Jump to content

జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 15

వికీసోర్స్ నుండి

రపాలక సంఘములవారు చాలా సొమ్ము ఖర్చు పె ట్టుకున్నారు. 1928 సం||రములో ఒక్క బెర్లిను పురపాలక సంఘమువారే ఈ విషయమే 600,000 పౌనులు ఖర్చు పెట్టినారు.

జర్మనీలో ఈసంరంభమునకు ఇంకా ఒక ఆకారము ఏర్పడ లేదు. దేశ నాయకులు దీని మూలముగా జూతీయశీలము నభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అధ్యాయము 15.

కార్మిక విద్య, పారిశ్రామిక విద్య.

ప్రతి ఫాక్టరీలోను, పెద్ద కార్యానాలలోను మూడుర కాల పనివాండ్లు కావలసి ఉంటారు.

(1) ఫాక్టోరీ అంతటిని మొత్తము మీద నడిపించేవారు. వీరు యంత్రము లేరీతిగా ఉండ వలెనో ఆలోచించి ప్లానులు వేస్తారు. వీరిపని ఉన్న యంత్రములను ఎట్లునడిపించడము అనేది కాదు. ఆయాయంత్రములను ఎట్లు అభివృద్ధి చేయ

136


డము అని వారాలోచిస్తూ ఉంటారు. వీరికి కార్ఖానాలో అనుభవము తక్కునగా ఉంటుంది. వీరి పని కాగితాలమీద ప్లానులు వేసుకొని ఆలోచించుతూ ఉండడమే వీరిని “ఇంజనీర్లు” అనపచ్చును.

(2) ఫాక్టరీలో ఆయాభాగాలను సరి చూచుకొనేవారు వీరికి యంత్రములను సడి పించడము, వాటిని సరిచేయడము, వాటిని మర మ్మత్తులు చేయడము, బాగుగా తెలిసి ఉండవలెను. వీరికి " మే స్త్రీలు” “ఓవర్ సీయర్లు” లేక “ఫోర్మెన్" అనవచ్చును.

(3) ఏదో ఒక యంత్రము యొక్క - చిన్న భాగమును కనిపెట్టుకొని ఉండి, అక్కడిపనినే చేస్తూ ఉండేవారు. వీరు మేధావంతులుగా ఉండరు. తమపనిని చేసుకొనిపోతూ ఉంటారు. వీరిని కార్మికు లనవచ్చును.

పై మూడు విధములవారున్ను చేసేపనులును వేర్వేరుగా ఉంటవి. అందుచేత వారివారికి ప్రత్యేక శిక్షణము నివ్వవలసి ఉంటుంది. ఒక

137

భవనముకట్టవలె ననుకొందాము. ఇంజనీరు ప్లాసులు గీసి, శ్రమను తగ్గించేయంత్రాలను ఏర్పాటు చేస్తాడు. ఒక ఆర్చిదింపడ మేలాగో, ఆ ఆర్చిలో ఎక్కడ ఎంతబరు వుంటుందో ఇంజనీరుకు తెలు స్తుంది. కాని, ఆ ప్లానుప్రకారము ఇటికలను పేర్చడానికి ఒక మే స్త్రీ ఉండవలెను. మంచి ఇంజనీరయినవాడు, మంచి మే స్త్రీ అయి ఉడనక్కర లేదు. మే స్త్రీ ఎన్నో ఆర్చీలను కట్టి ఉడవచ్చు నుగాని, మరిఒక కొత్తరకము ఆర్చి కట్టలేడు. మే స్త్రీ కింద కొంతమందిపని వాళ్ళు కూడా ఉండవలెను. వీరు చదువుకొన్న వారైతే తమపనిని మరింత బాగా చేసుకొని తమశ్రమ తగ్గించుకొన డానికి ఉపాయాలు ఆలోచించుకోగలరు. ప్రతి విషయములోను ఇప్పుడు యంత్రములు సహాయ పసుతున్నవి గనుక, ఈ పని వాళ్ళు తమపనిలో కుశలత సంపాదించవలసి ఉంటుంది. అందుచేతనే వీరికికూడా కార్మిక విద్య అవసరము.


గృహపరిశ్రమలకు ఇంజ నీర్లు అక్కర లేదు.మే స్త్రీలు, పనివాళ్ళు, ఉంటే చాలును,

138

వీళ్ళిద్దరికి మంచిశిక్షణము కావలెను. వ్యవసా యమునకు సహాయముగా జర్మనీలో ఈ మధ్య గృ హపరిశ్రమలు మంచి అభివృద్ధి పొందినవి. యూరోపులో వ్యవసాయము ఏడు నెలలు మాత్రము సాగుతుంది. చాలికాలము అయిదు నెలలు వ్వవసాయపుపని ఉండదు. ఆకాలమును వృథాచే యకుండా వ్యవసాయదారులు ఏదో ఒక గృహ పరిశ్రమ చేస్తారు. ఈ పరిశ్రమలలో ముఖ్యమ యినది పిల్లల ఆటవస్తువులను చేయడము. జర్మను లిప్పు డెన్నోరకాల ఆటవస్తువులను చేస్తున్నారు. ఇవన్నీ వ్యవసాయదారులు చేసేవే. వీటిని చే యడానికి ఇంజనులతో పనిచేసే పెద్దయంలో లక్కర లేదు. వీటిని చేసేయంత్రాలను ఒక చోటినుంచి మరిఒక చోటికి మోసుకొనిపోపచ్చును. వీటిని చేతులతోగాని, చిన్న మోటారు ఇంజనుల తోగాని నడిపించవచ్చును. మే స్త్రీ శిక్షణమున్ను , ఒక పరిశ్రమ యజమానుని శిక్షణమున్ను ఒక టేకాకపోయినా, ఒక్కరకమువే. జర్మనీలో ఆయావిధములవారికి


139

ప్రత్యేకముగా శిక్షణమివ్వదు

డానికి మూపు విధము లైన పాఠశాలలున్నవి. పనివాళ్ళపాఠ శాలలకు “గె వెర్బె షూలె” (Gewerbe Schule) అనగా ప్రారంభ కార్మిక పాఠశాలలని పేరు. కుమ్న, పరిశ్రమాధికారులకున్ను శిక్షణమిచ్చే పోటికి "ఫాక్ షూ లే” (Toub Schaulla) అనగా పరిశ్రమ పాఠశాలలని పేరు. ఇంజపేర్లకు శిక్షణ మిచ్చే వాటికి "హాక్' షూలె” (Feich sichulce} అనగా కార్మిక విశ్వవిద్యాలయములని పేరు.

"గేవెర్బ షూలె” (Gewer bee Schule) లేక

“బెరుఫ్ షూలె" (Belur Schule)

ప్రారంబ కార్మిక పాఠశాలలు,

బాల బాలిక లందరున్ను పధ్నాలుగోయేట బోర్డు పాఠశాలను విడిచి పెట్టగానే ఒక ఫాక్టరీలోనో ఒక వృత్తిలోనోప్ర వేశిస్తారు. మొదటివారు మూ డేండ్లు వాటిలో పని నేర్చుకోవలెను. ఈ కాలములో వారికి జీతమివ్వరు, పని నేర్చుకొంటూ "గెవెర్బె షూలె” (Gewerbe Schule) అనే బడికి కూడా పోతూ ఉండవలెను. శాసనము ప్రకారము కము వా 140

రీబడికి నిర్బంధముగా పోవలెను.ఈబడిలో తు దిపరీక్ష ప్యాసయితే జీతముమీద చేర్చుకొంటారు. ఒక దుకాణములో ఇల్లుతుడి చేవాడు, గృహపరిశ్రమలో సహాయము చేసేవాడు, హొ కళ్ళలో ఉత్తరాలను తీసుకొనిపోయేనాను, మం గళ్ళకు వడ్రంగులకు సహాయము చేసేవాడు. అంద రున్ను మూడేళ్ళు పని నేర్చుకొని, తమ వృత్తికి సంబంధించిన విద్యను “గే వీర్బె షూలెలో సంపా దించుకోవలెను. : పనినేర్చుకొనడానికిన్ని, చదువుకు న్ను వారు ఏమి ఇవ్వనక్కర లేదు.ఆయా యా జమానులు వారికే కొంచెము సొమ్ము ఇస్తారు. ఈ బడులు పురపాలక సంఘముల వశమందుంటని, గవర్నమెంట వారే వాటికయ్యేసొమ్మును పురపా లక సంఘములవారి కిస్తారు. కొన్ని స్థలాలలో గవర్నమెంటువారీ పాఠశాలలను తమవశములోనే ఉంచుకొంటారు.

తరగతులను ఆయావృత్తుల ప్రకారము ఏ ర్పాటు చేస్తారు. ఒక వృత్తిని నేర్చుకొనే పిల్లలం దరున్ను ఒక్కటే తరగతిలో విద్య నేర్చుకొం 141

చదువు అయావృత్తులకు తగినట్లు ఉంటుంది. పిల్లలు పుస్తకములు చదువుకొనడమే కాకుండా అనుభవముకూడా సంపాదిస్తారు. ఈ వృత్తికాక, జర్మముభాష, గణికము, చిత్రలేఖన ము, రాజనీతి ప్రథమపాఠములు, చిఠా ఆవర్జా వ్రాయడము, కసరత్తు, కూడా ఈ బడులలో నేర్పు తారు. తక్కిన బడులలోవలె వీటిలో కూ డా విహారములు, వ్యాయామకీడలు, నిర్బందములుగా ఉంటవి. ఆయావృత్తులలో మంచి ప్రగ్న సంపాదించిన వారే ఈబడులలో ఉపాధ్యాయులుగా ఉంటారు. ఒకొక్క వృత్తికి ప్రత్యేకముగా అను కూలించేటట్లు చిత్రలేఖనము, గణితము, క్షేత్రగణితము మొదలయిన విషయాలకు పాఠక్రమము లున్ను పాఠపుస్తకములున్ను వ్రాయబడి ఉన్నవి. వడ్రంగమునకు పనికివచ్చే గణితము, చిత్ర లేఖన ము, మరిఒక వృత్తివారి కుపయోగించవు. వడ్రంగము తరగతిలో కుర్చీలు మొదలయిన వాటి కుపయోగించే లెక్కలు, చిత్ర లేఖనమును మా త్రమే చెప్పుతారు. ఇతర వృత్తుల వారికి వారి

142

వారి వృత్తుల కుపయోగించేటట్లు చెప్పుతారు.

శాసనము ప్రకారము బడిలో వారమునకు 8 గం మాత్రమే చదువు చెప్పవలసి ఉన్నా, పది పండ్రెండు గంటలు కూడా చెప్పడము కలదు. యుద్ధమునకు పూర్వము జర్మనీలో ఈ బడులు 3,600 ఉండేవి. వీటిలో 640,000 మంది వి ద్యార్ధులుండేవారు. యుద్ధము తరువాత ఈసంఖ్య నూటికి 50నంతున హెచ్చినది.

పెద్ద పారిశ్రామిక పట్టణములలో, ఏదో ఒక వృత్తి నవలంబించే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్పుడు, ఆవృత్తికి సంబంధించిన విద్యార్థులకు ప్రత్యేకముగా పాఠశాల లను ఏర్పాటు చేసి “గెవెర్బె షూలే" నుంచి విడదీస్తారు. వృత్తి పాఠశాలకు "బెరుఫ్ షూలె” అని పేరు. “గె వెర్బే షూలే"లో అన్ని వృత్తులకున్న వేరు వేరుగా తరగతులు ఉంటవి; "బెరుఫ్ షూలె"లో ఏదోఒక్క వృత్తినే బోధిస్తారు.కొన్ని స్థలాలలో వృత్తికరగతులను ప్రారంభ పాఠశాలలకు చేర్చు తారు; ఈ పాఠశాలలకు “ఫర్ క్లాసెస్" అని పేరు.

143

పెద్దపట్టణములలోని ఈపాఠ శాలలకు వసతిగృహములుకూడా చేరిఉంటవి. వీటికి "యూగెండ్ షేమ్” అని పేరు. వీటిలో పిల్లలు తమభోజన సదుపాయములను తామే చేసుకోవలెను. ఈ పాఠ శాలలలోని పాఠక్రమమును గవర్న 'మెం టువారు ఏర్పాటు చేసి ఉన్నారు. వీటిలో పని నేర్చుకొనే పిల్లలు వారక్కడినుండిన సంవత్సర మును బట్టి మూరగతులలో ఉంటారు. ఆఖరు పరీక్షను ఆయావృత్తులలో ఆరి తేరినవారి సహాయముతో ఉపాధ్యాయులే చేస్తారు.ఒక పాఠశాలలో 25 వేర్వేరు విద్యలనుకూడా నేర్ప వచ్చును. జర్మనీలో ఆడపిల్లలు, మగపిల్లలుకూడా 14ఏళ్ళ ఈ మనరకు నిర్బంధముగా సామాన్య విద్య నేర్చుకోవ లేనని ఇంతకుముందుతెలుప బడ్డది. ఆతరువాత వారు మరిమూడేళ్ళు నిర్బంధముగా కార్మిక విద్యనో వృత్తి విద్యనో నేర్చుకోవలెను, ఎక్కువ నేర్పు అక్కర లేని వృత్తితీసుకొన్న వారు గాని, పని నేర్చుకొనడమునకుచేరనివారుగాని, “ఫోర్ట్ బిల్డింగ్ షూలె” (Fortbilding Schule)


144

అనే క్రొత్త రకముబడిలో చేరవలెను. "గి వెర్బె

షూ"లోను " బేయఫ్ షూలె"లోను చేరని తక్కిన పిల్లలందరున్ను ఈ బడులలో చేరవలెను. ఈబడులలో విశేషానుభవ మక్కర లేని సామాన్య విద్యను చెప్పుతారుగాని, కొద్దిగానో గొప్ప గానో అనుభవమునుకూడా ఇస్తారు.

ఉ న్నతపాఠశాల విద్య

“ పాక్ షూలె?" (Pach Sclaul) లేక

వాణిజ్య పాఠశాలలు.

కార్మిక విద్య ముఖ్యోద్దేశము స్త్రీలను, గృహపరిశ్రమయజమానుల ను తయారు చేయడము. మే స్త్రీలు స్వంతముగా యంత్రములను నడుపవలెను, గృహపరిశ్రమనుజమానులు కుట్టుపని గడియారములు చేయడము చిత్రములు వ్రాయడము మొదలయిన పరిశ్రమలలో ఎక్కువ నేర్పు సంపాదించవలెను. ఇక్కడ ఎక్కువజ్ఞాన మును సంపాదించవలసి ఉంటుంది గనుక, ఈ ఉన్నత పాఠశాలలలో ఒక్కదానిలో ఒకొక్క వృత్తి మాత్రమే నేర్పు తారు. ఒకొక్క వృత్తికొకొక్క

145


పాఠశాలను ఏర్పాటు చేసినారు. గెవెర్బెషూలే”లో పిల్లలు తమవృత్తిలో నే చాలాకాల ముండి బడిలో గంటగంటన్నర కాలము మాత్రమేఉంటారు, “ఫాక్ షూ"లో బడి ఎక్కున కాలమున్న, వృత్తిలో తక్కువకాలమున్న గడుపు ఈబకు లోనికి ప్రవేశము దొరకడము కూడా కొంచెముకష్టమే.

ఈ“ఫాక్ షూ లే”లో చేరేవారు. ఒకసా మాన్య ఉన్న ఆ పాఠ శాలలో ఆ రేళ్ళు చదువుకొని ఉండన లెను- లేదా, మాధ్యమిక పాఠశాలలో ఆ రేళ్ళు చదువుకొని ఉండవలెను- లేదా, ఒక బోర్డు పాఠశాలలో ఎక్కు ప్రజ్ఞతో చదువుకొని ఉండవలెను. “ఫాక్' షూ లే”లో మూడేళ్ళు చదువు చెప్పుతారు. వారమునకు30 గంటల నుంచి 40 గంటలవరకు పనిఉంటుంది. మొదటి సంవత్సరము పుస్తకముల చదువు ఎక్కువగాను, అనుభవము తక్కువగాను ఉంటుంది. రెండో యేడు సమానముగా ఉంటవి. మూడోయేడు అనుభవము ఎక్కువగాను, పుస్తకముల చదువు

146

తక్కువగాను ఉటుంది. ఈమూడేళ్ళలోను వి ద్యార్థి తనవృత్తికి సంబంధించిన ఒక వస్తువును సం పూర్ణముగా చేయడమును నేర్చుకోవ లెను. ఉదా హరణమునకు గడియారములను చేయడము నేర్చే బడిలో చిన్న ఇసూళ్ళనుంచి, చక్రములవరకు తానే చేసి, వానినన్నిటిని ఒక గడియారముగా కూ ర్చడము నేర్చుకోవలెను. .


మూడేళ్ళచదువున్నుఅయిన తరువాత వాణిజ్యమంత్రి శాఖవారు పరీక్షకులనునియ మిస్తారు. ఈపరీక్షకులకు పిల్లలు తాము చేసిన వస్తువులను చూపవలెను. "ఫాక్' షూ లే” విద్యా గులకు “లెహర్ లింగే” ( Jehrlinge) అని పేరు. పరీక్ష ప్యాసయిన వారికి "గెసెల్లె” ( (Geselle) పరీక్షకు గె సెల్లె పూఫుంగ్ (Greselle Prarkung) అని పేరు. "గె సెల్లే"లు ఫాక్టోరీలలో గాని, చిన్న దుకాణములో గాని, పని నేర్చుకొనడానికి చేరవచ్చును. వీరికి జీతా లిస్తారు. ఇట్లు మూడేళ్ళు పని నేర్చుకొంటూ ఉన్న కాలములో వారు బడులకు పోవలెననే నిర్భం


.

147,

ధము లేదు, కొని, మూడేళ్ళయినతరువాత ఒక పరీక్ష ప్యాసుకావ లేను. ప్యాసయితే ““మాస్టర్"(Master) అనగా అవృత్తిని ఆమూలాగ్రముగా నేర్చుకొన్న వాడు,అనే బిరు మునిస్తారు. ఈ పరీక్ష ప్యాసయి తేనే కాని, ఎవరున్న స్వతంత్రముగా దుకాణము పెట్టుకొని తమవృత్తిని అవలంబిచ నివ్వరు.'


జర్మనుల పరిశ్రమలకు ఈబడులు మూలాధారములు, ప్రతివృత్తి పాఠశాలను,ఇచ్చట వర్ణించడానికి వీలు లేదు.ఒక గడియారములు చేయడము నేర్పే పాఠశాలను గురించిమాత్రము ఈ కింద చెప్పబడుతున్నది. ఈ పాఠశాల డ్రెస్డెను పట్టణమునకు సమీపములో ఉన్న “గ్లాషూటె ” (Glasshat )) అనేపట్టణములో ఉన్నది. ఇందులో మూడేళ్ళు చదువు చెప్పుతారు.


పుస్తకముల పాఠములు (వారమునకు 10 నుంచి 20 గుంటలవరకు):- 1. అంకగణితము, బీజగణితము, స్లైడు రూలు (Slide Rale) ఉపయోగించడము, బేబి

148

ళ్ళసుబట్టి లెక్కలు చేయడము, గ్రాపులు, లోగో

రధిములు వారమునకు 2 గంటలు,

(2) క్షేత్రగణితము, త్రిగుణ మైత్రి ('Trignometry) లోని ప్రథమ పొఠములు.
(3) పదార్థవిజ్ఞానశాస్త్రము.
(4) విద్యుత్కర్మ శాస్త్రము (Electronics)
(5) విద్యుత్ప్రవాహ శాస్త్రము,
(6) విద్యుత్సంజ్ఞల నివ్వడము,
(7) జర్మను భాష.
(8) ఆరోగ్య శాస్త్రము,
(9) చిట్ఠా అవర్గాలు వ్రాయడము.
(10)ప్రథమపాఠములు.
(11) కసరత్తు.
(12) ఎంచిభాష, ఇంగ్లీషు భాష (ఐచ్చి
(10) రాజనీతి ప్రథమపాఠములు
(11)కసరత్తు

అనుభవము (వారమునకు 30 నుంచి 40 గంటలవరకు):- (1) రాపుపట్టడము (Filing), మెలి వేయ

149

డము (twisting) ఉపకరణములను, యంత్రములను వాడడము.

(2)సూక్ష్మమానములను ('licrometers)వాడడము, పెద్ద గడియారములను గురించి తెలుసు కోవడము

(3) వాచీలలో కష్టమైన భాగముల నిర్మాణము, రాళ్ళ నెక్కడ ఉంచడము, మూతలు చేయడము, జేబుగడియారము , సిలెండర్లు చేయడము మొద,

(4) పళ్ళుగల చక్రములు, స్ప్రింగు : ,విద్యుచ్ఛక్తితోపని,

(5) పెద్దగడియారాలలో పెండ్యులము,పెంద్యులములను సరియైన స్థానములో ఉంచ డము; స్త్రీల వాచీలు.

(6) మరమ్మత్తులు.

(7) వాచీసిని సంపూర్ణముగా నిర్మించడము,

హాక షూలె (Both Schule) (ఇంజనీరంగు కాలేజీలు)

ఈఇంజనీరింగు కాలేజీలు విశ్వవిద్యాలయ

150

ముల హక్కులను కలిగిఉన్నవి. వీటిలో డాక్టరు బిరుదమునిస్తారు. జర్మనీలో ఇటువంటి కాలేజీలు ఇంజనీరింగు వృత్తికి పదిన్ని, వ్యవసాయమునకు నాలుగున్ను, అడవులకు అయిదున్ను ఉన్నవి. తక్కిన విశ్వవిద్యాలయములలోనికి ఎట్లు ప్రవేశిం చడమో, వీటిలోను అట్లే ప్రవేశించవలెను. ఇం దులో చేరదలచిన జర్మను విద్యార్ధులు ఆబిట్యూ రియేంటెస్ పరీక్షను, విదేశ విద్యార్థులు తమ దేశ ములలోని విశ్వవిద్యాలయాలలోనికి ప్రవేశము నిచ్చేపరీక్షనున్ను ప్యాసయి ఉండవ లెను,కాలే జీలో ఇంత మందిని మాష్ట్రమే చేర్చుకొంటామన్న నియమము లేదు. స్థలములేదన్న కారణము చేత ఎవగినిన్ని చేర్చుకోక పోరు. అందరు విద్యార్థులన్ను కలిసిపని చేసుకొనడానికి సదుపాయాలు లేకపోతే, తుకిడీలుగా పని చేసుకొంటారు,

ఈ విశ్వవిద్యాలయాలలో రెండు పరీక్ష లున్నవి. ఒకటి “డిప్లొమా " పరీక్ష. రెండోది “డాక్టరు" పరీక్ష్ . డిప్లొమాపరీక్ష, బ్రిటిషు విశ్వ విద్యాలయాలలోని బి. ఎస్. సి. పరీక్షకు సరిపో

151

తుంది. డిప్లో మాపరీక్షు ఇవ్వడానికి విద్యార్థులు (1) ఒక శ్వవిద్యాలయములో నాలు గేళ్ళు చదు వుకొని ఉండవలెను (2) ఒక సంవత్సరము అను భవము సంపాదించుకొని ఉండవలెను. (3) పరీక్షలోని రెండు భాగములున్ను ప్యాసుకావలెను. ప్రవేశించిన రెండేడ్ల తరువాత మొదటి భాగములో పరీక్ష జరుగుతుంది. ఈ ప్పరీక్షకు (1)గణితము (2) యంత్ర నిర్మాణము (3) క్షేత్రగణితము: (4) పదార్థ విజ్ఞాన రసాయన శాస్త్రము: (5) విద్యుద్యం త్రములు (6')ఉష్ణత (7) రాజనీతిశాస్త్రము (8) ఫాక్టోరీలను నడిపించడము, మొదలయిన విషయ ములుంటవి.

ఈమొనటి భా గ ము లో రెండేండ్లకు పూర్వమే కృతార్థులయి, ఒక సంవత్సర మనుభవము పొందు తేనే కాని రెండో భాగముపరీక్షకు పోగూడదు. ఇంగ్లాండు, స్కౌటాండు చేశములలో బి. ఎస్. సి. డిగ్రీలకుండే నియమము లే ఈ పరీక్ష కున్ను ఉన్నవి. డిప్లొమా పరీక్ష ప్యాసయిన తరువాత మరి రెండేండ్లకు "డాక్టరు” బిరుద పరీక్షకు పో

152

వచ్చును. దీనికి తక్కినవిషయములలోవలెనే

పరీక్ష జరుగుతుంది

ఒక ఫాక్టరీలో గాని, పారిశ్రామిక కంపెనీలో గాని ఏడేళ్ళయినా పని నేర్చుకొంటెనే తప్ప, ఎవరినీ ఈ“హాక్ షులే”లో అధ్యాపకుడుగా నియమించరు. ఈ అధ్యాపకులకున్ను ఆయా పరిశ్రమాధి కారులకున్ను మంచిపరిచయముంటుంది. ఆందు చేత విద్యార్థులకు ఆయా ఫాక్టోరీలలోనికి సులభముగా ప్రవేశమ దొరుకుతుంది.

అధ్యాయము 16

వాణిజ్య విద్య.

జర్మనీలో మొదట వాణిజ్య పాఠశాలను హాంబర్గు పట్టణములో 1771 సం.రములో స్థాపించినారు. తరువాత మరి 20 ఏళ్ళకు బర్లినుపట్టణములో వాణిజ్య సంఘమువారు మరిఒకటి స్థాపించినారు.యుద్ధసమయములోను, ఆతరువాతను, సాధా రణపాఠశాలలవలె వాణిజ్య పాఠశాలలను కూడా


153