Jump to content

దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుక్కాట్కరై

వికీసోర్స్ నుండి

61. తిరుక్కాట్కరై 3

శ్లో. పురే తిరుక్కాట్‌కర నామ్ని పుష్కలం విమాన మాప్త: కపిలాఖ్య తీర్థగే|
   శ్రిత: పెరుం శెల్వ రమా మధి శ్రితో విరాజితే కాట్కర యప్ప నాహ్వయ:||

శ్లో. విభీషణ పురోధేన కటాక్ష: కపిలేక్షిత:|
   శఠారాతి మునిశ్రేష్ఠ దివ్య సూక్తి విభూషణమ్‌ ||

వివ: కాట్కరయప్పన్-పెరుం శెల్వనాయకి;(వాత్సల్యవల్లి)-పుష్కల విమానము-కపిల తీర్థము-దక్షిణ ముఖము-నిలుచున్న సేవ-కపిల మహామునికి ప్రత్యక్షము-నమ్మాళ్వార్లు కీర్తించినది.

విశే: నమ్మాళ్వార్లు ఈ స్వామి యొక్క శీలగుణమును ప్రకాశింపజేసిరి. శీలమనగా పెద్దలు పిన్నలతో అరమరికలు లేక కలసిపోవుట. శ్రియ:పతియగు సర్వేశ్వరుడు తన సంశ్లేషమును ఆళ్వార్లకు గుర్తుతెచ్చెను. కాని అది అప్పటి అనుభవమే యనిపించెను. అంతట ఆళ్వార్లు "ఆరుయిర్ పట్టదు?ఎనదుయర్‌పట్టదు" "పుండరీకాక్షుడు, కల్పశాఖల వంటి చతుర్బుజములు కలవాడు, నీలమేఘశ్యామలుడునైన స్వామి తిరుక్కాట్కరై క్షేత్రమున వేంచేసియుండగా నాఆత్మ పడుపాట్లు వేరెవరి యాత్మ పడుచున్నది" యని స్వామి శీల గుణమును ప్రకాశింపజేసిరి. వీరినే మలయాళదేశీయులు వామనుడని పిలతురు. శ్రవణ ద్వాదశినాడు గొప్ప ఉత్సవము జరుగును.

మార్గము: తిరువనంతపురమునకు 45 కి.మీ. నాగర్‌కోయిల్‌కు 30 కి.మీ. సౌకర్యములు గలవు. ఆలవాయ్-తిరుచ్చూరు రైలుమార్గములో "ఇరు--లక్కొడి స్టేషన్ నుండి "అజ్గమాలి" స్టేషన్ నుండి 15 కి.మీ.

పా. ఉరుగుమాల్ నె--; ముయిరిన్పర మన్ఱి;
   పెరుగుమాల్ వేట్కైయు; మెన్ శెయగేన్ తొణ్డనేన్;
   తెరువెల్లామ్‌ కావికమழ்; తిరుక్కాట్కరై,
   మరువియ మాయాన్ తన్; మాయమ్‌ నినై తొఱే;

పా. ఆరుయిర్ పట్ట దెనదుయిర్ పట్టదు;
    పేరిదழ் త్తామరైక్కళ్; కనివాయదోర్;
    కారెழிల్ మేగ;త్తెన్ కాట్కరై కోయిళ్‌కొళ్;
    శీరెழிల్ నాల్ తడన్తోళ్; తెయ్‌వవారిక్కే
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-6-1,9.

78

61. కాట్కరయప్పన్-తిరుక్కాట్కరై.

Katkarappan - Tirukkatkarai

62. అప్పన్-తిరుమూళిక్కళమ్‌.

Appan - Tirumuzikkalam

63. మాయప్పిరాన్-తిరుప్పులియూర్.

Mayappiran - Tiruppuliyur

64. ఇమయవరప్పన్-తిరుచ్చెంగున్ఱూర్.

Emayavarappan - Tiruchenkuunnur

62. తిరుమూழிక్కళమ్‌ 4

శ్లో. సరసీం తు పెరుకొళాభిధాం తిరుమూழிక్కళ పట్టణే శ్రితే
   సురనాథ దిశాముఖ స్థితి ర్వర సౌందర్య విమాన మందిర:||

శ్లో. మధురవేణిరమా నయనప్రియో నిజపురాహ్వయ వా నవనే శ్రుతు:
   హరితనామ మహాముని వీక్షితో విజయితే శఠవైరి పరిస్తుత:||

వివ: తిరుమూழிక్కళత్తాన్ (అప్పన్, శ్రీసూక్తి నాథన్)-మధురవేణి త్తాయార్, పెరుంకొళ తీర్థం-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-సౌందర్య విమానము-హారీతునకు ప్రత్యక్షము. నమ్మాళ్వార్, తిరుమంగై యాళ్వార్ కీర్తించినది.

విశే: నమ్మాళ్వార్లు ఈ స్వామియొక్క మార్దవ గుణమును ప్రకాశింపజేసిరి. ఈ దివ్యదేశమునకు వళత్తిన్ కళమ్‌ (తి.మొ.7-1-6) అను విలక్షణమైన తిరునామము కలదు. తిరువాయిమొழிలో నాలుగు దూతప్రేషణములు కలవు.

మొదటిది: తమ దోషములను సహింపగల క్షమాగుణమును గుర్తుచేయుచు అజ్జిరైయ మడనారాయ్ (1-4-1) అను దశకములో వ్యూహమూర్తి విషయమై దూతప్రేషణ చేయబడినది.

రెండవది: "వైకల్‌పూజ్గழிవాయ్" అను దశకమున సర్వేశ్వరుని ఆర్త రక్షణ దీక్షను గుర్తుచేయుచు విభవమూర్తి విషయమై దూతప్రేషణ చేయబడినది.

మూడవది: "పొన్నులగాళీరో" అను దశకమున సర్వేశ్వరుని రసజ్ఞతా గుణమును గుర్తుచేయుచు పరవాసుదేవుని విషయముగను అంతర్యామి విషయముగను దూతప్రేషణ చేయబడినది.

నాల్గవది: "ఎజ్గానలగమ్‌ కழிవాయ్" అను దశకమున సర్వేశ్వరుని సౌందర్యాతి శయమును గుర్తుచేయుచు అర్చావతార విషయమై తిరుమూழிక్కళ స్వామిని గూర్చి దూత ప్రేషణ చేయబడెను.

"ఎంగానలగంగழிవాయ్" అను ఈ దశకమున ఆళ్వార్లు "రూప సౌందర్య మార్దవములను గుణములను ఆధారముగా అర్చామూర్తి విషయమై దూత ప్రేషణ చేయుచున్నారు. ఇందు రెండవ పాశురమున "తమరోడు అఋగ్‌ఱైవార్కు" (తమ పరిజనులతో అచట నిత్యవాసము చేయువారికి)" స్వామి యాదృచ్చికముగా నన్ను కలిపినాడు. భాగవతగోష్ఠిలో కలసిన కారణమున బంధువులును వదలినారు. ఇట్లెవ్వరికినీ కాకపోతినే! స్వామి నన్ను ఎందులకు ఉపేక్ష చేయుచున్నాడు ? భాగవత గోష్ఠిలో పరవశుడై నన్ను మరచి యుండవచ్చును. ఆ గోష్ఠిలో నన్ను చేర్చుకొనుటకు నేను తగనా! అని అడిగి రండు" అని దూతలను పంపుచున్నారు. 79