Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువిత్తువక్కోడు

వికీసోర్స్ నుండి

69. తిరువిత్తువక్కోడు 11 (తిరువిచ్చిక్కోడు)

శ్లో. శ్రీవిత్తువక్కోడు పురే చక్రతీర్థయుతే శ్రిత:|
   ఉయ్య వంద ప్రభు ర్దేవీం విత్తువక్కోడు వల్లికామ్‌||
   తత్త్వ కాంచన వైమానే దక్షిణస్యోరగే శయ:
   అంబరీషా తిథిర్భాతి కులశేఖర సంస్తుత:||

వివ: ఉయ్యవంద పెరుమాళ్-విత్తువక్కోడువల్లి త్తాయార్-చక్రతీర్థము-తత్త్వకాంచన విమానము-దక్షిణ ముఖము-భుజంగ శయనము-అంబరీషునకు ప్రత్యక్షము-కులశేఖరాళ్వారు కీర్తించినది.

మార్గము: షోరనూర్-గురువాయూర్ బస్‌లో 15 కి.మీ.లో దిగి 2 కి.మీ నడచియు వెళ్ళవచ్చును. షోరనూర్-ఎర్నాకులం లైనులో పట్టాంభి స్టేషనుకు 2 కి.మీ.

పా. తరుతుయరమ్‌ తడాయేల్; ఉన్ శరణల్లాల్ శరణిల్లై;
   విరై కుழுవు మలర్పొழிల్ శూழ்;విత్తువక్కోట్టమ్మానే!
   అరశినత్తా లీన్ఱతాయ్ అగత్‌డినుమ్; మత్తవళ్ తన్
   అరుళ్ నినైన్దే యழுజ్గழవి: అదువే పోన్దిరున్దేనే.
           కులశేఖరాళ్వార్లు-పెరుమాళ్ తిరుమొழி 0-5-1

70. తిరుక్కడిత్తానమ్‌ 12

శ్లో. తిరుక్కడిత్తాన పురే ద్బుతాఖ్య నారాయణ: కల్పక వల్లి దేవ్యా|
   భూమ్యాఖ్య తీర్థే వరపుణ్యకోటి విమానమాప్త: సురదిజ్ముఖస్థ:||
   రుక్మాంగద మహారాజ ప్రత్యక్షత్వ ముసాగత:|
   పరాంకుశ మునీంద్రేణ స్తుతో విజయతే తరామ్‌||

వివ: అద్బుత నారాయణన్-కల్పకవల్లి త్తాయార్-భూమి పుష్కరిణి-పుణ్యకోటి విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-రుక్మాంగద మహారాజునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఈక్షేత్రమునకు "తాయప్పది" దాయభాగముగా లభించిన క్షేత్రము అను విలక్షణమైన తిరునామము గలదు. (తి.వా.మొ.8-6-8)

సర్వేశ్వరునకు భోగ్య భూతములైన వాస స్థానములు అనేకములు కలవు. కానీ "శ్రీవైకుంఠవిరక్తాయ" అనురీతిని వానియందు ఆదరములేనివాడు "ఎన్నైజ్గుమ్‌ తిరుక్కడిత్తన నగరుమ్" (8-6-8) (నామనస్సు తిరుక్కడిత్తాన దివ్యదేశము)

                                         86