Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువిడవెన్దై

వికీసోర్స్ నుండి

పా. అన్ఱాయర్ కులక్కోడియోడు; అణిమామలర్ మజ్గై యోడన్బళని, అవుణర్‌క్
   క్కెన్ఱాను మిరక్క మిలాదవనక్కు; ఉఱై యుమిడ మావదు; ఇరుమ్బొழிల్ శూழ்
   నన్ఱాయపునల్ నఱై యూర్ తిరువాలి కుడన్దై తడన్దిగழ் కోవల్ నగర్
   నిన్ఱానిరున్దాన్ కిడన్దాన్ నడన్దాఱ్కిడమ్; మామలై యావదు నీర్మలైయే.
          తిరుంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 2-4-1

92. తిరువిడవెన్దై 19

శ్లో. కల్యాణే త్విడవెన్ద నామని పురే కల్యాణ తీర్థాంచితే
   కల్యాణాఖ్య విమాన మధ్యనిలయ: కల్యాణ నామాహరి:
   దేవీం కోమళవల్లికా మనునయన్ ప్రాగాస్య సంస్థానగో
   మార్కండేయ మునీన్ద్ర వీక్షితతనూ రేజే కలిఘ్నస్తుత:

వివ: నిత్యకల్యాణర్-కోమలవల్లి త్తాయార్-కల్యాణ తీర్థము-కల్యాణ విమానము-తూర్పు ముఖము-నిలచున్నసేవ-మార్కండేయ మహర్షికి ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

గాలవ మహర్షియొక్క కుమార్తెలు 360 మంది. వీరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దినమున స్వామి వివాహమాడుటచే ఆయనకు నిత్యకల్యాణర్ అనిపేరు వచ్చినది. ఈ మూడువందల అరువది కన్యలను కలిపి ఒకే కన్యగాచేసి స్వామి తనకు ఎడమవైపున ధరించుటచే ఈక్షేత్రమునకు తిరువిడన్దై అనియు, తాయార్లకు అఖిలవల్లి అనియు పేరువచ్చెను. ఇచట మూలవర్ తిరుమేనిలో లక్ష్మీదేవి ఎడమ(ఇడదు) భాగమున ఉండుటచే "ఇడవెన్దై" అని పేరువచ్చెను. సముద్రతీర క్షేత్రమగుటచే సౌకర్యములు స్వల్పము.

మార్గము: మహాబలిపురమునకు 10 కి.మీ. దూరమున కలదు.

పా. తుళమ్బడు ముఱువల్ తోழிయర్కరుళాళ్
         తుణైములైశాన్దు కొణ్డడియాళ్
   కుళమ్బడు కువళై క్కణ్ణిణై యెழுదాళ్
         కోలనన్మలర్ కుழఱ్కణియాళ్;
   వళమ్బడు మున్నీర్ వై యమున్నళన్ద
         మాలెన్నుం మాలినమొழிయాళ్
   ఇళమ్బడి యివళుక్కెన్నినైన్దిరున్దా
         యిడై వెన్దై యెన్దపిరానే!
         తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 2-7-2

111

93. తిరుక్కడల్ మల్లె 20

(మహాబలిపురం)

శ్లో. శ్రీ మత్తార్ష్య తరజ్గిణీ తటగతే దేశేకడల్ మల్ల ఇ
   త్యాఖ్యే శ్రీ నిలమంగ నామయుతయాదేవ్యా భుజజ్గేశయ:
   భాతి శ్రీ స్థలశాయి నామకవిభు శ్శ్రీ పుండరీకేక్షిత:
   ప్రాగాస్యస్తు ఘనాకృతా కలిరిపు శ్రీ భూతచక్రస్తుత:||

వివ: స్థలశయనర్-నిలమంగై నాచ్చియ్యర్-తార్ష్య నది-తూర్పు ముఖము-భుజంగశయనము-గగనాకార విమానము- పుణ్డరీకునకు ప్రత్యక్షము-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

ఇది పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన సన్నిధి శిధిలమై సముద్రతీరమున కలదు. ఇది శిధిలముకాగా కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రము ఇదియొక్కటియే.

పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చింపబోయెనట. ఆసమయమున స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానున్నది, ఆహారమునీయుమని అడిగెను. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెడలెను. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించెను. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ అని సంబోధించిరి.

ఈక్షేత్రమునగల జ్ఞానపిరాన్(వరాహస్వామి) సన్నిధి తప్పక సేవింపవలెను. ఇచటస్వామి తిరుమేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెన్దై అనిపేరు.

ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారు క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షముకాగా వారికిని ఇచటి నుండియే మంగళాశాసనము చేసిరి.

మార్గము: మద్రాసునుండి 65 కి.మీ. దూరమున కలదు. సకల సదుపాయములు కలవు.

పా. పారాయదుణ్డు మిழ்న్ద పవళత్తూణై;
        ప్పడు కడలిలముదత్తై ప్పరివాయ్ కీణ్డ
   శీరానై; యెమ్మానై త్తొణ్డర్ తజ్గళ్;

                                      112