తెనాలి రామకృష్ణకవి చరిత్రము/ఠీవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తా. కూరలాట్టేలేవు. అందున్న కొంచమైనను వేడిగాలేవు. పిండివంటలు, అన్నముకూడ నంత బాగుగాలేదు. దయచేసి భోజనము చేయుడు.

దీనిలో నిజముగా సందర్భమున్న దా! యని రామకృష్ణుడడుగగా రాయ లాశ్చర్యాన్వితస్వాంతుఁడై ' రామకృష్ణా! నీ సాహసమును మెచ్చుకొంటి' నని బహుమాన మొసంగెను.


20 ఠీవి

రాయల యాస్థానమున ఠీవిగా గూర్చుండువారు సామంతరాజులు. ఆ సామంతుల ఠీవిని జూచినపుడెల్ల రాయలకే నవ్వు వచ్చుచుండును. ఒకనాడు సభలో రాయ లందరనుజూచి, 'ఠీవి విషయమై ప్రసక్తి వచ్చినప్పుడు మా సామంతులను జెప్పి, మరియొకరి పేరెత్తవలయు' అనఁగా, రామకృష్ణుడు లేచి 'మహారాజా! కోపింపకుడు, నాఠీవిసంగతి మీ రెఱుగరు కావున నట్లు జెప్పుచున్నారు. ఎల్లప్పుడు నేను గురుగుకూర, తిందును. తరిగినకూర యన్న నాకు జాల ప్రీతి ఆగి మన్న పడిచత్తును. మేకయెరువు కుంపటి బెట్టుకొని హాయిగా నులక మంచంమీద ఠీవిగా పండుకొందును' అనెను

'ఏమిఠీవి అదియా నీఠీవి' యని రాయలపహసింపగా, రామకృష్ణకవి 'ప్రభువువారు విష్ణుచిత్తీయమున నెట్లు సెలవిచ్చినారో మఱచిపోయినట్లున్న ది వినుడు.

‘మ. గురుగుంజెంచలి తుమ్మిలేఁదగిరి నాకుందింత్రిణీపల్లవో
      త్కరముంగూడ పొరంటి నూనియలతో గట్టవికుట్టారిగో
      గిరిముల్మెక్కి తమిం బసుల్పొలములోఁ గ్రేపున్మెయిన్నాకమే
      కెరువున్ గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తిరెడ్లజ్జడిన్'

ఆమాటలు విని రాయ లెంతమాత్రము గినియక చాల ధన మొసగి సత్కరించెను.