తెనాలి రామకృష్ణకవి చరిత్రము/కవితాప్రసక్తి
లాంబతోఁ జదరంగ మాడుచుండగా, బంటు రెం డేనుఁగులమధ్య నిఱుకుకొంటఁజూచిఁ తిరుమలాంబ 'యుద్ధతుల మధ్యమునఁ బేదరుండ దరిమె, యని బంటులు పైకి ద్రోసెను. గాయలు 'నీకీ పద్యపాద మెటనుండి లభించినదని యడుగఁగాఁ దిరుమలాంబ 'నేనీపద్యమును నాలుగు దీనారములిచ్చి కొంటిని' అని, యిట్లు చదివెను.
'గీ. ఒత్తుకొనివచ్చు కటికుచోద్యృత్తి చూచి
తరుణి తనుమధ్య మెచటికో తెలఁగిపోయె
నుండెనేనియు : గపడకున్నె యహహ
యుద్ధతులమధ్యమునఁ బేదకుండ దరమె'
'అయ్యో | ఆపద్యమునకు నాలుగు దీనారములు వెలయా? నూఱుదీనారము లిమ్ము' అనగా తిరుమలాంబ నరసరాజునకుఁ గబురంపి నూఱుదీనారము లొసంగి గారవించెను, 'తాను వ్రాసిన హరిశ్చంద్ర నలోపాఖ్యానమను ద్వ్యర్థికావ్యమును వినవలసినదని రాయల నాతఁడు కోరఁగా, విని హరిశ్చంద్రనలోపాఖ్యాన మనరాదనియు నల హరిశ్చంద్రోపాఖ్యాన మని యుండవలయు ననియుఁ జెప్పి, యనేక రీతుల సత్కరించి, వీడ్కొలిపెను.
నరసరాజుని యుపాయమున కందఱు సంతోషభరిత హృదయాంతరులైరి.
కవితాప్రసక్తి
శ్రీకృష్ణదేవరాయలొకనాఁడు సభాస్థలి గూర్చుండి, కవులెల్లరును వినునట్లు రామకృష్ణుని జూచి 'కవివరేణ్యా ! పెద్దన కవీంద్ర విరచితమైన మనుచరిత్రమున తిమ్మన్నకవి రచించిన పారిజాతాపహరణమున రామరాజభూషణుని వసుచరిత్రమున నొకేసందర్భమున వ్రాయఁబడునట్లుండు నీ క్రింది పద్యములోని కవితామాధుర్యమును గ్రోలి నీయభిప్రాయముఁ దెలియఁ జేయవలయును. 'ఉ. పాటునకింతులోర్తురె కృపారహితాత్మక ; నీవు దోపని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపియ
ప్పాటలగంధి వేదననెపంబిడి యేడ్చెఁగలస్వరంబుతో
మీటునవిచ్చు గబ్బిచను మిట్టల నశ్రులు చిందువందగన్ ,
(మనుచరిత్ర)
'ఉ. ఈసునబుట్టి డెందమున హెచ్చిన కోపదవానంబులచే
గాసిలియేడ్చెఁ బ్రాణవిభుకట్టెదురన్ లతాంగి పంకజ శ్రీ
సఖమైన మోముపయిఁ జేల చెరంగెడి బాల పల్లవ
గ్రాసక షాయకంఠకలకంఠనధూకల కాకలీధ్వనిన్.' (పారిజా)
శా. ఆజాబిల్లి వెలుంగు వెల్లికలడాయన్' లేక రాకా నిశా
రాజశ్రీ సఖమైన మోమునఁ జటాగ్రంబొత్తి యెల్గెత్తి యా
రాజీవాసన యేడ్చెఁ గిన్నరవధూ రాజత్కరాంభోజకాం
భోజీమేళవిపంచిసుధాపూరవంబు తోరంబుగాన్". (వ.చ)
రామకృష్ణకవి 'మహారాజా! చెప్పుట కేమున్నది? 'పెద్దన్నగారియేడ్పు అటు యిటూ ఉన్నది. ముక్కుతిమ్మన్నగారి యేడుపు ముద్దుముద్దుగా నున్నది. భట్టుమూర్తిగారు మాత్రము బావురుమని యేడ్చినా'రనెను అందరును గడుపులుబ్బునట్లు నవ్విరి. భట్టుమూర్తికిఁ గోపమువచ్చి, చుర చుర జూడసాగెను. రామకృష్ణకవి 'ఓభట్టుమూ ర్తీ ! నీకవిత్వముఁ గూర్చి నేనట్లు విమర్శించినానని కోపగించినావు కాఁబోలు' నని యీ క్రింది పద్యములఁ జది వెను—
'క. చీఁపర పాఁపర తీఁగల
జేఁపలబుట్టల్లినట్లు చెప్పెడి నీయీ
కాఁవుఁ గవిత్వపుఁ గూతలు
బాపనకవివరునిచెవికిఁ బ్రమదం బిడునే?'
శా. ఆద్రిస్నిగ్ధతలంబు బుద్బుదము లుద్యద్దారు భూషావళుల్
క్షుద్రాదుంబర పాకపక్వఫలముల్ శుర్త్వంతరాకాసముల్.
రుద్రాక్షాక్షం పంక్తివిభ్రమము లీరూఢిన్నిరూపింప నీ
శూద్రప్రజ్ఞలు విప్రవిత్కవి వచస్ఫూర్తిన్విడంబించునే?
క. కెంగేల రామకృష్ణుని
బంగరు కడియంబు లుండఁ బండితుఁ డగునా
జంగులు జల్లులు గల్గిన
సింగారపు టూరకుక్క సింగంబగునా?
13 అమవసనిశికిన్
శ్రీకృష్ణదేవరాయ లొకనాఁటి ' మధ్యాహ్నమున నిండు పేరోలగంబుండి.
'క. కలనాటి ధనములక్కఱ
గలనాఁటికి దాచ కమల గర్భుని వశమా'
యని చదివి, మిగత రెండుపాదములునుబూ ర్తి చేయుమనఁగా నలసాని పెద్దనకవి లేచి,
‘నెలనడిమనాఁటి వెన్నెల
యలవడునే నాడుఁబోయ నమవసనిశికిన్'
ఆపద్యము నాకర్ణించి, రామకృష్ణుఁ డిట్లు జదివెను---
క. ఎమితిని సెపితివి కపితము
బ్రమపడి వెఱిపుచ్చకాయ వడిఁదిని సెపితో
ఉమెతకయను దినిసెపితే
యమవసనిశి యన్నమాట నలసని పెదనా!
'అమవస నిశికిన్' యను ప్రయోగము మంచిదికాదను నుద్దేశముతో రామకృష్ణకవి యిట్లాక్షేపణం బొనరించెను. పెద్దన కుత్కృష్ఠత నాపాదించుచు దనకు నికృష్ఠత నాపొదించుకొని రామకృష్ణుఁ డిట్లు పద్వముఁ జెప్పెను .