తెలుగువారి జానపద కళారూపాలు/పగలేసిగాళ్ళు
స్వరూపం
పగలేసిగాళ్ళు
రాయలసీమ ప్రాంతంలో పగటి వేష గాళ్ళను పగలేసి గాళ్ళని పిలుస్తారని తమ జానపద కళాసంపదలో దోణప్ప గారు ఉదహరించారు. వీరు కూడా విప్రవినోదులు లాంటివారు.
దొర వేషం " దొరసాని వేషం", "వడ్డెర వాడు", "బ్రాహ్మణ వితంతువు " మొదలైన వేషాలను ధరించి చమత్కారమైన మాటల తీరుతో ప్రజలను ఆనందింపచేస్తారు.
వీరికి ఒక వూరూ వాడా అని వుండదు. దేశ సంచారం చేస్తూ సంవత్సరానికి కొక సారి వార్షికంగా వచ్చి ప్రదర్శనలిచ్చి పారితోషికాలు పొంది వెళతారు.
ధరించే ఆ యా పాత్రల నడక, మాట యాస, భాషా ఉచ్ఛారణ వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి వేషాన్నీ తీర్చి దిద్దుకుని సహజత్వం వుట్టి పడేలా వుండే అలంకరణ వస్తు సామాగ్రిని వారే సమకూర్చుకుంటారు. ఎవరు ఏ మాట మాటాడినా పరిహాస దరహాసంతో సమాధానా లిస్తారు.