తెలుగువారి జానపద కళారూపాలు/బొమ్మలాట కళాకారులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బొమ్మలాట కళాకారులు

నిమ్మల గోవిందు:
TeluguVariJanapadaKalarupalu.djvu

షుమారు అయిదువందల సంవత్సరాల క్రితం మహారాష్ట్ర నుంచి వలసవచ్చి, అనంతపురం జిల్ల, ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచు కున్నారు. ఆ సంతతికి చెందిన దళవాయి గోవిందు, ఈ నాటికీ ఆవృత్తినే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సమాచార శాఖ ద్వార, ఫామిలి ప్లానింగ్ గురించి బొమ్మలాట ద్వార ప్రచారం చేస్తున్నారు. బొమ్మలను తయారుచేయడం, ప్రదర్శించే కథలలోని మాటల్నీ పాటల్నీ పాడుతూ, సూత్ర ధారుడుగా వ్వవహారిస్తున్నారు. వీరు ప్రదర్శిచే ముఖ్య ప్రదర్శనాలు "సుందర కాండ " "మైరావణ", "సతీ సులోచనా", 'ఇంద్రజిత్తు" మొదలైనవి ముఖ్యమైనవి.

కుమారరాజారావు:

అలాగే నెల్లూరు జిల్లా ధర్మారావు చెరువుపల్లి వాస్తవ్యుడు, కుమార రాజారావుగారు బొమ్మలాట ప్రదర్శనలో అవార్డు నందుకున్నారు. భారత దేశంలోనూ, విదేశాలలోనూ పలు ప్రదర్శనలిచ్చి, ప్రఖ్యాతి వహించారు.

అనపర్తి చిన్నకృష్ణ:

తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీప గ్రామం, మాధవపట్నం బొమ్మలాట కళాకారులకు ప్రసిద్ధి. ఈ నాటికీ బొమ్మలాటలనే నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ నాడు శ్రీ సీతారామ నిలయ చర్మ చిత్రకళా ప్రదర్శన కమిటీ అధ్యక్షులుగా దర్శకులుగా అనపర్తి చిన్నకృష్ణగారు వ్వవహరిస్తున్నారు.

తోట పవన్ కుమార్:

సామర్ల కోట మండలం, మాధవపట్నంలో, శ్రీ నటరాజ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీ అధ్యక్షులుగా పవన్ కుమార్ వ్వవహరిస్తున్నారు. భారత రామాయణ గాథలకు సంబంధించిన, బొమ్మలాట ప్రదర్శనాలను భారత దేశమంతటా ప్రదర్శించారు.

తోట రంగారావు:

మాధవ పట్నానికి చెందిన తోట రంగారావు, పద్మనిలయ చర్మ చిత్రకళా సంస్థను ఏర్పాటు చేసి ప్రదర్శనాల నిస్తున్నారు. మహాభారత గాథల్ని, బొంబాయి లాంటి ముఖ్యపట్టణాలలోనూ, ఆకాశవాణి లోను ప్రదర్శస్నలు ఇచ్చారు.

TeluguVariJanapadaKalarupalu.djvu
తోట వెంకటరావు:

తూర్పు గోదావరి జిల్ల తాళ్ళ పాలెంకు చెందిన తోట వెంకటరావు, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలలోనూ, విశాఖ జిల్లాలోను, ఆలిండియా రేడియోలోను నూట ఇరవై బొమ్మలతో పది మంది కళాకారులతో రామాయణ, భారతాధి కథలను ప్రదర్శిస్తున్నారు.

తోటబాలకృష్ణ:

శ్రీ లక్ష్మీనిలయ చర్మ చిత్రకళా సంస్థను, కాకినాడ సమీపంలోని చౌదిగ గ్రామంలో స్థాపించి రామాయణ, భారత గాథలను ప్రదర్శిస్తున్నారు. పదిహేను నిముషాల నుండి ఏడు గంటలవరకూ ఏకబిగీన ప్రదర్శనాన్ని ప్రదర్శిచటం వీరి ప్రత్యేకత.

తోట ధవనేశ్వరరావు:

సామర్ల కోట మండలంలోని మాధవపట్నంలో ధననేశ్వర రావు, శ్రీ హనుమాన్ చర్మ చిత్ర కళా బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ సంస్థకు దర్శకుడుగా వుండి, రామాయణంలోని సుందర కాండ , "అంగద రాయబారం","లక్ష్మణ మూర్ఛ","లవకుశ" , భారతంలోని ఉత్తర గోగ్రహణం, కీచకవధ, పద్మవ్యూహము, శశి రేఖా పరిణయం మొదలైన ఘట్టాలను ప్రదర్శింస్తున్నారు.

ఎ.త్రినాథ్:

కాకినాడ సమీపంలోని "చౌదిగా" లో త్రినాథ్ శ్రీవాణీ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీకి అధ్యుక్షుడుగా వుండి, భారత దేశమంతటా బొమ్మలాటలను ప్రదర్శిస్తున్నారు.

తోట నాగభూషణం:

తూర్పుగోదావరి జిల్లా జెల్లావారి పేటకు చెందిన నాగభూషణం, బొమ్మలాట ప్రదర్శనాన్ని సమర్థవంతంగా ప్రదర్శించటమే కాక, రామాయణ, భారత గాథలకు సంబంధించిన, ఘట్టాలకు సంబంధించిన బొమ్మ లన్నిటినీ తయారు చేయ గల నిపుణుడు.

తోట సింహాచలం:
TeluguVariJanapadaKalarupalu.djvu

తూర్పు గోదావరి జిల్లా జెల్లావారి పేటకు చెందిన సింహాచలం_ శ్రీ అన్నపూర్ణ నిలయ చర్మ చిత్ర కళా సంస్థను స్థాపించి, బొమ్మలాట ప్రదర్శనంలో ప్రజా మన్ననల్ని అందుకున్నాడు. రామాయణంలోని పది భాగాలనూ, భారతంలోని పది భాగాలనూ ప్రదర్శించ సమర్థుడు.

తోట మావుళ్ళు:

మావుళ్ళు, శ్రీ తిరుపతి శ్రీనివాస చర్మ చిత్రకళా సంస్థను స్థాపించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ, దూరదర్శన్ లోనూ , రామాయణ, భారత, కథా ఇతివృత్తాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తున్నారు. వీరు మారేడు పాకలో జన్మించినా, మాధవ పట్నంలో స్థిరపడి ప్రదర్శనాలను ఇస్తున్నారు.

తోలుబొమ్మల తయారీ కేంద్రం:

రాష్ట్ర వ్వాపితంగా బోలు బొమ్మల తయారీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని "నిమ్మలకుంట" పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని సుమారు అయిదు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మండల కేంద్రమైన గోరంట్ల "కళ్యాణ దుర్గం" మండలంలోని, అవులన్న, దుద్దేకుంట, పిల్లల పల్లి, అయ్యగారి పల్లె, ధర్మవరం మండలంలోని నిమ్మల కుంట, రాళ్ళ అనంతపురం రాయదుర్గం మందలంలో సోమలాపురం, "చదం, జుంజురం పల్లీ" బొమ్మహాళ్ మండలంలోని ఉడేగోళం, మల్లాపురం, బ్రహ్మసముద్రం మొదలైన గ్రామాలలో బొమ్మలాట కళాకారులు ఎక్కువగా వున్నారు.

ఛాయా నాటికలు:
TeluguVariJanapadaKalarupalu.djvu

తోలుబొమ్మలాటకలకు సైదోడులే ఛాయా నాటికలు. బొమ్మలాటల అనంతరం వచ్చిన పరిణామమే ఈ ఛాయా నాటికలు. వీటినే షాడో ప్లేస్ అంటారు. ముఖ్యంగా ఈ ఛాయా నాటికలు దేశం మొత్తంలో చాల తక్కువ మందే ప్రదర్శిస్తున్నారు. మన ఉత్తమ కళారూపాల్లో ఛాయా నాటికను కూడ ఒక వుత్తమ కళాఖండంగా ఎంచవచ్చు. ఈ ఛాయా నాటికలు ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లండు దేశాల్లో సాంకేతికంగా బాగా అభివృద్ధి పొందాయని ప్రతీతి.

ఛాయా నాటికలు మనదేశంలో సుప్రసిద్ధ నర్తకుడు ఉదయశంకర్ తన నృత్య ప్రదర్శనాలతో పాటు ఈ ఛాయానాటికను కూడా వ్వాప్తిలోకి తీసుకవచ్చాడు. ఈయన ఛాయా నాటిక ద్వారా బుద్ధుని జీవితాన్ని ఎంతో నిపుణంగా ప్రదర్శించాడు. ప్రేక్షకులలో ఎంతో అనుభూతి కలిగించాడు. అలాగే ఆంధ్ర దేశంలో బాపట్ల ప్రజానాట్యమండలి కార్యకర్తలైన మురళీధర రావు, జొన్నలగడ్డ జోషీ మొదలైన వారు ఇతర కళారూపాలతో పాటు ఈ ఛాయా నాటికలను దేశానికి, ప్రజలకూ ఉపయోగపడే కథా ఇతి వృత్తాలను తీసుకుని ఎంతో ముచ్చటగా ప్రదర్శించారు.

మాత్రుకలు తోలుబొమ్మలే:
TeluguVariJanapadaKalarupalu.djvu

చాయా నాటికలకు మాత్రుకలు తోలు బొమ్మలే. తోలు బొమ్మలాటల్లో కేవలం తోలుతో తయారు చేయబడిన బొమ్మలను మనుషుల సహాయంతో ఆడిస్తారు. ఒక్కొక్కరు ఒక బొమ్మ, మరికొందరు రెండు బొమ్మలను రెండు చేతులతోనూ ఆడిస్తూ వుంటారు. కాని ఛాయా నాటికల్లో, కేవలం ఆయా పాత్రలకు సంబంధించిన వ్వక్తులు తెర వెనుక నుండి నటిస్తూ వుంటే వారి నీడలు, వారి అభినయం తెల్లని తెరమీద ఎంటో స్ఫుటంగా కనపడతాయి. కాని ఛాయా నాటికల్లో పాత్రలు ధరించిన దుస్తుల యొక్క రంగులు గాని ముఖానికి పట్టించిన రంగులు గాని కనబడవు. అలా కనపడవు కనుకనే ఏ విధమైన రంగులూ, రంగుల దుస్తులూ వుండవు. ఇందుకు కారణం ఏ మంటే తోలుబొమ్మ తెరకు అంటి పెట్టుకుని వుండడం వల్లా ఆ బొమ్మ వెనుకనే బలమైన దీపపు కాంతి వుండడం వల్లా బొమ్మలు పలుచని చర్మంతో తయారు చేయడం వల్లా, బొమ్మలో చిత్రించిన అన్ని రంగులూ మనకు స్ఫుటంగా గోచరిస్తాయి. కాని ఛాయా నాటికలో నటులు తెరకు సాధ్యమై నంత దూరంగా వుంటారు. వారికి కొంచెం దూరంగా ప్రొజెక్టు చేసే కాంతి వంతమైన లైటు వుంటుంది. నటీనటులు ముందుకు వచ్చిన కొలదీ నీడలు పెద్దవిగాను, వెనుకకు పోయిన కొద్దీ నీడలు చిన్నవిగానూ కనబడతాయి. ఇందులో కూడా ఆయా రంగులు చూపించ వచ్చు. ఈ రంగులు లైటుకు దగ్గరగా చూపించినట్లైతే రంగులు వివరంగా కనపడతాయి. ఉదాహరణకు ఒక ఇల్లు దహనం అయిపోయి నట్లూ ఆ మంటలు సహజంగా వున్నట్లూ చూపించ వచ్చు. ఎఱ్ఱ కాగితాలను సన్నగా జూల్సుగా కత్తరించి లైటు ముందు విసనగఱ్ఱలాగ విసరినట్లయితే ఆ రంగు నీడలు మంటలుగా కనిపిస్తాయి. ఇలా మనకు కావలసిన ఇతర రంగులను ప్రకృతి దృశ్యాలను ప్రదర్శించ వచ్చు.

ముఖ్యంగా ఛాయా నాటికలు ఆయా సన్నివేశాల ననుసరించి నేపథ్య సంగీతాన్ని వినిపించడంతో ఎంతో రమణీయంగా వుంటాయి.

సురభివారి ఈత మట్టల బొమ్మలాట:

ఆంధ్ర నాటక రంగ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం వహించే సురభి వారు ప్రారంభ దశలో ఈత మట్టల బొమ్మలాటల్నీ, తోలు బొమ్మలాటల్నీ, తరువాత నాటకాలను ప్రదర్శించారు.

సురభి కళాకారుల నివాసం పూనా సమీపంలో వున్న ఒక కుగ్రామం. శివాజీ ఆస్థానంలో ఉద్యోగులుగానూ, సేనానాయకులుగాను, ఉప నాయకులుగానూ వుండేవారు. వీరందరూ క్షత్రియకులానికి చెందిన వారు. వీరందరూ బహు విద్యావంతులుగాను, సంగీత సాహిత్యాలలో ఆరితేరినవారై యుండేవారు. శివాజీ, శంభాజీ గతించిన తరువాత, మహమ్మదీయ దండ యాత్రల్ని తట్టుకోలేక భార్య బిడ్డలతో వలసలు పోయారు. అలా వలసలు పోయిన వారిలో కొంతమంది బళ్ళారి, రాయ దుర్గం, అదోని ప్రాంతాలకు చేరుకున్నారు. వారినే అరెకాపులనేవారు.

దాత కరువు:
TeluguVariJanapadaKalarupalu.djvu

ఆనాడు దాత కరువుతో ఆంధ్ర దేశమంతా అలమటిస్తోది. వారితో తెచ్చుకున్న అభరణాలన్నీ అమ్ముకుని జీవించారు. తరువాత జీవనోపాధి కష్టమైంది. వారిలో అనేక మంది శ్రావ్యమైన గాత్రాలు కలవారున్నారు. పాటలను ప్రారంభించారు. తరువాత కొన్ని వినోద కార్య క్రమాలు ప్రదర్శించారు. కూటి కోసం కోటి విద్యలన్నట్టు ఆ తరువాత ఈత మట్టల బొమ్మలాటను ప్రారంభించారు. ఈత ఆకులను మట్టలతోను తీసుకు వచ్చి వాటిని ఎండ బెట్టి వాటిని బరువుకింద మణగిబెట్టి, వాటిని సైజులువారీగా, చిన్న పెద్ద పాత్రలు ఎంచుకుని , అయా పాత్రల ఆకారంలో ఆకులను బొమ్మల ఆకారంగా కత్తరించి, రామాయణ కథను ఎన్నుకుని, ఆయాపాత్రలకు వెనుక భాగాన మాటనూ పాటనూ కూర్చి, తెర చాటున దీపాలు పెట్టి, తోలుబొమ్మల ఆటల మాదిరి ప్రశ్నించేవారు. ఈత మట్ట పిడిని పట్టుకుని ఈ బొమ్మలను చక్కగా ప్రదర్శించి తద్వార వచ్చిన డబ్బుతో తమ జీవనాన్ని సాగించే వారు. అలా ఈత మట్టల బొమ్మలాటలను ప్రదర్శించిన సురభి వారు ఆ తరువాత తోలు బొమ్మలాటల్ని ప్రదర్శించారు.

ఊచబొమ్మలాట:

తోలు బొమ్మలు, కొయ్య బొమ్మలు, బుట్టబొమ్మలుతో పాటు ఈత మట్టల బొమ్మలాటలను, ఊచ బొమ్మలాటలను కూడ ఆంధ్ర దేశంలో ప్రదర్శించారు.

క్రిందనుండి ఊచలతో బొమ్మలాడించటం వల్ల వీటికి ఊచబొమ్మలని పేరు వచ్చిందని కె.వి. గోపాల స్వామి గారు నాట్యకళ జానపద వుత్సవాల సంచికలో ఉదహరించారు.

ఈవిధంగా బొమ్మలాడించే పద్ధతి బెంగాల్ లో ప్రచారంలో వుంది. ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఊచబొమ్మలాటలను ప్రదర్శించినా ఇటీవల కాలంలో వాటి జాడ అంతగా తెలియటం లేదు.

కర్ర బొమ్మ తలను తయారు చేసి సన్నకర్ర నొకదానిని క్రిందకు వుండేటట్లు ఈ రంధ్రంలో అమరుస్తారు. బొమ్మను పట్టుకుని ఆడించడానికి ఇది అనువుగా ఉపయోగపడుతుంది.

అంగ విభాగంలో మొండెము, నిటారుగా వున్న కర్రకు సమాంతరంగా తగిలించిన చెక్క భుజాలు వుంటాయి. త్రాళ్ళ బొమ్మల మాదిరి చేతుల్ని అమర్చుతారు. వాటి అరచేతులకు సూత్రాలు తగిలించి క్రింద నుంచి ఆడిస్తారు. ఈ బొమ్మలకు కాళ్లు కానీ, పాదాలు కాని వుండవు. కర్ర బొమ్మల అవయవాలను కూర్చటం కష్టంతో కూడు కున్న పని.

TeluguVariJanapadaKalarupalu.djvu

తల గుల్లగా వుంటుంది. దానిని మెడమీద అమర్చుతారు. తల, మెడ, భుజాలు ఏకాంతంగా వుంటాయి. తలలోని నిర్దిష్ట భాగంలో అమర్చిన త్రాళ్ళు క్రిందకు వ్రేలాడటానికి వీలుగా ఒక్కోసారి కర్రలకు బదులుగా సన్నటి గొట్టాలను వాడటం కూడా కద్దు. త్రాళ్ళు లాగటం ద్వారా సూత్రధారుడు తలను ఆడిస్తాడు. త్రాళ్ళబొమ్మలు, చేతి బొమ్మలకంటే ఊచ బొమ్మల చలనం నెమ్మదిగా వుంటుండి. అయితే వీటి కదకలలో ఎక్కువ అందం వుంటుందంటారు గోపాలస్వామిగారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఒక్క విషయంలో తప్ప, ఊచబొమ్మల రంగస్థలం, నిర్మాణం కూడ చేతి బొమ్మల రంగస్థలం వలేనే వుంటుంది. బొమ్మలకు అమర్చిన కర్రల్ని గుచ్చి నిలబెట్టటానికి వీలుగా చిల్లులు పొడిచిన చెక్కలను రంగ స్థలానికి క్రిందగా అవవసర మైన చోట్ల వుంచుతారు. కొన్ని బొమ్మలకు, ఖాళీ సమయంలో సూత్ర ధారుడు నిలబెట్టటానికి వీలుగా కర్రలకు, అడుగున ఒక అంగుళం దూరంగా ఉండేటట్లు రెండు బిళ్ళలను అమరుస్తారు. చేతి బొమ్మల మాదిరే దీపాలను ఏర్పాటు చేస్తారు.

TeluguVariJanapadaKalarupalu.djvu