తెలుగు శాసనాలు/ఖణపతి దీర్ఘాసి శాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

15. బణపతి దీర్ఘాసి శాసనము. (శకము. 997).

కలింగపట్నమునకు నాలుగుమైళ్లు ఉత్తరముగ దిర్ఘాసి యను గ్రామము కలదు. అచట దుర్గమెట్ట యను కొండపై నొక శిథిలాలయము వద్ద నీశాసనము కలదు. దీనియందు కొంత సంస్కృతభాగము; మిగిలినది తెలుగు పద్యభాగము.

గంగాన్వయమునకు చెందిన రాజరాజు కళింగదేశమును క్రీస్తు 1068 నుండి 1076-77 వరకు పాలించెను. అతని మాణ్డలికులలో నొకడు బణపతి యనువాడు ఈ శాసనమును వ్రాయించెను. దీర్ఘాసి నగరమున దుర్గాలయము నకు ముందు తానొక మణ్డపమును నిర్మించి, శతాబ్దము 997 న ఆ దేవికి అఖండ దీపమునకై దానమొసగినట్లు ఈ శాసనమందు కలదు. అతని భార్యయు మరియొక దీపమునకు దానము చేసెను. ఈ బణపతి తన యేలిక పంపున చోడరాజును (మొదటి కులోత్తుంగుడు) వడ్డదేశమును, కిమిడి దేశమును (పర్లాకిమిడికి) గొడ్రిసింగ (తెలియదు) వేంగి దేశమును జయించినట్లు చెప్పబడెను. బణపతికి చలమర్తిగండ, బణ్డన విజయ, గణ్డగోపాల అను బిరుదులు చెప్పబడెను. పుట:TeluguSasanalu.pdf/88