దివ్యదేశ వైభవ ప్రకాశికా/శిరీవరమంగై

వికీసోర్స్ నుండి

51. శిరీవరమంగై 11 (నాంగునేరి)

(వానమామలై)

శ్లో|| తోతాద్రౌ వర పంకసార స్సంశోభి తేంద్రాబ్జినీ
    రమ్యే నందన వర్ధనం సముపయన్ వైమాన మైంద్రాసనః |
    దేవ్యా శ్రీ వరమజ్గనామ యుతయా తోతాద్రినాథః కు, మా
    నీళా, సేనప తార్ష్య చామర ధరా సూర్యేందుభీ రాజతే ||

శ్లో|| భృగు రోమశ మౌనిభ్యాం మార్కండేయ మహర్షిణా |
    బ్రహ్మణాపిచ దృష్టాంగ శ్శఠారాతి మునిస్తుతః ||

వివ:- వానమామలై పెరుమాళ్ - తెయ్‌వనాయకన్ (దేవనాయకన్) - శిరీవరమజ్గై తాయార్ - తోతాద్రి - శేత్తుత్తామరై పుష్కరిణి, ఇంద్రపుష్కరిణి - నంద వర్ధన విమానము, తూర్పు ముఖము - కూర్చున్నసేవ - శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సేన ముదలియార్ (విష్వక్సేనులు) పెరియ తిరువడి (గరుత్మాన్) చామరములు ధరించిన కన్యలు, సూర్యుడు, చంద్రుడు, వీరందరితో కలసి వేంచేసియుందురు. భృగు, రోమశ, మార్కండేయ మహర్షులకు, బ్రహ్మకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే:- ఇచట వేంచేసియున్న తాయార్ పేరుమీదనే ఈ క్షేత్రమునకు "శిరీవరమజ్గై" యని పేరు ఏర్పడినది. ఇచట పెరుమాళ్లను పునరుద్ధరించు సమయమున భూమినుండి ఎత్తునపుడు దెబ్బతగులుటచే ప్రతిదినము తైలముతో తిరుమంజనము జరుగును. ఆ తైలము సకల వ్యాధి నివారకము. అష్ట స్వయంవ్యక్త క్షేత్రములలో ఇది యొకటి. ఇచట గల వానమాలై మఠము జగత్ ప్రసిద్ధము.

సింధుదేశపురాజు కుశాసనమహర్షిచే శపింపబడి శునకస్వరూపుడై "శేత్తుత్తామఱై" పుష్కరిణిలో స్నానమాడి పూర్వరూపము నందెను. ఇచ్చట శఠారిలో నమ్మాళ్వార్ల తిరుమేని (విగ్రహము) వేంచేసి యుండుట విశేషము. ఊర్వశి, తిలోత్తమ అను దేవకన్యలు తపమాచరించి భగవానుని అనుగ్రహమున చామర కన్యకలుగా వేంచేసియున్నారు. మణవాళమామునుల స్వర్ణముద్రిక ఇచట (ఉంగరము) కలదు. తులా మాసం మూలా నక్షత్రమున వానమామలై జీయరుస్వామి దీనిని ధరించి శ్రీ పాదతీర్థమును అనుగ్రహింతురు.

నమ్మాళ్వార్లు "నోత్తనోన్బు" అను తిరువాయిమొழிలో (5-7-10) ఆఱెనక్కు నిన్పాదమే (నీ శ్రీ పాదములే నాకు ఉపాయము) ఓ దేవ నాయకా ! ఏ విధమైన ఉపాయములేని నాకు శ్రీ పాదములనే ఉజ్జీవనోపాయముగా ప్రసాదించితివి. దీనికి నేనేమి ప్రత్యుప కృతిని గావించెదను. నాయాత్మ కూడ నీదేగాన దానిని కూడ నీకు సమర్పించు నధికారము నాకు లేదు గదా!యని సర్వేశ్వరుని ఔదార్యగుణమును ప్రకాశింపజేసిరి.

మీన మాసం ఉత్తర తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇచటగల తేనమాంపొழிల్(తేనెచే సమృద్దమైన మామిడి తోటలు గలది) అను పెరుమాళ్ల ఉద్యానవనము, స్వర్ణగోరథము సేవింపదగినవి.

సూచన: ఈ క్షేత్రమును "నాంగునేరి"అని చెప్పవలెను. లేనిచో ఎవరికినీ తెలియదు. ఈక్షేత్రస్వామి విషయమై కొన్ని శ్లోకములు.

శ్లో. వరమంగే శుభోత్తుంగే వర పంకేరు హేక్షణే|
    పదపంకేరుహే నిత్యం తవ భృజ్గం కురుష్వమామ్‌||
    మాత శ్శ్రీవరమంగే మధురిపు వాంచిత మనోహరా పాంగే|
    మంగళవదన శశాంకే మామవ విద్యుల్లతా సమానాంగే||
    వన్దేహం వనమాలినం సరసిజా సర్వం సహా సేవితం
    చంచచ్చామర కన్యకా భృగుయుతం చక్రాది భూషానిత్వమ్‌|
    మార్కండేయ మునీన్ద్ర వన్దిత వియత్ క్ష్మాభృన్నివాస ప్రియం
    సేనాధీశ దినేశ చంద్ర విహగాధీశై స్సదా సేవితమ్‌||
    నౌమి శ్రీసురరాజ మమ్బుజదృశం పద్మా మహీ సేవితం|
    గోదాలోచన కోమలోత్పల విధుం శ్రీదాంఘ్రి పజ్కేరుహమ్‌|
    వానక్ష్మాధర నిత్యవాస రసికం దీనావనే దీక్షితం
    మత్రా శ్రీవరమంగయా విలసితం సార్దం శఠద్వేషిణా||

మార్గము: తిరునల్వేలి నుండి తిరుక్కురుజ్గుడి మార్గములో నాంగునేరిలో దిగవలెను. తిరునెల్వేలి నుండి 30 కి.మీ. ఇచట సర్వసౌకర్యములు కలవు.

పా. ఏనమాయ్ నిలజ్గీణ్డ వెన్నప్పనే కణ్ణా; యెన్ఱుమెన్నై యాళుడై;
   వాననాయకనే;! మణిమాణిక్క చ్చుడరే;
   తేనమామ్బొழிల్; శిరీపరమజ్గలత్తవర్ కై తొழுవుఱై;
   వానమామలైయే; యడియేన్ తొழுవన్దరుళే||

పా. ఆఱెనక్కు నిన్బాతమే; శరణాక త్తన్దొழிన్దాయ్; ఉనక్కోర్‌కై
   మ్మాఱు ననొన్ఱిలే; నెనతావియు మునతే
   శేఱుకొళ్ కరుమ్బు మ్బెరు--న్నలు; మలితణ్‌శిరీవరమజ్గై;
   నాఱు పూన్దణ్డుழாయ్ ముడియాయ్; తెయ్‌వ నాయకనే||
                   నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-7-6,10

66

51. దెయ్‌వనాయగన్-శిరీవరమజ్గై.

Deyavanayagan - Vanamamalai

52. కాయ్‌శినవేందన్-తిరుప్పుళింగుడి.

kaisinavendan - Tiruppulilingadi

53. మకరనెడుంకుళిక్కాడన్-తెన్‌తిరుప్పేర్.

Makaranedumkulakandan - Ten Tirupper

54. కళ్లపిరాన్-శ్రీవైకుంఠమ్‌.

Kallapiran - Srivaikundam