దయలేక నీవురాక యున్న - తాళ జాలరా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
దయలేక నీవురాక యున్న - తాళ జాలరా ॥దయలేక॥

చరణ:
నిన్నరేయి కన్నులార - నిదుర లేదురా
వన్నెకాడ నిదురలేక - వాచియుంటిరా ॥దయలేక॥

ఉత్తమాటగాదు నిన్నె - గుత్త గొంటిరా
చిత్తగించు నాదు మనవి - చిత్తగించరా ॥దయలేక॥

శ్రీసఖా నే జేసుకొన్న - దోస మేమిరా
వాసిమీర దాసురామ - దాసు నేలరా ॥దయలేక॥