తెలుగువారి జానపద కళారూపాలు/చుట్ట కాముడు
చుట్ట కాముడు
పిల్లలు బొడ్డెమ్మ ఆడుతారు. పెద్దలు బతుకమ్మ ఆట ఆడుతారు. ఇందులో నృత్యమూ, పాట కలసి కట్టుగక్వ వుంటాయి. బొడ్డెమ్మ, బతుకమ్మ, చుట్ట కాముడు ఈ మూటి నృత్య గానాలు దాదాపు ఒకే లాగా వుంటాయని జయధీర్ తిరుమల రావు గారు ప్రజా సాహితి సంచికలో ఉదహరించారు.
ఈ మూడు రూపాలూ, నాట్లు వేసే సమయం లోనూ కలుపు తీసే సమయం లోనూ, కోతల సమయంలోనూ, నూర్పిడి సమయం లోనూ ఏర్పడిన స్వరూపాలే.
కలుపు తీసే సమయంలో పాడుకునే పాటనే స్త్రీలు విరామ సమయంలో తతుకమ్మ పాటగా పాడు కుంటారు. రాను రాను బతుకమ్మ పాటలో శారీరకమైన పని పోయి నృత్యం చోటు చేసుకుంది. కలుపు తీయడమనే చేతుల శ్రమ చప్పట్లు కొట్టడంగా మారింది.
పని పాటల్లో శ్రామికి స్త్రీలు జీవితాన్ని పాడుకున్నా, పండుగల సందర్భంలో గౌరమ్మ మీదో, బొడ్డేఎమ్మ మీదో పాడు కోక తప్పదు. కానీ తెలంగాణా ప్రజాపోరాట కాలంలో పోరాట జీవిత కాథలనే, బతకమ్మ పాటల్లోనూ, చుట్ట కాముడు నృత్యాల్లోనూ ప్రతిబింబించారు.
- శక్తి వంతమైన కళారూపం:
తెలంగాణా పోరాట కాలంలో నల్లగొండ జిల్లాలో చుట్ట కాముడు చాల ప్రసిద్ధి పొందింది. నైజాం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ కందూరి ఈశ్వర దత్తు లాంటి వారు కూడా చుట్ట కాముడు చాల శక్క్తి వంతమైన కళా రూపంగా పేర్కొన్నారు. స్త్రీలు పాల్కొనే చుట్ట కాముడు ఆటకి దగ్గరగా వున్న ధూలా కళా రూపాన్ని పురుషులు రాత్రి పూట ప్రదర్శిస్తారు.
- ఉయ్యాల పదం:
పోరాట కాలంలో మల్లు స్వరాజ్యం వ్రాసిన వీరమట్టా రెడ్డి ఉయ్యాలో అనీ, ధీర ఆనంటా రెడ్డి ఉయ్యాలో అని చుట్టూ తిరుగుతూ చేసే నృత్యం ఎంతో ఉత్తేజాన్ని కలిగించేది. ఆ పోరాట కాలంలో పాడిన అనేక పాటల్లో, ఉయ్యాలో