జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 21
వచ్చును. ఉపన్యాసాలు వినడానికి విద్యార్థులు కొంతసొమ్మి వ్వవలెను. ఆసొమ్మంతా ఈ రిటైర యినప్రఫెసర్లకే ఇచ్చి వేస్తారు.
అధ్యాయము 21
వయస్సుమించిన వారి విద్య,
ఫోక్ హాక్ షూలె (Volkhoch Schule)
చిన్నప్పుడు చదువుకొనడానికి మంచి అవ కాశాలు లేకపోయినవారు యావజ్జీవమున్ను చ దువులేక ఉండనక్కర లేకుండా, వయస్సుమీ రనవారి కోసము జర్మనీలో బడులను ఏర్పాటు చేసినారు, యుద్ధమయిన తరువాత ఈవిషయమై మిక్కిలి శుద్ధ తీసుకొంటున్నారు. ఇటువంటి విద్యను మొదట ఆరంభించిన వారు డెన్మార్కు వారు, 1844 సం|రములో వ్యయసాయదారుల పిల్లల కోసము డెన్మార్కులో ఇట్టి మొదటి "ఫోక్ హాక్ షూలే'ను స్థాపించినారు. ఈబడి 'మొదట మత సంస్థగా ఉండేది. దీనిమీదజనుల కౌదరమెక్కువ
177
కావడము చేత ఇటువంటివి మరికొన్ని లేచినవి. ప్రభుత్వము వారుకూడా ఇట్టిబకుడులను స్థాపించి విద్యావిధానములో చేర్చుకొన్నారు. 1918 స:రమున - *డెన్మార్కులో 6,640 విద్యార్థులతో ఈ బడు లుండేవి. వీటిలో చలికాలములో మగ వారికి అయిదు నెలలున్ను ఎండ కాలములో ఆడ పిల్లలకు నాలుగు నెలలున్ను చదువు చెప్పేవారు, వసతిబడులలో 18 ఏండ్ల నుంచి 20 ఏండ్లలోపు వి ద్యార్థులను చేర్చుకొంటారు. వీరిలో చాలామంది వ్యవసాయదారులు. వ్యవసాయానుభవ 'మెక్కు వగాగల సాధారణ విద్యను వీరికిస్తున్నారు. వీరిలో పనికివచ్చిన కొందరిని వ్యవసాయక ళాశాలలకు పం పుతారు. ప్రస్తుత స్థితిని బాగు చేసి, మంచిపౌరు లను తయారు చేయడమే ఈబడుల ఉద్దేశము.
వయస్సుమించినవారికి బడుల నేర్పాటు చేసే పద్ధతిని స్వీడను, నార్వేలవారుకూడా ఇప్పు డవలంబించినారు. వీటిని ప్రభుత్వమువారే పో షిస్తారు. ఇంగ్లాండులో ఈ ఉద్యమమును యూని వర్సిటీ ఎక్స్టెన్షస్ ఉపన్యాసాలుగా ఆరంభించినారు.
178
పెట్టినారు. ఈ పద్ధతిని కేంబ్రిడ్జిలో 1871 సం! రమున అరంభించినారు. దానిని తక్కిన విశ్వ విద్యాలయాల వారుకూడా అవలంబించినారు. ఇప్పుడీ పద్ధతి ఎక్కువ ప్రచారములో ఉన్నది.
విశ్వవిద్యాలయాలలో అందరినీ చేర్చుకో వడమువల్ల చదువుకొనే వారి సంఖ్య ఎక్కువ కావడ మేకాని, విద్యలో అభివృద్ధి కనబడదనిన్నీ , విశ్వ విద్యాలయాలు పరిశోధనను సాగించి, కొత్తవిష యాలను కనుక్కొని, తాముకని పెట్టిన దానిని జన సామాన్యమునకు తెలియ జేయనలసినదనిన్ని లారు హాల్డేను గారి అభిప్రాయము,
ఇంగ్లాండులోను ఈఉద్యమమారంభ మయి నప్పుడే జర్మనీ లో కూడా ఆరంభమయినది. పద్ధతి ప్రకారము మొదటి బడి 1879 సం:రమున లేచినవి. అప్పటినుంచిస్ని , ఇట్టి బకు లెన్నో లే చినది. పల్లెటూళ్ళలో ఇటువంటివి ఉన్న తపాఠశాలలుగా ఉంటవి. వీటిలో వ్యవసాయమును ఎక్కువగా చెప్పుతారు. 14 సం|రములకున్ను,
179
17 సం|రములకున్ను మధ్య వయస్సువా రబడులకు నిర్బంధముగా పోవలెను. తక్కినవారికి ఐచ్ఛికము.
పట్టణములలోని బడులు అనేకరకములుగా ఉన్నవి. వీటిలో చాలామట్టుకు ప్రయివేటు బడులు. కొన్ని వసతులతో కూడిన క్లబ్బులుగా ఉంటవి. వీటికి పట్టణాలలో చాలామంది పోతుఉంటారు. వీటికి “యూగెండ్ షేమ్” (YLI-gendsheim) అనగా యవనుల గృహములని పేరు, ఫాక్టోరీలలో పనిచేసే వయసువచ్చిన పిల్లలకు ఈబడి అధికారులు పెండ్లిండ్లు చేసి, వసతి గృహములలో వసతులిచ్చి, సాయంకాలము వారికి ఉపన్యాసాలిస్తారు. ఇందునల్ల వారు చెడు సహవాసములలో పడక, విద్యాభివృద్ధి చేసుకొంటారు.
20 లక్షలజనసంఖ్యగల 'బెర్లను పట్టణములో
ఇటువంటివి ఏడు ప్రయివేటు సంఘము లున్నవి.
వీటిలో ఒకటి ఈక్రింద వర్ణింపబడినది.
ఈ సంఘమును సభ్యు లే ఎన్నకొన్న కమిటీ వారు పరిపాలిస్తారు. సంవత్సరమునకు రెండుషి
180
ల్లింగులు చెల్లించేవారు సభ్యులవు తారు. వీరికి
తక్కు వజీ తాలకే ఉపన్యాసాలు వినిపిస్తారు. చిన్న
పెద్దకం పెనీల వారుకూడా సంఘములో సభ్యులు
కావచ్చును. చిన్న సంఘాలకు చందా సం:రమునకు
15 ఫిల్లింగులు, పెద్దవాటికి 30 షిల్లింగులు. .
ఈ సంఘమునకు బెర్లిను మ్యునిసిపాలిటీ
వారు మొత్తముఖర్చులో నూటికి నాలుగుచొప్పున
గ్రాంటిస్తారు. ఖర్చులో నూటికి 2 చొప్పున చం
దాలువ స్తవి. మిగిలిన నూటికి 94 ఖర్చున్ను
సభ్యులచందాలవల్లను, విద్యార్థుల జీతములవల్లను
వస్తుంది. పదహారు వేర్వేరుబడులలో ఉపన్యా
సాలిస్తారు. బెర్లినుమ్యునిసిపాలిటీ వారు తమ బడి
గృహములను చదువుకోసము ఉచితముగా ఇచ్చి,
దీపముల ఖర్చు, బంట్రోతుల ఖర్చు కూడా భరిస్తారు.
ఈబడులు ఆయా మ్యునిసిపలుబడుల ప్రధానోపా
ధ్యాయుల తనిఖీలో ఉంటవి. తమబడి కాలములో
కాక, సాయంకాలము ఈ ప్రధానోపాధ్యాయు లే
ఉపన్యాసాలిప్పిస్తారు. ఈసంఘము యాజమా
న్యముక్రింది బడులలో 20,545 విద్యార్థులు చదు
181
లామంది ఈబడులలో చదువుకొనడానికి పోతూ ఉండేవారు. వీటిలోని ఉపాధ్యాయులను విశ్వ విద్యాలయాలలోని అధ్యాపకులు, ఉపన్యాస కు లలోనుంచిన్ని, ఉన్నత పాఠశాలలలోని ఉపాధ్యా యులనుంచిన్ని, సంఘకార్యనిర్వాహక వర్గమువారు ఏర్పాటు చేస్తారు. కార్మిక, వాణిజ్య విషయాలను ఇంజనీర్లున్న, వర్తకులున్ను బోధిస్తారు.
ఈబడులకు అన్ని వయస్సులవారున్ను వి ద్యార్థులుగా పోతారు. 20 ఏళ్ళ లోపువారు నూ టికి 13 రు, 21 నుంచి 30 ఏళ్ళవారు 41 మంది, 31 నుంచి 40 ఏళ్ళవారు 23 రు, 40ఏళ్ళ పై బడినవారు 23 రు ఈబడులలో చదువుకొంటున్నారు. ఈవి ద్యార్థులు ఆనేక వృత్తులనుంచి వస్తారు. దుకాణాల మీద ఫాక్టోరీలలోను పనిచేసేవారు నూటికి 51.8 మంది, ప్రభుత్వోద్యోగులు 14.4 మంది, కూలి వాళ్ళు 11,6 మంది, ఇంజనీర్లు 6 మంది సామా న్యవృత్తుల వారు 6 మంది, ఉపాధ్యాయులు 10.2 మంది ఇప్పుడు వీటిలో చడువుకొంటున్నారు.
182
సర్టిఫి కేట్లు ఇస్తారు. ఉన్నత పాఠశాలాపరీక్షకు పోదలచిన వారికి ప్రయివేటు గా చదువు చెప్పుతారు. వీరికి ప్రత్యేకముగా " తెలివి తేటల పరీక్ష" అనే దానిని విద్యామంత్రి శాఖ వారేర్పాటు చేసినారు . ఈపరీక్ష ఆబిట్యూరియేటెన్ పరీక్షకు సమానము. ఈప్రయివేటు విద్యార్థులకు ప్రతిశనివారమున్ను పరీక్ష జరుగుతుంది.
అధ్యాయము 22
విద్యా పరిశోధనాలయములు,
విద్యా పద్ధతులలో ఏదో ఒకటే శ్రేష్ఠమైన దని చెప్పవీలు లేదు. ప్రభుత్వము వారు, విశ్వ విద్యాలయములవారు, ఇతర విద్యాలయముల వారు కూడా కొత్త విద్యా పద్ధతులను కొత్తరీతిగా బడులను నడిపించడము కనుగొనడానికి -ప్రతి దేశము లోను ప్రోత్సాహము కల్పిస్తారు. ఆమెరికాలో ఇట్టి విద్యా పరిశోధనాలయములు చాలా ఉన్నవి.
183