జయజయ మహాదేవ శంభో (దండకం)
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్.గోవర్ధనం, ఆర్. సుదర్శనం
జయ జయ మహాదేవ శంభో హరా శంకరా, సత్యశివసుందరా, నిత్యగంగాధరా!
బ్రహ్మ విష్ణుల్, సురల్, తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా!
భీకరారణ్య మధ్యంబునన్ బోయనైపుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్!
దివ్య జపహోమ తపమంత్ర కృషిలేని జ్ఞానాంధుడన్!
దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్!
విశ్వరూపా! మహామేరుచాపా! జగత్సృష్టి, సంరక్ష, సంహార కార్యత్కలాపా!
మహిన్ పంచభూతాత్మనీవే కదా దేవదేవా! శివా!
పృథ్విజలవాయురాకాశ తేజో విలాసా మహేశా! ప్రభో!
రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా! కాశీపురాధీశ విశ్వేశ్వరా!
నీలిమేఘాల కేళీ వినోదాల తేలు శ్రీశైలమల్లేశ్వరా! శ్రీశైలమల్లేశ్వరా!
కోటినదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా! శ్రీరామలింగేశ్వరా!
నిత్యగోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా! భీమేశ్వరా!
దివ్యఫలపుష్ప సందోహ బృందార్చితానంద భూలోకకైలాస క్షేత్రాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వరా!
దేవ దేవా! నమస్తే! నమస్తే! నమస్తే! నమః!