త్రినయన తరుణీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


రాగం: వీణాధరి వలె        తాళం: ఆది

పల్లవి:
త్రినయన తరుణీ! త్రిభువన జననీ!
శ్రుతినుత సరణీ! మది నిను గననీ

కలుముల కోరా ఘనతల నడుగా
పరులకు చెరుపే తలపా తల్లీ!

గురువుల నీడా కుదురుగ నడుగా
మది నిను గనుటే గురిగా నుంటీ

కనులకు నీవూ దొరకవు మతికీ
నిజముగ సచిదానందవు నీవూ

ఈ పాట mp3