దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కురుగూర్

వికీసోర్స్ నుండి

49. తిరుక్కురుగూర్ 9 (ఆళ్వార్ తిరునగరి)

శ్లో. భాతి శ్రీ కురుకాపురే పురవరే శ్రీ తామ్రపర్ణీ నదీ
   తీరస్థే సురదిజ్ముఖ స్థ్పితిరసౌ గోవింద వైమానగ:|
   దేవ్యా సంతత మాదినాధలతయా యుక్త శ్శఠ ద్వేషిణాం
   దృష్టాస్తత్త్యవ లోలుపో నవరతం దేవాధినాథ ప్రభు:||

వివ: ఆదినాథ పెరుమాళ్(పాలిందునిన్ఱ పిరాన్)-ఆదినాథ వల్లి-తామ్ర పర్ణీనది-గోవింద విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-నమ్మాళ్వార్లకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఈక్షేత్రమునకు"ఉఱైకోయిల్"(సర్వేశ్వరుడు నిత్య నివాసము చేయుచున్న)దివ్యదేశము అను విలక్షణమైన తిరునామము కలదు. నమ్మాళ్వార్లు ఈ స్వామి విషయములో పరత్వ సౌలభ్య గుణములను సేవించి ప్రకాశింపజేసిరి. (తిరువాయిమొழி 4-10)

ఈ దివ్యదేశమునకు 1.కి.మీ దూరములో నమ్మాళ్వార్ల అవతారస్థలమైన "అప్పన్ కోయిల్" అను గ్రామము కలదు. ఈ క్షేత్రమునకు సమీపముననే నవ తిరుపతులు గలవు. ఆళ్వారు తిరునగరి యను అష్టాక్షరీ మంత్రరూప పద్మమునకు యెనిమిది అక్షరములనెడి యెనిమిది పద్మదళములవలె యెనిమిది దివ్యదేశములు అమరియున్నవి. ఈక్షేత్ర సంగ్రహశ్లోకము

1. వైకుంఠ నాథ 2. విజయాసన 3. భూమిపాలన్
4. దేవేశ 5. సజ్కజి విలోచన 6. చోరనాట్యన్
7. నిక్షిప్తవిత్త 8. మకరాయత కర్ణపాశౌ
9. నాథం నమామి వకుళాభరణేన సార్థం.

వివ: 1.వైకుంఠం-శ్రీవైకుంఠం 2. విజయాసన-వరగుణమంగై 3. భూమిపాలాన్-తిరుప్పుళిజ్గుడి 4. దేవేశ-తొలవిల్లి మంగలం 5. పంకజ విలోచన-తొలవిల్లి మంగలం 6. చోరనాట్యన్-తిరుక్కుళందై 7. నిక్షిప్తవిత్త-తిరుక్కోళూరు 8. మకరాయతకర్ణపాశౌ-తెన్ తిరుప్పేర్ 9. నాథం-పొలిందు నిన్ఱపిరాన్-ఆళ్వార్ తిరునగరి. ఈ తిరునగరిలో నిర్ణిద్ర తింత్రిణి(నిద్రపోని చింతచెట్టు)కలదు. ఇది ఆదశేషుల యవతారమని పెద్దలు చెప్పుదురు. ఈ వృక్షము క్రిందినే నమ్మాళ్వార్లు యోగనిష్ఠలో వేంచేసియుండిరి. ఇచట జ్ఞానప్పిరాన్ అను వరాహ పెరుమాళ్ సన్నిధి కలదు. ఈ క్షేత్రము మణవాళ మహామునులచే నిర్వహింపబడినది. మేషం ఉత్తర తీర్థోత్సవము. వృషభం విశాఖ నమ్మాళ్వార్ల తిరునక్షత్రం. 5వ రోజు ఉత్సవమున నమ్మాళ్వార్ హంసవాహనముపై వేంచేయగా నవ తిరుపతుల పెరుమాళ్లు వేంచేయుట

62

48. రంగమన్నార్-శ్రీవిల్లిపుత్తూర్.

Rangamannar -Sriviliputtur

49. ఆదినాథన్-ఆళ్వార్ తిరునగరి.

Adinadhan - Alvar Tirunagari

50.A దేవపిరాన్-తిరుత్తొల విల్లి మంగలమ్‌.

Devapiran - Tirutola Villimangalam

50. B అరవిందలోచనన్-తిరుత్తొల విల్లి మంగలమ్‌.

Aravindalocanan - Tirutolamangalam తిరుమంజనం గరుడసేవలు సేవింప తగినవి. శ్రీరంగములో వలె ఇచటను అరయర్ సేవ కలదు.

ఇచట స్వామి స్వయం వ్యక్తము. పెద్దతిరుమేనితో వేంచేసి యున్నారు. స్వామి శ్రీపాదములు భూమిలో నున్నవని ఐతిహ్యము.

ఇంద్రుడు పితరులను సేవింప నందున వారిచే శపింపబడి, ఈ స్థలమునకు వచ్చి ఆధినాథ పెరుమాళ్లను సేవించి శాపవిముక్తిని బొందెనని స్థలపురాణము.

"సర్వేశ్వరుని పరత్వమును తెలిసికొన లేక సంసారులు నశించి పోరాదు" అను ఔదార్యముతో ఆళ్వార్లు "ఒన్ఱుమ్‌ తేవుమ్‌" అను దశకమును ఉపదేశించి సర్వేశ్వరుడే సమస్త కారణభూతుడు అని పరత్త్వమును ప్రకటించి, అతడు మన కొరకే తిరుక్కురుగూర్ అను దివ్యదేశమున(తిరుక్కురు గూర్ అదనుళ్‌నిన్ఱ) వేంచేసియున్నారు. అని సర్వేశ్వరుని "పరత్త్వ సౌలభ్యములు" అనుగుణములను ప్రకటించిరి.

మార్గము: తిరునల్వేలి నుండి తిరుచ్చందూర్ రైలుమార్గం. ఆళ్వార్ తిరునగరిస్టేషన్ శ్రీవైకుంఠ స్టేషన్ నుండి 5 కి.మీ.

పా. ఒన్ఱున్తేవు ములగు ముయిరుమ్‌; మత్‌త్తుమ్‌ యాదుమిల్లా
    అన్ఱు;వాన్ముగన్ఱన్నొడు తేవరులకోడు యిర్ పడైత్తాన్
    కున్ఱమ్పోల్ మణిమాడ నీడు తిరుక్కురుగూరదనుళ్
    నిన్ఱ వాదిప్పిరాన్ నిఱ్క మత్‌త్తై తై య్‌వమ్‌ నాడుదిరే||

పా' ఇలిజ్గత్తిట్ట పురాణత్తీరుమ్‌ శమణరుమ్‌ శాక్కియరుమ్‌
    వలిన్దు వాదు శెయ్ వీర్గళుమ్ మற்றுమ్ నున్దెయ్‌వము మాగినిన్ఱాన్
    మలిన్దు శెన్నెల్ కవరివీశుం తిరుక్కురుగూరదునుళ్
    పొలిన్దు నిన్ఱ పిరాన్ కణ్ణిర్ ఒన్ఱుమ్పెయిల్లై పోత్తుమినే.

    ఓడియోడి ప్పలపిఱప్పుమ్పిఱన్దు, మறறோర్‌తెయ్‌వమ్‌
    పాడియాడిప్పణిన్దు పల్ పడికాల్ వ ழி యేఱి కాణ్డీర్
    కూడివాన పరేత్తనిన్ఱ తిరుక్కురుగూరదనుళ్,
    ఆడుపుట్కొడి యాది మూర్తి క్కడిమై పుగువదువే.
         నమ్మాళ్వార్-తిరువాయిమొழி 4-10-1,5,7

                                            63