Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 17

వికీసోర్స్ నుండి

జ్య విద్య సంపాదించిన వాడు. జీవితములో బాగుగా విజయు డౌతాడు.

అధ్యాయము 17

శ్రీవిద్య.

మొదటి నుంచిన్ని బాలురతో పాటు బాలి కలనున్న ప్రారంభ, మాధ్యమిక పాఠశాలలలో చేర్చుకొంటూనే ఉన్నారు. ఇద్దరికిన్ని పొఠక్రను మొక్కటే; కాని, చేతి పనులలో భేదముండేది. ఆ పిల్లలకు కుట్టు పసి, వంట, దాదిపని, వీటితో కూడిన గృహ నిర్వాహకత్వము నేర్పుతూ ఉండేవారు. ఉత్తమపాఠశాలలలో మాత్రము బాలబాలికలకు భేదముకల్పించినారు. బాలుర కు ద్దేశించిన ఉన్నత పొఠశాలలలోనికి, జిమ్నే సియములలోనికిని బాలిక లను చేర్చుకొనేవారు కారు. అందుచేత వారు ఆబి బ్యూరియెంటెన్ పరీక్ష ప్యాసయి కళాశాలలలో చేరడానికి వీలుండేది కాదు. కాని, ఉపాధ్యాయినీ వృత్తి నవలంబిం పదల చిన ఆడపిల్లలు కళాశాలలలో

160

ఉపన్యాసాలు వినడానికి అవకాశాలుకల్పించినారు.

ఆడపిల్ల లకు ప్రత్యేకముగా ఉన్నత పాఠశాల లుండేవి.వీటిలో ఆ రేళ్ళు ఇతర విషయాలతో బాటు వారు ఇప్పటి యూరోపియను భాష ఒకటి నేర్చుకొనేవారు .హైస్కూలు పరీక్ష పాసయిన ఆడపిల్లలను కళాశాలలో చేర్చుకొనేవారు కారు, హైస్కూలచదు వయిన తరువాత మరిమూడేళ్ళు చదువుకొనడానికి ఆడపిల్లలకు ప్రయివేటు వసతి గృహముల నేర్పాటు చేసినారు ఇక్కడ వారు ఇతర విషయాలను నేర్చుకొన్నా, గృహనిర్వాహ కత్వము, కుట్టు పని, వంట, ఎక్కువగా నేర్చుకోసలసి ఉండేది. పిల్లలందరున్ను వసతిగృహములలో చిన్న, చిన్న కుటుంబాలుగా ఏర్పడి ఉండేవారు. గదులు ఊడ్చి, ప్రక్కల పరచి, వంతులు ప్రకా రము తమచిన్న కుటుంబమునకు పంట చేసేవారు. వంటకు కావలసిన సామానుల పట్టీలను వారే వ్రాసు కొని, వారేకొనుక్కొనేవారు. ఈ కుటుంబముల వారు తమ వంటయింటి పొదము, అందము, పంటల

161

రుచి విషయములలో ఒకరితో ఒకరు పోటీ మీద పని చేసుకొనేవారు,వీరికి చిట్టా ఆవర్జాలు వ్రాయడము, ప్రధమచికిత్స, రోగులను పోషించడము కూడా నేర్చేవారు.

ఆడవాళ్ళు ఇళ్ళలో ఉండి, పిల్లలను చూచు కొంటూ ఉంటార నే ఉద్దేశముతో వారి విద్యాక్ర మమును ముందర ఏర్పాటు చేసినారు కాని, వారీ నిర్బంధములను సహించక ఆందోళనము చేయనా రంభించినారు. దాని మూలముగా 1908 సం: రములో వారికి “లిజియమ్” (Iyucum) అనే ప్రత్యేక హై స్కూళ్ళను ఆరేళ్ళు చదువు కొన డానికి ఏర్పాటు చేసినారు. “ఓబర్ - రియల్ షూలె”లోని కడపటి మూడు తరగతులలోను చ దువుకొని వారు ఆబిట్యూరియెంట్ - పరీక్షకు పోవడానికి కూడా వీలుకల్పించినారు. ఈఏర్పాటు తృప్తికరముగా లేకపోవడము చేత హైస్కూళ్ళ కంటే పైవిద్యాలయాలను (ఓబర్' లిజియమ్) (Ober - I_yzeum) 1917 సం|రములో యుద్ద సమయములో ఏర్పాటు చేసినారు.

162

వలెనని కోరినారు. 1921 సం|కములో స్త్రీలకు వోటు ఇచ్చే అధికారము వచ్చినది.

ఇది గాక మగవాళ్ళు యుద్దమునకు పోయి ఉన్నప్పుడు ఆడ వాళ్ళకు వారిఉద్యోగము లిచ్చినారు. యుద్ధము కాగానే స్త్రీలు తమ ఉద్యోగములను మగవాళ్ళకు ఒప్ప జెప్పడాని కంగీకరించ లేదు. మగ వాళ్ళతో సమానముగా మాకున్ను విద్యా సౌకర్యములుండ వలెనని కోరినారు. 1921 వ సం: రములో విద్యాంగ మంత్రి ఒక కాన్ఫరెన్సు చేసినాడు, దానిలో విద్యా విషయములో స్త్రీలకుండే నిర్బంధములన్నీపోయినవి. ఇప్పుడు మంత్రి చేతికింద, అతనికి శ్రీ విద్యా విషయమై సలహాధవ్వడానికి ఒక ఉద్యోగిని ఉన్నది.

ఇప్పుడు జర్మనుల పిల్లలు మొదట మగ పిల్లలతో బాటు నాలు గేళ్ళు "గ్రుండ్ షూలె" (సామాన్య విద్యాలయము)నకు పోతారు. పదేం ళ్ళు వయస్సున బాలురతో బాటు కొందరు ఉన్నత పాఠశాలలలోను, కొందరు మాధ్యమిక పాఠశా లలలోను చేరుతారు. మిగిలినవారు ప్రారంభ


183



పాఠశాలలలోనే మరి నాలు గేళ్ళు ఉంటారు. వృత్తి పాఠశాలలలోనికిన్ని పారిశ్రామిక పాఠశాలలలో నికిన్ని బాలురవలెనే బాలికలున్న నిర్బంధముగా పోవలెను. ఆడపిల్లలకు (1) కూలిపనివాళ్ళకుద్దేశించిన “ఔఫ్-బౌ-షూలె”నూతనోన్నత పాఠశాలలు (2) లిజియములు అని రెండు విదముల ఉన్నతపాఠశాలలున్నవి.లిజీయములో ఆ రేళ్ళు చదువుకొని ఆడపిల్లలు (1) ఒకవసతిపాఠశాలలో చేరి గృహనిర్వాహకత్వము నేర్చుకో వచ్చును లేదా (2) మగపిల్లల జిమ్నే సీయములో చేరవచ్చును, లేదా (3) లిజియమునకనుబంధ ముగా గాని ప్రత్యేకముగాగాని ఉండే ఓబర్ లిజి యములో చేరవచ్చును.ఓబర్ - లిజియములో మూడేళ్ళు చదువుకోవలెను. దీనిని తుదిపరీక్ష ఆబిట్యూరియెంటెన్ పరీక్షతో సమానము, రెండుపరీక్షలున్ను ఒక్క రీతిగా నే జరుగుతవి. ఈపరీక్ష ప్యాసయిన వారు బాలురవలెనే బాలికలున్ను ఒక విశ్వవిద్యాలయములోగాని, కార్మికకళా శాలలో కాని చేరవచ్చును,



164

విశ్వవిద్యాలయాలలో స్త్రీల సంఖ్య అతివేగముగా వృద్ధిఅవుతున్నది. ఇప్పుడు మొత్తము సంఖ్యలో నూటికి పదిమంది స్త్రీలు విశ్వవిద్యాల యాలలో చదువుకొంటున్నారు. స్త్రీలు "స్టాటు” (Star1) పరీక్ష ప్యాసు కావచ్చును. డాక్టరు బిరు దమునున్ను పొందవచ్చును. స్టాటు పరీక్షను విశ్వవిద్యాలయాలవారే చేస్తారు. ఇది బి.యే పక్షతో సమానము.ఇది ప్యాసయినవారు గవ ర్నమెంటు ఉద్యోగాలకు అహర్హలై ఉంటారు.స్త్రీ లకు తమ కళాశాలలో ప్రత్యేక సంఘములు న్నవి. కాని, వీరు "క్నీపె"లలో పాల్గొనరు.

అధ్యాయము 18

ఉపాధ్యాయ శిక్షణము.

యుద్ధమునకు పూర్వము ప్రారంభ పాఠశా లోపాధ్యాయులు ' సెమినారు'లనే వసతి పాఠశాల లలో శిక్షణముపొందేవారు.ఈ పాఠశాలలకు ప్రారంభ పాఠం పాఠ శాలలను చేర్చే వారు. సెమినారు

.

165