తెనాలి రామకృష్ణకవి చరిత్రము/తిమ్మరుసు

వికీసోర్స్ నుండి

యందముగా నున్నది. అందుచే నిది రక్తికట్టుటకై కృష్ణపాత్రధారిని గొట్టినా నని బదులుపలికెను. రాయలు కుపితుడై పహరా నిచ్చుచున్న భటుల బిలిపించి 'రామకృష్ణుని యిరువదినాలుగు దెబ్బలు కొట్టుడని యాజ్ఞాపించెను రామకృష్ణునిఁ దీసికొని పోవుట కాభటులు ముందుకురాగా మహారాజా! మీరు శిక్షవిధించుట న్యాయమేగాని నేను లోనికి నచ్చినపు డీ యిరువురు భటులతోడను, నాకు రాయలవారు ప్రసాదించు బహుమానము చెరిసగము మీకిచ్చెదనంటిని. అందుచేత నాయిరువది నాల్గు దెబ్బలలో వీరికి పండ్రెండు వారికి పండ్రాడు దెబ్బలు తగులవలయు ననెను. ఆభటులు మొర్రోయని ఏడ్వసాగిరి. రామకృష్ణుని యుక్తికిముదమంది రాయలు మన్నించెను.


25 తిమ్మరుసు

ఉత్తరదేశ దండయాత్ర పూర్తిచేసికొని వచ్చుచు, రాయలు సింహాచలక్షేత్రమును సందర్శన మొనరించెను. సింహాద్రిస్వామి సన్నిధిని రాయలనేక దానములగావించెను. పెద్దనాది కవులందరు గూడ రాయల ననుసరించియుండిరి. తిమ్మరుసు మంత్రికూడ పెక్కు దానముల జేసెను. రాయ లగ్రహారదానము చేయనెంచితినని చెప్పగా రామకృష్ణుడు తన బంధువుఁడగు మంత్రిప్రగడ బుచ్చి వేంకయ కాదానమిప్పించవలసినదని రాయలను కోరెను. రాయ లందులకు సమ్మతింప, తిమ్మరుసు, రామకృష్ణుడు తక్కుంగల కవులవలె దనయెడ భయభక్తియుకుడై మెలంగడను కోపముతో వలదని వారించెను. రామకృష్ణుడు క్రోధమునంది యీపద్యము జదివెను-

ఉ. లొట్టయిదేటిమాట పెనులోభులతో మొగమాటమేల తా
     గుట్టకయున్న వృశ్చికము కుమ్మరపువ్వని యందు రేకదా
     పట్టపురాజుపట్టి సరిపల్లె సరాసరి యీయకున్న నే
     దిట్టకమాన నామతము తీవ్రమహోగ్రభయంకరంబుగాఁ.

దిట్టితినా? మహాగ్రహమతిన్ మకరగ్రహఝర్ఝరీభటా
పట్టపుదట్ట ఫాలఫణీభర్తృబహూకృతపర్జటస్ఫుటా
ఘట్టదట్టనాల కవిఘట్టనిరర్గళ రాజభృత్యకీ
చట్టభధూర్జటీ నయనజర్జరకీలలు రాలగావలెన్
జుట్టరికంబునం బొగడజూచితినా రజితాద్ర్యధిజ్యకీ
పట్టణ మధ్యరంగగతభవ్యవధూవదనానుషంగ సం
హట్ట శిరస్థగాంగఝరహల్లికజాలసుధా తరంగముల్
చుట్టుకొనన్వలెన్ భువనచోద్యముగా భయదంబుగా మఱిన్
దిట్టితినా సభాభవన ధీంకృత భీమనృసింహరాడ్వ జూ
తాట్ట మహాట్టహాస చతురానసముద్భృకిటీ తటీవటీ
కోట్టణరోషజాల హృంతకుంఠిత గంఠగంభీర నాడసం
ఘట్ట విజృంభమాణగతి గానలె, దీవనపద్యమిచ్చి చే
పట్టితినా మణీకనకభాజన భూషణభాసురాంబరా
డట్ట తురంగగంధ గజరాజ దమూల ఘనాతపత్రభూ
పట్టణభర్మ్యభటపంక్తి చిరాయు రనామయంబులై
గట్టిగ దోడుతో వెలయగావలె నెక్కువఠీవి జూడుడీ
యట్టిటు మంపమేలమును నందఱకుంబలె జుల్కజూచియే
పట్టుననైన గౌరవము పల్కకుడీ పయిపెచ్చు నందునన్
గొట్టదు దుష్కవిద్విరదకోటుల వింశముఖోద్భటాకృతిన్
బెట్టుదుదండము ల్సుకవిబృందముకే నతిభ క్తిసారెకున్
గట్టిది ముల్లెలేబదియు గాగలనూటపదాఱులెయ్యెడన్
రట్టడి రామకృష్ణకవిరాయుని మార్గమెఱుంగ బల్కితిన్'

ఈ పథ్యమువిని, తిమ్మరుసుమంత్రి భీతచేతస్కుడయి రాయలచే బుచ్చివెంకునకు గోనేడాగ్రహారమును దానముగ నిప్పించెను. సింహాచలక్షేత్రమున నాలయస్తంభముపై రామకృష్ణు డీశ్లోకమును శిలాశాససరూపమున వెలయించెను.

శ్లో. శాకాబ్దే బహుధాన్యనామననభోనేత్రాబ్ది చంద్రాన్ని తే
    కార్తీక్యాం శశివాసరే శుభతిథే సింహాచలస్వామినే
    హారంకర్ణ విభూషణేన కటకే శ్రీకృష్ణరాయాధిపా
    మాత్యారాచయ సాళ్వతిమ్మ నృపతిః ప్రాదాద్విజన్మాగ్రణిః

నాటినుండియు, తిమ్మరుసుమంత్రి రామకృష్ణునియెడ నాదరాభిమానములు గలిగి మెలంగుచుండెను,


26 తిలకాష్ఠ మహిష బంధనము

రాయల యాస్థానమున కొకనాడు రామశాస్త్రి యను పండితుడు వచ్చి 'రాజూ! నేను తర్క వ్యాకరణ పండితుడను. తమ యాస్థానమున విద్వాంసులను గెలుచుట కేతెంచినాను' అనగా రామకృష్ణకవి 'అయ్యా! శాస్త్రిగారూ! తమరు కవిత్వముకూడ చెప్పగలరా?' యని ప్రశ్నించెను.

'వెధవకవిత్వమే చెప్పలేనా? అదికూడ గొప్పయేనా?' అని యా శాస్త్రి పలికెను.

'అయితే మీరు నిస్సంశయముగా వెధవకవిత్వము జెప్పగలరని తలంతును -'

'వెధవకవిత్వము – పునిస్త్రీ కవిత్వము నని రెండురకముల కవిత్వము లున్న వా?'

'మీరే యన్నారుకదా, వెధవకవిత్వమే చెప్పలేనా యని అందుచేత మీకెందు బాండిత్వమున్నదో యెఱుంగవచ్చునా?'

'తర్కవ్యాకరణములందు' --

అయితే ఒకమాట --త్రియంబక , అనుపదమునకున్న యధికారసూత్రమును దెలుపుడు—'

త్రి+అంబక :--ఇది ద్విగుసమాసము.