దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువనంతపురమ్‌

వికీసోర్స్ నుండి

59. తిరువనంతపురమ్‌ 1

శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
   శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
   అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
   ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

వివ: అనంత పద్మనాభస్వామి-శ్రీహరిలక్ష్మీతాయార్-భుజంగశయనం-మత్స్య పుష్కరిణి-హేమకూట విమానము-తూర్పు ముఖము-మూడు ద్వారములలో దర్శనము-శివునకు, ఇంద్రునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున కలదు. ఇచట స్వామి మూడు ద్వారములలో సేవ సౌదింతురు. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొழி ప్రబంధములో(10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్‌ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.

శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు పిలిచిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వేంచేసిరి.

"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించిరి. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో వేంచేసియుండిరి. ఆకారణమున యోగరహస్యము వారికి లభింపకపోయెనట. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని భావించిరట.

ఈక్షేత్రమున సేవింపవలసిన విశేషములు పెక్కులు గలవు.ఇచటికి సమీపమునగల "యానైమలై", అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ చూడదగినవి.

ఆచార్య హృదయములోని "ససైన్య పుత్ర శిష్య సాధ్య సిద్ధ భూసురార్చనత్తుక్కు ముఖ, నాభి పాదజ్గళై ద్వారత్రయత్తాలే కాట్టుం సామ్యమ్‌ అనన్త శయనత్తిలే వ్యక్తమ్" అనుచూర్ణిక "సైన్య, పుత్ర, శిష్య సాధ్య, సిద్ధ బ్రాహ్మణారాధనలకు అనుకూలముగా ముఖము, నాభి, పాదములతో మూడు ద్వారములందు సేవసాదించు సౌమ్యగుణము (ఎల్లరును ఒక్కరీతిని జూచు గుణము) తిరువనంత పురమున కనిపించును అని తెలుపుచున్నది. 75 అమరరాయ్‌త్తిరిగిన్ఱార్గట్కుఆది" అనుటచే బ్రహ్మాది దేవతలు సేవించుటను; "అమరర్‌కోన్ అర్చిక్కిన్ఱ అజ్గగప్పణి శెయ్యర్" "సేన ముదలియాళ్వార్(విష్వక్సేసులు) ఆరాధింపగా అందుకు తగినట్లు అంతరంగ కైంకర్యనిరతులును నిత్యముక్తులును, అనుటచే సైన్యాధిపతి సేవించుటయు "నమర్గళో శొల్లక్కేణ్మిన్ నాముమ్‌ పోయ్ వణుగ వేణ్డుమ్" "భాగవతులారా! నామాట వినుడు మనము తిరువనంతపురము పోయి కైంకర్యము చేయవలెను" అనుటచే మన వంటి వారి సేవను స్వీకరించు చున్నాడు.

ఈవిధముగా ఏవిధమైన తారతమ్యము లేక సర్వుల సేవను స్వీకరించుటచే సామ్యమను గుణము ప్రకాశించుచున్నది.

మార్గము: ఇది కేరళ రాష్ట్ర రాజధాని. చెన్నై-తిరువనంతపురం(త్రివేండ్రం)రైలు మార్గము. తిరువనంతపురము సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.

పా. కెడుమిడరాయ వెల్లామ్; కేశవా వెన్న; నాళుం
    కొడువివై శెయ్యుమ్‌ కు త్‌తిన్; తమర్ గళుమ్‌ కురుగ కిల్లార్;
    విడముడై యరవిల్ పళ్ళి; విరుమ్బినాన్ శురమ్బలత్‌తుమ్;
    తడముడైవయ; లనన్ద పురనగర్ పుగుదు మిన్ఱే.

    కడువినై కళై యలాగుమ్; కామనై ప్పయన్ద కాళై;
    ఇడవగై కొణ్డదెన్బర్;ఎழிలణి యనన్దపురమ్;
    తడముడై యరవిల్ పళ్ళి; పయిన్ఱవన్ పాదం కాణ
    నడమినో నమర్గళుళ్ళీర్; నాముమక్కఱుయచ్చొన్నోమ్;
           నమ్మాళ్వార్-తిరువాయిమొழி 10-2-1,8


మంచిమాట

జీవులు

నిత్యవిభూతియగు పరమపదము లీలావిభూతి యీ రెండును సర్వేశ్వరునకు శేషభూతమై యుండును. వీనిలోనివసించువారు నిత్యులనియు ముక్తులనియు బద్ధులనియు మూడు విధములుగా నుందురు. అందు నిత్యులనగా అనంత గరుడ విష్వక్సేనాధి అంతరంగిక కైంకర్యవరులు. ముక్తులనగా కొంతకాలము సంసారమున పడియుండియు సర్వేశ్వరుని కృపకు పాత్రులై పరమపదమును చేరినవారు. బద్ధులనగా సంసారమున బడియుండువారు. వీరు రెండు విధములుగా నుందురు. 1. ఋబుక్షువులు 2. ముముక్షువులు. బుభుక్షువులనగా అవిధ్యకు వశ్యులై దేహయాత్రచేయువారు. ముముక్షువులనగా సుకృతవశమున ఆచార్యానుగ్రహము లభింపక సర్వేశ్వరుని పొందుటకై ప్రయత్నించువారు.

76

60. తిరువణ్ పరిశారమ్‌ 2

శ్లో. తిరువణ్ పరిశార పట్టణే వరలక్ష్మీ సరసా సమన్వితే|
   సురదిగ్వదనోపవేశనో వినతాకారి విలోచనాతిథి:||

శ్లో. ఇంద్ర కల్యాణ నిలయ: తిరువాళ్ మార్పనాహ్వయ:|
   దేవ్యా కమల వల్ల్యాయం రేజే శఠరిపుస్తుత:||

వివ: తిరువాళ్ మాఱ్పన్(తిరుక్కురళప్పన్)-కమలవల్లి తాయార్-లక్ష్మీతీర్థం-తూర్పు ముఖము-కూర్చున్నసేవ-ఇంద్ర కల్యాణ విమానము-వినతకు, ఉడయ నంగైయార్‌కు(నమ్మాళ్వార్ల తల్లిగారు)కారి.(నమ్మాళ్వార్ల తండ్రిగారు)-గరుడాళ్వార్లకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్లు కీర్తించిన క్షేత్రము.

విశే: ఈ దివ్య దేశమునకు "అచ్చేరి" అను విలక్షణమైన తిరునామము కలదు. ఈస్వామి విషయమై నమ్మాళ్వార్లు సౌకుమార్యమను గుణమును ప్రకాశింప జేసియున్నారు.

సంసారులు శబ్దాది విషయలంపటులు-నిత్య సూరులు భగవదను భవమున మునిగినవారు. వీరెవరును స్వామిమిశ్రమను గుర్తించుటలేదు. కావుననే అతి సౌకుమార్యముగల స్వామి "అழிయుమ్‌ శబ్గుమ్‌ శుమప్పార్ తామ్‌" అనునట్లు శంఖ చక్రములను తానే స్వయముగా భరించుచున్నాడే "వాళుమ్‌ విల్లుమ్‌ కొణ్డు పిన్ శెల్వార్ మత్తిల్లై" శంఖ చక్రములను విల్లును తీసికొని వెనుక నడుచు వారు ఎవరునులేరే" యని ఆళ్వార్లు సర్వేశ్వరుని సౌకుమార్యమను గుణమును ప్రస్తుతించిరి.

నమ్మాళ్వార్ల తల్లిగారైన ఉడయనంగై యార్ అవతారస్థలము. వారి సన్నిధి కోయిలకు సమీపముననే గలదు. ఇచట ఆళ్వార్లు బాల్యదశాసూచకమైన అర్చారూపమున వేంచేసియున్నారు.

మార్గము: కన్యాకుమారికి ఉత్తరమున 20 కి.మీ దూరమున నాగర్‌కోయిల్‌కు 4 కి.మీ. దూరమున గలదు. తిరువాట్టారునుండి "తొడువెట్టి" చేరి బస్సు మారి నాగర్ కోయిల్ చేరవచ్చును. వసతులు స్వల్పము.

పా. ఆళుమాళారాழிయుమ్; శజ్గుమ్‌ శుమప్పార్ తామ్;
    వాళుమ్‌ విల్లుజ్కొణ్డు; పిన్ శెల్వార్ మற்றிలై;
    తాళుమ్‌ తోళుమ్; కైగళై యారతొழ்క్కాణేన్;
    నాళుమ్‌ నాళుమ్‌ నాడువ; నడియేన్ --లత్తే.

పా. వరువార్ శెల్‌వార్; వణ్ పరిశారత్తిరున్ద; ఎన్
    తిరువాழ் మార్వఱ్కెన్; తిఱమ్‌ శొల్లార్ శెయ్‌వదెన్;
    ఉరువార్ శక్కరమ్; శజ్గు శుమన్దిజ్గుమ్మోడు;
    ఒరుపాడుழల్వా; నోరడియాను ముళనెన్ఱే
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-3,7

77