తెనాలి రామకృష్ణకవి చరిత్రము/బాల్యము
కాకమాను రామరాజ భూషణుడు, ప్రౌఢకవి మల్లన్న, పింగళి సూరన్న తెనాలి రామకృష్ణకవి—వీ రష్టదిగ్గజములని, కీర్తి గాంచిరి.
2 బాల్య ము
రామకృష్ణకవి బాల్యావస్థలో నున్నపు డపరిమితముగ నల్లరి సేయుచు తలిదండ్రులమాట పాటింపక తిరుగుచుండెను. ఈతఁడొకనాఁడు కొందరు బాలురతోకలిసి యాటలాడు చుండగా, నామార్గమున బోవుచుండిన సిద్ధుడొకఁడాగి, రామకృష్ణుని ముఖమువంక తదేకదృష్టిగఁజూచి, రమ్మని పిలచి యిట్లనెను ఓ బాలుడా! నాతో దూరము వత్తువేని నీకుమేలు కలిగించెదను,
రామకృష్ణుఁ డాసిద్ధునియెడల గౌరవయుక్తుఁడై యనుసరించెను. కొంతదూరము గొనిపోయి యాసన్యాసి, ఓ బాలుడా నీ ముఖమున నసాధారణమగు తేజముప్రస్ఫుటమగుచున్నది. నీకు గాళికామంత్రము నుపదేశింతును. భక్తి, ముక్తుడవై , దేవి యాలయమునకు బోయి గర్భగుడిలో గూర్చుండి, జపింపుము, నీకు మేలు కలుగును. అనియొకమంత్రము నుపదేశించి వెళ్ళెను.
రామకృష్ణుడు నిర్భయచిత్తుడై "కాళికాలయమునకు బోయి యేకాగ్రచిత్తముతో నామంత్రమునుజపింపగా, దేవి సంతుష్టినొంది సాక్షాత్కరించెను. దయార్దహృదయమై దేవిప్రత్యక్షమైనంత నే రామకృష్ణకవి భక్తి యుక్తుఁడై ధ్యానించుటకుమారు ఫక్కుననవ్వెను. కాళికాదేవి యాగ్రహమునొంది “ఏమిరా' నన్ను చూచి నవ్వెదవు అని గర్జించెను. భయభక్తులు తన్ను ముప్పిరిగొన నాతడు 'అమ్మా! నన్ను క్షమింపుము నేను నీదాసుడను, నీరూపము చూడగానే నా చిత్తము సందేహాయత్తమైనది” అనెను. 'అ సంశయమేమి?' అని దేవి ప్రశ్నింప, రామకృష్ణుడు తల్లీ! మాకు పడిశము బట్టినచో రెండుచేతులతోను బాధపడుచున్నను జాలుబలేదే సహస్రశీర్షములుగల నీకు పడిశము పట్టినచో నెట్లు బాధపడుదెవోయని నవ్వుపచ్చినది. అని బదులుచెప్పెను. అతని పరిహాసమునకు బ్రమాదంబంది 'దేవి 'రామకృష్ణకవీ! నీవు వికటకవివై ధనయశస్సముపార్జన మొనరింతువు' అని యంతర్ధానమయ్యెను.
కాళికాదేవి యొకగిన్నెలో క్షీరమును, మరియొకగిన్నెలో బెరుగును బోపి, 'దీనిలోనీకేది కావలయు?'నని ప్రశ్నింపగా నాతడు అమ్మా! ఆ పాత్రలను నీ చేతిలో యుంచుకొనియడిగినచో నేనేమిచెప్పుదును? అని వానినందుకొని 'ఇదియేమి?' అని ప్రశ్నింపగా, 'దేవి ఇది విద్య, ఇది ధనము, ఈరెండింటిలో నీకేమి కావలయునో తీసుకొను' మనెను. రామకృష్ణుడు 'అమ్మాఁ విద్యయుండి ధనములేని మనుజులకు మర్యాదయుండదు. దారిద్ర్యానలమున మ్రగ్గిపోవుచు నెవడును గ్రంథములరచించి విద్యావ్యాప్తికి తోడ్పడజాలడు. కావున విద్యాధనములు రెండును మానవున శవసరమే' యని పాలును పెరుగును కూడ త్రాగివైచెను.
అతని సాహసమున కచ్చెరువంది. దేవి 'రామకృష్ణా! నీకవిత్వము శాశ్వతమై ఆచంద్రతారార్కమై వెలయుగాక ' యని నీవించి మాయమయ్యెనని కొందరు చెప్పుదురు.
3 ఆస్థానమున బ్రవేశించుట
విద్యానగరమున కేలికయైన సాళువనరసరాయలు దేశసంచార మొనరించుచు తెనాలినొకసారి చూడబోయి యచ్చట పాఠశాలకరి
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.