జ్యోతిష్య శాస్త్రము/గ్రహములకు కాలచక్రములో స్వంత స్థానములున్నట్లు, బలమైన స్థానములు ఉన్నాయా?

వికీసోర్స్ నుండి

29. గ్రహములకు కాలచక్రములో స్వంత స్థానములున్నట్లు, బలమైన స్థానములు ఉన్నాయా?[మార్చు]

కాలచక్రములో ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క లగ్నము స్వంత స్థానముగాయున్నదని ముందే తెలుసుకొన్నాము. ఎవరికైనా స్వంత స్థలమే బలముగా ఉండును. కనుక ఏ లగ్నమునకైనా ఆ లగ్నాధిపతియైన గ్రహమునకు తన స్వంత స్థానమే బలమైనదిగా ఉండును. ఒక గ్రహమునకు తన స్వంత లగ్న స్థానము తప్ప మిగత స్థానములు బలమైనవిగానీ, బలహీనమైనవిగానీ ఉండవు. కొందరు ప్రతి గ్రహమునకు ఉచ్ఛ నీచ స్థానములున్నాయనీ, ఉచ్ఛ స్థానమందు గ్రహమునకు బలమెక్కువయనీ, నీచ స్థానమందు గ్రహమునకు బలము తక్కువయనీ చెప్పుచుందురు. అదంతయు శాస్త్రబద్ధత గాని విషయమగును. ఎందుకు బలమైనదో, ఎందుకు బలహీనమైనదో చెప్పుటకు శాస్త్రాధారములేదు. కావున గ్రహములకు స్వంత స్థానములున్నవిగానీ, ఉచ్ఛ నీచ స్థానములు లేవు. స్థానములనుబట్టి గ్రహములను బలమైనవనీ, బలహీనమైనవనీ చెప్పలేము. అయితే పన్నెండు గ్రహములలో సహజముగానే కొన్ని బలమైనవిగానున్నవనీ, కొన్ని బలహీనముగా ఉన్నవనీ చెప్పవచ్చును.