తెలుగు శాసనాలు/కొండపఱ్తి శాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

9. కొండపఱ్తి శాసనము.


వరంగల్లు సమీపములో కొండపఱ్తి యను గ్రామమువద్ద చెఱువులో నొకకొండరాతిపైన ఈ శాసనము కలదు.ఇది ఇటీవలనే కనుగొబబడెను.అక్షరములు సుమారు తొమ్మిద వ శతాబ్దమునకు చెందునని భావింపబడుచున్నవి.అర్థమగుటలో నిదియు కొంత చిక్కు కలిగించుచున్నది.ఇది యొక పొలమును కట్టుబడి కిచ్చు సందర్ంహమును తెలుపును.

  1. స్వస్తి[|]పొలమెయరట్టోడి మంచికాళు
  2. కొణ్డపకు సమభగంబు తంబుల స్రవంబు చేసిన
  3. భూమి[|*]దీని గూన్తుకున్తుల పరుదివడ్డి యారంభఛేయువారు[|*]
  4. యిట్లు దక్కనిగల్పమణ్డి తంబులంబు దిన్నవారవన్దామి గొరవలు[దా]నమెయు
  5. కుమరమయ్యయు గణపతి యోజు యిట్లు సాక్షిగాను తంబు[ల]స్రవంబు చేసిన స్రవణభూమి[|*]
  6. యీ నెల యరి నాలుగు ద్రమ్ములు ఆయంబు పుట్టెణ్డుగొలుగు ధనంజెయ ఫలధారు
  7. కొనువారు ఆకిడి ప[ం]గులేదు[|*]యుద్దఱు బొత్తున నార[ం]భ చేయువారు అమ్మ೯ కొణ్డమణ్డీ యారంభ
  8. చేయువాణ్డు స్రావకుల భీమియక్ఱొం పాలదివాకరయస్రన్నుగొల మేడియము సాక్షి{|*]
  9. నాగ కమరియ క్రొచ్చె{||*]మంగళ మహాశ్రీ[||*]
'క్ఱొంపాల'పదములో(8వపంక్తి)'ఱ'అక్షరము వాడబడెను.సున్నకు బదులింక బిందువులేగలవు.తంబుల స్రవంబుచేసిన భూమి-ఉదకధారా పూర్వకము చేసి దాన ము లొసగుట మనకు తెలుసు.ఇది తాంబూలము పుచ్చుకొని యిచ్చినభూమి. ఇది దానముకాదు.ఒక కట్టడి.అంటే భూమి సేద్యము కొండపఱ్తి శాసనము

45

చేయుటకై యిచ్చి సమభాగం పాలు పంచుకొనే యేర్పాటు చేసుకొనిరి.పూర్వమిట్టి విధానము నిర్ణయము చేసుకొనునపుడు కూడ అందుకు సంబంధించిన వారు తాం బూల గ్రహణము చేసి తామా నిర్ణయమునకు కట్టుబడి యుందుమని అంగీకరించు ట ఆచారమని మనం దీని వలన గ్రహించెదము.అట్టి ఆచారము వివాహ సందర్భ ము లోనే మనకు ప్రస్తుతము అలవాటుగానున్నది.వధూవరులు నిర్ణయమై వారికి వివాహనుచేయుదమని వారి పెద్దలు నిర్ణయము చేసుకొనునపుడిట్టి సంప్రదాయము కలదు.అట్లు తాంబూలము తినిన పిదప ఆనిర్ణయము మారదని భావము. వివాహ మునకు సంబంధించిన యితర నిర్ణయములు చేయునపుడుకూడ తాంబూలములు స్వీకరించుట కలదు.బజంత్రీలు ,పలకీలు మోయువారు,వంటవారు మున్నగువారిచేత కూడ తప్పక రావలెనను నిర్ణయముతో నిట్టి తాంబూల స్వీకారము చేయబడును.

వేరే కట్టుబాట్ల విషయంలో మనకంతగా ఈ యాచారము కనిపించదు.కాని ఆ కాల ములోనిది ప్రతి ముఖ్యమగు కట్టుబాటుకి ఇరువురు-లేక పలువుర మధ్య పరస్పర ఇప్పందముమీద చేసుకొనబడు నిర్ణయానికి తాంబూల స్వీకరణము అతి ముఖ్యమగు సాంఘికాచారముగ నుండెడిదని మనకు శాసనము వలన తెలియుచున్నది. అట్లు చేసుకొన్ననిర్ణయము అయా పక్షముల వారెవ్వరు తప్పకూడదని కట్టడి,దానికి సాక్షు లుకూడ తాంబూలము స్వీకరించెదరు.ఇది దానము కాదు.కేవల మొక కట్టడి మాత్రమే.


పొలమెయరట్టోడి అనే స్థానికాధికారి మంచికాళు కొడుకైన కొణ్డపకు చెరి సమాన ముగ పాలికి సేద్యముచేయునట్లు ఏర్పాటుచేసిన భూమి యిది అని మొదటి వాక్యానికి అర్థ ము.అట్లని తాంబుల స్వీకారము చేయబడెను.ఈ భూమిని కూన్తుకున్తుల అంటే బిడ బిడ్డతరమున పరువదివడ్డి అంటే వ్యవసాయ పర్వము నాడు చెల్లించుపన్ను చెల్లించిన సేద్యము(ఏటేటా)ఆరంభచేయువారు.అంటే ప్రారంభ ముచేయగలరు.భూమిలో సేద్యమునకు దిగునపుడు ముందుగ భూస్వామికి కొంత చెల్లించవలెను.పంట వచ్చిన తరువాత మఱికొంత చెల్లించవలెను.


పరువది=వ్యవసాయ పర్వదినమగు యేరువాక పూర్ణిమవంటి దినము.నీరారం బంబు,కాడారంబంబు,(వరియారంబంబు,వెల్లారంబంబు అని కొరవి శాసనంలో పన్నులు విధించబడెను.అట్టియారంభము ఇది) 46

తెలుగు శాసనాలు

వడ్డి(ఒడ్డు→ఇడ్డి)=చెల్లించి

ఆరంభచేయువారు=సేద్యము ఆరంభించవలయును.

కూన్తుకూన్తు=స్త్రీ వాచకపదములతో తరతరముల అనునర్థమున బిడ్డబిడ్డ తరమువంటి ప్రయోగము కాని బిడ్డ ఇభయలింగ వాచకము(బిడ్డడు,ఆడుబిడ్డ)కూన్తు పదము పుం వాచకము కానరాదు.

ఇట్టుదక్కని=ఈ విధముగ దక్కు(=చెల్లును) అని

గల్పనుండు=స్థలనామము అచటనుండి ఆ శాసనములో 'నుండి 'అను ప్రత్యయము రెండుచోట్ల వాడబడెను.

వన్దామి గొరవలు=వన్దామి యను పేరుగల గురువులు (మతథానమునకు చెందిన స్థానపతులు)

తంబులంబు దిన్నవా(రు)=తంబులము తిన్నవారు.

దామమోయు,కుమరమయ్యయు,గణపతి యాజు-దీని సాక్షు లని చెప్పబడెను.

ఈ నేలయరి= ఈ భూమికి పన్ను -నాలుగు ద్రమ్మలు

ఆయంబు పుట్టెణ్దగొలుగు=ధాన్యరూపముగ చెల్లించవలసినది. పుట్టెడు కొలత.

ఈ రెండు విధముల రాబడి ధనంజెయుడను పేరుగల ఫల ధారుడు(సుంకాధికారివంటి ఉద్యోగి)తీసికొనగలరు.ఈ పదము తహసీల్దారు,సుబేదారు,జమీందారు వంటి ఉర్దూ పదము కాదు. ఈ సంస్కృతపదము వేఱుచోగానరాదు. క్రయవిక్రయ ము లందు వస్తువులవెలను నిర్ధరించుటయందు ధారణ పద ప్రయోగము కానవచ్చుచున్నది. 'వణిజులు తమయంత వలసిన ధారణ సేయజూచుట ప్రజఁ జెఱచి కొనుట మడికి సింగన సకలనీతి నమ్మకము.ప్ర.218.


అకిడి వంగులేదు:అకిడి వంగు లేదు.ఈ రెండు విధములగు వెఱొండు పన్నులు లేవు.ఈ పన్నులెట్టివియో తెలియవు. వంగు సుంకము వేరే శాసనాలలో కూడవచ్చును.అకిడి కొండపఱ్తి శాసనము

47

అనేది పంగునకు విశేషణమో లేక వేరే పన్నును తెలుపు పద మో తెలియదు.మొత్తముమీద రెంటి అర్థము సరిగా తెలియదు .పన్నులని మటుకు తెలుసు.


ఇద్దరు బొత్తున నారభ చేయువారు-కొణ్డప-వందామి గొరవ.ఈ యిఱువుర పొత్తున


అరభ=సేద్యారంభము చేయువారు. అర్మకొండనుండి యారభ చేయువారు - ఇది బహుళ గొరవల పక్షమున పంపబడు సేద్యకాండ్రను తెలుపును.ఈ గొరవలు అర్మకొండ(అన్మకొండ)లోని జైన గురువులు, వారు తమ సేద్యగానిని పంపుదురు.అనుమకొండకు పూర్వము అర్మకొండ యని యితర శాసనములందుకలదు.


స్రావకులభీమయ - ఆసేద్యకాని పేరు.ఆయన స్రావకుడు.సామాన్య జైన మతాను యాయి.


ఈసేద్యకానిని పంపు విషయములో క్ఱొంపాల దివాకరయ,స్రన్నుమేడియ అను నిద్దరు సాక్షులు.


నాగకమరియ-నాగయ్య అనే కమ్మరి యీ శాసనమును తొలిచెను.ఇచట 'నాగయ' లోని 'య' 'కమరి' పదమున చేరుట గమనించదగిన గ్రామ్య ప్రయోగము.


మంగళమహాశ్రీ- పూర్వకాలమునందేది వ్రాసినను 'మంగళాదీని,మంగళమధ్యాని, మంగళాంతాని' అని సంప్రదాయమును పాటించెడువారు.మధ్య అదిలేకున్నను ఆద్యంతములలో మాత్రము శాసనములందీ యాచారము కనుపించును. ఆదిలో 'స్వస్తిశ్రీ' యనియు అంతమున 'మంగళమహాశ్రీ' అనియు ఉండును.


ఇప్పటి కౌలునామా వంటిదీ శాసనము.స్టాంపులు,రిజిస్ట్రేషన్లు లేకుండ చక్కగ తాంబూలాలు పుచ్చుకొని నిర్ణయము చేసుకొన్నారు.దాన్నొక గుండుమీద చెక్కించారు.