తెలుగు శాసనాలు/పణ్డరంగుని అద్దంకి శాసనము
స్వరూపం
12. పణ్డరంగుని అద్దంకి శాసనము.
(శ.సం. 770 ప్రాంతము.)
మొట్టమొదట తెలుగులో గణయుక్తముగ వ్రాయబడిన పద్యము అద్దంకి శాసనమని కీర్తిశేషులు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారు గుర్తించి ప్రకటించి యుండిరి (ఇపి. ఇండి. IX పుటలు 271-275). ఇది తూర్పు చాళుక్య రాజగు గుణగ విజయాదిత్యుడు పట్టాభిషేకమైన మొదటి సంవత్సరమును జెప్పుచున్నది కనుక నిది సుమారు క్రీ. 844 ప్రాంతమునకు జెందిన రచన గావచ్చునని వారు నిర్ణయించిరి. ఆ మొదటి యేడు పండరంగుడను నాతడు సేనాధిపతిగ పట్టము గట్టబడెననియు, రాజుచే పంపబడి సమస్త సేనతో పణ్డ్రెణ్డు బోయ కొట్టములను వశము చేసుకొని కట్టెపు దుర్గమును తెరపించి కన్దుకూరు (నగరము)ను బెజవాడతో సమానముగ చేసెననియు ఇందు జెప్పబడెను. వేరు విధముగగూడ కొందరు చెప్పిరి. పుట:TeluguSasanalu.pdf/82