తెలుగువారి జానపద కళారూపాలు/గరుడ స్తంభం దాసరి
స్వరూపం
గరుడ స్తంభం దాసరి
శంఖం, జేగంట, దీపపు సెమ్మా, రాగి చెంబు, హనుమంతుడు బిళ్ళ అనే అయిదు గుర్తులతో యాచించే గాయకులను దాసరు లంటారు. వీరి దీపపు సెమ్మాని గరుడ స్తంభం అంటారు. కొందరిని శంకు దాసర్లనీ, కొందరిని గరుడ స్తంభం దాసరులనీ పిలుస్తారు. వీరు గాథలను గానం చేస్తారు.