తెలియదే తెలియదే - తెలియదే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
తెలియదే తెలియదే - తెలియదే మాయ ॥తెలియదే॥

అనుపల్లవి:
వలపు సొలపులో - వాని గుణమేమొ కాని ॥తెలియదే॥

చరణ:
వలపించుటే కాని - వలచుటలేదే దాని
కలనైన మరువడే - కానిపని చేసినాడే ॥తెలియదే॥

చెలియరో నే మందు - బలమగు దానిమందు
తల కెక్కెనేమో అందు - వలన రాడే యిందు ॥తెలియదే॥

వేమరు ననుగూడి రాడు - వింతమాట లాడినాడు
భామరో దాసు శ్రీరామ - పాలుడే గోపాలుడే ॥తెలియదే॥