Jump to content

జ్యోతిష్య శాస్త్రము/ఒక గ్రహమునకు బద్దశత్రువుగా మరొక గ్రహమున్నదా?

వికీసోర్స్ నుండి

20. ఒక గ్రహమునకు బద్దశత్రువుగా మరొక గ్రహమున్నదా?

[మార్చు]

కాలచక్రములోని గ్రహములు మొత్తము పండ్రెండుగలవని తెలుసు కొన్నాము. అందులో ఆరు ఒక గుంపుకాగ, ఆరు మరొక గుంపుగా ఉన్నవని తెలుసుకొన్నాము. ఇక్కడ మరొక సూత్రము ఏర్పడుచున్నది. ఆరు గ్రహములు మిత్రులైతే తర్వాత ఏడవ గ్రహమునుండే శత్రు గ్రహములు కలవు. అందువలన ఒక గ్రహమునుండి ఏడవ గ్రహము ఏదైతే, అది బద్ద శత్రువు అని తెలియుచున్నది. ఇంకా వివరముగా చెప్పుకుంటే, ఒకటవ స్థానాధిపతికి ఏడవ స్థానాధిపతి తీక్షణమైన శత్రువని తెలియు చున్నది. దీనినే జ్యోతిష్యశాస్త్రములో ఒక సూత్రముగా తీసుకొని, ఒకటికి బద్ద శత్రువు ఏడు అని తేల్చుకొన్నాము. ఒకటికి × ఏడుకి అను సూత్రము ప్రకారము ఏ గ్రహమునకు ఏ గ్రహము బద్ద శత్రువో తెలుసుకొందాము.

చతురస్రాకారములో నున్న కాలచక్రము - 22వ పటము

ఇక్కడ మేషలగ్నాధిపతియైన కుజ గ్రహమునకు, ఏడవస్థానమైన తులా లగ్నాధిపతి శుక్రగ్రహము పూర్తి బద్దశత్రువుగా వ్యవహరిస్తున్నది. అలాగే శుక్రగ్రహమునకు ఏడవస్థానములో కుజగ్రహమే అధిపతిగా ఉండుటవలన, సూత్రము ప్రకారము శుక్రునకు కుజుడు కూడ బద్దశత్రువే నని తెలియుచున్నది. పైనుంచి క్రిందికి చూచినా, క్రిందినుండి పైకి చూచినా ఎటుచూచినా, సూత్రబద్దముగా కుజునకు బద్దశత్రువు శుక్రుడు, శుక్రునకు బద్దశత్రువు కుజుడుగా తెలియుచున్నది. ఒక వర్గములోని ఆరు గ్రహములు మరొక వర్గములోని ఆరు గ్రహములకు శత్రువులైనప్పటికీ, అందులో ఒక పేరుగల గ్రహమునకు, మరొక పేరుగల గ్రహము ప్రత్యేకించి పెద్ద శత్రువుగా ఉన్నదని తెలియుచున్నది. అందులో విచిత్రమేమంటే 1×7 అను సూత్రము ప్రకారము ఒకవైపునుండి ఒక గ్రహమునకు మరొక గ్రహము బద్దశత్రువైతే, మరొకవైపునుండి శత్రువైన ఏడవగ్రహమునకు మొదటి గ్రహమే తిరిగి బద్దశత్రువగుచున్నది. పండ్రెండు గ్రహములలో శత్రు మిత్రులను విడదీయుటకు 2:1 సూత్రము ఉపయోగపడితే, ఎవడు ఎవరికి బద్దశత్రువు అని తెలియుటకు 1×7 అను సూత్రమును ఉపయోగించి చూడాలి.

ఇపుడు వృషభ లగ్నమునకు అధిపతియైన మిత్ర గ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము బద్ద శత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 23వ పటములో తెలుసుకొందాము.

ఇక్కడ వృషభ లగ్నాధిపతియైన మిత్ర గ్రహమునకు బద్దశత్రువు భూమి అని తెలియుచున్నది. అలాగే భూమికి బద్దశత్రువు మిత్రగ్రహమనియే తెలియుచున్నది. 1×7 అను సూత్రము ప్రకారము ఒకమారు బద్ద శత్రువులుగా మారిన గ్రహములు వారు ధర్మబద్దముగా ఎల్లపుడు ఒకరికొకరు
చతురస్రాకారములో నున్న కాలచక్రము - 23వ పటము

వ్యతిరేఖముగానే ప్రవర్తించుచుందురు. ఎటువంటి సందర్భములోను అధర్మముగా నడుచుకోరు.

ఇపుడు మిథునలగ్న అధిపతియైన చిత్రగ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము బద్ద శత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 24వ పటములో తెలుసుకొందాము.

ఇక్కడ మిథునలగ్నాధిపతియైన చిత్రగ్రహమునకు, బద్ద శత్రువు కేతు గ్రహము అని తెలియుచున్నది. అలాగే కేతు గ్రహమునకు బద్దశత్రువుగా చిత్రగ్రహమే అగుచున్నది. కాలచక్రములోని పండ్రెండు భాగములలో ఒక గ్రహమునకు 7వ స్థానములోని మరొక గ్రహము బద్ద శత్రువైతే, బద్దశత్రువైన ఏడవ గ్రహమునకు మొదటి గ్రహము తిరిగి బద్ద శత్రువగుచున్నది.
చతురస్రాకారములో నున్న కాలచక్రము - 24వ పటము

ఇపుడు కర్కాటక లగ్న అధిపతియైన చంద్రగ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము బద్దశత్రువుగానున్న గ్రహమేదో తర్వాత పేజీలోగల 25వ పటములో తెలుసుకొందాము.

ఇక్కడ కర్కాటక లగ్నాధిపతియైన చంద్రునికి, అక్కడినుండి సప్తమ స్థానాధిపతియైన రాహువు బద్దశత్రువుగా ఉన్నాడు. అలాగే రాహువుకు అక్కడినుండి సప్తమస్థానాధిపతియైన చంద్రుడు 1×7 అను సూత్రము ప్రకారము బద్దశత్రువుగా ఉన్నాడు. ఈ విధముగా చంద్రునికి రాహువు, రాహువుకు చంద్రుడు తీవ్రశత్రువులుగా ఉన్నారు
చతురస్రాకారములో నున్న కాలచక్రము - 25వ పటము

ఇపుడు సింహ లగ్న అధిపతియైన సూర్యునకు బద్దశత్రువుగానున్న గ్రహమును తర్వాత పేజీలో గల 26వ పటములో చూచి తెలుసుకొందాము.

ఇక్కడ సింహలగ్న అధిపతియైన సూర్యునికి, అక్కడినుండి సప్తమ స్థానములోనున్న శని బద్దశత్రువుగా ఉన్నాడు. అలాగే 1×7 అను సూత్రము ప్రకారము, శనికి కూడ సూర్యుడు బద్దశత్రువుగానే ఉన్నాడు. స్వంతస్థానము లను బట్టి, వారి శత్రుత్వములను నిర్ణయించడము జరిగినది. స్వంత స్థానములను బట్టి, ఒక మారు శత్రువులుగా మారిన గ్రహములు, ఆ స్థానములను వదలి ఎక్కడ ఉండినా వారి శత్రుత్వమును మాత్రము వదలరు. పండ్రెండు స్థానములలో ఆరు స్థానాధిపతులకు శత్రువులను తెలుసుకుంటే, మిగత ఆరు స్థానములకు, చెప్పకనే శత్రువులు ఎవరైనది తెలిసిపోవుచున్నది.
చతురస్రాకారములో నున్న కాలచక్రము - 26వ పటము

ఇపుడు చివరిగా కన్యాలగ్న అధిపతి బుధగ్రహమునకు 1×7 సూత్రము ప్రకారము బద్దశత్రువు ఎవరో తర్వాత పేజీలోగల 27వ పటములో చూచి తెలుసుకొందాము.

ఇక్కడ కన్యాలగ్న అధిపతియైన బుధ గ్రహమునకు 1×7 అను సూత్రము ప్రకారము, అక్కడినుండి సప్తమస్థానాధిపతియైన గురు గ్రహము తీవ్ర శత్రుత్వము కల్గియున్నది. అలాగే గురు గ్రహమునకు కూడ సరిగా

చతురస్రాకారములో నున్న కాలచక్రము - 27వ పటము

బుధగ్రహమే బద్ద శత్రుత్వము వహిస్తున్నది. ఎవరికి ఎవరు బద్ద శత్రువులు అన్నది క్రింద వరుసలో చూడండి.

గురువర్గమునకు శనివర్గము, శనివర్గమునకు గురువర్గము శత్రువు లైనప్పటికీ ఒక గ్రహమునకు అయిదు గ్రహములు సాధారణ శత్రువులుకాగా ఒక గ్రహము మాత్రము బద్దశత్రుత్వము కలిగియున్నది.