తెలుగు శాసనాలు/కొరవి శాసనము
10. కొరవి శాసనము.
(సుమారు క్రీ.935)
పదవ శతాబ్దము లోగాగల తెలుగు శాసనాలలో ముఖ్యముగ చెప్పదగినది కొరవి శాసనము.ఇది క్రీస్తు 935 నాటిదని చరిత్రకారుల అభిప్రాయము.అప్పటి తెలుగు శాసనము లన్నింటిలోనిది భాషయందు,చారిత్రక విశేషములందు చాల ముఖ్యమైనది. ఇది వరంగల్లు జిల్లా మానుకోట(యిప్పటి మహబూబాబాదు)తాలూకాలో కొరవి గ్రామ మున వీరభద్రాలయములో నున్నది.శాసన స్తంభము తుదియందు విరిగి పోవుటచే నలువైపుల కొన్నిపంక్తులు నష్టమైనవి.ఇటీవల అదే గ్రామమున చెరువులో నొక శాస న ఖండము లభించెను.అదియు నిదేవిధముగనుండ శిలాస్తంభము పై నిదే విధమ గు అక్షరములలో దీని విషయముతో కలియు విషయమునే కలిగి శాసనము యొక్క అడుగు భాగము మాత్రము కలదిగా నుండెను.ముందు చెప్పిన మొదటి భాగమున నష్టమైన భాగమిదియేనని నిశ్చయమ్య్గ చెప్పలేనంత అగోచరముగ విష యము కను పించుచున్నది. మొత్తమున రెండు భాగములను కలిపి చదువు కొన్నను లోగడ గల సందేహము లట్లే యుండును.దీని నిప్పటివరకు పలువురు విద్వాంసులు పరిశీలించి
యుండిరి 1. అయినను భాషయందైతేనేమి, చరిత్రయందైతేనేమి యిందలి విషయములు సందేహరహితము కాలేదు.
దీనివలననేగాని వేరువిధముగ తెలియని చరిత్రాంశము కొంత యిందుకలదు. శకాబ్దము లు చెప్పబడకున్నను ఆధారాంతములచే నిది క్రీస్తు 935 నాటిదని తెలియుచున్నది. పూర్వము వేంగీనాటికి పశ్చిమ సరిహద్ధైన ప్రస్తుత ఖమ్మము మెట్టు జిల్లాకు చేరిన విషయమును ముదుకొండ చాళుక్యులనబడు రాజులు దరిదాపు నాలుగు వందల సంవత్సరములు యేలుచువచ్చిరి.(సుమారు క్రీస్తు800 నుండి 1200వరకు).వీరధిక కాలము వేంగిచాళుక్యులకు సామంతులై యుండిరి.
చాళుక్య గుణగవిజయాదిత్యుని తరువాత నతని సోదరుడగు విక్రమాదిత్యుని పెద్ద కొడుకగు మొదటి భీముడు క్రీస్తు 892 లో
1.ఎ.పి.ఆంధ్రికా 1.పుట 118-145 కొరవి శాసనము
49
వేంగి రాజ్యమున కభిషిక్తుడగు సమయములో రాష్ట్రకూట రెండవ కృష్ణుడు దండెత్తి వచ్చి రాష్ట్రమును బీభత్సమొనర్చెను.అప్పుడు ముదుకొండ చాళుక్య వంశ్యుడగు కుసుమాయుధుడనే రాజు రాష్ట్రకూట కృష్ణునితో తనశక్తి కొలది పోరి వేంగిదేశము ను కాపాడి భీమునికి పట్టాభిషేకము నిర్విఘ్నముగ జరిపించెను.ఈ యంశముతో మన కొరవి శాసనం ప్రారంభమగును.మరల కొద్ది కాలమునకే రాష్ట్రకూట కృష్ణుడు దండెత్తి వచ్చుచు త్రోవలో ముందుగ ముకొండ రాజ్యమును నాహుతి గొనెను.ఆ యుద్ధము లో కన్నర బల్లహుని(కృష్ణరాజు)చేతజిక్కి ముకొండ చాళుక్యరాజయిన కుసుమాయు ధుడు మడిసెను.ఈ వంశము నీ ప్రాంతమున నెలకొల్పినది బాదామి చాళుక్య సంత తిలోని వాడైన రణమర్ధుడను రాజు.తాను పట్టము గట్టు కొనునపుడు రాజ్యాధికార సూచకముగ మెడయొందొక కణ్ఠియను అలంకరించు కొనె ను.దానికి రణమర్ధకణ్ఠియ యనుపేరు.అతని సంతతిలో రాజూమునేలు రాజులెల్లరు దానిని రాజలాంఛనముగ ధరించుట ఆచారమై యుండె ను. కుసుమాయుధుడు రణభూమిలో చనిపోగా మృత దేహము శత్రువుల వశము కాకుండు లోపుగనే శిరమును,దానితోపాటు అతడు ధరించిన రణమర్ధ కణ్ఠియను అతిధైర్య పరాక్రమ ము లతో పోరి అతని పెద్ద కొడుకగు గొణగయ్య కాపాడ గలిగెను.లేనియెడల శత్రువులు తమచే జయింపబడిన ప్రధాన నాయకు లగు రాజ సేనానాయకుల శిరములను తమ విజయసూచకముగ ఊరేగించి అవమాన పఱచెదరు.అంతేకాక వారి ముఖ్యములగు రాజలాంఛనము లను తాము స్వీకరించి ఆ రాజ్యమును తాము లోబరచుకొన్నట్లు ప్రకటిం చుకొందురు.అందుచే రాజు లు స్వయముగ యుద్ధములో పాల్గొనునపుడు తమమృతదేహముల కట్టి యవమా నములు జరుగకుండ కాపాడుటకై తమ వెంటనే ప్రత్యేక రక్షకులను ఉంచుకొందురు. ఈ సందర్భములో కుసుమాయు ధునికి, అట్తి రక్షకుడుగ తనపెద్దకొడుకైన గొణగయ్య యే ఆయాపదలో శరీరమునుండి శిరమును,రాజలాంఛనమగు రణమర్ధకంఠియను కాపాడె ను.వెంటనే తానా కణ్ఠియను ధరించి రాజపదవి స్వీకరించి అదే యుద్ధ రంగమున శత్రువును పారద్రోలి విజయలక్ష్మిని సంపాదించి ముదుకొండ రాజ్యము ను నిలబెట్టగలిగెను.దీనికంతకు చాళుక్య భీముని రక్షించుట గూడ ప్రధానమైనది గనుక అతని సేనలు ప్రక్కనే సహాయముగ నిలబడినవని వేరే చెప్పనక్కర
[4] 50తెలుగు శాసనాలు
లేరు.తనతండ్రి నిహతుడైనను గొణగయ్య రాష్ట్రకూట చక్రవర్తి యగు కృష్ణరాజును తరుమకొట్టి తన రాజ్య మును వేంగిరాజ్యమును కాపాడుట కొద్దిపాటి విష యము కాదు.చాళుక్య భీమునకు చేసిన ఈ మేలు నకు ప్రతిఫలముగ వేంగిరాజ్యములో గొణగయ్య గౌర వ ప్రతిపత్తులు ఇనుమడించెను.కొరవి శాసనము లో మొదటి భాగమునగల చరిత్ర యిది.
కొంతకాలము గడిచినది.సుమారు ముప్పది సంవ త్సరముల తర్వాత మొదటి భీముడు గతించెను.అతని పుత్రుడు కొల్లభిగణ్డ విజయాదిత్యుడు కొద్ది కాలమేలె ను.ఇతని పుత్రుడు మొదటి అమ్మరాజు వేంగికి రాజయ్యె ను. అతడుకూడ ఆఱేడు సంవత్సర ములు రాజ్యము చేసి గతించిన పిమ్మట దాయాదులలో కల హమువచ్చి వేంగిరాజ్యము ను యుద్ధమల్లుని వంశ్యులగు తాడవ.అతని కొడుకు రెండవ యుద్ధమల్లు డు చేజిక్కించుకొని యేడు సంవత్సరములు రాజ్యము చేసిరి. క్రీ.934 లో మరల అమ్మరాజు వంశమునకు చెందినవారు తిరుగబడిరి. అమ్మ రాజు సవతి తమ్ముడగు రెండవ భీముడు యుద్ధమల్లుని కడతేర్చి రాజ్యము చే జిక్కించికొనెను.ఇట్టి అనిశ్చిత పరిస్థితిలో ముదుగొండ రాజగు గొణగయ్య కెవరిని చేబట్టి వేంగితో తనకుగల సంబంధమును నిలబెట్టుకోవలెనో తోచలేదు.రెండవ యుద్ధమల్లు నికి రాష్ట్రకూట చక్రవర్తి యగు నాలుగవ గోవిందుని అండ దండలు గట్టిగా నున్నవి.కాని యుద్ధమల్లుడు రాజ్యార్హుడు కాదని గొణగయ్య భావించెను. మొదటి అమ్మరాజు కొడుకు బేత విజయాది త్యుడు పిఠాపురము పారిపోయె ను.అతని దృష్టిలో దేశము విడచి పారిపోయిన అమ్మరాజు పుత్రుడగు ఈవిజయా దిత్యుడే న్యాయమైన రాజు.కానిబలహీనుడగుటచే రాజ్యమును దక్కించుకొనలేక పోయెను.యుద్ధమల్లుని కడతేర్చి రాజ్యమును సంపాదించిన రెండవ భీమునితో ముందుగా తన వ్యతిరేకతను చూసి విరోధము
తెచ్చుకొనెను.యుద్ధమల్లునికి సహాయముకొఱకు వచ్చిన రాష్ట్రకూట గోవిందుడు ముందుగా ముదుకొండ రాష్ట్ర ముపై బడెను.వేంగిలో తాను నమ్మిన బేత విజయాదిత్యుడే పారిపోగా తనకు స్థానమేమాత్రము లేదని తలచి గోవిందుని ధాటికి ఆగలేక గొణగయ్య పొరుగున ఉన్న వేములవాడ చాళుక్య రాజైన రెందవ అరికేసి యొద్ద శరణు జొచ్చెను. ఈలోగాఅతని సోదరుడగు నిరవద్యుడు వేంగిలో రాజుగ నిలబడిన రెండవ భీముని ప్రాపుచేరి అతని బలముతో గోవిందు నెదిర్చి తరిమి వైచి ముదుకొండను కొరవి శాసనము51
తాను చేజిక్కించుకొనెను.కొద్ది వ్యవధిలోనే వేములవాడ రాజైన రెండవ అరికేసరి గోవిందుని పరిమార్చి అతని ప్రత్యర్థియగు మూడవ అమోఘవర్షునికి రాష్ట్రకూట రాజ్యమిప్పించెను.
తెలుగు శాసనాలు
కథ యెంతవఱకో తెలియక కొంత సందేహము. శాసనమ సంపూర్తి యగుటచే కొంత కష్టము.భాష విషయములో మొద టి రెండు భాగములలోను కష్టము కనిపించదు. మూడవ భాగమున దండనములు విధించు సందర్భములోనే కొన్ని పదము లర్థము కావు.
ఈ ముదుకొండ పల్కుల శాసనములు వేరే రెండు తామ్ర పట్టికలు గలవు.కాని వాటి ల్లో కేవలము వంశవృక్షములు మాత్ర మొసఁగబడిని.రాజకీయాంశము లెవ్వియు తెలుప బడలేదు. ఇదియే ఆ రాజులకు సంబంధించిన క్లిష్టమగు రాజకీయములను తెలుపుచున్నది.శాసనమును రచించుటలో జూపిన నేర్పును చెప్పదలచిన విషయములను సుబోధ మగు నట్లు వ్రాయజాలక పోయెననిపించును.ఆనాడు వారి దృష్టిలో రాజకీయ విషయములన్ని పరిచితములై యుండినవే గనుక వారికి ఈ రచన చక్క గానే అర్థమగుచుండెడిదని భావించవలెను. మనమిప్పుడు ఆ రాజకీయములలోని విశేషాంశములను వేఱే ఆధారముల ద్వారా కనుగొనవలసి యుండుటచే కష్టముగా నున్నది.
పెద్దరాయి-మొదటివైపు
- శ్రీ విక్రమాదిత్య నృపా
- గ్రతనయుణ్డయ్న చాలుక్య
- భీమునకు శౌచకన్ధప్ప೯
- నకు వే[ం]గీశ్వరునకు రన
- మద్ధ೯(ద్ధా೯)న్వయ కులతిలకు
- ణ్డయ్న కుసుమాయుధుణ్డు గ
- న్నర బల్లహుని కస్తప్రాప్త
- [0]బయ్న రనమద్ధ೯(ద్ధ೯)కణ్ఠియం దన
- భుజవీయ్య[೯]బలపరాక్ర
- మంబున న్దెచ్చి కణ్ఠియం కట్టి
- పట్టం బెత్తి ఖఱ్గ సహాయు
- ణ్డై నేల యెల్లం గావంబు(బూ)ని కొరవి శాసనము
53
13.మంచి కొణ్డ నాణ్డా దిగ
14.వేంగి దేసము విష్నువ
15.ద్దె೯(ద్ధ೯)నుతో సద్ధ೯రాజ్యంబు సేయు
16.యుచున్న కుసుమాయుధు పె
17.ద్ద కొడు కనేక రిపు నృపతి
18.మణిమకుట మకరికా
19.కషణ మృశృ(సృ)ణిత చ[రణ*]
పెద్దరాయి-రెండోవైపు
(ఈ క్రింది రెండువైపులలో నేది రెండవదో ఏది మూడవదో చెప్పవీలుగాకున్నది).
- గల కలాత్త೯ంబు రా
- జ్యంబు సేయుచు నిష్ఠ(ష్ట)వి
- షయ కామభోగంబుల
- నుభవించు చు సుఖంబు
- ణ్డి యొక్క నాణ్డు కొరవి నల్ల
- మేఱెయ కొడుకు పెద్దన
- రావించి నీవు నాప్రణ స
- మానుణ్డవైన చెలిని నీ
- చేసిన యుపకారంబు నా
- కు బ్రత్యుప కారంబు సేయ
- వలయుం గాన నీకేమి వ
- లయుం దాని వే
- ణ్డి కొమ్మన్న నీ
- శ్రీ నాకెల్లం గలదేమిలే
- కున్న వేణ్డి కొణ్డుమయ్న
- ంబరోపకారంబు పొణ్దె(డ్=θ)నా
- ని కొరవి యన్నది ముదు
- గొణ్డ పల్కుల కులసన్త 54
తెలుగు శాసనాలు
పెద్దరాయి- మూడవవైపు
- స[టా]నెగల్ల శ్రీ నిరవ
- ద్యుణ్డ నేక సమర సంగ
- ట్టణ భుజాసి భాసురు
- ణ్డై తమయన్న రాజ్యశ్రీ
- కెల్ల న్ధాన యరు హుణ్డై
- చేకొని నిల్చి భీమసలు
- కి యన్ద నేక వస్తు వా
- హనోత్సవంబు ల్వడయు
- చు తమ యన్న గొణంగయ్య
- చేసిన ధమ్ము೯ పులునస
- ంబును నెగఱ్పను గావను
- రక్షింపను వలయునని
- చేకొని కొరవి కిచ్చిన
- స్తితి సల్పి శలాస్థ(స్త)మ్భ
- ంబు వ్రతిష్టి(ష్ఠి)ంచి భీమేశ్వ
- రంబును నాతని కొఱ్పించి
- న చెఱువులు మఱియు మె
- వ్వి యేని నాతని చా(చే)యంబడి
- [న]ధమ్ము೯ వుల[న్దీఱ...]
మొదటి రాయి-నాలుగవ వైపు
1.ముక్కు దఱిగినను చఱి
2.చినను చిరియ వెఱికిన
3.ను మఱ్చి లునను ఱంక్కాడి
4.నను ఇరువాద్యది ఏను
5.ద్రమ్ములు మాణిసి చేసిన
6.దోసంబునకు వాని జీవిత
7.ం ఒదణ్డూవు వరియార[ంఒ] కొరవి శాసనము
55
8.ంబు పదవరంబు,వెల్లార
9.ంబంబు ఏరగద్యాణంబు పె
10.రామణి పున్నమ నాణ్డు ఏ
11.నూరు ద్రమ్మలరి వె
12.ట్టి సుఖంబు మనువ(నా)రు[.*]
13.నాయకుణ్డైర్న(న)కాంపులయ్న
14.వెఱ రాజులం జొచ్చి మ
15.నా[0]జనదు యీస్తితి యడి
16.సి కొన్న రాజుల్గ రేని
17.యు యీస్తితి యడిసిన కవ
18.నాపకు ఇన్దు మన్న కంపు
చిన్నరాయి-మొదటివైపు
- ...ఱు నన్ద మ యమ్మక[ట్టి]
- న పట్టంబు గానంబూని[ధు]
- రదెడె రాముణ్డై తనచే
- తినాల తోడుగా నమంగు
- గుణంగణ్డను పేరితో జ
- లుక్య భీమణ్డూన్దను
చిన్నరాయి-రెండవవైపు
1. గాల[0]బున ...
2. కాన్తరితుణ్డై చనిన నా
3. తని తమ్ముణ్డు సకలలో
4. కాశ్రయ, మణికణ(న)కము
5.క్తాలంకార చలుక్య కు[లో]
6.ద్భవ సితగ చఱక్క బీ
చిన్నరాయి-మూడవ వైపు
- ఇచ్చిన స్తితియు పఱియ[ద] 56
తెలుగు శాసనాలు
2 .యు[0]బోయువెరెయంబు జి
3. ట్టరి యెల్లన్దక్కి చాబొడి
4. చిన మాట యిరువది ద్ర
5. మ్మలు మనం బొడిచిన
6. నఱువది ద్రమ్మలు
7. అక్కసలకు కఱకు[0]లి
8. లేదు.
చిన్నరాయి-నాలుగవ వైపు
- మహీపతి వంశ జాశ్చపా
- పాద పేత మనసో భువి భూ
- రిభూపా ఏ(యే)పాల మన్తిమ
- మధ్యమ్మ೯ మిమం సమస్తం
- తేషా[0]మయా విరచి తోంజలి రేష
- మూద్ని೯(ధ్ని೯)[||*]చన్ది[సన్ది]విగ్రహిచాము(0*)
- ఱెయన్ర(వ్రా)లు
ఇది క్రీ. 935 నాటి దగుటచే ఇంచుమించు నన్నయభట్టు కాలమునొక శతాబ్దము ముందుది. ఇప్పటికి పూర్వము తెలుగు శాసనములందు కనిపించు 'ɵ' అను అక్షరము పూర్తిగ అదృశ్యమైన దనవచ్చును. ఈ క్రింది పదములలో అది వాడపడలేదు.
పూర్వము శాసనము | ఇప్పుడు కొరవి శాసనములలో | |
---|---|---|
వీరునɵయ్య | రాగిమడవనపల్ల | తనయుణ్డయ్న |
ధనంజయుదు | (కలమల్ల) | కుసుమాయుధుణ్డు |
వానుɵ | (రామేశ్వరం) | వాణ్డు |
సంయుక్తునɵగున్ | (అరకటవేముల) | [లో] కాన్తరితుణ్డై |
ఖడ్గ అనుటకు ఖల్గ
మేడియ అనుటకు మేఱెయ
చళక్క అనుటచు చ తిక్క (చాళుక్య)
నెగడ్పను " నెగఱపను
క్రొప్పించి " కొఱిపించి
మ్రుచ్చిలిన " ముఱచిలిన
చాముం డెయ " చాముం ఱెయ
1. చనదుయీప్తితి యడిసిన దీనిలో ...యీ
2. కలరేనియు యీ స్తితి యడిసిన " .............. .."........ యీ
3. మఱియు మెవ్వియేనినాతని మె అనునది వ్రాత పొర..."
పాటు కావచ్చును. 'పని నాతని' యమచోట 'పనిన్ '
ద్రుశాంతముగనున్నది. శబ్దరత్నాకరములో ఏని అని
కళగా చూపి, ద్రుతాంతముకూడ మతాంతరమున జెప్ప
బడెను.
4. రాజుల్లల రేనియు ........................................... " ఇచట కళగానే యున్నది.
ఇచట కళగానే యున్నది.
1. కవనావకు ఇందుమన్న
2. అంకాడినను ఇరు వాద్యది ఏనుద్రమ్ములు.
ఇంతవఱకుగల తెలుగు శాసనములలో 'ఐ' అను అక్షరము వాడుట
అరుదు. దానికి బదులుగ “అయి' అనునది వాడబడుచుండెడిది. కాని
శాసనమందు పదాంతములందు రెండు విధములుగను వాడబడెను. 'ఐన' అని
న' పరముగ వ్రాయుచో 'అయిన' అని వ్రాయను ద్దేశించి 'అయ్న' అని
వ్రాసెను.
తనయుణ్ణయ్న , కులతిలకుణ్ణయ్న , అ స్తప్రా పంబయ్న , నాయకుణ్ణయ్న
అనుచోట రెండు విధముల కలిపి తప్పు బ్రాయబడింది. 'న' వరముగాని, కేవల
'ఐ' అనియే వ్రాయుచోట 'అయి' వ్రాయకుండ ఏత్వము క్రిందైత్వము వ్రాసెను. ఖట్గసహాయుణ్డై, రాముణ్డై, [లో] కాన్తరితుణ్డై, భాసురుణ్డై, అరుహుణ్డై, 'సమానుణ్డవైన చెలివి' అనుచోట మాత్రము 'ఐన' అని కలదు. (కడపజిల్లా అనిమెలలోని క్రీ. 976 నాటి వైదుంబ శాసనములో వర్షంబు 'ఐన' అని విడిగా 'ఐ' కారము కనిపించు చున్నది). ఈ కొరవి శాసనములో విశేష మేమన 'అయిన' అను రూపములేదు. కానీ అయ్న అనేదే పైపదములలో కనిపించు చున్నది. అనగా ఉచ్ఛారణ సౌకర్యము కొఱకు యి లోని ఇ లోపించినదని అర్థము. ఈ లోపము సంస్కృతంలోను కనిపించును. సంస్కృతములో దీనిని ఉపధాలోపమని చెప్పుదురు. 'ఐ' అనియే వ్రాయుచోట 'అయి ' వ్రాయకుండ ఏత్వము క్రిందైత్వము వ్రాసెను. ఖట్గసహయుణ్దై, రాముణ్డై, [లో] కానరితిణ్డై, భాసురుణ్డై, అరుహుణ్డై, "సమానుణ్ణవైన చెలివి" అనుచోట మాత్రము 'ఐన" అని కలదు.
(కడపజిల్లా అనిమెలలోని క్రీ. 976 నాటి వైదుంబ శాసనములో వర్షంబు 'ఐన' అని విడిగా ‘ఐ కారము కనిపించు చున్నది.) ఈ కొరవి శాసనములో విశేషమేమన 'అయిన' అను రూపములేదు. కాని 'అయ్న అనేదే పైపదములలో కనిపించుచున్నది. అనగా ఉచ్చారణ సౌకర్యము కొఱకు యి లోని ఇ లోపించినదని అర్థము. ఈ లోపము సంస్కృతంలోను కనుపించును. సంస్కృతములో దీనిని ఉపధాలోవమని చెప్పదురు. 'అథాప్యుపదాలోపో భవతి" అని నిరుక్త కారుడు వేదములో ఈ లోపమును జెప్పెను. 'అల్లోపో నః' అని పాణిని సూత్రముకూడ నిట్టి లోపమును గూర్చియే. (ఉదా: రాజన్ + ఇ = రాజ్ న్+ఇ = రాజ్జి ; నామన్ + ఇ = నామ్ న్ + ఇ= నామ్ న్ ; అనగా ఇచట వరుసగ •జ" "కారము "మ" "కారము మీది 'అ' 'కారములు లోపించినవి. నూతన నూత్న ; విద్యాధర --> విద్యాద్ర ; ఇత్యాది సంస్కృత పదములు). అట్లె “వైదుంబ' వదము "వయిదుంబ" అనికాని “వయ్దుంబ" ఆనికానిఅగును. గారికి - గార్కి పెఱుకు –• పెఱ్కు ఇట్టివి అనేక పదములు శాసనము " ఇపుడు -> ఇప్డు లందు గానవచ్చును, మ న కి పు డు • చేసిన -> చేశ్న వాడుకయందును గలవు. గాన<- గ్నా
చదువు -> చదివిన అనిక్తాంత క్రియా విశేషణములలో చేయు -> చేసిన 'ఇన' తుదియందుండుట సామామై అగు -> అయిన నను "ఇ" లోపించుట గమనించదగినది.
సంయుక్తాక్షరములను ఉచ్చారణ సౌలభ్యము కొఱకు విశ్లేష మొనర్చుట. కొన్ని కావులందు గానవచ్చును. తెలుగు శాసనములందిరి సాధారణము. నిఘంటువులో కొన్ని చేర్చబడెను. పుట:TeluguSasanalu.pdf/68 పుట:TeluguSasanalu.pdf/69 పుట:TeluguSasanalu.pdf/70 పుట:TeluguSasanalu.pdf/71 పుట:TeluguSasanalu.pdf/72 పుట:TeluguSasanalu.pdf/73 పుట:TeluguSasanalu.pdf/75 పుట:TeluguSasanalu.pdf/76 పుట:TeluguSasanalu.pdf/77 పుట:TeluguSasanalu.pdf/78
11. కొన్ని పద్య శాసనాలు.
ఏ భాషయందైనను క్రమమగు విధానములో వాక్యరచన యేర్పడక పూర్వమే గ్రామ్య వేడుకలకు చెందిన పదాలు, పాటలు, మొదలగు వాజ్మయము వెలువడి ఆయా ప్రజల్లో ప్రాంతీయంగాను అనుశ్రుతంగాను వచ్చుచుండెను. కాలక్రమంలో కొన్నిపోయి మరికొన్ని క్రొత్తవి చేరుచుండును. ఇట్టివి యెచట వ్రాయబడి యుండవు గనుక మనకు లేనట్లే. వ్రాత చేతనైన తరువాత కూడ అట్టివి వ్రాసియుంచవలెననే తలంపు కలుగకపోవుట వలన అనేక పదాలు, పాటలు ప్రజల నోళ్ళలో ఉన్నంతకాలం ఉండి తర్వాత అంతరించును. గాథా సప్తశతివంటి ప్రాకృత ముక్తకములబట్తివే. తెలుగులోకూడ నట్టి క్రమబద్ధమైన పద్య రచనలున్నట్లు శాసనాల్లో అక్కడక్కడ గనబడును. ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు వారి ప్రాజ్నన్నయ యుగము అను గ్రంథములో కొన్ని శాసనములనుండి అట్టి పద్యములవలె కనుపించు భాగములు వృత్తగంధి లేక పద్యగంధి యనబడునని తెలిపి ఈ క్రింది యుదారణములనిచ్చి యుండిరి. (ప్రాజ్నన్నయ యుగము. పుట 354.)