దశావతారచరిత్రము/3. వరాహావతారకథ
3. వరాహావతారకథ
తృతీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని | 2 |
శా. | శ్రీదారత్వమునం బ్రసిద్ధుఁడవు, లక్ష్మీకాంత నేప్రొద్దు వ | |
సీ. | శ్రీవిష్ణుపదభక్తిఁ జెలఁగుసప్తర్షిచంద్రములలో ము న్నెన్నఁదగినమేటి | |
తే. | తోయరుహసంభవునకుఁ బౌత్రుఁడు మరీచి, పుత్త్రుఁడు విచిత్రగుణమణిపాత్రుఁ డఖిల | 4 |
క. | దితి మొదలగు పదుమువ్వురు, సతు లతనికి గలరు సహజసౌశీల్యరమా | 5 |
క. | కులరూపగుణసమృద్ధులు, గలసవతులలోన దితి సగౌరవలీల | 6 |
ఉ. | ఆరమణీశిరోమణి వయస్యలతో నొకనాఁడు కేళికా | 7 |
సీ. | పల్లవాధర యల్ల మొల్లతీవవల్ల నెల్లతావుల తావు లుల్లసిల్లెఁ | |
తే. | బంకజాక్షిరొ యవంకఁ బొంకమాయె, గుజ్జుమామిడిపజ్జనె గొజ్జఁగులును | 8 |
మ. | నిపతత్కుందమరందపూరమున దన్నృత్యన్మయూరంబు నా | 9 |
ఉ. | సారెకు గంధసారగిరిసారసమీరకిశోరవారముల్ | 10 |
క. | శీతలతలవనకేళీ, కౌతుకమున నున్న దితినిఁ గని యపుఁ డొకనా | 11 |
క. | తిలకింపు మిదె విచిత్రము, లలనా మారీచమంజులత నతిమందా | 12 |
క. | చెలియా కాంతా మోదము, గలుగనియెడల న్మదాళి కలియునె తమిచేఁ | 13 |
క. | నారీకలితోచ్చైస్తన, హారితవిస్ఫూర్తి మించె నది గను మనఁగా | 14 |
సీ. | తనమనోహరుపేరు వినినంతఁ గాంతకు మనసు రంజిల్లిన మదనుఁ డదియె | |
| ములవెంటఁ గోకిల కలరవచ్చలమున నానను సుమవాసనామిషమునఁ | |
తే. | దనువున హిమానితాశ్లేషజనితపులక, రాజకైతవమున రాగరసము నిండి | 15 |
తే. | వసుధ వాసంతవేళ నెవ్వారి కైన, నంగజోద్రేక మొనరించు నందుమీఁదఁ | 16 |
సీ. | నునుదీవె సురపొన్నఁ బెనఁగొన్నఁ గనుఁగొని ప్రాణేశుఁ గౌఁగిలింపగఁ దలంచుఁ | |
తే. | గలికిరాయంచ ముక్కున గమిచి కమల, నాళఖండంబుఁ బతికిచ్చు నలువుఁ గాంచి | 17 |
తే. | రామ శృంగారకేళికారామసీమ, సదృశవస్తునిరీక్షణోజ్జ్వలితసురత | 18 |
శా. | ఈయారామమునం బికస్వరము లెంతే వింతగాఁ జల్లనై | 19 |
ఉ. | ప్రాయముగా వసంతము నపాయముగా వినఁ గర్ణసూచికా | 20 |
క. | ఉపవాసంబుల వ్రతములఁ దపములఁ, గృశియించు బడుగుఁదపసుల కేలా | 21 |
తే. | కన్నకొడుకులు మూఁడులోకముల నేల, నక్కటా ముక్కుఁ బట్టుక యనుదినంబుఁ | 22 |
తే. | అకట తన కేమి కొదవ గేహమున సకల, భోగభాగ్యంబులును మంచిపువ్వుఁబోండ్లు | 23 |
తే. | వలపు గలిగిన నిండుజవ్వనిని వనినిఁ, గలయుకంటెను సౌఖ్యంబు గలదె వేఱె | 24 |
ఉ. | తానయి చేరఁబిల్చి సురతప్రియుఁ డై యొకనాఁటికైన స | 25 |
చ. | అని సురతస్పృహాహవిరుదగ్రమనోజశిఖక్షతత్రపా | 26 |
సీ. | సంపూర్ణపూర్ణిమాచంద్రబింబము చెన్నుఁ గన్న ప్రసన్నవక్త్రంబువానిఁ | |
తే. | సూర్యతేజంబు గైకొన్న శుచికిఁ జంద్ర, కాంతియు నొసంగుభంగి దుగ్ధముల నగ్ని | 27 |
సీ. | చంకనత్ప్రత్నతాటంకంబు లిరువంకఁ గనుపట్టుచంద్రభాస్కరులు గాఁగ | |
తే. | గనుబొమ లనంగుఁ డూనుసింగాణి గాఁగ, విప్పుఁగన్నులు విరిగల్వవిరులు గాఁగ | 28 |
క. | తలవంచి మించుసిగ్గునఁ, బలుకక యూరకయె యున్నఁ బతి యచ్చెలువం | 29 |
శా. | కించిల్లక్షితదంతకోరకరుచు ల్కెమ్మోవిపై మించఁగాఁ | 30 |
తే. | అనవరతసౌఖ్యసంధాత యైననేత, కంటె దైవంబు గల్గునె కామినులకుఁ | 31 |
క. | మంచిది యటువలెఁ జేసెద, నంచానతి యిచ్చె దేని యది వినిపింతుం | 32 |
క. | అని వనితామణి దెల్పిన, విని నవ్వుచు మౌనివిభుఁడు వెలఁదీ యీలా | 33 |
సీ. | అలసి వచ్చినవేళ నడుగు లొయ్యన నొత్తి విడె మిచ్చి సురటిచే విసరుటకును | |
తే. | ననవరత మగ్నిహోత్రంబు లరయుటకును, దేవపూజోపకరణము ల్దీర్చుటకును | 34 |
సీ. | సంసారసంభవాక్షయదుఃఖవారాశిఁ దరియింపఁగాఁ జేయుతరణి తరుణి | |
తే. | సదనమణిమయదీపికాజ్వాల బాల, వల్లభమనోమదావళవారి నారి | 35 |
సీ. | అతిథుల నిష్టమృష్టాన్నతృప్తులఁ జేసి యనుదినంబును బుణ్యమందికొనుట | |
తే. | గమలలోచన నీవల్ల గాదె యట్టి, నీకుఁ బ్రత్యువకారంబు నెఱఁపగలనె | 36 |
తే. | దుర్గముల నాశ్రయించినదొర యరాతి, వర్గముల గెల్చువైఖరి వనిత నీదు | 37 |
క. | మహిఁ జతురాశ్రమములలో, గృహి యధికుం డట్టిగృహము నీవే “గృహిణీ | 38 |
తే. | అనిన వల్లభ యీలీల నాడ నెంత, దాన నావంటివా రెందఱైనఁ గలుగ | 39 |
తే. | ఇంకఁ దాఁపఁగ నేల ప్రాణేశ వినుము, సిగ్గువడి యుండనీయఁడు చిత్తభవుఁడు | 40 |
తే. | అటులు గావునఁ గామార్త నగుచు నిన్ను, శరణు వేడెద రక్షింపు సౌఖ్య మొసగి | 41 |
మ. | అనినన్ లేనగ వంకురింప మునికాంతా యింతసంతాప మే | 42 |
సీ. | మలయాచలాయాతమందానిలము గాదు రణరంగసన్నధరథము గాని | |
తే. | తారకలు గావు దేవతాద్వంద్వముక్త, నవనమస్కారకుసుమబాణములు గాని | 43 |
సీ. | తిలకింప ద్వాదశార్కులకన్న వేండ్రమై జలజారి పండువెన్నెలలు గాయఁ | |
తే. | గాలకంఠకఠోరహుంకారములను, దండిదండిని కుసుమకోదండి యడర | 44 |
తే. | ప్రాణనాయక యిదె చూడు పతులఁ గూడి, పాయకుఁ డటంచు సతులకుఁ బల్కుతేజి | 45 |
చ. | అళు కొకయింత లేక కుసుమాస్త్రుఁడు క్రొన్నెలసానదీరుచెం | 46 |
శా. | ఓయాత్మేశ్వర యీవసంతమున శాంతోష్ణాంశుసంతాపమున్ | 47 |
తే. | ప్రాణనాయక యొకముహూర్తంబు తాళు, మంచు నానతి యిచ్చితి రంత యేల | 48 |
వ. | అదియునుం గాక. | 49 |
సీ. | తల్లి దైవం బని తగుప్రదక్షిణనమస్కృతుల నింద్రాదులు సేవసేయ | |
తే. | జుట్టఱికమున నిచ్చిపుచ్చుకొను బంధు, జాల మెంతయు గౌరవసరణిఁ జూడ | 50 |
సీ. | అదితి గన్నకొమాళ్లయం దొక్కరుఁడు జగత్త్రయరక్షణాధురంధరతఁ బూనె | |
తే. | మఱియు నీచెట్టపట్టిన మగువలందు, నెవ్వరికి లేరు సత్పుత్త్రు లెంచి చూడ | 51 |
క. | రమణునిమన్ననవలనన్, రమణీమణి రమణనొందు రవిమన్ననచేఁ | 52 |
సీ. | విరియఁబోసినజటావిసరంబు కెంజాయ సాంధ్యరాగంబుపై చౌకళింపఁ | |
తే. | గేల శూలంబు పూని దిగ్భిత్తు లగల, నట్టహాసంబు చేయుచు నఖిలభూత | 53 |
తే. | అనలచంద్రార్కనేత్రత్రయంబు దెఱిచి, చూచుచున్నాఁడు రోషస్పురణ దనర | 54 |
క. | శిక్షించు న్సత్పురుషుల, రక్షించుం గడలిఁ బొడమి ప్రబలినవిషమున్ | 55 |
మ. | అనిన న్మందమరుత్కిశోరకులలోలాకాశగంగాతరం | 56 |
తే. | కుడువఁ గూడును కట్టుకోఁ గోక లేక, తోలు గట్టుక తిరుగు బిచ్చాలశివునిఁ | 57 |
తే. | చూడఁ దెడ్డును మంచముకోడు గాని, యేమిసంపద పార్వతి కీశ్వరునకు | 58 |
క. | జనకుఁడు పదుమువ్వురు మముఁ, గని మీప్రియుఁడైన వాసఁ గైకొనుఁ డన్న | 59 |
శా. | “శాంతంపాప” మటంచు మౌనిపతి హస్తచ్ఛాదితశ్రోత్రుఁడై | 60 |
సీ. | అఖిలలోకంబుల నధికుండ నేనంచుఁ గర్వించు విధిమస్తకంబుఁ ద్రుంచె | |
తే. | శౌరి నయనాంబుజమునఁ బూజన మొనర్ప, మెచ్చి చక్రం బొసంగె నమ్మేటిమగని | 61 |
సీ. | దండధరోద్దండత నడంచు విషభోక్త యహిఫణామణు లూను నస్థిహారి | |
తే. | హరుఁడు శంకరుఁడును భవుఁ డభవుఁ డిందు | 62 |
తే. | అనిన నట్టిదేవుఁ డంగజునకు లొంగి, సందెలందు దివములందు విడక | 63 |
శా. | ఈలాగందురె బాల వాంఛితఫలం బీఁజాలువిశ్వేశ్వరుం | 64 |
తే. | దశమి హరివాసరమున ద్వాదశిని బర్వ, తిథుల సంక్రమణంబుల తిథుల నన్య | 65 |
క. | ఋతువై స్నానము సేసిన, సతి నంతర్గృహమునందు సంతానేచ్ఛన్ | 66 |
శా. | ఔలెండా యిటువంటిఛాందసము లెన్నైనా గలా విందుకున్ | 67 |
తే. | వెఱవ దననేల కామిని విభునిచెట్ట, పట్టినప్పుడె స్వేదకంపంబు లొదవె | 68 |
తే. | నయము దెల్పెడుగతి కంకణములు మొఱయఁ, గౌను నలియింపఁ బులకలు గ్రమ్మికొన్న | 69 |
చ. | వల దిది సంజవేళ చెలువా యొకయించుక తాళుమంచు నేఁ | 70 |
మత్తకోకిల. | ఈమనోరథ మెల్లఁ దీర్చెద నీముహూర్తము దాళవే | 71 |
క. | ధీరాగ్రేసరుఁ డంతట, నీరేరుహనేత్రచేతినిర్బంధము దు | 72 |
తే. | ఎంత చెప్పిన వినవె కా నింక నీవె, యనుభవించెదు రమ్మంచు హసితవదన | 73 |
తే. | జాళువాకోళ్ళపట్టెమంచంబుమీఁదఁ, దళుకుకుంకుమపఱపుపై వలువఁ బఱిచి | 74 |
క. | మదనుండంపినకిల్లా, కిదిగో మనసిమ్మటన్న యేపున నవలా | 75 |
క. | వడిగ బిగిగుబ్బజిగి గ, న్పడుజిలుగున్సరిగచెలువపయ్యంటపయిం | 76 |
తే. | చెలువ పయ్యెదఁ జుబుకంబుచేత నదిమి, ఱవికె సడలింపఁ దిలకించి రమణుఁ డెంత | 77 |
మ. | అలరు శయ్యకుఁ జేరి యొత్తిగిలి సయ్యాటంబునన్ గబ్బిగు | 78 |
చ. | పడఁతుక ప్రేమమీఱ మొనపంటఁ జుఱుక్కున మోవి నొక్కినం | 79 |
తే. | కలికి యీరీతిఁ బరిపరిగతులఁ బెనఁగఁ, గఠినవక్షోజయుగళసంఘట్టనమున | 80 |
మ. | అలుకల్ దీరిచి ముద్దు పెట్టుకొని సయ్యాటంబునం జంటిపై | 81 |
తే. | అకుటిలభ్రూశరాసన వనతితీక్ష్ణ, చంచలాలోకవిశిఖవకంచుకాఢ్య | 82 |
క. | అని నర్మోక్తులఁ దనసతి, చనవుం జెల్లింపఁగోరె సమరతికలనన్ | 83 |
తే. | నెలఁత రమ్మని తనదుసందిటికిఁ దిగిచి, చన్నుగవ యంటి వాతెఱచవుల దేరి | 84 |
తే. | నిగనిగల్ గుల్కు నధరమాణిక్య మొసఁగె, గుబ్బచనుదోయి బంగారుకుండ లొసఁగె | |
| బెనఁగెఁ దనపోఁకముడికిఁగాఁ బ్రియునితోడ, నీరజాక్షులు ముగ్ధలు గారె యెందు. | 85 |
తే. | నీవి తనయంతటనె జాఱె నీరజాక్షి, రౌర యభిమానరక్షకు లైనవారు | 86 |
వ. | అంత. | 87 |
మ. | తను లేలెమ్మనికొమ్మ యెత్తులిడ మోదంబొప్ప నాథుండు పై | 88 |
తే. | అనధరక్షత మనఖభేదన మకంఠ, కూజిత మభాషణ మబంధకుశల మయ్యు | 89 |
| అంత సురతాంతవైరాగ్య మనుసరింప, నింతమాత్రసుఖంబున కేల యిట్టి | 90 |
చ. | ప్రిదిలినకట్టుకొంగు సవరించి మిటారపుఁజన్నుదోయి ప | 91 |
తే. | మౌని స్నానంబు చేసి నవీనధౌత, చేలములు గట్టి నిర్మలక్షితి వసించి | 92 |
మనోహారిణీవృత్తము. | ఉదరము బరువై యున్నను మది స, మ్మదమును భయమును మల్లడిగొనఁగాఁ | 93 |
తే. | కామమోహిత నగుచు దుష్కాలమునను, నిన్ను గూడి రమింపఁగ నిలిచె గర్భ | 94 |
వినయవృత్తము. | అనిన, న్విని య, మ్ముని యి, ట్లనియెన్. | 95 |
సీ. | పతిచిత్త మెఱుఁగక రతిఁ గోరుట పతివ్రతలకు ధర్మముగాఁ దలఁపవైతి | |
తే. | మించి నేనెంత దెలుప లజ్జింపవైతి, దక్షనందనవయ్యు సత్పదము దక్కి | 96 |
ఉ. | కామము ధైర్యవారణనికామము దుర్దమదుష్క్రియాలతా | 97 |
సీ. | వదినె యంచు నొకింత వాత్సల్య ముంచక పౌలోమి ముందల బట్టువారు | |
తే. | నీదుగర్భంబునందు జన్మింతు రబల, సంజ రమియించినట్టిదోషంబువలన | 98 |
క. | అన ముఖవర్ణవ్యత్యయ, మున మోదము ఖేద మగుట మునిపతి దెలియం | 99 |
తే. | విను మనోహర యొకరసావేశమునను, దను వెఱుంగమి నపు డట్టితలఁపు పుట్టె | 100 |
మ. | ఘనశౌర్యంబున వైరివీరవరులన్ ఖండించి లోకంబు లె | 101 |
తే. | ఐన సాధునింద కాలయు లగుటను, వగవవలయు వారివారి కైన | 102 |
క. | వనితా పశ్చాత్తాపం, బునఁ గుందుట విష్ణుదేవుఁ బొగడుట నన్నుం | 103 |
తే. | రమణి నీయగ్రసుతుఁడు హిరణ్యకశిపుఁ, డతనికి జనించుఁ బ్రహ్లాదుఁ డనుకృతార్థుఁ | 104 |
క. | శ్రీదయితపాదసేవా, హ్లాదుఁడు ప్రహ్లాదుఁ డలరు నతిపావనుఁడై | 105 |
వ. | అంత. | 106 |
తే. | దితికపోలతలంబులు తెల్లవాఱె, నదితి నెమ్మోము వెలవెలనయ్యెఁ దోఁడఁ | 107 |
క. | గర్భమున వృద్ధిఁబొందెడు, నర్భకులశరీరకాంతి యధికంబై యా | |
| విర్భూతమయ్యె ననఁగా, గర్భిణికుచచూచుకములఁ గాళిమ దోఁచెన్. | 108 |
క. | చిట్టుములువుట్టెఁదాఁ గను, పట్టికి నిటమీఁద ధర్మపథమున నిటులం | 109 |
క. | ఇటువంటిభూమి నీవిం,కిఁట గైకొను మంచుఁ బట్టి కెఱిగించుగతిం | 110 |
సీ. | శ్రేష్ఠనిష్ఠురతపోనిష్ఠచేఁ బరమేష్టి మెప్పించి వరముఁగా మించ నెంచు | |
తే. | నమరకాంతలఁ జెఱల వేయంగఁ దివురు, దేవదేవునితో నిరోధింపఁజూచు | 111 |
తే. | బాలకులఁ గాంచినను బాకభంజనాది, శత్రువులు నొత్తురో యను సంశయమున | 112 |
సీ. | వదనంబు సఱచినవానిఁ గానఁగలేక ధరణీజనం బెల్లఁ దల్లడిల్ల | |
తే. | నంబునిధి జాతహాలాహలంబులీల, నదితి దుర్భరగర్భంబునందుఁ బొడమి | 113 |
తే. | అప్పు డింద్రాదికసుధాంధు లంధు లగుచుఁ, బేరుపేరుల నొండొర్లఁ బిలిచికొనుచుఁ | 114 |
మ. | అతిచంద్రార్కతనుద్యుతిచ్ఛటల లోకాంతర్బహీరూఢగా | 115 |
తే. | భారతీనాథ సర్వసంపత్సనాథ, ప్రకటతరవిశ్వనిర్మాణపారదృశ్య | 116 |
తే. | అంధకార మొకటి హాలాహలాగ్రమై, మించి జగము లాక్రమించి యున్న | 117 |
సీ. | ఆదికాలమున "సోహం” బంచు నామానసంబునఁ బుట్టిన జ్ఞానవంతు | |
| లుగ్రుఁడు మొదలుఁ బ్రత్యుత్థాన మొనరించి పూజింపఁగాఁ దగుపూజ్యతములు | |
తే. | సంతతాత్మానుభవసౌఖ్యజాయమాన, తృప్తితృప్తాంతరంగులై తిరుగుచుండ్రు | 118 |
సీ. | ద్వారకాంచనరంభ లూరుకాండములుగాఁ గలితసోపానము ల్వళులుగాగఁ | |
తే. | హంసకారావయుతపరిఖాంబుజంబు, లడుగులును ధూపధూమంబు లలకములుగ | 119 |
క. | చని యేలోకంబునఁ గాం, చనివైభవ మిందుఁ జూడ సమకూరె నటం | 120 |
ఉ. | శ్రీవిభుఁ డాద్యుఁ డీశ్వరవిరించిముఖామరసేవ్యుఁ డంచు స | 121 |
ఉ. | మందసమీరచంచలసమంజసకంజపరాగపుంజ మెం | 122 |
మ. | అరిషడ్వర్గము లేమి దుఃఖములపొం దావంతయున్ లేక శ్రీ | 123 |
సీ. | మణీకిరీటంబులు మకరకుండలములు నాకర్ణధవళనేత్రాంబుజములుఁ | |
తే. | విబుధపతినీలరుచిదివ్యవిగ్రహములు, దర్పకానంతసదృశసౌందర్యములును | 124 |
సీ. | పదియాఱువన్నెలబంగారమే కాని యితరలోహంబు లిందెందు లేవు. | |
తే. | సరసీరుహనాభసారూప్యధరులె కాని, యితరు లైనట్టివార లిందెందు లేరు | 125 |
వ. | అని యనీదృశ లోకసాధారణ లోకదురవలోక మణిగణలోకవిలోకాయిత | 126 |
మ. | కలితస్తంభము కామినీహసనరంగచ్చంద్రికాస్విన్నశీ | |
| త్పలమారంద ముదశ్రువు న్మదకపోలద్వంద్వమై సర్వమై | 127 |
వ. | అని యిందిరారవిందనయనానందకరుం డగు నందకకరునిషందిరసౌందర్యంబు | 128 |
క. | బాలురుగాన వివేకము, సాలదొ బిసబిసన నెందుఁ జనియెద రంచుం | 129 |
వ. | ఇవ్విధంబున. | 130 |
క. | పోవలదని రోధించిన, దౌవారికజనముఁ గాంచి తాపసవరు లే | 131 |
తే. | అనిన వేళ గాదు వనజాతనేత్రుండు, తరుణిఁ గూడి యంతిపురమునందు | 132 |
మ. | ఇనబింబంబున యోగిమానసములం దేప్రొద్దు శ్రీకాంతతో | 133 |
క. | కనుటయుఁ గనఁదగు నదియును, గనుఁగొనువాఁ డాత్మ యయ్యెఁ గనుఁగొనవలదం | 134 |
తే. | ఏల యజ్ఞాన మొదవె నీవేళ మీకు, నిర్వికారంబు పూర్ణంబు నిర్మలంబ | 135 |
తే. | ఘట[3]మటోపాధి భిన్న మౌ గగన మట్లు, ప్రకృతిసంబంధమున భిన్నభంగిఁ దోఁచు | 136 |
తే. | ప్రకృతిభిన్నగుణంబులఁ బ్రభువుఁ బోలి, మమ్ము దౌవారికులఁ జేసి మనుపుచోటఁ | 137 |
క. | చనవరుల నడ్డగింపం, జనునే దౌవారికులకు జగదీశునకుం | 138 |
క. | ఎటువంటి బంధు లయినం, గుటిలాత్ములఁ జేరనీయఁ గూడునె యన్నన్ | 139 |
తే. | హరికి నెటువలెఁ దోఁచునో యనిన మీకు, వెన్నునకు భేద మెయ్యెది యెన్ని చూడఁ | 140 |
తే. | ఐన సమయంబు గాదని యంటిరేని, కన్నుల రవీందులును నాభిఁ గమలభవుఁడు | 141 |
క. | కమలాక్షునిఁ గొల్వఁగ నిది, సమయము గాదన్న నేది సమయం బిఁక నో | 142 |
వ. | ఇవ్విధం బంతయు నెఱింగియు నంజనంబునం దెలిసి వసుధాంతరంబున నుండు | 143 |
క. | గడగడ వడఁకుచుఁ బెదవులు, దడుపుచు జయవిజయు లపుడు దాసోహ మటం | 144 |
సీ. | తొడలపై నిడియొత్త నడుగు పంటవలంతి జఘనంబుఁ దాఁకించు సరసలీల | |
తే. | నొకరొక రెఱుంగనటులు గాఢాపగూహ, చుంబనంబుల సొక్కించి సొగసువగలు | 145 |
క. | వాకిటికలకలమంతయు, నాకర్ణించుచు సరోరుహాక్షులు దమలో | 146 |
మ. | ఉడురాణ్మండలపాండురాగముఖరత్నోదారరత్నంబులౌ | 147 |
సీ. | కంకణంబులు మ్రోయఁగా నీళయును ధరారమణియు వింజామరములు వైవ | |
తే. | జాఱుసిగ కేలనొత్తుచు జాళువామె, ఱుఁగుదుప్పటివలెవాటుకొంగు జాఱఁ | 148 |
వ. | అప్పుడు. | 149 |
సీ. | తనమ్రొక్కుఁ గినుకఁ గైకొనక లచ్చివిదిర్చుపదనఖం బంటినఫాలతలము | |
తే. | చిటులు గస్తూరితిలకంబుఁ జిఱుచెమటయుఁ, గలిగి సురతాంతకాంత శృంగారలక్ష్మిఁ | 150 |
తే. | శ్రీవధూమణి చెక్కుతోఁ జెక్కుఁ జేర్చి, పవ్వళింపంగ మకరికాపత్త్రరేఖ | 151 |
క. | పంకజసదనానవనఖ, రాంకిత వైకుంఠకంఠ మనులేపభవ | 152 |
తే. | యోగివంద్యుని సందిటియొత్తులకును, రణితకేయూరమణులు గారణము గాఁగఁ | 153 |
తే. | నీరజాలయగుబ్బ కస్తూరికుంకు, మములసోఁకులు వక్షఃస్థలమునఁ జూచి | 154 |
తే. | కలిమిముద్దియ నిద్దపుఁ గమ్మమేని, పనపునిగ్గులటంచు నేర్పరుపలేక | 155 |
తే. | అడుగు లొత్తెడు నప్పు డప్పుడమిపడఁతి, గబ్బిగుబ్బలయంగరాగంబు సోఁకె | 156 |
తే. | భువనమోహనశృంగారపూర్ణ మగుచు, వెలయు హరిదివ్యమంగళవిగ్రహమున | 157 |
తే. | మౌను లానందబాష్పాయమాననయను, లగుట నంతట నానతు లగుచు లేచి | 158 |
శా. | భేదాతీతుఁడవై జగన్మయుఁడవై పెంపొందు నీలీల సం | 159 |
సీ. | పద్మరాగప్రభాభాసమానకిరీట మృగమదతిలకజృంభితలలాట | |
తే. | శంఖచక్రాదిసాధనసహితహస్త, యజ్ఞనిగ్రహరుచివిగ్రహప్రశస్త | 160 |
ఉ. | శ్రీపతి తావకీనపదసేవనశీలుర ద్వారపాలురం | 161 |
మత్తేభగర్భితసీసము. | వినతపద్మాసన విశ్వరక్షణచణా నాళీకపత్రేక్షణా రమేశ | |
తే. | యని విచిత్రవచస్ఫూర్తి వినుతి సేయ, మౌనిమత్తేభవృత్తంబు మదిని మెచ్చి | 162 |
క. | ముక్తులును విరక్తులు భవ, ముక్తులు హృదయాంబుజాతముఖ్యగుణాళీ | 163 |
సీ. | ఆఁకొన్నసురలెల్ల ననుదినం బెవ్వరిక్రతుశాలపంచలఁ గాచియుండ్రు | |
తే. | వేదశాస్త్రంబు లేరిచే వెలయుచుండు, నెంచు నెవ్వరిదినచర్య స్మృతిచయంబు | 164 |
శా. | ఏమీనాక్షికటాక్షలేశమునకై యీశానవాణీశసు | 165 |
మ. | అజమూర్థాపహవృత్రశాత్రవులు బ్రహ్మద్వేషము ల్సేయఁగా | 166 |
క. | అపరాధం బొనరించిన, కపటాత్ములఁ బుణ్యజనులు గండని కినుకన్ | 167 |
చ. | సరసులు ఘర్మకాలమునఁ జండకరోష్ణము పైని బూని యం | 168 |
క. | వీరలు మీ కొనరించిన, నేరంబున ధరణిఁ బుట్టి నిశిచరు లగుచుం | 169 |
సీ. | జయవిజయులఁ జూచి దయ నిటులను మున్ను యోగనిద్రాసక్తి నున్నవేళ | |
తే. | గోరెదరొ జన్మములమూఁట వైరు లగుచుఁ, జేరెదరొ యన్న వారలు వైరముననె | 170 |
వ. | అటు గావింపుఁడని యంగీకరించి యంగనాసంగతుండై భుజంగపుంగవశయ | |
| యున్నవా రిది వారియావిర్భావసమయంబు గావున నఖిలలోకంబు లంధతమ | 171 |
తే. | శ్రీవిభుని నామ మెక్కడఁ జెవులఁబడునొ, యంచు మూసినచందాన హస్తపిహిత | 172 |
పంచచామరము. | ధరంబు లొడ్డగిల్లెఁ ద్రెళ్లెఁ దార లాఱె నగ్ని భా | 173 |
తే. | కశ్యపుఁడు వచ్చి కృతజాతకర్ముఁ డగుచు, నగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డని సహోద | 174 |
వ. | అంతఁ బ్రతిదినప్రవర్ధమాను లగు దితిసూనులయం దగ్రజుం డగుహిరణ్యా | 175 |
సీ. | అంగుష్ఠమున నిల్చెనా కిరీటము దాఁకి పటపట బ్రహ్మాండభాండ మగలు | |
తే. | గడిఁది నిట్టూర్పుగాడ్పుల గ్రహగణంబు, లొక్కమూలకుఁ జిక్కు నత్యుగ్రదృష్టి | 176 |
మ. | అసురాధీశుఁడు రోహణాచల సముద్యద్రత్నముల్ సెక్కి ర | 177 |
వ. | అంత నొక్కనాఁడు. | 178 |
క. | జలరాసు లేడు నొండై, కలసిన జలకేళి సల్పఁగా నిమ్మగు నీ | |
| యిల యేమి నడుమ ననుచుం, దలఁచి హిరణ్యాక్షుఁ డధికదర్పస్ఫురణన్. | 179 |
మ. | నగరంబు ల్నగము ల్నదంబులు నరణ్యంబు ల్నదుల్ లోనుగా | 180 |
మ. | చటులోచ్ఛ్వాసమరుత్పరంపరలచే సర్వంకషాభ్రంలిహ | 181 |
క. | అది చాలక బ్రహ్మాండం, బుదితము గావించి బాహ్యమున నుదితం బౌ | 182 |
వ. | ఆసమయంబున. | 183 |
క. | స్వాయమ్భువమను వొకనాఁ, డాయంబుజభవునిఁ జేరి యతివయుఁ దాను | 184 |
క. | వనజాక్షుఁ గూర్చి జన్నము, లొనరించిన సుగతి గలుగు నొండేమిటిచేఁ | 185 |
ఉ. | ఔ నిది నిక్కువంబు గనకాక్షుఁడు ఘోరతపంబు చేసి నా | 186 |
క. | అని హరి దలఁచుచుఁ దనలో, నను చింత యొనర్చు బ్రహ్మనాసారంధ్రం | 187 |
ఉ. | అంతట హంసమాత్ర మయి యాపయి నుక్ష సదృక్షమై గజం | 188 |
మ. | ప్రళయారంభవిజృంభితాంబుధరగర్జాతర్జనప్రోజ్జ్వల | 189 |
వ. | అంత. | 190 |
మ. | ఘనసూచీముఖసూచకాగ్రధవళాంగస్తబ్ధరోమాళి డు | 191 |
క. | జనమేజయనృప కిటియై, కనకాంబరుఁ డవని నెత్తఁ గనఁడో వినఁడో | 192 |
ఉ. | కాటుకకొండఁ బోలు మెయికాంతి జగంబులఁ జిమ్మచీఁకటుల్ | 193 |
సీ. | అంజనాచలమౌళి రంజిలు కమలాప్తబింబంబు నాఁ గిరీటంబు దనర | |
తే. | గాలభణభృతఫణాగ్రజాగ్రచ్చిరత్న, రత్నసూచికరోర్మికారాజి మెఱయఁ | 194 |
క. | అడుగులు దడఁబడఁ బెదవులు, దడపుచు గుండియలు పగుల దడదడయన న | 195 |
చ. | కనుఁగొని కేక వేయుచుఁ గికాకిక నవ్వుచు సైన్యనాథులం | 196 |
మ. | అమరావాసము సొచ్చి యచ్చట సుధర్మాస్థానచింతామణీ | 197 |
చ. | వరుణునిఁ జేరఁబోయి రణవాంఛను వచ్చితిఁ బొరుమన్న నా | 198 |
మ. | త్వరగాఁ బోయెద వేమికార్య మనినం దైత్యుండు నేఁ బోరికి | 199 |
తే. | ఎందుఁబోయిన బోవ నీ కిపుడు నీవు, వెంటనే పోయి గెలువు మవ్విష్ణు ననుచుఁ | 200 |
మ. | కనియెం దానవసార్వభౌముఁ డెదుట న్గంభీరపాథోధిమ | 201 |
వ. | ఇట్లు కనుంగొని. | 202 |
తే. | నాకచరవైరి శౌరి హా పోకుపోకు, మిదిగో వచ్చితి నెందు వోయెదవు పంద | 203 |
తే. | కోఱఁ దనరారు ధరణీచకోరనయన, వారిరాశిని దేల్చె నవారితాత్మ | 204 |
తే. | పర్వతారాతి గురిసె ముద్బాష్పమేఘ, పుష్పవృష్టికిఁ దోడుగాఁ బుష్పవృష్టి | 205 |
వ. | ఇవ్విధంబున నవ్వరాహమూర్ధన్యుం డనన్యసామాన్యవిరోధిరమాన్యకార | 206 |
తే. | హరి వగుటఁ జేసి మును పంది వగుట నిక్కు, వంబు తుది నేఁడు నీవికారంబు నొంది | 207 |
ఉ. | వాసవదంతి దంతములు వల్ల దిభాస్యున కొంటికొమ్ము గాఁ | 208 |
ఉ. | వీరుఁడ వంచు నిన్నుఁ బదివేలవిధంబులఁ బ్రస్తుతించుచు | 209 |
ఉ. | దండము పెట్టఁగా సురవితానము లందును భక్తిసేయకన్ | 210 |
తే. | సెలసి కొట్టిన కిటికోఱ జీరవారి, కనకనయనునిబలుమేనఁ గాననయ్యె | 211 |
వ. | అంత. | 212 |
మ. | శునకంబుంబలెఁ జుట్టుముట్టుకొను రక్షోవీరు దంష్ట్రాహతిం | 213 |
సీ. | తమ్మికన్నుల మరందముదశ్రువులు జాఱ నెలదేఁటిచూపులు బెళుకుఁజూప | |
తే. | రంధ్రనాభియు వనరోమరాజి మెఱయఁ, దనులత చలింపఁ గపటభూదారకాంత | 214 |
మ. | పరికింపం గిటికోఱ దంతమయ దీపస్తంభమై యొప్పె పై | 215 |
వ. | అంత. | 216 |
క. | దితిజనిశాధవరాహున్, శ్రితదురితేందీవరాహు శ్వేతవరాహున్ | 217 |
శా. | ఆహా యజ్ఞవరాహమూర్తి వగు టీ వాశ్చర్యమే విస్ఫుర | 218 |
సీ. | క్రూరారికోటీరకురువిందములఁ గాని కురువిందముల నెందు గ్రొచ్చఁబోవు | |
తే. | ఘోణిమాత్రంబవే దితిప్రాణదనుజ, పాణిగతఖండనఖయురక్షోణి నీల | 219 |
చ. | వలపున నీవు ముద్దుఁ గొనవచ్చిన నీదగుమోము సూచి పో | 220 |
సీ. | గిరిరాజఘర్షీంద్రకరిమదధారనా శ్రీకంధరాకాశశిఖ యనంగ | |
తే. | నున్ముఖాహీంద్రలోచనద్యుతి యనంగ, నవ్యతావకదంష్ట్రికానాళమునను | 221 |
క. | అని పొగడెడు బ్రహ్మాదుల, ఘనకృప నీక్షించి దంష్ట్రికాభూసతికిన్ | 222 |
క. | తొలుతఁ బెనుగంటి సుట్టుట, వలనం జాపవలె ముడుగు వసుధాస్థలిపై | 223 |
చ. | పురము ల్గ్రామములు న్నదు ల్సరసు లంభోదు ల్వను ల్ద్వీపము | 224 |
క. | ఆయెడ బహుయజ్ఞంబులు, స్వాయంభువమనువు భక్తి సల్పెన్ లక్ష్మీ | 225 |
ఉ. | శ్వేతవరాహకల్ప మిది వేఁడుక నీ కెఱిఁగించితిన్ జగ | 226 |
క. | అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై | 227 |
శా. | శ్రీరంగ త్కరుణాకటాక్షతపన శ్రీముష్ణతీక్ష్ణవ్రతా | 228 |
క. | భారతశాస్త్రార్థప్రతి, భారత మత్యూఢ ధరణి భారతమోను | 229 |
పంచచామరము. | హిరణ్యగర్భముఖ్యదానహృష్టశిష్టశేముషీ | 230 |
గద్య. | ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట | |
3. వరాహావతారకథ సమాప్తము.