తెలుగు శాసనాలు/తెలుగులిపి భాషల మొదలు
తెలుగు లిపి భాషల మొదలు
నాగరికత పెరిగినకొలది మానవుడు తన జీవితమును వైజ్ఞానికముగను, నైతికముగను మెఱుగుపఱచుచు ఆ విధానములను తరతరముల సంరక్షించుట తన కర్తవ్యముగ భావించెను. ఆ ప్రయత్నము లోనిదే లేఖన విద్య భారత దేశము నందీ విద్య యిప్పటికి ఐదువేల సంవత్సరములకు పూర్వము నాటిదనబడు సింధు నాగరికత నాటికే యొక సువ్యక్తమగు రూపము దాల్చియున్నట్లు తెలియుచున్నది కాని యింతవఱకు ఆ లిపి సరిగా చదువబడలేదనియే చెప్పవలెను. తరువాత చెప్పదగిన భారతీయ లిపి క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది నాటిదగు మౌర్యలిపి. అంతకు పూర్వమే వేదములు, వేదాంగములు, ఇంకాయెన్నో సూత్ర గ్రంథములు వెలసియుండుటను బట్టి యేదో విధమగు వ్రాత యుండెడిదని స్పష్టమగుచున్నది. అంతేకాదు, మౌర్యలిపి యనబడు అశోక శాసనములందున్న అక్షరములకన్న వేదసూత్ర వాఙమయమందున్న అక్షర సంపుటి విశిష్టమైన దగుటచే దీనికి చెందిన లిపి అశోక లిపి కంటే విశిష్టమైనదని యెంచవలసి యున్నది. కాని వేద, సూత్ర వాఙమయములందు కానవచ్చు అక్షరములు, వాటి ఉఛ్ఛారణ విశేషములు అన్నియు గురు శిష్య పరంపరగా వల్లేవేయబడుచు సంరక్షించబడినవేగాని వ్రాతతోగూడిన గ్రంథముల ద్వారా కాదని కొందరు చెప్పుదురు. అంతేగాక అశోకుని నాటి లిపి అతిసరళముగను సుగ్రాహ్యముగను ఉండు. ఉదా ; గ = అ, + = క = ర; మొదలగునవి. ఇట్టి ప్రాథమిక దశనుండియే భారతీయ లిపులన్నియు అనేక ప్రాంతీయ మార్పుల నొందుచు నేటి రూపములను పొందినవని లిపి పరిశోధకులు భావించెదరు. ఏది యెట్లున్నను సింధు నాగరికత నాటి లిపిని అశోకుని మౌర్యలిపితో కలుపు రూపాంతరమును తెలుపు ఆధారము లేవియు ప్రస్తుతము లేవు. కనుక మౌర్య లిపియే మన తెలుగక్షరములకు కూడా మాత్రక యయ్యెను.
కుబిరకుని భట్టిప్రోలు శాసనము, ఎఱ్ఱగుడి (జొన్నగిరి) గుట్టమీది అశోకుని శాసనములు ఆంధ్రదేశమునందలి మొదటి వ్రాతలుగ చెప్పబడుచున్నవి. ఆ లిపిని బ్రాహ్మీలిపి యనియు అందలి భాష ఒక విధమగు ప్రాకృతమనియు చరిత్రకారులు చెప్పుదురు. అప్పటినుండి అనేక పరిణామములు
జెందుచు శాతవాహన శకము దాటి ఇక్ష్వాకు, శాలంకాయన, బృహత్ఫలాయన, విష్ణుకుండిన,
మాఠర వంశ్యుల రాజ్యకాలముల నధిగమించి నప్పటికి అనగా క్రీస్తు తర్వాత 500 ప్రాంతమునాటికి అంతవరకు చెల్లుచున్న ప్రాకృత, ద్రావిడ భాషలనుండి విడివడి తెలుగుభాష యొక రూపునొందెను. ఇంకను ఒక శతాబ్ది గడచిన కాని శాసన భాషగ తయారు కాలేదనవచ్చును. అంటే అంతకుముందు తెలుగు భాష యే మాత్రము లేదనికాదు; ఉన్నది.కాని 'నాగబు', 'సంవత్సరంబుళ్' కొన్ని ఊళ్ళపేర్లు మొదలగునవి.అచ్చటచ్చట శాసనములలోను, పొట్ట, అత్త, కరణి, వంటి పదములు హాలుని గాథాసప్తశతిలోను కానవచ్చుటయేగాని, వాక్యరూపములో భాష కనిపించుటలేదు. తెలుగుభాష వాడుక యందుండి యున్నచో కొన్ని తప్పులతో గూడిన పస సముదాయములు శాసనములందు లభించెడివియే. అప్పటి రాజులభాష ప్రాకృతము గనుక అప్పటి శాసనములన్నియు ప్రాకృతమునందే యున్నవను వాదమంత బాగులేదు.సామాన్య జనులు వ్రాయించిన చిన్న వాక్యముల శాసనములనేకములు అమరావతిలోను నాగార్జున కొండ దగ్గర, మరికొన్ని చోట్ల దొరికినవి. అవికూడా ప్రాకృతమునందే యున్నవి. కనుక తెనుగప్పటికి జనసామాన్యమునందు కూడ ధారళముగ మాట్లాడబడు చుండెనను కొనుటకు ఆధారము లేవియులేవు.కాని అనేక దేశ్య పదములు వాడుకలో నున్నమాట నిజము.వారు మాట్లాడు వాక్యము లెట్లుండునో చెప్పుట కష్టము. మనకు తెలుగు వాక్యములు గల మొదటి శాసనములు కొన్ని కడప మండలములో కనిపించును. అవి ఆరవ శతాబ్దమునుండి వ్రాయబడినట్లు తెలియుచున్నది. అప్పటికి దేశములో వాదుకయందున్న బ్రాహ్మీ లిపినే కొలది మార్పులతో తెలుగువారు కన్నడమువారు వాడుకొనిరి. అందుచే దీనిని తెలుగు-కన్నడ లిపియని పరిశోధకులు చెప్పుదురు. కన్నడలిపినుండి తెలుగులిపి కాకతీయులనాటినుండి అనగ పన్నెండవశతాబ్ది నుండి వేఱుపడెను. అయునను ఈ రెండు లిపుల పోలిక మిక్కిలి సన్నిహితముగ నుండును.
తెలుగక్కరములు:
మున్ముందు వ్రాయబడిన తెలుగు శసనములలో కడప మందలము కమలాపురం తాలూకాలోని కలమల్ల శాసనము మనకు లభించెడి వాటిలో మొదటిదిగా భావింపబడుచున్నది.ఇయ్యది క్రీ.ఆరవ శతాబ్దికి చెందినట్లు కనబడును.కన్నడ మందప్పటికొక శతాబ్దికి పూర్వమే శాసనములు ప్రారంభ మగుట గమనించదగిన విషయము. కనుక దక్షిణ భారతమున సంస్కృత-ప్రాకృత-ద్రావిడ సమ్మిశ్రమము నుండి వెలువడిన ప్రాంతీయ భాషలలో కన్నడము కంటె తెలుగు ఆర్వాచీనమై యున్నది. అప్పటి శాసనములను పరిశీలించుచో తెలుగు భాషలో గల అక్షర విశేషములు, పద విశేషములు, వాక్య రచనావిధానము, సంధి, సమాస, కారక, విభక్తి, మున్నగు వ్యాకరణాంశములే కాక ఉచ్చారణ సౌలభ్యమునకైన యితర మార్పులు అనేకము గోచరించును. అందు అక్షరములను గూర్చి తెలిసికొందము.
అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనిమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞ,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,స,హ,ళ. వర్ణములు వాడుకయందుండెను. కాగా ముఖ్యముగ గమనించవలసిన యక్షరములు మరికొన్ని ఆనాటి తెలుగులో కానవచ్చును. అందు శకట రేఫము ఒకటి. ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవుచున్నది. సుమారు క్రీస్తు పదవశతాబ్ద్యంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాషించువఱకు శాసనములందు 'ఴ' అను రూపమున వ్రాయబడు అక్షరముండెడిది. ఇది బండి 'ఱ' లోని అడ్డు గీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అది క్రమముగా కొన్నిచోట్ల 'డ' గాను, కొన్ని చోట్ల 'ళ' గాను, మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి. ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లున్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగ శాసనములను బట్టి తెలియుచున్నది. అది 'చోఴ' పదములలో 'చోడ' లేక 'చోళ' అనియు; 'నోఴంబ' పదములో 'నోళంబ' అనియు, ఴెందలూరు అనుచోట దెందులూరు గాను, క్ఴిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'క్ఴొచె' అనుపదము 'క్రొచ్చె'; వ్ఴచె అనునది 'వ్రచ్చె' అనియు మార్పునొందెను. ఈ యక్షరము కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదములలో వాడబడుచున్నదని కొందరు భావించెదరు. తెలుగు శాసనములలో చొఴ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది.[1] కనుక 'ఴ' అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.
ఇంకొక యక్షరము θ లేక ద[2].ఇది దంత్య 'థ'కారముగాదు.పై జెప్పిన 'ఱ'కంటె రెండు మూడు సటాబ్దులపూర్వమే యిది సాసనములందు సైతము ఉపయోగమునుండి తొలగెను. నన్నయభట్టు నాటికే యిదిభాషలో లేదు.సంయుక్తాక్షరములలో 'నణ'లోకలసి యుండెడిది. న్ద,ణ్ద, మూన్దు: చాండద్లాకు,చదు(మూడు,చాణ్డాలురకు)చెడు) మున్నగు పదములలో కాన నగును. కలమళ్ళ శాసనములో 'ధనంజయుదు రేవాణ్డు,ఏళన్ చిఱుంబూరి రేవణకాలు..." అని దు,ఱు లు రెండు వ్రాయబడియుండుటనుబట్టి θ, ఱులు భిన్నాక్షరములవలెను అట్లే రామేశ్వరము(ప్రొద్దుటూరు) శసనమొకదానిలో ఱ,ఱ,θ ,డ,ళ,లు స్పష్టముగా వ్రాయబడియున్నవి గనుక నవి యన్నియు భిన్నాక్షరములే యగును.పై జెప్పిన 'ధనంజయుదు'క్రమముగా ణ్దు,ండు,ఁడు,డు, అనే ప్రథామా విభక్తి ప్రత్యయమైనది అట్లే _ అనేది,వాణ్డు,వాండు,వాఁడు, వాడు అని ఏకవచనరూపములు 'వాణ్ర్డు '-'వారు 'అనే బహువచనరుపములు పొందినట్లు చెప్పినను,కలమళ్ళ శాసనములోని 'ధనంజయుదు ' అనేది ధనంజయురు ' అని బహువచన రూపమో లేక ధనంజయుడు ' అని ఏక వచన రూపమో తెలియదు.ఉరుటూరు శసనములో 'చోఱ మహారాజు θ ఏళ ' అనేప్రయోగం బహువచనంగా తోస్తుంది.రామేశ్వర శాసనములో 'చదు '(చెడు) ;అని యేకవచనాంతమునే తెలుపుచున్నది. అరకట వేముల(ప్రొద్దుటూరు తాలూక) శాసనములో వేంగుళూద్లు, పెను θకాలు, నారకోళు,కంచద్లు ఇన్నల్వురు సాక్షి అనియున్నది.ఇందు పెన్రుకాలు , అనే పదంలో క్రావడికూద కనిపిస్తోంది. కనుక ఈ θ ను ఱ అనటం బాగులేదు. ఇదివేరక్షరమే.పైన జెప్పిన రామేశ్వరశాసనమందే ౘదుగట్తున్, చθగట్టున్ అను రెండుప్రయోగములు గలవు. వీటికి 'చెడు తగులును'అను నర్థము చెప్పవలెను.కనుక 'θ 'అనేది 'డ' గా మారింది. అంతేకాదు చెఱచు, చెఱ అనే నేటి పదములలోని 'ఱ'పై చθ'లోనిθ'అగునా అని తోచుచున్నది. అందే చాణ్θ, ద్లా కు(చాండాలః)అను సంస్కృత తత్సమ పదము కలదు.'చండాలురకు'అని దీనిఅర్థము చెప్పవలెను.అదేశాసనములో 'కొణ్ణయ్య 'అనే పదంలో 'ణ్డ'అనే మూర్ధన్య సంయుక్తాక్షరం వాడబడింది.కానిదానిలోనే మూణ్θ (మూన్డు)దంత్య సంయుక్తాక్షరం కనిపిస్తోంది.తమిళ అవన్ నుండి వాన్,' వాన్డు' అయ్యినట్లుగాక 'మూన్θ' అను తమిళపదమే మొదటి నాడుకలో నున్నది, తరువాత 'వాణ్డు'వలె 'మూణ్డు' అయింది.
∉ రూపములో మరొక అక్షరము.ప్రాచీన తెలుగు శాసనాల్లో కనిపిస్తుంది. ఇది శఖట రేఫమో లేక వేరక్షరమో ఇంకా నిర్ణయం కాలేదు. ఒకేశాసనములో, ∉ ఱ, ఱ, θ అను నాలుగక్షరములు కనిపించును.ఇందు మొదటి రెండు 'ఱ ' యగునేమో.ఇంతవఱకు చెప్పినవిగాక సంస్కృతసంబంధము వలన మిగిలిన అక్షరములతో గూడిన నేటి తెలుగు వర్ణమాల యేర్పడెను.
సంయుక్తాక్షరములలో వర్గానునాసికములు వాడుటయందు తరువాతికాలమందెక్కువ నియమము కనుపించును.ప్రాచీన కాలమున అట్టి వాడుక ఉన్నట్లు అంతగా తోచదు. రాజ్యంచేయ, ధనంజయు, రాచమానంబున, ఫలంబు, అశ్వమేధంబు, చిఱుంబూరు,కొట్టంబు, భుజంగ, వంగనూర్లి మున్నగునవి అనుస్వారమునే కలిగియున్నవి. 'న్' స్థానములో అనుస్వారరూపములు అంతగా అప్పుడు కనిపించవు.(వస్తనిపోరి,సామన్తకముల్ వాన్డు, పాతకు θ మున్నగునవి) అట్లే 'ణ' కూడ. వాణ్డు, కొణ్డయ, రెణ్డు, రేనాణ్డు, ఇత్యాది. రూపములే కాని అనుస్వారయుక్తరూపములరుదు.మిగతా అనునాసికములగు బదులు సున్నలు బహుళముగా వాడబచునే యున్నవి
ఈ సున్న యొక్క రూపము ప్రాచీన బ్రహ్మీలిపిలోను,మనతెలుగు లిపిలోను ఒకచుక్క(.)గాపరమందున్న అక్షరముపైన గుర్తించబడెడిది.అనునాసికము వాడుచో పరమందున్న అక్షరమునకు పైన వ్రాయుదుము.గనుక దానిస్థానములో చుక్కను వాడినను అట్లేపరమందున్న అక్షరముపైన నుంఛెడివారు.(ధనజయుదు)ధనజయుదు;రాచమానంబున=రాచమానబున, దేగులబు, వశ,వేగు, వగనూరు, ఫలబు)కొంతకాలమునకు చుక్కయే చిన్న సున్నగా అక్షరము పైభాగముననే వ్రాయబడెడిది.ఇది సాధారణముగ చాళుక్యుల లిపిలో కాన్పించును.క్రీ.1124 నాటి గూడూరు శాసనమునందుకూడ నిట్లే యున్నది.ఇంక తెలుగులిపి ప్రత్యేకత నొందిన తర్వాత అక్షరము తర్వాత,అదే పంక్తిలో నిప్పటివలె సున్నపెట్టుట ఆచారమైనది.దీనికి కూడ కొంతచరిత్ర కలదు.ప్రాఛిణాళీఫీళొ 'మ'కారము హల్మాత్రమే వ్రాయబడినచో 'δ'వ్రాసెడివారు.అంటే మ్=δ.ఇదే కాకతీయుల నాటికి పూర్వమే పైనున్న పొల్లు లేకుండ '0'గా మారింది.మ్=δ=ం. ఇటువంటిది అయ్యిందన్నమాట.కన్నడలిపిలో కూడ నిదేచిధముగా మారింది.క్రీ.1100 ప్రాంతపు కందూరు చోళుల వొల్లాలశసనములో సున్నకు బదులుδవాడుటకలదు.ప్రాకృత భాషాసంపర్కముతగ్గి సంస్కృతభాషాప్రభావమెక్కువైనకొలది అనుస్వారమునకు బదులు వర్గానునాసికములను వాడుట యెక్కువైనట్లు కనిపించును. ఉదా:-డౙ్కల పూణ్డి,సమరస ౙ్గట్టణ,సమాలిజ్గిత,ప-మహాపాతక,రాజ్య-య,ప్రసాద--,కు--,వసన్తీశ్వరము,వందిత,వసుందరాం,నేణ్టి,వైదుమ్బ,సమ్పన్నుణ్డు.మొద||
ఉచ్చారణమునకు తగినట్లు వ్రాయుట చేతకాకపోవుట నేడుకూడ మనకు తెలుసు. భాషాంతరపదాలు వాడునప్పుడు మరీ కష్టము.Bank ను బంకు,బాంకు,బ్యాంకు,బేంకు అని వ్రాయుచుందుము.కొరవి శాసనములో చాయంబడిన అనేపదమిట్టిదే.పొడచిన అనుటకు పొడిచ్చిన ,అదాయంబు అనుటకు అదెయమ్బు వ్రాయుట,ఇవి అన్ని ఉచ్చారణ దోషములో వ్రాయుటలో తప్పులో చెప్పలేము రెండు ఆనాడట్లే ఉన్నవి. తెలుగు లిపి భాషల మొదలు
కొన్ని విలక్షణోచ్ఛారణములు గల పదములు:
శ్రీయైయరికొడుకు మరమ = శ్రీఅయితయారి కొడుకు మారమ కావొచ్చు.(ముద్దనూరు శా.)
నూట్టామ్భది=నూటయేమ్భది
అదెయమ్చు=అదాయమ్చు
కాద్లివ్త్ర్యేంగు=కాడ్లవేగు(?)
సఞత్తుదిగున్=సయుక్తుణ్డగున్.
:సంధి విశేషములు 1.పరరూపము ఏకాదేశమగుట
వీరున్ఱు+అయ్య=వీరున్ఱయ్య ... రాగిమడవనపల్లి శాసనము
ఉత్తమున్ఱు=అయిన=ఉత్తమున్ఱయిన....తిప్పలూరు
సిద్దవటంబు+ఆడుచు=అద్దవటంబాడుచు...రామాపుర శాసనము
రేనాణ్డు+ఏళుచు=రేవాణ్డేళుచు....రామేశ్వరము
రాజులు+ఏళన్=రాజులేళన్...చిల్మకూరు
వసన్తీశ్వరంబునాకు+ఇచ్చినది=వసన్తీశ్వరంబునాకిచ్చినది....రామేశ్వరము.కాని దీనికి విరుద్ధముగ పూర్వరూపమే యేకాదేశమయినట్లు రెండుచోట్లగలవు.
సంయుక్తుθ+అగు=సంయుకునుθ(ఇందుకూరుశాసనము)
మహాపాతకునుθ+గు=మహాపాతకునుθగు
ఈరెండు లేఖదోషములేమోనని సందియము కలుగుచున్నది.
యడాగమసంధి:
దీని+ఆదాయమ్బు=దీనీయాదాయమ్బ..(బలపనూరు)
ఇరువది+అది=ఇరవదియాది...(ఎఱ్ఱగుడిపాడు)
స్తితి+ఉ=స్తితియు
3.సరళాదేశ-గసదదవాదేశసంధి:
మూణ్డు+పుట్లు=మూణ్డుపుట్లు...(బలపనూరు) 8
చడు+కట్టున్=చడుగట్టున్....(రామేశ్వరము)
పలంబు+కాన్చున్=పలంబుగాన్చున్...(రామేశ్వరము)
పరబలంబు+పొడిచి=పరబలంబు లొడిచి...(రాగిమడవనపల్లి)
ఈస్థితిం+తప్పువారు=ఈస్థితిదప్పువారు...(కొరవి)
వేయి+చెఱువుళు=వేసెఱవుళు...(మాలెపాడు)
4.ఇతరసంధులు:
మూణ్డు+నూఱు=మున్నూఱు
మూణ్డు+తూము=ముత్తుమ్బు
ఇను+మారు=ఇమ్మారు;ఇమ్మడి
ఈ+మూణ్డు=ఇమ్మూణ్డు...రామేశ్వరము
ఈ+నల్వురు=ఇన్నల్వురు...అరకటవేముల
పెద్ద+తెరువు=పెందెరువు
పెద్ద+చెఱువు= పెంజెఱువు
ప్రాచీన శాసనములలో సంధిని వివక్షచేయకపోవుటయే తరచు కనుపించును.రేనాణ్డు ఏళన్,శక్షికను ఇచ్చిన;శ్రీధరయకు ఇచ్చిననేల;పటుకాను;
సమాసములు; ఆయారాజులు వారి ప్రశస్తులలో ప్రసిద్ధమైన సంస్కృత సమాసాలనే అధికముగా వాడుకొనెడివారు. సమరసజ్ఘట్టణోపలబ్ధ జయలక్ష్మీ సమాలింగిత వక్షస్థల 'అని వైదుమ్బులు, జగత్త్రయాభివన్దిత సురాసురాధీశ పరమేశ్వర ప్రతీహారీకృత మహాబలికులోద్భవ 'అని బాణరాజులు చెప్పుకొనేవారు.కాని రేనాటి చోళులు మొదట్లో ప్రశస్తులే చెప్పుకోలేదు.' స్వస్తిశ్రీ చోడమహారాజుల్లేళన్ ' 'ఏర్కల్ముతురాజు ధనంజయుడు రేనాణ్డు ఏళన్ 'అంటూ ప్రారంభంచేసి శాసన విషయము చెప్పేవారు.
తర్వాత 'పృథివీవల్లభ విజయాదిత్య చోడమహారాజుళ్ 'అని పృథివీవల్లభ అని మాత్రమే చేర్చుకొన్నారు.కానికొంతకాలం తర్వాత అంటే తొమ్మిదో శతాబ్దిలో వీరు 'చరణసరోరుహ విహిత విలోచన త్రిలోచన ప్రముఖాఖిల,పృథ్వీశ్వర కారితకవేరీతీర, కరికాల కులరత్న ప్రదీప.అహితాంకుళ 'అనే ప్రశస్తిని మొదలు పెట్టిరి. కాని మొదటి రేనాటి చోళులు,ఈ ప్రశస్తిని చెప్పుకొనే ఆర్వాచీన చోళులు ఒకే తెలుగు లిపి భాషల మొదలు-పేజి-9
కుటుంబములోనివారో కాదో యింకా స్పష్టముగా తెలియదు.6,7,8. శతాబ్దాల్లోని ప్రాచీన చోళ శాసనములు అతి క్లుప్తంగాను,చిన్న చిన్న తెలుగు పదాలో సంస్కృత-ప్రాకృత తద్భవాలో కలిగి యుండెడివి.గ్రామనామములు, ఏవైన బిరుదులు కొన్ని,రెండుమూడు పదముల సమాసముగా నుండెడివి. తాణ్ణికొణ్ద, తాడ్లఱేవ, చిఱుంబ్రోలు, తర్కపువ్రోలు,ఊరిస్వాముళ్, మార్పిడుగు, విడెల్విడుగు పెందెరువు, ముచ్చింతల, మున్నూఱు, వేనాన్ఱు, పెఱ్నిధి, ఇన్నల్వురు, పొలగరుసు, రట్టుగుళ్ళు, రాచమానంబు, వీరున్ఱయ్య.
సంస్కృతసమాసాలు యథాతథంగా వాడుకొనేవారు.
చరువశర్మ పుత్ర విన్నశర్మళాకు
పెర్బాణవంశ భుజంగది భూపాదిత్యులు
కౌణ్డిల్య గోత్రస్య పెన్బాఱ రేవ శర్మాణ పుత్రస్య అగ్గిళమ్మా-రి కివ్విన దత్తి(చామలూరు శాసనము).అంటే వారికెట్లావస్తే అట్లా వ్రాసేవారు.ఇట్లాంటి సమాసాలను నన్నయ్యగారు క్రమబద్ధంచెయ్యటం తెలుగుతనానికి అపకారమో ఉపకారమో మరి?
పదజాలము:
ద్రవిడ, కర్ణాటక, ప్రాకృత భాషలనుండి అనేక పదములు తెలుగులో ప్రవేశించినవి. సంస్కృతమునుండి తత్సమములు తత్భవములనేకములు చేరుచున్నవి.కాని వాటినైన సరియగు విభక్తి ప్రత్యయములు చేర్చుకొని బహుళముగా వాడుకొనుట వారికింకా తెలియదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, షష్ఠి, సప్తమీ విభక్తుల ప్రత్యయములే పరిమితముగా వాడబడెడివి. అవికూడా మనకిపుడు ప్రసిద్ధముగా నున్న(కారక) అర్థములలో వాడబడెడివికాదు. సమాపక క్రియలకు బదులు క్రియాజన్య విశేషములే అధికముగ వాడబడెడివి.ఇచ్చిన పన్నస, వ్రచ్చినవారు, నిల్పినశిల, వధిసిన పన్డు(ఇక్కడ డ ను θగా చదువుకోవలెను)
6, 7, 8,శతాబ్దములలో తెలుగుశాసనములందువచ్చుకొన్ని పదములు. కొను=తీసుకొను,పట్టుకొను → కఞచిగొణిన=కంచిని పట్టుకొనిన .రామాపురశాసనము.C.700AD, 10
ఏణ్డు=సంవత్సరము
నాణ్డు=దేశము(ప్రాంతము);నేడు(కాలము)
పాఱ=బ్రాహ్మణుడు
పాఱున్=పోవును...(రామేశ్వర శా.)
తేనికి/దేనికి=దీనికి
వేనేఱువుళు=వేయిచెఱువులు
మగమ్డ(ఇక్కడ డవత్తునుθ గా చదువవలెను)=వీరుడు, భటుడు.....రాగిమడవనపల్లి
పసర(ము)=పశువు?... రాగిమడవనపల్లి
వెళెయ=వెడలగొట్టు?.... రాగిమడవనపల్లి
పొడచి పడియె=పొటాడి చనిపోయె
పుట్లు=(కొలత)
తుమ్బు=(తూము)... బలపనూరు
ప్రళు=ప్రాలు=బియ్యము
కుంచెడు=(కొలత)
నెయ=నేయు
ఉప్పు
పసులు=ఆవులు
ముదుణ్డ్లు .......ముద్దనూరు
నట్లు=(వడ్ల)....అనిమెల క్రీ.976
పులయూరి=?... రామేశ్వరము.AD.700
కాన్చు=కను=పొందు
ఱచ్చు=దచ్చు=చెఱచు
ౘ్దు(చదు)=చెడు=చన్డగు(ఇక్కడ డవత్తును θగా చదువవలెను) (కొఱ్ఱపాడు)... రామేశ్వరము.AD.700
క్ఱిన్దన్=క్రిందన్....రామేశ్వరము.AD.700
నిల్పిన=నిలబెట్టిన....రామేశ్వరము.AD.700
కొట్టంబు=(కోట?)...ఎఱ్ఱగుడిపాడు
ఇచ్చిన
ఇరువది తెలుగు లిపి భాషల మొదలు
కంచరి
కమ్మరి
పంపు=పంపున=ఆనతిన)....కలమళ్ళC.580
ఏళన్=ఏలన్
ఆటికళా=?
ఏంబది=50 .....ఉరుటూరు 70
వక్రంబువచ్చు=అడ్డువచ్చు
కొచ్చియ=(కౌశిక,గోత్ర ?)
సమ్మాంరు=శమ్మన్(ఆర్య)
రట్టగుళ్ళు ....రామేశ్వర
రట్టకుట్ట ...వెల్దుర్తి
కాచికుడిపిన వాన్డు (ఇక్కడ డవత్తును θగా చదువవలెను)....వెల్దుర్తి
వక్రపల్కినవారు
పారదాయ=(భరద్వాజ గోత్ర?)....తిప్పలూరు 625 A.D.
మఱున్డ(ఇక్కడ డవత్తునుθగా చదవాలి)పిడుకు=(శత్రువులకు పిడుగువంటివాడు)
పటుకాను=స్థానముగాను:పట్టుగాను
పన్నవీస=పణాళ=పన్నస=దానముచేసినభూమి ..తిప్పలూరు 625AD
పులొంబున= పొలంబున(విప్పఱ్ల శాసనంలోకూడ 'పులొంబున ' అనికలదు)..రామేశ్వరము
రెణ్డు
తోటళు
అణతి=అజ్ఞ
మాఱ్పిడగు= శత్రువులకు పిడిగువంటివాడు
వేవురు
పరియారువు= పరిహారముగ... నల్లచెరువుపల్లె
తేవుళ్=దేవులు
కొఱొచె=క్రొచ్చె(శిలపై చెక్కుట)...పఱికి =ప్రక్కి..నల్లచెరువునిపల్లె 12
క్ఱొచ్చె : ఱ→ పూర్వాక్షరమున క్రారముగను, పరాక్షరమునకు ద్విత్వముగను మారును.
వఱచు=వ్రచ్చు
అఱిసిన=చెఱచిన
తాన్డికొన్డ(ఇక్కడ'డ'వత్తును& theta;గా చదవండి)=తాడికొండ=అత్తివర్మ గోరంట్లశాసనము
రెగొన్డ(ఇక్కడ'డ'వత్తునుθగా చదవండి)=విక్రమేంద్ర-చిక్కుళ్ళశాసనము
కుమ్డారు(ఇక్కడ'డ'వత్తునుθగా చదవండి)=పోలమూరు శాసనము
వేయివఱకు అంకెలు వాడుచుండిరి.పుణ్యకుమారునికి తిప్పలూరిశాసనమందు తిథి,వార, నక్షత్ర, హోరలు చెప్పబడినవి గనుక వాటిపేర్లు బాగా తెలిసియుండును. ప్రాచీన తెలుగు శాసనాలలోవాక్యరచనకు ప్రధానముగ కారకనియమము పాటించుట ముఖ్యము. అనగా నేయే సందర్భములలో నేయే విభక్తిప్రత్యయములతో నామవాచకములను క్రియతో నన్వ యించవలెనో గమనించుట ఒక్కొక్క భాషలో నీవిధాన మొక్కొక తీరుగ నుండును. సంస్కృతములో 'చతుర్థీసంప్రదానే' అనిదానార్థమునందు చతుర్థి విధింపబడెను.'విద్ధశర్మణే గ్రామోదత్తః' అని వాక్య ముండును. కాని తెలుగులో అదేవాక్యము వ్రాయుచో 'విద్ధశర్మకు గ్రామమివ్వబడెను' అని యుండును. దానార్థములలో బహుళముగా షష్ఠియే యిట్టివాక్యములందు రూఢియై యుండుట కారణము.క్రొత్తగా భాషరూపొందునపుడు విభక్తి ప్రత్యయము అతిస్వల్పముగ నుండును.వాటిని మాత్రమే ఉపయోగించుచు వాక్యములను రచించెడివారు.కనుక స్థిరమైన భాషయగు సంస్కృతము కంటె తెలుగు భాష ప్రాథమిక దశలో చాలా తప్పులతో లక్షణవిరుద్ధముగ నుండెడిది.ఒకేరాజుచేత వ్రాయించబడిన సంస్కృత శాసనములు తెలుగు శాసనములు పోల్చిచూచిన సంస్కృతశాసనములు సుభోధముగను, తెలుగువి వక్తవ్యాంశముకూడ తెలియకుండగను ఉండును. పుణ్యకుమారుడనే రేనాటి చోళరాజుచే వొసగబడిన మాలెపాడు,దొమ్మరి నన్ద్యాల సంస్కృత శాసనాలు చక్కగా అర్థమగుచుండును.కాని ఆరాజువే తిప్పలూరు, తెలుగు లిపి భాషల మొదలు
రామేశ్వరములోని తెలుగు శాసనాలు అర్థమగుటలో కష్టముగ నుండును.అట్లే తూర్పు చాళుక్య రాజగు విష్ణువర్ధన మహారాజుయొక్క ఱ(అ)హదకరశాసనము సంస్కృతభాగము సులభముగ నుండును. తెలుగు భాగము అర్థముకాదు. ఇట్టివి ఇంకా అనేకము గలవు.అంతేకాక సంస్కృత శాసనాలు సాధారణముగా విద్వాంసులు వ్రాసెడివారు. కనుక కొంతమటుకు నిర్ధుష్టముగనే యుండును. తెలుగుశాసనాలు ప్రజాబాహుళ్యము మాటాడు భాషలోనే యుండేడివి.కనుక గ్రామ్యమనవలెను.దానిని వ్రాయునప్పుడు అనేక లోపములుండును. ఇప్పటిగ్రామ్యభాషనైనను వ్రాయవలెనన్నచో అనేకభేదములుండును. ప్రాంతీయ భేదములేకాక ఉచ్చారణలో కూడ కొంచెం చదువుకొన్నవారు మాట్లాడునది వేరు,చదువురానివారు మాట్లాడునదివేరు.అందుచే ఇట్టిభేదములన్ని మనకు తెలుగుశాసనాల్లో కనుపించును.
తెలుగు భాషలో అఱవ శతాబ్దము వఱకు వాక్యరచన ఉన్నట్లు చెప్పదగిన ఆధారములు లేవు. అమరావతి ప్రాకృత శాసనాలనడుమ 'నాగబు', గాథాసప్తశతిలో పొట్ట, అత్త ,కరణి, మొదలగు పదాలు ఒకటి-రెండు శతాబ్దములనుండి వాడుకలో నున్నట్లు తెలియుచున్నను నాగార్జునకొండ శాసనాల్లోగాని మరి యితరచోట్ల శాసనాల్లోగాని ప్రాకృతభాషలోను,చెదురుగ సంస్కృతభాషలోను వాక్యములున్నవేగాని తెలుగులో వాక్యములు 6వ శతాబ్దిలోగాని కానరావు. అప్పుడప్పుడే ద్రవిడ, ప్రాకృత, కన్నడ , సంస్కృత పదాలనుండి కొన్నిటిని తీసుకొని తమకున్న పదజాలముతో జోడించి తెలుగు వాక్యములు వ్రాయుట మొదలు పెట్టుకొన్నట్లా ప్రాచీన తెలుగు శాసనాలను కొన్నిటిని చూడగ మనకు తెలియగలదు. అప్పటికే మాటాడు భాషలో తెలుగువాక్యాలు ప్రాకృత వాక్యాల స్థానంలో విశేషముగ జొచ్చియుండును.కాని తెలుగులో వాక్యములువ్రాయుట క్రీ.575 ప్రాంతముదనబడు ధనంజయుడను రేనాటి చోళరాజు యొక్క కలమళ్ళ శాసనమును బట్టియే మనకు తెలియుచున్నది. అంతకు పూర్వము రెండు శతాబ్దములనుండికూడ యేకొద్ది వాక్యములో వాడుకలో నుండియుండునని యూహించవచ్చును.మనకు మొదటి తెలుగు శాసనాలు కొన్ని రేనాడు మండలము(కడపజిల్లా)లోనే దొరుకుచున్నవి.అయినను సరిహద్దు జిల్లాలను విడిచి మిగిలిన తెలుగుదేశమంతటను అప్పటికే తెలుగుభాష 14
వ్రాత భాషగ పరిణమించినదని చెప్పవచ్చును.ఇప్పుడు కొన్నిశాసనాలను వాటి రచవా విధానమును పరిశీలించుదుము.
వీటిలో అనేక పదములు దీర్ఘములకు బదులు హ్రస్వములు వాడుట, హ్రస్వములకుగాను దీర్గము లువాడుట,శ,ష, లకు బదులు 'స'ను వాడుట,ఋకారస్థానములో 'రి'వాడుట, 'అ'కారము నకు బదులు 'ఎ' కారమును వాడుట మున్నగు ననేక వ్యత్యసములు నేడు వ్యాకరణాదుల దృష్టిలో అవశబ్దములని తోచును.అప్పుడప్పుడే మాటలు పలుకుట నేర్చుకొను శిశువులు తమ ఊహలను ప్రకటించుట కెంతో శ్రమతో మాటలను వెదకికొనుచు తప్పులతోగూడిన అసంపూర్తి వాక్యములను ఎట్లు పలుకుదురో అట్లే యీ ప్రాచీనుల తెలుగు వాక్యము లుండును.