జన్మే ఒక రాత్రి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

జన్మే ఒక రాత్రి బాబు జన్మే ఒక రాత్రి

శివుడని యనగా నెవడు
వెలుగుల కిరణమె అతడు
కిరణము మొలచెడి స్థలమేది
పుటకల వెలుపల గల వేది

అట్టది కిరణ మ్మెద మెదలు
అంటవు దానిని తుద మొదలు
అదియే రూపము చేకొనిన
అభవుడు భవుడై శివుడగును

జగముల మోసెడి కుండలిని
ఆతని పదముల అందెయగు
బహు గోళమ్ముల అంబరము
ఆతని నడుమున పులితోలు

జీవుల నడిపెడి త్రిపుటులను
అతని త్రిశులము బలిగొనును
మూలాథారపు భుజగపతి
భూషణ మాతని కంఠతటి

జగముల గాల్చెడి హాలాహాలం
బాతని గళమున చిరుమచ్చ
పగటిని రాత్రిని పాలించే
రవి శశు లాతని నేత్రములు

అన్నిటి తనలో కలుపుకొని
అగ్నియె ఆతని పైకన్ను
సెగల నదల్చెడు గంగమ్మ
ఆతని శిరసున చిరుచెమ్మ

లోపలి జ్ఞానపు వెలుగులకు
మొలకే తలపై నెలవంక
కాపున నాతడు గల రాత్రి
సచిదానందపు శివరాత్రి

వేది = (త్రేతాగ్నులు వుండే స్థలము)

శివరాత్రి సందేశము - 1998 నుండి