Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువాయిప్పాడి

వికీసోర్స్ నుండి

106. తిరువాయిప్పాడి (గోకులము) 11

శ్లో. గోకులే యమునా తీరే ప్రాచీముఖ లసత్ స్థితి:
   రుక్మిణీ సత్యభామాభ్యాం హేమకూట విమానగ:|
   నవమోహన కృష్ణ: శ్రీ నంద గోపాక్షి గోచర:|
   రథాంశ కలిజిత్ గోదా కులశేఖర సంస్తుత:||

వివ: నవమోహన కృష్ణన్-రుక్మిణీ-సత్యభామ-గోకులము-యమునానది-తూర్పు ముఖము-నిలచున్నసేవ-హేమకూట విమానము-నందగోపునకు ప్రత్యక్షము-కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-ఆండాళ్ కీర్తించినది.

విశే: ఆళ్వార్లు కీర్తించిన కోవెలగాని పెరుమాళ్లుగాని యిపుడుకానరారు. ఇపుడున్న సన్నిధులు తర్వాత నిర్మించినవే. గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు-ఊయలలో శ్రీ కృష్ణుడు సేవసాదింతురు. ఇచట రెండు సన్నిధులు కలవు. రెండును సేవింప దగినవి. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము-బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగును. తప్పక సేవింపదగిన ఉత్సవములు.

మార్గము: మధురకు 12 కి.మీ. దూరములో కలదు.

పా. నాణి యినియోర్ కరుమ మిల్లై నాలాయలారు మఱిన్దొழிన్దార్
   పాణియాదెన్నై మరున్దు శెయ్‌దు పణ్డుపణ్డాక్కవుఱుదిరాగిల్
   మాణియురువా యులగళన్ద మాయనై క్కాణిల్ తవై మఱియుమ్;
   ఆణై యాల్‌నీరెన్నై క్కాక్కవేణ్డిల్‌ఆయ్‌ప్పాడిక్కే యెన్నైయుయ్‌త్తిడుమిన్.
         ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-2


మంచిమాటలు

1. శిష్యుని హితము గోరువాడు ఆచార్యుడు, మనోవాక్కాయముల ఆచార్యకైంకర్యము చేయువాడు శిష్యుడు.

2. ఆకలిగొన్నవానికి అమృతపానము వంటిది ద్వయాను సంధానము.

140

107. తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము) 12

శ్లో. క్షీరాబ్దా నమృతాఖ్య తీర్థ రుచిరే శ్రీవ్యూహమూర్తి ప్రభు:
   నాయక్యాతు కడళ్ మకళ్ పదయుజా త్వష్టాంగ వైమానగ:|
   లంకా వీక్షణ భాక్ భుజంగ శయన: పద్మాసనేశాదిభి:
   దృష్టాంగోఖిల దివ్యసూరి వచసాం పాత్రంచ నీళాస్తుతే:||
   రామకృష్ణాది మూర్తీనాం మూలకారణ విగ్రహ:|
   శరణాగత గీర్వాణార్థం విరాజతే||

వివ: క్షీరాబ్ది నాథన్(వ్యూహమూర్తి)-క్షీరాబ్దిపుత్రి-అమృత తీర్థం- అష్టాంగ విమానము-దక్షిణ ముఖము-భుజంగ శయనము-బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము-ఆళ్వార్లు, ఆండాళ్ కీర్తించినది.రామకృష్ణాది విభవావతారములకు మూలకందమైన రూపము. శరణాగతులను, దేవతలను రక్షించుటకై వేంచేసియున్నారు.

మార్గము: దేవతలకు, సనకసనందనాది యోగులకు మాత్రము దర్శింపవీలైనది.

పా. తిరుమగళుమ్‌ మణ్‌మగళుమ్; ఆయ్‌మగళుమ్‌ శీర్‌న్దాల్,
   తిరుమగట్కే,తీర్‌న్దవాఱెన్‌కొల్-తిరుమగళ్మేల్
   పాలోదమ్‌ శిన్దప్పడ నాకణైక్కిడన్ద;
   మాలోద వణ్ణర్ మనమ్‌
          పొయిగై ఆళ్వార్-ముదల్ తిరువన్దాది 42

పా. పామ్బణైమే ఱ్పాఱ్కడలుళ్; పళ్ళియమర్‌న్దదువుమ్‌,
   కామ్బణైత్తోళ్ పిన్నైక్కా; యేఱుడనేழ் శెత్‌తవుమ్‌
   తేమ్బణైయ శోలై; మరామరమే ழனయ్‌దదువుమ్‌
   పూమ్బిణైయ తణ్డుழாయ్ ప్పొన్ముడియమ్బోరేఱే||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 2-5-7


మంచిమాట

సంసారమనెడి పాము కరచినచో అందులకు తగిన ఔషదము ద్వయ మంత్రము.

                                        141