Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 25

వికీసోర్స్ నుండి

అధ్యాయము 25

ముగింపు

యుద్ధమునకు పూర్వము జర్మనులకు సంస్థా నిర్మాణ విధానములో "పెట్టినది పేరుగా ఉండేది. వారి సైన్యపుఏర్పాటులు మిక్కిలి సూక్ష్మముగా ఉండేవి. రషియాతోగానీ, ఫ్రాన్సుతో గాని, యు ద్ధము సంభవిస్తే, ఏ సైనికుడెక్కడనుండి యుద్ధము చేయవ లెనో కూడా ముందుగానే ఏర్పాటు చేసు కొన్నారు. వా రేమేమిపనులు చేయన లెనో, ఏ రైలుబండి ఎప్పుడెప్పుడు బయలు దేరవ లెనో, ఏ బండిలో ఏ సైనికు డెప్పుడెక్కవలెనో, ఎక్కడకూ ర్చోవ లెనో, అన్నీ ఎంతో కాలము ముం దే నిశ్చయిం చుకొన్నారు. తామనుకోని పరిస్థితులు తటస్థించినప్పుడు వారేమేమి చేయవ లెనో మీది ఉద్యోగ

.

198


స్థులు చెప్పు తే నేకాని, వారికి తెలిసేది కాదు. సూక్ష్మనిర్మాణక్రమము జర్మసుజాతికి పుట్టులక్షణము. దీనిని గురించి ఒక చిన్న కథ ఉన్నది.

ఒక అధ్యాపకుడు పిల్లలను విహారమునకు తీసుకొని వెళ్ళడానికి ముందుగా చేయవలసిన వి ధానమంతా ఏర్పాటు చేసినాడట.ఏభై మంది పిల్లలు విహారమునకు వస్తామని పేర్లిచ్చినారట. విహారమునకు సంబంధించిన సూక్ష్మ విషయము లన్నీ కలిగిన కార్యక్రమమును 200 పుటలుగా ఆ చ్చు వేసినపుస్తకమును అధ్యాపకుడు ప్రతివిద్యార్థి కిన్ని ఇచ్చినాడట, రైలు బళ్ళలోను, ట్రాముబ ళ్ళలోను, ఏవిద్యార్థి ఎక్క-డకూచ్చోన వలెనో, హో టేళ్ళలోను భోజన టేబిళ్ళవద్దను ఎవరెక్కడ ఉండ వలెనో, ఫాక్టోరీలకు పోయేటప్పుడు ఏవిద్యార్థి వర్గముతోకలసి ఉండవ లెనో, అన్నీ అతడు వ్రాసి యిచ్చినాడు, రైలు కదలడాని కారంభించే సరికి ఒక విద్యార్థి రాలేదు, అధ్యాపకుడు కంగారుపడి “అయ్యో! ఏమి చేయడము” అని గోల చేయ నా రంభించినాడట, అప్పుడొక ఇండియా విద్యార్థి ఆ

197

యనవద్దకు నెమ్మదిగా పోయి “అయ్యా, ఆవిద్యా ర్థి చెల్లించవలసినది చెల్లించినాడా?"అని అడిగినాడు. " చెల్లించినాడు” అని అతడు జబాబిచ్చి నాడు. "అయి తే, ఆతని స్థానములో ఈ నా చేతి కర్రనుంచి ప్రయాణము సాగించండి.” అని విద్యార్ధి చెప్పినాడట, అందరున్న పక్కున నవ్వి బండిలో కదలినారట.

ఒక్క బడులలో నేకాక రాజ్యంగ విషయ ములన్నిటిలోను ఈరీతిగా అతిసూక్ష్మవిషయము లనుకూడా ముందుగా ఏర్పరుచుకొనడము జర్మము వారిలక్షణము. ఇంగ్లీషువారి కట్టిలక్షణములేదు. అకస్మాత్తుగా ఏర్పడిన పరిస్థితుల నెదుర్కొ నడ ములో వారికి ఎక్కువ ప్రజ్ఞ ఉన్నది.

జర్మనులు మిక్కిలిపాటుపడే స్వభావము యూరోపులోని అన్ని జాతుల వారి కంటె జర్మనులు ఎక్కువ పాటుపడ తారు. విశ్వ విద్యాలయాలలో ఎండకాలములో ఉదయం 6 - గంటలకున్ను, చలికాలములో 7 గంటల కున్ను పని ఆరంభించి, రాత్రి తొమ్మిదిగంటలవరకు పనిచే గలవారు.

198

స్తారు. మధ్యాహ్న భోజనమునకు రెండుగంటలు

మాత్రము విరామముంటుంది. ఇంత కష్టపడినా, ఆటలు, వ్యాయానుములు ఎక్కువగాగల ఇతర జాతుల వారికంటే జర్మనులు ఎక్కువబలము, ఆరోగ్యము కలిగి ఉంటారు.

యుద్ధమునకు పూర్వము, కైజరు యాజ మాన్యము క్రింద ఆ యా జర్మను రాష్ట్రములు ఒక్కటిగా చేరినవి.వీరిలో ప్రషియా రాష్ట్రము వారి పలుకుడి ఎక్కువగాఉండేది. ఇప్పుడు" కైజరు అవలంబించిన పద్ధతిపోయినది; జర్మను భాష, జర్మను విజ్ఞానము మాత్రమే జర్మనుసామ్యాజ్యమును ఒక్కటిగా నిలబెట్టుతున్నది. ఇప్పటి జన్మను రాజ్యాంగములో ఏదో ఒక రాష్ట్రమునకే ఎక్కు నపలుకుబడి లేదు. ఇరవై ఆరు రాష్ట్రముల లోను ప్రతి రాష్ట్రమున్ను జర్మను సామ్రాజ్యము తనదిగా భావించుకొంటుంది. రాష్ట్రములన్నీ ఒక సామ్రాజ్యమయి ఏకముగా ఉండడము లాభకర మని జర్మనులు గ్రహించినారు. కొద్ది కాలము లో తండ్రి రాజ్యముతో పరదేశములలో ఉండే జర్శను వలసరాజ్యములు కలిసి ఏక సామ్రాజ్యముగా ఉండడమునకు మార్గ మేర్పడినది. ఆర్థిక పరిస్థితు లనుబట్టి ఈసామ్రాజ్యములో ఆస్ట్రియా మొట్ట మొదట చేరుతుంది. జెకో-స్లోవేకియాలోను, పోలాండులోను ఉన్న జర్మనులు తండ్రి రాజ్యము మీద ఎక్కువ అభిమానము కలిగి ఉన్నారు. తా మిప్పుడు అస్వాభావికముగా ఉన్న దేశముమీద వారికంత ఇష్టము లేదు. అచ్చటచ్చటవిడబడి జర్మ నులున్న దేశములను ఆకర్షించేశక్తి జర్మను రా జ్యాంగ పద్ధతికి ఉన్నది. బ్రిటిషు సామ్రాజ్యములో అట్లుకాదు; దీన్ని ఒక్క బ్రిటిషు దీవుల చేయి పై గా ఉన్న ది. జర్మనీకివలె బ్రిటిషు సామ్రాజ్యమునకు ఒక రాజ్యాంగ పద్ధతి లేదు. దీని వలసరాజ్యములు తల్లి నుండి విడిపోయి తమసంసారములను చూచుకొనే ఉద్దేశముతో ఉన్న విగాని, వాటికి తల్లి యింటిలో పడి ఉండవలెనని లేదు. తల్లి కిన్ని తమకున్ను సామాన్య లక్షణము లేదు.

యుద్ధమయిన తరుహత జర్మనీవారు తమ విద్యాపద్ధతిని, రాజ్యాంగ పద్ధతిని బాగుగా గాలించి తిరిగి నిర్మించుకొన్నారు. జర్మను పద్ధతిలో, అన్ని విధములైన విద్యాలయములలోని చదువులోను ఒకటితో ఒకటి సంబంధించి ఉండడము ముఖ్య క్షణము, పద్దతి మొత్తముమీద ఆలోచించి ఏర్పరిచినది; దీనిప్రకారము ప్రతివ్యక్తికిన్ని ప్రత్యేకముగా విద్యాశిక్షణము దొరుకుతుంది. వ్యక్తి తానవలంబింపదలచిన వృత్తి నెంచుకొనగానే, అత డెక్కడ ఏపుస్తకములు చదువవలెనో, ఎట్లు చదువవలెనో సమస్తమున్ను తెలిసియే ఉంటుంది. ఆచదువుకు కావలసిన సౌకర్యములన్నీ అవ్యక్తికి సులభముగానే లభిస్తవి. ప్రతివ్యక్తికిన్ని కార్మిక విద్యను నిర్బంధముగా నేర్పే దేశము జర్మనీ ఒక్కటే. ఫ్రాన్సు ఈ నిర్బంధ కార్మిక విద్యను గురించి ఎంతో కాలమునుంచిన్ని ఆలోచిస్తున్నది; కాని, జర్మనీ ఈలోగా నిర్బంధ కార్మిక విద్య నవ లంబించి దానిలోని సుక్ష్మాంశములనుకూడా ఏర్పాటు చేసుకొన్నది.

అయ్వాషయములలో విశేష జ్ఞానసంపన్ను లను తయారు చేయడము జర్మను విద్యాపద్ధ తికి మరి ఒక ముఖ్య లక్షణము. ఒక్క అధ్యాపకు లే కాక ప్రతివాడున్ను తనవృత్తిలో విశేషజ్జుడుగా ఉంటాడు. తనవృత్తిని దాటి, మరొకవిషయములో బడిపిల్లవానికంటే తక్కువగా ఉంటాడు. ఇప్పుడు జీవనము ఎక్కువపోటీతో సాగుతున్నది. ఇట్టి సమయములో విశేషజ్ఞత చాలా అవసరమే. కాని, ఈ పద్ధతి ప్రకారము మంచి నాయకులు తయారుకారు. ఇంగ్లాండులో మంచిలాభముగా పని చేసే కార్మిక సంస్థల యజమానులు తమవృత్తిలో విశేషజ్ఞులై ఉండరు.కౌని, వారికి మంచి విశాల మైన విద్య ఉంటుంది, ఎక్కువ ప్రపంచానుభవ ముంటుంది. జర్మనీలో ప్రతివాడున్ను పరిశోధ నము చేస్తాడు, ఇంగ్లాండులోను, ఫ్రాన్సులోను, మంచి తెలివి తేటలుగలవారే పరిశోధనము చేస్తారు. గొప్ప విషయములను కనుక్కొనేవారు సాధారణముగా జర్మనులై ఉండరు. కనుగొన్న విషయమును సూక్ష్మాంశములతో కూడా విస్తరింప చేయడములో జర్మనులకు పెట్టినది పేరు. జర్మనీలో విశ్వవిద్యాలయములున్ను, పరిశ్రమ సంస్థ లున్ను అన్యోన్య సహాయముతో పనిచేసుకొంటవి. జర్మనుల పరిశ్రమాధిక్యతకు ఇదియే మూలరహస్యము.

పరిశ్రమలను అభివృద్ధి చేయుడము, నిర్బంధ కార్మిక విద్య నేర్పడములలో జర్మనుకు ఎక్కువ శ్రద్ధ ఉన్నా, వారు ప్రాచీన విషయ పరిశోధనమును కడకంటితో చూడరు. ఈ విషయములను అభివృద్ధి చేయడమునకు విశ్వవిద్యాలయాలవారు ఎక్కువ పాటుపడ తారు, ఈవిషయములు జిమ్నే సియములలోను విశ్వవిద్యాలయాలలోని వేదాంత” శాఖలలోను ఎక్కువగా ఉన్నది. యుద్ధానికి పూ ర్వమందు వలే ఇప్పుడున్ను ఈవిషయములమీద అభిమానము తగ్గ లేదు. జర్మనులకు బుద్ధిస్వాతం త్ర్యము మెండు. ఇప్పుడు జీవితము ఆర్థిక పద్ధతులు మీదనే నడుస్తూఉన్నా, జర్మనులకు ఆధ్యాత్మిక విష యములమీదనే ఎక్కువ ప్రీతి అని చెప్పవచ్చును.

(1) విశ్వవిద్యాలయాలలో మొదట చేరే టప్పుడు విద్యార్థికి తగిన సలహా లేక ఒక సంవత్సరము పృధాగా పోవడము (2) రాజ్యాంగ విషయములలో ప్రజ్ఞ సంపాదించడానికి కావలసిన శీలము నభివృద్ధి చేయడానికి తగినవిద్య లేకపోవడము, అనేవి జర్మను విద్యా ద్ధతిలోని లోపములు

మూడు వందల సంవత్సరములనుంచిన్ని జర్మనీవారు తమవిద్యా పద్తిని అభివృద్ధి చేసుకొం టున్నారు. తమపద్ధతిని తలంచుకొని వారుగర్వి స్తారు. ఇది సహజము, న్యాయముకూడాను. సం వత్సరమునకు ఏటేటా పండెండున్నర కోట్ల పౌను లను, ఇంత కాలమనే మితి లేకుండా, ఈ మండలి వారికి జర్మనీ చెల్లించనలసి ఉన్నా, ఈ విద్యా పద్ధతి మూలముననే, ఇంగ్లీషు వారుతప్ప, యూరోపులోని అన్ని దేశములవారికంటెను జర్మనులు ఎక్కువ అభివృద్ధిపొంది, ధనవంతులై ఉన్నారు.