఁ గొన్నిపదములు, వాక్యములు మిగిలినవి. అట్టివానిని సవరించుట నేను పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/48 పాఠకులు మన్నింతురుగాక. ఈగ్రంథమునకు రెండవసారి యచ్చుపడుభాగ్యము పట్టునేని యీలోపములన్నియు నందు సవరింపఁబడును. ఈసంపుటములోని బాలసరస్వతీశ్వరుని సభాపర్వమందలిరచన కేవలబాలకవిత్వమువలె నున్నది. గ్రంధసంపూర్ణతకు వెలితిలేకుండుటకై యీసభాపర్వము ప్రకటింపక తప్పినదికాదు. పైఁజూపినగుణవిశేషము లన్నియు తిమ్మయకవిత్వమునకు సంబంధించినవేకాని యీతనిరచనలోనివి గావు. తంజావూరినుండి యీప్రతి వ్రాసి తెచ్చుటకై ఆంధ్రవిశ్వవిద్యాలయముచే నియుక్తులైనవారు శ్రీ. కొమ్మసమంచి జోగయ్యశర్మగారును, శ్రీ. టి. రామచంద్రాచారిగారును. ప్రతి వ్రాయుటలో వారు చూపినశ్రద్ధకు నే నెంతో సంతోషించితిని. ఊరక జీతముకొఱకే పనిచేయువా రట్టిశ్రద్థ చూపలేరు. ఈయిర్వురిలో జోగయ్యశర్మగారు ఇంచుమించు నేఁటివఱకు నాకు చేఁదోడు వాఁదోడుగా నుండి, యీకార్యనిర్వహణములో నాతో సమానమగు నభినివేశమునే చూపిరి. ఈయనుచరునికతముననే దుస్సహమైన నాశ్రమ కొంతసహ్య మనిపించినది. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు,పింగళి లక్ష్మీకాంతం 6 - 2 - 1943.