దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువిణ్ణగర్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

16. తిరువిణ్ణగర్ 16 (కుంభకోణం 5.కి.మీ)

(ఉప్పిలి యప్పన్ కోయిల్)

శ్లో. భాతి శ్రీ తిరువణ్ణగర్ పురవరే హార్త్యబ్జినీ శోభితే
   శ్రీ మద్విష్ణు విమాన సంస్థితి లసన్ శ్రీ భూమి దేవీ పతి:
   శ్రీ మాను ప్పిలి యప్పనాహ్వయ యుత: పక్షీంద్ర కావేరికా
   ధర్మైర్దష్ట వపు శ్శఠారి కలిజిత్ సమ్యక్ స్తుత:ప్రాజ్ముఖ:|

వివ: ఉప్పిలియప్పన్(శ్రీనివాసర్) భూమిదేవి తాయార్-ఆర్తి పుష్కరిణి(అహోరాత్ర పుష్కరిణి)-విష్ణు విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-గరుత్మంతునకు, కావేరికి, యమునకు, మార్కండేయ మహర్షికి ప్రత్య్క్షము-పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినది.

విశే: ఈ దివ్యదేశమునకు "నణ్ణగర్" అను విలక్షణమైన తిరునామము కలదు. శ్లాఘ్యమైన దివ్యదేశము.(తి.వా.మొ. 6-3-2) నల్ కురువుమ్‌ అను తిరువాయిమొழிలో (6-3) నమ్మాళ్వార్లు తమకు సేవ సాయించిన తిరువిణ్ణగర్ పెరుమాళ్ళ కల్యాణ గుణములను అనుభవించుచు "పల్‌వకయుం పరన్ద" అని సర్వేశ్వరుని ఆఘటిత ఘటనా సామర్ద్యమనెడి కల్యాణ గుణమును ప్రకాశింపజేసిరి. తంజావూరు జిల్లాలో ప్రసిద్దమైన క్షేత్రము. ఇచ్చట స్వామి మార్కండేయ పుత్రికను వివాహమాడిరి. ఆ సమయమున భూమిదేవి నాచ్చియార్ చిన్న వయసు గలవారగుటచే తళియలో ఉప్పువేయుట కూడ తెలియనివారైరి. అందుచే నాటి నుండి స్వామి ఉప్పులేని ప్రసాదమునే ఆరగించెడివారు. నేటికిని ఉప్పులేని ప్రసాదమునే ఆరగించు చున్నారు. ఈ క్షేత్రమునకు తులసీ వనమనియు తిరునామము కలదు. అన్ని వసతులు గలవు. సన్నిధిలో ప్రసాదములు లభించును. కుంభఘోణమునుండి టౌన్ బస్ కలదు. ఈసన్నిధి తిరునాగేశ్వరము అను ప్రసిద్ధ శివ క్షేత్రమునకు 1 కి.మీ. ఇచట నుండి తిరుచ్చేరై "నాచ్చియార్‌కోయిల్" పోయి సేవింప వచ్చును.

   పర--డరుడమ్బాయழక్కు ప్పదిత్త పుడమ్బాయ్;
   కరన్దుం తోన్ఱియుమ్‌ నిన్ఱుమ్‌ కైదవజ్గల్ శెయ్‌దుమ్; విణ్ణోర్‌
   శిరజ్గళాల్ వణజ్గుమ్‌ తిరువిణ్ణగర్ చ్చేర్‌న్ద పిరాన్
   వరజ్గొళ్ పాదమల్లాలిల్లై యావర్‌క్కుమ్‌ వన్‌శరణే.
          నమ్మాళ్వార్-తి.మొ 6-3-7

   వణ్డుణు నఱుమల రిణ్డై కొణ్డు-వణ్ణనమ్‌ వినై కెడవెన్ఱు; ఆడిమేల్
   తొణ్డరు మమరరుం పణియనిన్ఱ జ్గణ్డమోడ కలిడ మళన్దవనే
   ఆణ్డాయున్నైక్కాణ్బద్బో రరుళె నక్కరుళుదియేల్
   వేణ్డేన్ మనై వాழక్కైయై విణ్ణగర్ మేయవనే.
        తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 6-1-1

17. తిరువాలి తిరునగరి

(శీర్గాళి 18 కి.మీ)

శ్లో. దివ్యేలాతని పద్మినీ తటగతే హ్యష్టాక్షరా గారగ:
   భాతి శ్రీ తిరువాలి పట్టణ వరే పాశ్చాత్య వక్త్రాసన:|
   సంప్రాప్తోమృత కుంభ పూర్వ లతికాం శ్రీ కర్దమాలాతని
   ప్రత్యక్షో మణవాళ నాహ్వయ విభు: కీర్త్య: కలిధ్వంసిన:

వివ: వయలాలి మణవాళన్-అమృత ఘటవల్లి తాయార్-ఏవరవన్ శిందై తనక్కినియాన్-అలాతని పుష్కరిణీ-అష్టాక్షర విమానము-పశ్చిమ ముఖము-కూర్చున్న సేవ-అలాతనికి, కర్జమ ప్రజాపతికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్ల అవతారస్థలమైన తిరుక్కుఱైయలూర్ ఈ క్షేత్రమునకు సమీపమునే గలదు. వృశ్చికమాసములో కృత్తికా నక్షత్రమునకు ముందు పది దినములు వీరి తిరు నక్షత్రము అతి వైభవముగా జరుగును.

తిరువాలి తిరునగరిలో పంగుని(మీనమాసం) ఉత్తరా నక్షత్రము అవసాన దినముగా బ్రహ్మోత్సవము జరుగును. ఈ ఉత్సవములలో ఎనిమిదవ ఉత్సవమునాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ "ఆడల్ మా" అను అశ్వము మీద వేంచేసి పెరుమాళ్ల తిరువాభరణములు అపహరించు సమయమున జరుగు సంవాదము అతి మనోహరముగా నుండును. తిరువాలి తిరునగరి వాస్తవముగా రెండు తిరుపతులు తిరువాలి నుండి తిరునగరి సుమారు 3 కి.మీ దూరములో నున్నది. తిరువాలి యందు నరసింహస్వామి సన్నిధి కలదు. తిరునగరి యందు వయలాలి మణవాళన్ వేంచేసి యున్నారు. ఈ తిరువాలికి దక్షిణమున 7 కి.మీ దూరములో తిరునాంగూరు దివ్యదేశము కలదు. రామానుజ కూటము కలదు.

ఈ క్షేత్రమున వేంచేసియున్న తిరుమంగై ఆళ్వార్ల సౌందర్యము వర్ణానాతీతము. ఆ సౌందర్యమును మణవాళ మామునులు ఇట్లు అభివర్ణించిరి.

అణైత్త వేలుమ్‌, తొழுత కైయుమ్; అழన్దియ తిరునామముమ్; ఓమెన్ఱ వాయుమ్‌, ఉయర్‌న్ద మూక్కుం; కుళిర్‌న్ద ముగముమ్; పరంద విழிయుమ్‌, ఇరన్డు కుழలుమ్‌, శురుండ వళైయుమ్‌, పడిత్తకాతుమ్‌, మలర్‌న్ద కాతు కాప్పుమ్‌, తాழన్ద శెవియుమ్‌, శెఱిన్ద కழுత్తుమ్‌, అకన్ఱ మార్‌పుమ్‌, తిరన్ద తోళుమ్‌;నెళిత్త ముతుకుమ్‌, కువిన్ద విడైయుమ్‌, అల్లి కయఱుమ్‌, ఆళున్దియ శీరావుమ్‌, తూక్కియ కరుజ్గోవైయుమ్‌, తొజ్గలుమ్‌ తనిమాలైయుమ్‌, శాత్తియ తిరుత్తణ్డైయుమ్‌, శతిరాన వీరక్కழలుమ్‌, కున్దియిట్ట కణైక్కాలుమ్‌, కుళిరవైత్త తిరువడి మలరుమ్‌, మరువలర్‌త ముడల్, తుణియ వాళ్ వీశుమ్‌, పరకాలన్ మజ్గై మన్నరాన వడివే.

                     27