తెలుగువారి జానపద కళారూపాలు/జిత్తులమారి కత్తుల గారడీ

వికీసోర్స్ నుండి

జిత్తులమారి కత్తుల గారడీ


బతుకు పోరాటం కోసం కత్తులతో చెలగాటం ఆడే కత్తుల గారడీ వాళ్ళను ఈ నాటికి ఆంధ్రదేశంలో అక్కడక్కడ చూస్తూ వుంటాం.

కూటి కోసం కోటి విద్యలన్నట్లు పొట్ట పోసుకోవటానికి అనేక విద్యల్ని ఆనాటి భిక్షకులు ఆయా విధానాలను అవలంబించారు.

ఆయా విధానాల ద్వారా ప్రజలను అకర్షించీ, ఆనందపర్చీ, వారిని మెప్పించీ, వారి ద్వారా పారితోషికాలను పొందుతూ, వారి జీవితాలను, వాటితో వెళ్ళబుచ్చుకుంటూ కాలం గడిపేవారు ఎంతో మంది కనబడుతూ వుంటారు.

కొందరు కళారూపాలను ఎన్నుకుంటే మరి కొందరు, గారడీలనూ, మంత్ర తంత్రాలనూ, మాయా జాలాలనూ అనుసరించారు. మరి కొందరు ఆట పాటలను అనుసరించారు.

ఎవరు ఏది అనుసరించినా ప్రజలను ఎలా ఆకర్షించాలనేదే ముఖ్య విషయం. ఆలా ఆ రోజుల్లో ప్రజలను ఆకర్షించే అన్ని విధానాలూ, కళారూపాలుగానే వర్థిల్లాయి. ఆ కోవకు చెందిందే ఈ కత్తుల గారడి.

కత్తుల గారడీ వారు రెండు బుగ్గలకూ కత్తిని ఈదరి నుంచి ఆ దరికి పొడుచుకునీ, కంఠాన్నీ సగం వరకూ కోసుకున్నట్టు కత్తిని పొడుచుకునీ, శరీరం పై అంతా రక్తమయం చేసుకునీ, ముఖ్యంగా రొమ్ముల మీద ధారలుగా కార్చుతూ, చూసే వారిని భయ భ్రాంతుల్ని చేస్తూ, వారిలో జాలిని కలిగించి యాచిస్తూ వుంటారు. ఈ దృశ్యాల్ని పిల్లలూ, పెద్దలూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. ఇలా కత్తులతో చెలగాటాలాడే వారిని కత్తుల వాళ్ళనీ, కత్తుల గారడీ వాళ్ళనీ, ఇచ్ఛాపురం మొదలైన ప్రాంతాల్లో కోతలరాయుళ్ళని పిలుస్తూ వుంటారు.

వీరి ప్రదర్శన డప్పుల వాయిద్యంతో అట్ట హాసంగా ప్రారంభమౌతుంది. కత్తుల్ని ఇతరులు గుర్తించ లేని విధంగా....................... చేతి దండలకూ, దిగబడినట్లు.......................... కత్తిని రెండు ప్రక్కలా స్ప్రింగు...................... బిగువుతో కత్తులు చర్మంలో..................... భాగం, ఈ ప్రక్క సగ భాగం........................ కుండా చిక్కటి రత్కపు రం..........................

మరి కొంత మంది కత్తి................................... ముక్కనూ, ఈ ప్రక్క ఒక............................. పెద్ద గన్నేరు కాయల రసాన్ని.................................... కత్తులు నిలబడిపోతాయి. దా............................. కారినట్లే కనిపిస్తుంది.............................

ముఖ్యంగా ఈ కత్తు............................... వగా ఉపయోగిస్తారు. ఎందుకటే..................................

కలగటానికి ఇలా వారు ఒక రోజు బజారున పడితే ఆ రోజు హాయిగా జీవితం గడిచి పోతుంది. ఇలా ఒక ఊరినుంచి మరో వూరికి పోతూ జీవితాన్ని సాగిస్తారు.

శివమెత్తించే వీరశైవుల వీరభద్ర విన్యాసాలు


ఆంధ్రదేశంలో వీర శైవ సంప్రాదాయం వారు ఎక్కువ మంది ఈ వీర భద్ర వినాస నృత్యాలు చేస్తూ వుంటారు. ఈ విధానాన్ని వీర భద్ర పళ్ళెం పట్టట మంటారు. అంతే కాక శైవ మత సంప్రదాయంగల పద్మసాలీల దేవుడైన

వీరావేశంతో నారసాలు పొడుచుకోవడం
భావనాఋషి వుత్సవాలలోనూ,  విశ్వ బ్రాహ్మణుల వీర భద్ర స్వామి వుత్సవాలలోనూ,  ఈ నృత్య విన్యాసము జరుగుతూ వుంటుంది. 
ఖడ్గ విన్యాసం:

పైన వివరించిన వుత్సవాలలోనే గాక పెద్ద పెద్ద జాతర్ల సందర్భాలలో కూడ ఈ వీరభద్ర నృత్య విన్యాసం జరుగుతూ వుంటుంది. ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద _ అబబబబ _ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని దక్షుని దండకం ఈ విధంగా ప్రారంభిస్తాడు.

దక్షయజ్ఞ దండకం:

దక్షుండు యజ్ఞంబు ..................॥శరభ॥
తలపెట్ట నందులో దశ్శరభ..................॥శరభ॥
బ్రహ్మదేవుని గుండె ......................॥శరభ॥
భగ్గుమనియె శరభ ......... ............॥శరభ॥
వింటిరా సురులార శరభ
విన్నపం బొక్కటి శరభ
కలగంటి ఈ రాత్రి శరభ
కల్లగాను కల్లగానూ అగగగగ, శరభ అశ్శరభ

 మహిమీద పార్వతి శరభ
మాయమై పోయెనని శరభ
పరమేశ్వరుని హోమము శరభ
భగ్గుమనియ శరభ

 చెమట బట్టగ తీసి శరభ
చట్రాతిపై వేసి శరభ
వరేశ్వరుడు బుట్టె శరభ
విశ్వమునకు శరభ
పట పటా బ్రహ్మాండ వలము లన్నియు .........॥శరభ॥
కొట్టె గద దక్షుని......... ॥శరభ॥
తోలెగ దరివుల ......... ॥శరభ॥

దండించ వైరుడు......... ॥శరభ॥
నీమిండ డనగ......... ॥శరభ॥
మొక్క జొచ్చితిమి గదా మోసపోయితిని......... ॥శరభ॥
వెన్ను గల అన్నకు శర......... ॥శరభ॥
ఏనుగు తల బుట్టెనని........... ॥శరభ॥
గుడి మీద తాతకు........... . ॥శరభ॥
గొఱ్ఱె తల ఇంపాయె............ . ॥శరభ॥
పరుల గుణవిహార......... ... .॥శరభ॥
కోసూరి వీరభద్ర................ . ॥శరభ॥
అదదద, అగగగ, అదదద, అగగగ
శరభ, దశ్శరభ, అశ్శరభ, శరభ, శరభ

అంటూ ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరా వేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతనుగాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్య గాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానాహంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ వుత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా వూరంతా ఊరేగుతూ ఒక్కొక్క మజలీ వద్దా... అంటే నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా వుత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు.

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాస ముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి.