దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువణ్ వండూరు

వికీసోర్స్ నుండి

67. తిరువణ్ వండూరు 9

శ్లో. వణ్ వండూర్ పురి పాపనాశ సరసా యుక్తేతు వేదాలయం
   వైమానం సమధిశ్రితో వరుణ దిగ్వక్త్ర స్థితి: ప్రీతిమాన్|
   దేవ: పాంబణయప్ప నంబుజలతా నాథ స్సముజ్జృంభతే
   మార్కండేయ సునారాదాక్షివిషయ: కీర్త్య:శఠద్వేషిణ:||

వివ: పాంబణయప్పన్-కమలవల్లి త్తాయార్-నిలచున్న సేవ-పాపనాశపుష్కరిణి-వేదాలయ విమానము-పశ్చిమ ముఖము-మార్కండేయునకు, నారదునకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము నకులునిచే ప్రతిష్ఠ చేయబడినదని చెప్పుదురు. ఆళ్వార్లు అనేకవిధముల సర్వేశ్వరుని ప్రార్థించియు అభీష్టము లభింపక "దానికేమి కారణమని" ఆలోచించి "శ్రియ:పతి తిరువణ్ వణ్డూరులో వేంచేసియుండి అచటి భోగ్యతా విశేషములకు పరవశుడై తనను మరచి యుండు" నని భావించి స్వామియొక్క ఆర్తరక్షణ దీక్షను గుర్తుచేయదలచి సముద్రతీరమున సంచరించు పక్షులను శ్రియ:పతి యొద్దకు దూతలుగా పంపుచున్నారు.

ఇది ఆళ్వార్లు సర్వేశ్వరుని విషయమై నాయికా భావముతో దూతప్రేషణము చేసిన దివ్య దేశము. తిరువాయిమొழிలో గల నాల్గు దూతప్రేషణములలోనిది రెండవది. మొదటిది "అ--ఱైయ మడనారాయ్" అను దశకమున వ్యూహమూర్తి విషయమై దూతప్రేషణ గావింపబడినది. ఈ క్షేత్రస్వామి విషయమైన "వైకల్ పూజ్గழிవాయ్" అను దశకమున(6-) "ఏఱు శేనగనాఱ్కు"(వర్దిల్లుచున్నశైర్యము గలవానికి) యని విభవమూర్తి విషయమై దూత ప్రేషణము నెరుపబడినది. ఈక్షేత్రమునకు పంపోత్తర దేశమను తిరునామము గలదు. పంపానదికి ఉత్తరతీరమందున్న దివ్యదేశము అని అర్థము. (తి.వా.మొ. 6-1-10).

మార్గము: శెజ్గణూర్‌కు వాయువ్యముగా 5 కి.మీ. వసతులు స్వల్పము. తిరువల్లవాళ్ నుండియు సేవింపవచ్చును.

పా. వైకల్ పూజ్గழிవాయ్; వన్దుమేయు జ్గురుకినజ్గాళ్;
   శెయ్‌గొళ్ శెన్నలుయర్; తిరువణ్వణ్డూరుఱైయుమ్;
   కైగొళ్ శక్కరత్తైన్;కనివాయ్ పెరుమానై క్కణ్డు;
   కైగళ్ కూప్పి చ్చొల్లీర్; వినై యాట్టియేన్ కాదన్మైయే
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-1-1

84