Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుప్పులియూర్

వికీసోర్స్ నుండి

మార్గము: ఆల్‌వాయ్ టౌన్ నుండి బస్సు కలదు. బస్టాండు సమీపంలోనే సన్నిధి కలదు. ఎర్నాకుళం నుండియు రావచ్చును 10 కి.మీ.

పా. ఎజ్గానలగజ్కழிవాయ్; ఇరై తేర్‌న్ది జ్గీనిదమరుమ్;
    శెజ్గాల మడనారాయ్; తిరుమూழிక్కళత్తుఱైయుమ్;
    కొజ్గార్ పూన్తుழாయ్ ముడి; యెజ్కుడక్కూత్తర్ క్కెన్ తూదాయ్;
    నుజ్గాల్ గ ళెన్ తలై మేల్; కెழுమీరో నుమరోడే;
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-7-1

63. తిరుప్పులియూర్ 5 (కుట్టనాడు)

శ్లో. పులియూరితి విశ్రుతే స్థితో నగరే పూంశున తీర్థ సుందరే
   పురుషోత్తమ దేవయానగ శ్శుశుభే పొఱ్కొడి నాయకీపతి:||

శ్లో. మాయప్పిరాన్ నామ హరి:సప్తర్షి నయనాతిథి:
   ప్రాజ్ముఖ శ్శఠజి త్పూక్తి శతకే కీర్తితోసమే||

వివ: మాయప్పిరాన్-పొఱ్కొడినాయకి-పూంశునై తీర్థము-పురుషోత్తమ విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-సప్తర్షులకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. ఈ క్షేత్రమునకు "వళమ్పుగழுమ్‌ ఊర్" అను విలక్షణమైన తిరునామము కలదు. (సౌందర్యస్తుతి దేశము 8-9-3 తి.వా.మొ)

విశే: ఈ క్షేత్రము భీమ సేనుని ప్రతిష్ఠయని యందురు. పెరుమాళ్ల తిరుముఖ మండలము రజిత కవచముచే కప్పబడి యుండును. నమ్మాళ్వార్లు తిరువాయిమొழிలో తోழிమార్(సఖి) దశలో చెప్పిన దశకములు మూడు. అందులో "కరుమాణిక్కమలై మేల్" (8-9) అను దశకము మూడవది. ఈ మూడు దశకములలోని ప్రణవ మందలి ఉకారార్థమగు అనన్యా ర్హత్వము ప్రకటింపబడినది. ఇందు మొదటి పాశురమున "కరుమాణిక్కమలైమేల్ మణిత్తడన్దామరైక్కాడుగల్పోల్; తిరుమార్వువాయ్ కణ్‌కై ఉన్దికాల్ ఉడై ఆడైగళ్".

తిరుప్పులియూర్‌లో వేంచేసియున్న స్వామి తిరుమేని నీల రత్నగిరివలె నున్నది. స్వామి వక్షస్థలము; మోని; నేత్రములు, శ్రీహస్తములు; నాభి, శ్రీపాదములు; పీతాంబరము మున్నగునవి ఆకొండమీది సరోవరమునగల పద్మవనము వలెనున్నవి" యని ఉత్తమ నాయక లక్షణములను ప్రకాశింపజేసిరి.

మార్గము: శజ్గణూర్‌కు 5 కి.మీ. వసతులు స్వల్పము.

80