జ్యోతిష్య శాస్త్రము/మకరము

వికీసోర్స్ నుండి

19. మకరము

ఇపుడు మకర లగ్నమునకు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తర్వాత పేజీలోని 21వ పటములో చూచెదము.

మకర లగ్నమునకు అదే లగ్నాధిపతియైన రాహువు, ప్రక్కనేగల కుంభ లగ్నాధిపతియైన శని మిత్రులు కాగా, మరియు వృషభ లగ్నాధిపతియైన మిత్రగ్రహము, మిథున లగ్నాధిపతియైన చిత్రగ్రహము, కన్యా లగ్నాధిపతి యైన బుధ గ్రహము, తులా లగ్నాధిపతియైన శుక్రగ్రహము

కాలచక్రము - 21వ పటము

మొత్తము ఆరు గ్రహములు శాశ్వితముగా మిత్రులుగా ఉన్నారు. ఇక మిగిలిన మీన లగ్నాధిపతియైన గురువు, మేష లగ్నాధిపతియైన కుజుడు, కర్కాటక లగ్నాధిపతియైన చంద్రుడు, సింహ లగ్నాధిపతియైన సూర్యుడు, వృశ్చిక లగ్నాధిపతియైన భూమి, ధనుర్ లగ్నాధిపతియైన కేతువు అను ఆరు గ్రహములు మకరమునకు శాశ్విత శత్రుగ్రహములుగా వ్యవహరించు చున్నవి. అలాగే ప్రక్కనేయున్న కుంభ లగ్నమునకు కూడా మకరమునకు మిత్రు శత్రువులుగా ఉన్నవారే శాశ్వితముగా మిత్రు, శత్రువులుగా ఉన్నారని తెలుపుచున్నాము. మకర, కుంభ లగ్నములకు శాశ్వితముగా మిత్రు, శత్రువులుగానున్న గ్రహములను క్రింద వరుసగా చూడచ్చును.

ఇంతవరకు కాలచక్రములోని ఆరు లగ్నములను చిత్రించి, ఎవరు శత్రు గ్రహములో ఎవరు మిత్రు గ్రహములో చూపించాము. దాని ప్రకారమే ప్రక్కనగల అదే వర్గ ఆరు లగ్నములకు చిత్రించకనే వివరించి తెలిపాము. దానివలన మొత్తము పండ్రెండు లగ్నములకు శాశ్వితముగ మిత్ర, శత్రువులుగానున్న గ్రహములను తెలియజేయడమైనది.