చీనా - జపాను/జపాను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
36
చీనా

లును జపానులో దూరి ఇట్టిపత్రములు వ్రాయించుకొనెను.జపానులో పాశ్చత్యవస్తువులు వర్తకము ప్రబలజొచ్చెను. జపానుకు మిగిలిన దెల్లయు జపాను జాతీయభావమే.

అంతకుముందు జపానులో అనేక సేనా నాయకులు ఒక్కొక్కభాగమున కొక్కొక్కడధిపతియై ఒకరినొకరు నరకు కొనుచుండిరి.కేంద్రప్రభుత్వమగు పోగను వంశీయులు నామకః మాత్రమే ఉండిరి. మికడో అను బిరుదముగల ఆరాజునకు జపానునాయకులపై నెట్టిచర్యలను గాని తీసుకొనుటకు సాధ్యము కాకుండెను.అయినను అతను పవిత్రమూర్తిగా మాత్రము భావింపబడుచుండెను.కామోడోరుపెర్రీ చర్యల తరువాతను జపానులో ఒక అపూర్వ చైతన్యముదయించెను.మికాడోకు తిరిగీ పూర్ణాధికార మిాయబడెను.అతని జండాక్రింద నిలబడి విదేశీ ప్రభుత్వ ముల నెదురుకొనుటకు తక్కిన నాయకులెల్లరును నడుము కట్టుకొనిరి.దీనినే మొయిజీ శకము అందురు.ఇది 1865 తో ప్రారంభమాయెను.రాచరికముతో పాటు పాశ్చాత్యప్రాతినిధ్య రాజ్యాంగక్రమము కూడ ప్రతిష్ఠించబడెను. ఇప్పటి నుండియే జపానులో పారిశ్రామికవిప్లవము కూడా ప్రారంభమై దినదినాభివృద్ధి పొందజొచ్చెను.

పారిశ్రామికాభివృద్ధితో పాటు కార్మికుల కష్టములు కూడ పెరిగెను.పాశ్చాత్యదేశముల శుశ్రూషచేసి పరిశ్రామిక నైపుణ్యమును చేపట్టి ఉత్పత్తి నెక్కువచేసెనే గాని, ఈ ఉత్పత్తి కార్మికుల నెక్కువ కష్టపెట్టి తక్కువ కూలులిచ్చి
జపాను

హింసించుచుండుట వల్లనే సాధ్యమయ్యెనని పెక్కురితలంపు.పారిశ్రామికముగ మాత్రమే జపాను అభివృద్ధి పొందెను కాని వ్యావసాయకముగ మునుపటిస్థితిలోనే ఉండెను.వ్యవసాయకుల కష్టములు తగ్గలేదు, రాబడి హెచ్చలేదు.జపానులో తయారైన వస్తువులను కొనుక్కొని అనుభవించుటకు జపాను కార్మికకర్షకులకు సాధ్య ము కాదాయెను.ఈసరుకంతయు విదేశముల కెగుమతి కావలసినదే.విదేశపు మార్కెట్టులన్నియు పాశ్వాత్య ప్రభుత్వముల వశమునందుండెను.ఐరోపాయుద్ధము ధర్మమా అంటూ వాటి విజృంభణము పూర్తిగా చల్లరినప్పటి నుండియు జపానుసరుకు పరదేశములకు యెక్కువగా యెగుమతి కాజొచ్చెను.కాని లాభములు భాగ్యములు అన్నియును వర్తక జాతులకే తప్ప కర్షక కార్మికులకు యెక్కువగా లేకుండెను.కూలులు యెక్కువచేసీ చేయ డములో వారి లాభములు కూలి వారిపరిశ్రమలు మూలపడక మానవు,జపాను బాగుపడుటకెల్లయు కారణము తక్కువ కూలులిచ్చి యెక్కువ వస్తువు తయారుచేసి ఇతర దేశములకంటె సరుకును విదేశపుటంగళ్ళలో చౌకగా అమ్మి వాటిని గుత్తగొనుటయే కనుక జపాను కర్షకకార్మికులకు బాగుపడేయోగము లేదన వచ్చును.జపాను కీర్తిలో తాముకూడాభాగస్వాములమే యను గర్వము ఉంటున్నన్నాళ్ళు వారు దారిధ్యముతో నీల్గగలుగుదురు. కాని వర్గచైతన్యముదయించిన తరువాత ఇదిసాధ్యముకాదు.జపానులో వర్గ చైతన్యము కూడ ఉదయించినది.

37
38
చీనా

వారు కల్లబొల్లి బోధనలతో ఊరకొనకున్నారు.సోవియట్టు సిద్ధాంతములు వారి తలలకు కూడ యెక్కుచున్నది.

జపానుకు పారిశ్రామిక విప్లవముతో పాటు విదేశములతో రంధికూడా యేర్పడినది.లంకాషైరు వర్తకము క్షీణించు ట వలన బ్రిటనుకు జపానుపై ఈర్ష్య పొడమినది.ఇరాకు, టర్కీ, పెర్షియా, కెన్యా, ఉగండా, రాష్ట్రములు జపాను వస్తువులనే కొనుట వలన బ్రిటిషు ఈర్ష్య మరియును వర్థిల్లినది.మెక్సికోలో కూడా జపానువస్తువులే ప్రాకుట వలన అమెరికాకు జపాను యెడల క్రోధము జనించినది.జపాను యెక్కడవెళ్లితే అక్కడ విదేశముల జండాలు ఎగురుచుండెను.జపాను జండాకూడా విశాలప్రపంచములో యెగురకున్నచో ఈ అంగళ్ళు దాని స్వాధీ నములో ఉండవు.ఈ విధముగా జపానుకు సామ్రాజ్యపిపాస జనించినది.ఇందుకై సైన్యవేద్ధి, నౌకావృద్ధి, వైమా నిక వృద్ధి చేసుకొనవలసి వచ్చినది. లాభములు గూబలలోనికి వచ్చినవి.ఆదా అయిన ధనమంతయు ఇందు కొరకే వ్యర్థమగుచున్నది.జపానుకు విదేశప్రభుత్వములతో నీవానేనాయను పరాక్రమముతో డీకొనగలశక్తి వచ్చిన దన్నమాట తప్ప మరేమియును మిగులకున్నది.నౌకాపరాక్రమములో గ్రేటుబ్రిటను, అమెరికా సంయుక్త రాష్ట్ర ము లతో సమానమైన స్థానము జపానుకు లభించిన నేమిగాక,ఇందుకై యెంత ధనము, జనము వమ్మగు చున్నదో ఊహింపవచ్చును.
జపాను

సైబేరియాలో ఒకప్పుడు జపాను సేనలు మిక్కుటముగ దిగినను, వానిని తిరిగీ తీసుకొని పోవలసి వచ్చెను. చీనాలో టనాకా గవర్నమెంటు పలుకుబడి హెచ్చి జపానుద్వేషము ప్రబలి జపానుదాడి ధిక్కరించబడుచున్నది. కొరియాలో జపాను ప్రతికూలతత్వము ప్రబలి జపాను కేప్టను నాకామూరా సంహరింపబడెను.దీనితో జపాను యుద్ధదాహము మరింత ప్రబలెను.యుద్ధము తప్ప ఈకార్యములను చక్కచేయగల సాధనము వేరేలేదని అది నిశ్చయించుకొనెను.చీనా జపాను రెయిల్వే కాన్ఫరెన్సు పుసికి పోవుటనే ఒకమిషగా తీసుకొని అది మరింత సైన్యవృద్ధి చేసుకొనెను.

మంచూరియా ఆక్రమణమునకది కంకణము కట్టుకొనెను. ఇందుకై జపానుకైన సైనికనావిక వ్యయములు 1930-31లో 442.8 మిలియను యెన్నులు.తరువాతి సంవత్సరములో ఈ వ్యయము 4546,697.2, 851.8, 937.3 గా పెరిగి 1935-36లో 1023.0యెన్నులాయెను.1934-35 లో జపాను చేసిన అప్పులు కాక ఆదాయములో నూటికి 70 వంతులు ఇందుక్రిందనే ఖర్చయ్యెను.ఇట్లే ప్రతి సంవత్సరమును అగుచుండె ను.పాశ్చాత్యపూంజీదారు ప్రభుత్వములో ఉన్నంత ప్రజాభిప్రాయగౌరమైనను జపానులో లేదు. అక్కడ సైన్యాధికారు లేదిచెపితే అదేమాట, ఎంత అడిగితే అంత ఇయ్యవలసినదే.ఈ విషయములో ఇటలీ,జర్మనీ ప్రభుత్వములను మించికూడ జపాను ఫ్యాసిస్టు అగుచున్నదనుటకు సందేహము లేదు. 40
చీనా-జపాను

జపాను సేనానయకు లెల్లరును పూర్వపుసామురేయి తరమునకు చెందినవారు.జపానుకు కొన్ని విజయములు కలిగేదాకా వీరు బ్రిటిషు సామ్రాజ్యముతో స్నేహముగా ఉండిరి.1904-5 సంవత్సరములో రష్యాపైని విజయము కలిగిన తరువాత జపాను ముక్కనులు తెరచి యేపాశ్చాత్యప్రభుత్వమును లక్ష్యము చేయక తనధీమా మిాదనే తాను వర్తించుచున్నది.దీనికంతటికిని కారణము జపాను ప్రభుత్వము యొక్క 30కేబినెట్టులలోను 11 మిలిటరీ ప్రధానుల(ప్రైముమినిష్టరులు)క్రిందను తక్కిన 19 సివిలు ప్రధానుల క్రిందను నుండుటయే.

జపానులో పార్టీలు
“ధనమూల మిదం జగత్” అని సామెత ఏ ప్రభుత్వము, పార్టీ, పరిశ్రమ, నావలు, సైన్యములు వర్థిల్లవలె నన్నను ధనము ప్రధానము.ఈధనము బ్యాంకుల ఆధీనము.ఈధనయుగములో బ్యాంకులు చేయలేని పని లేదు. ఒకచీటీ వ్రాస్తే యేపనిపడితే ఆపని అగును.ఏపలుకుబడి కావలస్తే ఆపలుకుబడి, పరపతి కలుగును. జపానులో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నవి.ఒకటి మిన్సిటో, ఇంకొకటి సియూకాయ్‌, మొదటిదానికి మిట్సూయీ బ్యాంకు, రెండవ దానికి మిట్సుబీషి బ్యాంకు మూలాధారములు.మిట్సూయూ బ్యాంకు మూడు ధనవత్కుటుంబముల చేతులలో ఉన్నది.జపానులోగల పట్టు, ప్రత్తి, బొగ్గు, నూనె, చక్కెర యంత్ర
జపాను

ములు,వర్తకముల కన్నిటికి వీరు పెట్టుబడి దారులు, ఇతర పరిశ్రమలు,వానిలో ముఖ్యముగా నౌకానిర్మాణ పరిశ్రమ కంతటికిని మిట్సుబీషీ బ్యాంకు పెట్టుబడిదారు.మరిమూడు చిన్న బ్యాంకులును ఇవ్వియును కలసి సాన్వాబ్యాంకు అనుపేరిట ఒక సమ్మేళన బ్యాంకు లేక అమాల్గమేటెడు బ్యాంకుగా ఉన్నవి.

1928 లో వయోజన ప్రాతినిధ్యమేర్పడిన తరువాత ఈరెండు బ్యాంకులును ధనమును విరాళములను విరజల్లి నియోజకవర్గము నంతటిని స్వాధీనము చేసుకొనినవి.ఇవి రెండును ధన ప్రధానములైన పార్టీలే.కాని ధనాధి కారమునకు కూడ ఒకమితమున్నది.ఒక భయంకర పార్టీలేస్తే అది దానికి తలయొగ్గక తప్పదు.జపానులో ఇట్టి టెర్రరిష్టు పార్టీలెన్నో ఉన్నవి.వీటికి కూడా సామురేయి వంశీకులే నాయకులు.వీరు మధ్యయుగము నాటి ఫ్యూడలు ప్రభువుల సంతతి వారు.జెన్యోషా సంఘము(నల్ల సముద్రము సంఘము)1879 ప్రాంతమున కొరియా, మంచూరియా ఫిలిపైను దీవులలో రహస్యముగా యేజంట్లను పెట్టి పనిచేసి ఆదేశమును స్వాధీనము చేసుకొనుటలో కొంత సఫలమైనది.1901 ప్రాంతములో టోయామా అనునతడు కొకూరు యూకేయి,అనేక కాళసర్ప సంఘమును సృష్టించి రష్యాపై విజయమునకు దారి చూపించినాడు.వీరి యేజంట్లు చీనా, ఆఫ్గనిస్తానను, ఫిలిపైనులు, మంచూరియాలలో పని చేయుచుండిరి.మరియొక పార్టీ

41
42
చీనా-జపాను
సేనలలోతిరిగి వారికి దేశాభిమానము నూరిపోయుచున్నది.1931 నాటికి వీరిసంఖ్య 27,60,000 వీరుకాక జపాను రిజర్విష్టు సంగమని యింకటున్నది. వీరు జపానులోని బౌద్ధమతావేశపరుల సహాయముతో జపాను సామ్రాజ్యతత్వము పైని చక్రవర్తి పైని వీరత్వముతోకూడిన పూజ్యభావమును కుదుర్చుచున్నారు.ఓదోగికాయ్‌, డెయినిప్పను, కొకుసుకేయి మొదలగు సంఘములు జపానులో కార్మిక విప్లవ భావములు కలుగకుండా ప్రచారమును ప్రారంభించుచున్నవి.కొందరు పార్లమెంటు సభ్యులు వీనిలి సంస్థాపకులు.డేనినిప్పను సంఘము కార్మికులను పూంజీదారులకును స్నేహము గూర్చుటకై సియూకాయి పార్టీవల్ల స్థాపించబడినది.వేరెట్టి హత్యలు దోపిడులు క్రౌర్యములు చేసినను వీరికి శిక్షలుండవు.ఇవన్నీ జపాను ప్రభుత్వ సంరక్షణమునకై ఒనరించ బడి నవి.తోచినంత మాత్రమున చాలును.విశ్వవిద్యాలయములు వామపక్షములు చెలరేగకుండుటకై దోహదము చేయుచున్నవి.ఇటువంటి సంఘములు నేడు 600 ఉన్నవి.శ్రీమంతులు, భూస్వాములు, సేనానాయకులు అందరును వీరికి సహాయము చేయుచుందురు.ఈవిధమైన భయంకర సంఘముల కన్నింటికిని యేదోయొక రీతిని విప్లవ ప్రతికూల ధన్యాధ్యమిత వాదజాతీయ సంస్థలతోను మనుష్యులతోను సంబంధముండనేయున్నది.
జపాను
ఈ కారణము వలన జపాను జాతీయతా సంఘట్టనకు, గౌరవభంగమునకు, సైన్యవిజృంభణమునకు, ఆశా పోషణమునకు భంగకరమైనట్లు అనుమానము కలిగించిన యెందరో ధీమంతులు, రాజకీయవేత్తలు, కమ్యూని ష్టులు, చివరకు సేనానులుకూడ రహస్యముగ వధించబడిరన్న ఆశ్చర్యమేమి! వాషింగ్టను ఒడంబడిక వీరి కిష్టము లేదు గనుక హారా అనునతడు వధించబడెను.లండను నేవల్‌ కాన్ఫరెన్సు తీర్మానము వీరి కిష్టము లేదుకనుక హామాగూచీయనునతడు వధించబడెను.జాతిసమితితో స్నేహముగానుండి లొంగిపోవుచున్నారను అనుమానముచే ఇనూకాయ్‌మినోయే అనువారలు వధింపబడిరి.మంచూకోలో యుద్ధపన్నాగము లేమిా వద్దని జనరల్‌ నాగాటా అనాడట.ఇందువల్ల లెప్టినెంటు కర్నలు అయిజవా అతనిని వధించెను.ఈ కర్నలును విచా రణకు తెచ్చిరి.ఈవిచారణకు వామపక్షము వారందరూ ఇష్టముగా ఉండిరి.దక్షిణపక్షము వారికిది యిష్టము లేదు.అయినను వామపక్షము లేక యెడమపక్షము గనకే యెన్నికలలో విజయమువచ్చి వారి క్యాబినెట్టు స్థాపించబడినది.దక్షిణపక్షము లేక కుడుపక్షము వారును వారికి చెందిన యువక ఉద్యోగ సంఘము వారును, రక్తసమితి(లీగు ఆఫ్‌ బ్లడ్)వారును రహస్యముగా కుట్రలు పన్ని ఈ క్యాబినెట్టులోని ముగ్గురను వధించిరి. ఒకనికి అపాయకరమగు గాయముచేసిరి, ప్రధానియగు ఓకాడాయనుకొని అతని బావమరదిని చంపివేసిరి;గనుక ఓకడా మాత్రము మిగిలి 44
చీనా-జపాను

పోయెను. ఇదియంతయు, 1936 ఫిబ్రవరి 26 వ తేదిని జరిగినది.వీరు టోకియో ఆయువుపట్టుల నన్నింటిని మూడుదినములు స్వాధీనమునందుంచుకొనిరి.తరువాత ప్రభుత్వమునకు లొంగిపోయినను, వీరి షరతుల నన్నింటిని క్రొత్త ప్రధాని అంగీకరించిన తరువాతనే క్రొత్త క్యాబినెట్టు యేర్పడినది.జపాను ప్రభుత్వము వరుస ఈరీతిని ఉండును.

ఇవిగాక కొన్ని సక్రమాభివృద్ధి సంఘములు లేకపోలేదుకాని ఇవిలేచిన వెంటనే అణగ ద్రొక్కబడుచున్నవి. సేనుకాటయామా 1897 లో రైల్వే లేబరుయూనియనును స్థాపించి ఒకగొప్ప సమ్మెకట్టు నడిపించెను గాని 1900లో ట్రేడు యూనియను లెచ్చటను ఉండారాదని ఒక పోలిసు చట్టము ప్యాసు చేయబడెను.1912 లో టోకియా ట్రాము పనివారలు, గనుల పనివారలు, ఓడలపనివారలు, అచ్చాఫీసు పనివారలు, పడవప పని వారలు సమ్మెలుకట్టి కొంత విజయము నందిరి.1918 లో వ్యవసాయపు పనివారలు కూడా తిరగబడిరి.ఈ విధముగా ప్రజాఉద్యమములు కూడా జపానులో చెలరేగు చున్నవి.కాని గవర్నమెంటువారి చర్యలవల్లను, కుడి యెడమపక్షనాయకుల భేదాభిప్రాయముల వల్లను ఇవి బలవంతము కాజాలకున్నవి.అయినను 1932 జపాను ట్రేడు యూనియను కాంగ్రసు లెక్కెల ప్రకారము చూచిన యెడల నూటికి 79 గురు కార్మిక సంఘములవారు కాంగ్రెసులో నున్నట్లే తెలియుచున్నది.అయినను జపాను కార్మికులలో
జపాను

నూటికి పదిమంది యైనను అసలు కార్మిక సంఘములలోనే చేరలేదు.సోషలుడెమోక్రటికు పార్టీ, జపాను సోషలిష్టు పార్టీలలో మొదటిది స్థాపించబడిన వెంటనే అనగా 1891లోను, రెండవది స్థాపించబడిన మరుచటి సంవత్సరములో అనగా 1907 లోను అణగత్రొక్కబడినవి.1912లో స్థాపించబడినను అయికాయి సంఘము కొంత స్నేహసంప్రదాయముతో వర్తించుచున్న కారణమున అసలే అణగత్రొక్కబడకుండా కాస్త కొనయూపిరితో జీవించుచున్నది. 1936 ఫిబ్రవర్లో స్థాపితమైన మిన్సీటీ పార్టీ ప్రభుత్వములో ప్యాసిష్టు ప్రతికూల పక్షమువారు 204గురు ఉండగా అప్పొజిషను పక్షమువారు 174 గురు ఉన్నారు.ప్యాసిష్టులకు ప్రతికూలముగా వోటులిచ్చిన కొందరిమిాద బాంబులుకూడా విసరబడినవి.

జపానులో యేపక్ష ప్రభుత్వమటు ఉండనీ, అది సైన్యమునకు కావలసిన ఖర్చుల నన్నిటినీ చెల్లించుచుండ వలసినదే.వాణిజ్యమంత్రులందరూ, యుద్ధ, నావికా, మంత్రుల చేతులలో కీలు బొమ్మలు.జపానులో అన్నిటి కంటెను ప్రధానమగు పరిశ్రమ,యుద్ధపరికరముల పరిశ్రమయే, కనుకనే వారిధాటీ ఈరీతిని చెల్లుచున్నది.

45
46
చీనా-జపాను
♦♦♦చీనామిాద కన్ను♦♦♦

జపానులో కలిగిన నూతన పాశ్చాత్య జాతీయ చైతన్య మూలకముగా జపాను జనసంఖ్య హెచ్చినది;పరిశ్రమలు పెఱిగినవి; సైన్యములు యుద్ధనావలు వృద్ధియైనవి.జపానువారు నివసించుటకును బాగుపడుటకును క్రొత్తసీమ లు;సరుకులు చెల్లుటకు, ముడిపదార్థములు సంపాదించుటకు వలసరాజ్యములు; సైన్యముల పనికై క్రొత్త అవ కాశములు కావలసియున్నవి.జపాను ప్రక్కనున్న విశాలదేశము, అనేక అవకాశములను పూర్తిచేయు దేశము చీనా యైయున్నది.కనుక జపానుకళ్ళు చీనామిాద పడినవి.


చీనా ఇదివరకే అనేక పాశ్చాత్యప్రభుత్వములకు గుత్తయై యుండెను.చీనాలో కూడా ఇంతోఅంతో జాతీయ విజ్ఞా నము సోవియటు ఆసయములు మొలక లెత్తినవి. కనుక జపాను ఆశలు సఫలము కావలెనన అవతల పాశ్చాత్య ప్రభుత్వములను ఇవతల చీనాప్రజలను డీకొనగల సామర్థ్యము కావలసియున్నది. జపాను తన పారిశ్రామికాభివృద్ధిని సైన్యాభివృద్ధిని కూడ ఇందుకొరకే చేయుచున్నది.

చీనాయొక్క దక్షిణ మధ్యభాగములును పసిఫిక్కుదీవులును ఇదివరకే మంచి నాగరికత పొందియున్నవి. వీనిని లోబరచుకొన్నచో తక్కిన చీనా సులభతరముగా వశ్యముకాగలదు కనుక ఈ భాగములలోనే ముందు ప్రవేశింప వలెనని జపానులో ఒక తెగవారి అభిప్రాయము.ఈ పనికై
జపాను

పూనుకొన్నచో ముందుగానే అమెరికాతోను ఇతరవిదేశములతోను విరోధమునకు సిద్ధముగా ఉండవలెను. జపానులో యుద్ధమంత్రివర్గములన్నియు ఇందుకనుకూలములు.

రెండవవర్గము అనగా పారిశ్రామిక ప్రభువులును వర్తకశిఖామణులును చీనావాయవ్యభాగమును ముందు స్వాధీనము చేసుకొనవలెనని కోరుచున్నారు.ఈభాగములు సులభసాధ్యములు, ముడిపదార్థసంపూర్ణములు, మంచి కలప దొరకును.కనుక నౌకాశాఖవారు కూడ దీనికే అనుకూలముగా ఉన్నారు.రెండువర్గములవారి యొక్కయు పరంపరాశయము చీనానంతటిని తమ స్వాధీననందుంకొనుటయే.

వాయవ్యచీనాలో ముడిపదార్థములు చౌక, వస్తువులు యెక్కువ చెల్లును కనుక 1931కి పూర్వమే జపాను పెట్టుబడిదారులు అక్కడ అనేక బట్టలమిల్లులు, బొగ్గుగనులు, నూనెమిల్లులు మొదలైనవి పెట్టి లాభములు తీయుచుండిరి.మంచిహక్కులు సంపాదించి ఇదివరకే అభివృద్ధి పొందుచుండిరి.కనుక మంచూరియా సులభముగా సాధ్యము కావచ్చును. ఇది సాధ్యమైనచో అవతల రష్యాకు ఇవతల అమెరికాకు కూడ జపాను ప్రక్కలో బల్లెమై యుండును.

1894 నుంచి జపాను చీనాలో ఒక్కొక్కముక్కను తీసుకొనుచుండెను.ఆ సంవత్సరం డెసెంబరు మాసములోనే ఫార్మోజాను తీసుకొనెను.రష్యా అడ్దుతగులబట్టికాని మం 48
చీనా-జపాను

చూరియా స్వాధీనమై యుండేడిది.1904-5 రష్యా జపాను యుద్ధములో రష్యా ఓడిపోయినది కనుక క్వాం టంగున్ను తూర్పు చీనా రెయిల్వే(దీనినే తరువాత దక్షిణ మంచూరియా రెయిల్వే అనిరి)చాలా భాగము న్ను జపానుకు స్వాధీనమైనవి.దక్షిణ మంచురియా వీరి ఆటలకు ఆటపట్టు(స్ఫియర్‌ ఆఫ్ ఇన్ప్లూయెన్సు) అయి నది.ఈవిధముగా జపాను సామ్రాజ్యము యొక్క పలుకుబడి ఆసియాలో వృద్ధియైనది.గనుకనే 1934 లో జపాను తన మన్రోడాక్టరిను ప్రకటించగలిగినది.

ఐరోపాయుద్ధము ప్రకటించగానే జపాను జర్మనీ యొక్క చీనా వలస రాజ్యములగు వెయిహినీను, షాంటంగుల ను, తత్ర్పాంతములందలి రెయిల్వేలను స్వాధీనము చేసుకొనినది.చీనాలో జర్మనీని ఒకా జపానే ఓడించి తన సామ్రాజ్యము నీరీతిని పెంచుకొనినది.చీనా రిపబ్లికు ప్రెసిడెంటు యుఆనుషిలేయిని వశీకరణ మొనర్చుకొని అతనిని చక్రవర్తిని చేయబూనినది.ఇట్లుచేసినచో గ్రేటుబ్రిటను, అమెరికాదేశములు తననెదిరించలేరనిన్ని,అంతగా యెదిరిస్తే కాస్త సదుపాయములు చేసి ఊరుకో పెట్టవచ్చుననిన్ని జపాను ఉద్ధేశ్యమై యుండెను.

1915 లో జపాను కాళసర్పసంఘమువారు డిమాండులను పెట్టిరి.వీనిని అయిదు భాగములుగా విభజింప వచ్చును.మొదటిభాగము ప్రకారము జర్మనీని చీనా నుండి తొలగించవచ్చును.రెండవభాగము ప్రకారము దక్షిణ మంచూరి
జపాను

యానులోపలి మంగోలియాలో తూర్పుభాగమును జపాను స్వాధీనములో ఉంచుకొనవచ్చును.మూడవభాగము ప్రకారము చీనాలో ఉన్నపెద్ద ఇనుపగనులన్నియు జపాను స్వాధీనమగును.నాలుగవ భాగము ప్రకారము చీనా యొక్క దీవినిగాని, సింధుశాఖనుగాని, రేవునుగాని హార్బరునుగాని ఒక్క జపానుకే కాక యితరజాతికిని బాడుగ వేయరాదు.అయిదవ భాగము ప్రకారము చీనా యెల్లయు జపానుకు ఆర్థిక రాజకీయదాస్యము చేయు నట్లు బిగించును.

యుఆన్‌షి-కాయ్‌, ఈడిమాండులకు లొంగుదామా మానుదామా అని చాలాకాలము తటపటాయించెను.కాని ఈషరతులకు ఒప్పుకుంటావా లేక యుద్ధముచేస్తావా అని జపాను అంత్య సందేశమును పంపినప్పుడు అయిద వ భాగము డిమాండులకు తప్ప తక్కినభాగముల కన్నిటికిని యుఆన్‌షి-కాయ్‌ తలయొగ్గెను.ఈ అయిదవ భాగమునకైనను యుఆన్‌షి-కాయ్‌ మొగముచూచి జపానులొంగలేదు.బ్రిటను మొదలగు విదేశీప్రభుత్వముల నిర్బంధమొకటియుండుటచే ఇప్పటిమట్తుకు జపాను ఆషరతులను ఉపసంహరించుకొనెను.

1916 లో జపాను చీనాలో ఒక ఒడంబడిక చేసుకొనెను.దాని ప్రకారము విరోధులనెదిరించుట యందును, ఉభయుల సంరక్షణమునందును ఒకరికొకరు సహాయము చేసుకొనుటకును యుద్ధసామగ్రిని చేకూర్చుటకును ఒప్పుకొనిరి.ఈ

4
49
50
చీనా-జపాను
విధముగా చీనానిండా సేనలు, ఉద్యోగస్తులు మొదలగువారిని జపాను దించగలిగినది.యుద్ధానంతరమున జర్మనీ వలసరాజ్యమగు చీనాభాగములను చీనాకిచ్చివేయుదురను ఊహలతో చీనామిత్రవర్గమునకు 1,75, 000 మనుష్యుల సహాయమును ఫ్రాన్సు మెసపోటేమియా ఆఫ్రికాలకు పంపెను.కాని యుద్ధానంతరమున మిత్రవర్గమువారు చీనా కోర్కెను తీర్చక అంతకుముందే ఆ ప్రదేశములనాక్రమించుకొనిన జపాను తీసికొనుట కంగీకరించిరి.అయిరోపాయుద్ధము అనాధజాతులకు స్వాతంత్ర్యమును ఎల్లరకు స్వయం నిర్ణయపు హక్కును ఇచ్చునిమిత్తమే జరుపబడినదను ప్రారంభప్రకటలు నమ్ముకొని చీనా యుద్ధానంతరమున ఈ దిగువ అయిదు కోరికలను కోరెను.(1)చీనాలో వివిధ దేశముల లాభముకొరకు ప్రత్యేకప్రదేశములు కేటాయింపబడినవి.వీనిని స్పియర్సు ఆఫ్‌ ఇన్ఫ్లుయెన్సు అందురు.మరే దేశములోను ఇట్లులేదు గనుక వీనిని తీసివేయవలెను.(2)చీనాలో విదేశప్రభుత్వముల సేనలు పోలీసులు ఉండరాదు.(#)తపాలా, టెలిఫోను తంతిశాఖలు విదేశస్థుల స్వాధీనములో ఉండరాదు.($)చీనాలో విదేశీయులకు స్వదేశస్థులకు కంటె మించిన హక్కులు (ఎక్స్ట్రాటెర్రిటోరి యల్ రైట్సు) తొలగించవలెను.(5)విదేశస్థులాక్రమించుకొనిన ప్రదేశములను చీనాకిచ్చివేసి విదేశ వస్తువులపై చీనాకిష్టమై అనుకూలమైన రీతిని సుంకములను విధించుకొన నీయవలెను.ఈ కోరికలు చాలా న్యాయమైనవి, ధర్మమైనవే.కాని వీనిని
జపాను

గూర్చి ఆలోచించవలసిన అవకాశమదికాదని ఇవి త్రోసివేయబడినవి.

చీనాలో పాదుకొన్న తొమ్మిది విదేశ ప్రభుత్వములకును వారిలోవారికే పడకపోవుటచేత అందరూ కలసి చీనాకు సరీగా అభివృద్ధి చేతామనే మిషపెట్టి యెక్కువ సమరసగా లాభాలు పంచుకొనుటకై ఒకసభ 1921 సెప్టెంబరు 12వ తేది మొదలు 6-2-1922 వరకు వాషింగటనులో జరిపి ఒక ఒడంబడికకు వచ్చినారు.ఈసభలో పాల్గొ నిన తొమ్మిదిదేశములు అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేటు బ్రిటను, ఫ్రాన్సు,ఇటలీ, జపాను,బెల్జియము , హాలండు పోర్చుగలు, చీనా. దీని ప్రకారము చీనాకు ఒక స్వయంవ్యక్తిత్వమున్నదని అంగీకరించారు.నిజం గా చూస్తే జపాను చీనాను యెక్కడ యెక్కువ మ్రింగివేయునో అని కల్పించిన యెత్తే ఇది.జపాను ఈసంగతి తెలుసుకున్నది.జపాను ప్రధాని టనాకా అనునతడు 1926“తనాకా ప్రణాళిక”(టనాకా మేనిఫెస్టో)ను ప్రకటించె ను. చీనాలోను కొరియాలోను జపాను ప్రతికూల తిరుగుబాటులు జరిగెను.వీనిని సహించకే జపాను టనాకా ప్రకటనము చేసెనని కొందరందురు. మంచూరియాలో బలవంతముగా సైన్యమును దింపి ఆక్రమింపవలె ననియే ఈ ప్రకటన సారాంశము.1931 సెప్టెంబరులో మంచూరియా ముఖ్యపట్టణమగు మూక్డెను నగరమును జపాను తీసుకొని మంచూకో రాజ్యమును నిర్మించెను.బ్రిటనుకు ఇది 52
చీనా-జపాను

ఇష్టము లేకున్నను,జపాను యేవోకొన్ని సౌకర్యములను చేస్తా నన్నందువలన లిట్టను కమిషనువారు ఈ ఆక్ర మణమున కనుకూలముగానే 1932 లో తీర్పు వ్రాసిరి.చీనా పెద్దగోడ పొడవునను జపాను మిలిటరీ స్టేషనుల ను నిర్మించెను.తరువాత జహోలు, చాహారు రాష్ట్రములను తీసుకొనెను.ఈ విధముగా ఉత్తర చీనాలో జపాను యేటేటా యెంతోకొంత తీసుకొనుచునే యున్నది.జాతిసమితి దీనిని లీగ్‌ ఆఫ్‌ నేషన్సుకాస్త ఆక్షేపించినదను కారణమున జపాను సమితిని తృణీకరించి వెలుపలకు వచ్చి వేసినది.

1933 లో జరిగిన టాంగుకూ ఒడంబడిక ప్రకారము చీనా, మంచూరియాను జపానుకు అర్పించినట్లే. ఈ ఒడంబడిక షరతు లిదివరకు బహిరంగముగా ప్రకటనము కాలేదు.ఇందులో సంతకము పెట్టిన చియాంగు కాయిషేకు జపాను స్నేహము కొరకు చీనానెంతవరకు ధారపోసినాడో తెలియుట కష్టము.లోపల మంగోలియాలో జపాను ప్రవేశించుటకై యెత్తులు పన్నుచున్నది.ఇందుకై మంచూకోకు ఆదేశమునకు మధ్యనున్న 15000 చదరపుమైళ్ళ ప్రదేశము అనగా జెహోలు చాహారు జిల్లాలను జపాను స్వాధీనముచేసుకొనియే యున్నది.
జపాను
¶¶¶చీనాలో విజయములు¶¶¶

మంచూకో రాజ్యముయొక్క విస్తీర్ణము జర్మనీ, ఫ్రాన్సు,స్విజర్లేండు, ఆష్ట్రియా దేశముల విస్తీర్ణమంత ఉండును. లోపలి మంగోలియాలో దూరుదమన్నను,అమెరికాను ప్రతిఘటింతమన్నను, ఉత్తర చీనాలో మరింత దొలుచు కొందమనను ఈరాష్ట్రము జపానుకు మిక్కిలి అనుకూలించును.

ప్రత్యేక స్వతంత్రరాష్ట్రమను పేరేగాని చక్రచర్తి హెన్రీపూయిా యొక్క కుటుంబ సంరక్షకశాఖ మొదలు సమస్త రాజకీయ సైనిక పోలీసు ఉద్యోగములును జపానువారివే.జపాను వెళ్ళుటకు ముందు మంచూకో దొంగల యము;శాంతికి శూన్యము, పరిశ్రమలు లేవు,వ్యవసాయము తక్కువ.జపాను దక్షిణ మంచూకో రెయిల్వేను తీసుకొని ఇతర రెయిళ్ళను వేయించి,పోలీసు స్టేషనులు పెట్టి శాంతి నెలకొల్పెను.మంచూకోలో నవ నాగరి కత నెలకొల్పేటందుకు 1932లో జపానుకు 29 మిలియనుల యెన్నులైతే,1934 లో 78 మిలియను లైనది.ఏటా ఈరీతినే ఖర్చులు హెచ్చుచున్నవి.మంచూకో రాజ్యస్థాపన సమయమున బ్రిటను, అమెరికా మొదలగు దేశము లకు మంచూకో తలుపు తెరచియుంచి అందరకు లాభములు కలిగిస్తానని సూచించినది కాని ఇంత దండుగ అవడము చూచి ఆతెరచియుంచిన ద్వారములనుండి పూర్వపువారిని వెళ్ళగొట్టుటే కాని క్రొత్తవారిని రానీయ కుండా చూచుచున్నది. 54
చీనా-జపాను

రాజ్యస్థాపన అయిన క్రొత్తరికములో మంచూకోకు సంవత్సరమునకు 40 మిలియనుల గాలనుల క్రూడు ఆయి లు కావలసియుండేడిది.దీనిలో 4/5 అమెరికా, బ్రిటను, డచ్చి కంప్నీల వారు ఇచ్చుచుండిరి.జపాను ఈ ఖర్చును భరించలేక కొంత పెట్టుబడి మంచూకోలోనే పెట్టి ఫుషూనుషేలు ఆయిలు తయారుచేయింప నిశ్చయిం చు కొన్నది.తక్కిన విదేశస్థులు ఇది అక్రమమని పెద్ద గోలచేసిరి.కాని జపాను లక్ష్యపెట్టలేదు.మంచూకోలో శాంతి నెలకొల్పుట,ఫ్యాక్టరీలు కట్తుట మొదలైనవన్నీ యెంతకష్టమైనను,జపాను వీటికన్నింటికిని తెగించుకొనుట కొక్కటే కారణము.ముందు మంచూకోలో బైటాయిస్తే క్రమంగా చీనా అంతలోను పెద్దతనం వహింపవచ్చుననియే జపాను యూహ.

మంచూకో వలన జపానుకు ఉత్తరోత్తరా మంచి లాభముగా వుండునే కాని ప్రస్తుతము అవసరములకది చాల దు.సరేగదా ముందుకలిగే లాభములకు ఇప్పుడు చాలావరకు దండుగ పెట్టుకోవలెను.జపాను జనసంఖ్య వెయ్యికి 30 కంటె యెక్కువ యేటాపెరుగుచున్నను వ్యవసాయ తరగతులు మంచూరియాకు వెళ్ళలేదు, వెళ్ళవు.వర్తకములు ఉద్యోగములుచేసి పైపైని తడుముకొనుటయే జపాను ఉద్దేశ్యము.ఇటువంటి పనులకై ఇదివరకే చాలావరకు వృద్ధికి వచ్చిన దేశము అవసరము. మంఛూకో దిగువనున్న ఉత్తర చీనా అనబడు అయిదు రాష్ట్రములును అట్తివి.హొపీయి, చాహారు, స్యూయి
జపాను

యాన్‌,షాన్సీ, షాంటంగులలో 90 మిలియనుల ప్రజలున్నారు.అనగా జపాను జనసంఖ్య కంటె 22 మిలియ ను లెక్కువ.వీరు సంవత్సరమునకు 200 డాలర్ల విలువగల విదేశీవస్తువులను దిగుమతి చేసుకొనుచున్నా రు.ఈ సరుకంతా జపానులో తయారైనదే అయిన యెడల అలాభములు కలసివచ్చుటయే కాక రానున్న యుద్ధమునకై మంచూకోలో చేయవలసిన ప్రయత్నములకది యెంతయు ఉపయోగపడగలదు.ఇదిగాక అక్కడ మంచి ఇన్నుము, నూనె, తగరము, రాగి బంగారము గనులున్నవి.అక్కడ మంచి ప్రత్తిపంట పండును. ఆప్రత్తి తన స్వాధీనములో ఉండిన యెడల ఇండియానుండియు అమెరికానుండియు సంవత్సరమునకు400-500 మిలియను టన్నుల ప్రత్తి దిగుమతి అగుటకు అవసరముండదు.అక్కడ పశుసంపద చాలా శ్రేష్ఠమైనది. వాటితోలు ఒలిచి చెప్పులు మొదలగు వస్తువులు తయారుచేసి ప్రపంచమున విరజిల్లవచ్చునని జపాను ఊహ. రెయిల్వేలు సిద్ధముగా ఉన్నవి గనుక రాకపోకలు రక్షణలుకొరకై తడములాడుకొననక్కరలేదు. యుద్ధ సమయ మున జపానుకు ఆహారము పోనీయకుండ చుట్టివేతమని అమెరికా రష్యాలు తలచుచున్నవి.ఉత్తరచీనా రేవులు జపాను చేతులలో వుండిన యెడల ఆపని సాగనేరదు.లోపలి మంగోలియాలోనికి సెంట్రలు ఆసియా లోనికి, టిబేటులోనికి యెగబ్రాక వలెనంటే ఇదిచాలా అవసరము.

55
56
చీనా-జపాను

మంగోలియాలో ఇంకను కొందరు మంగోలు నాయకులు జాతీయ భావపూరితులున్నారు.ఈజాతీయ భావము నూతగొని జపాను చీనారష్యాల కడ్డముగా వారిని నిలబెట్టవచ్చును.పశ్చిమ మంచూరియా,లోపలి మంగోలి యా, మంగోలియను రిపబ్లికు కలిస్తే మంగోలియా దేశమగును.జెహోలు, సౌంగాను అను రెండురాష్ట్రములు, మంగోలియాకు చెందినవి.అప్పుడే వానిని మంచూకో రాష్ట్రములోని అయిదు జిల్లాలలో ఒకభాగముక్రింద మార్చుకొనినది.చీనానుండి మంగోలియాకు యెవ్వరునూ పోకుండా రహదారీ ప్యాసుల సిష్టము జపాను పెట్టి నది.జపాను సేనలకు తెలియపరచకుండా ఆభాగములద్వారా రాకపోకలెవ్వరికిని సాధ్యముకాకున్నది.

హోపేయినుండిచీనా గవర్నరును తీసివేయవలెననిన్నీ,క్యూమింటాంగుతో దానికి సంబంధముండకూడదనిన్నీ, అక్కడ జపాను ప్రతికూల ప్రచారము చేయరాదనిన్నీ 1935 లో జపాను చీనాకు సందేశము పంపించినది. హోపేయితో సంబంధముంచుకొనని చీనాచేతులు కడుగుకొని జపాను విజయమును స్థిరపరచినది. చాహారు నుంచి కూడా చీనాగవర్నరును తరిమి జపాను తన గవర్నరును పెట్టినది.ఈ రెండు రాష్ట్రములతో తక్కిన మూడు రాష్ట్రములను చేరి వేరే స్వతంత్ర రాష్ట్రముగా కేటాయించవలెనని జపాను చీనాకు 1935 సెప్టెంబరులో ఒక సందేశము పంపినది.ఈరాష్ట్రమును"కమ్యూనిష్టు
జపాను

ప్రతికూల ఉత్తరచీనా స్వతంత్ర రిపబ్లికుసభ” అధికారము క్రింద నుంచవలెనని కోరినది.నవంబరు 23 వ తేదిని ఇందుకై యుద్ధమునకు కూడ దిగినది.కాని కొందరు కర్షకులు పన్నులీయమని తిరగబడుట వలన జపాను కొంచెము శాంతించి వెనుకకు తగ్గినది.పీపింగు, టీస్ట్సిను మొదలగు నగరముల ప్రజలు చీనా పక్షపాతులే యైనను జపాను సహాయము లేనిదే తాము నెగ్గలేమని తక్కిన మూడు రాష్ట్రముల గవర్నరులకును తెలియ వచ్చినది.కనుక ఈ అయిదు రాష్ట్రములును నేడు చీనానుండి యింకా సంపూర్ణముగా స్వతంత్రములు కాకున్న ను చీనాకందు పలుకుబడి లేదనియు జపాను చెప్పినట్లుగా ఆడి జపానుకు లొంగియుండుచున్న వనియు విశదమగుచున్నది.

₪₪₪మంగోలియా చరిత్ర₪₪₪
మంచుకో దేశమునకు పడమరను రెండుదేశములున్నవి.దక్షిణభాగమునకు లోపలి మంగోలియా అనియు, ఉత్తరభాగమునకు వెలుపలి మంగోలియా లేక మంగోలియన్‌ రిపబ్లికు అనియు పేర్లు.ఈ రెండింటికిని చాలా భేదములున్నవి.మంచూకో రాజవంశమువారు మొట్టమొదట దక్షిణభాగముతో స్నేహముచేసి ఉత్తరభాగమును కూడా బెదరించి చీనానంతటిని జయించి ఒక సామ్రాజ్యముగా కొంతకాలము వరకును పరిపాలించిరి. ఈవిధము గా 1911 వరకు ఉండెను.1911 లో చీనా రిపబ్లికుస్థాపించబడగానే ఉత్తర మంగోలియా 58
చీనా-జపాను

తాను వేరే రిపబ్లికుగా ప్రకటించుకొనెను. లోపలి మంగోలియా మిాద చీనా అధికారము కలిగి యుండగోరెను గాని అదిసాగలేదు.కనుక ఈ రెండు రాష్ట్రములును అప్పటినుండి చీనాతో సంబంధము లేక స్వతంత్రముగానే ఉన్నవి.

క్రమక్రమముగా ఉత్తరమంగోలియాకు చీనాతోకంటె రష్యాతోనే సంబంధము ముదరజొచ్చెను.ఈదేశమునకు ఉర్గా నగరము రాజధాని, రష్యా సహాయముతో ఇక్కడ శాంతి నెలకొనెను. మధ్యయుగమునాటి జమిాందారీ తత్వము వదలిపోయెను.పశువుల మందలు పెరిగెను.1911-15 మధ్యను జారులు 5మిలియను రూబుల్సు మంగోలియాకు బదులిచ్చి బాగుచేసిరి. జపాను, చీనా కూడా తిరిగీ మంచి మాటలతో మంగోలియాను తమలో చేర్చు కొన గోరినవి కాని సాధ్యము కాలేదు.

వెలుపలి మంగోలియాలో చీనా జనరలు హ్సూ అనునతడు 1919 ప్రాంతమున కొంత భయంకరదారుణ పరి పాలనమును ప్రారంభించెను.కాని అంగెర్ను స్టెర్నుబర్గు అను ఒక్క పిచ్చి ప్రభువు(మేడ్‌బారిన్) ఆసమయమున లేచెను.అతడు జెంఘిస్కాను వంశీయుడు. లోపలి, వెలుపలి మంగోలియాలను కలిపి మంగోలియా సామ్రాజ్యముచేసి“ఆసియా వాసులకు ఆసియా” ఉండవలెనని అతను కొంత అలజడి చేసెను,జపాను ఇతనికి చాలాసాయమును కూడా చేసెను. కాని మూడు నెలలు దాటకుండా ఇతని పిచ్చిపరిపాలన మంతమొందెను.
జపాను

చీనా జనరలు హ్సూక్రిందను,మంగోలియా ప్రభువు అంగెర్నుస్టెర్ను క్రిందను పీడితులైన ప్రజలందరును మంగోలి యను ప్రజాపక్షమును స్థాపించిరి. ప్రభుత్వమును కూడానెలకొల్పిరి.పిచ్చిప్రభువును, చీనా జనరలును కూడా ఓడించిన వారు వీరే. వీరికి రష్యా సోవియటు ప్రభుత్వము సహాయమొనరించెను.చీనాప్రభుత్వము మంగోలియా ను తనక్రిందనుండి విడతీయరాదని సోవియటు ప్రభుత్వమునకు అర్జీ పెట్టుకొనెను. సరే చీనా క్రిందనే ఉండనీ అని రష్యాఊరకొనెను.అయినను మంగోలియా రిపబ్లికుపై చీనాకు నిజమైన యెట్టిఅధికారమును లేదు.ఈ దేశ ములో చాలామందిది బౌద్ధమతము.వారు సజీవబుద్ధుని(లివింగుబుద్ధ)పూజింతురు.కనుక బౌద్ధ లామాకు కొం త మతాధికారమున్నను,నిజమైన పరిపాలకులు మంగోలియను ప్రజాపక్షమువారే.1924 వరకుఒక బుద్ధుడు చస్తే మరియొక బుద్ధునెన్నుకొనుచుండిరి.కాని అప్పటినుండి ఆబుద్ధుని అనుచరులకు కాస్త ఆస్తిని విడచిపెట్టి తిరిగీ బుద్ధుని ఎన్నుకొనుటెమానిరి.

మంగోలియా రిపబ్లికు కాకముందు ఆదేశవర్తకమంతయు చీనావారి చేతులలో నుండెను.చీనావారు వారికి సరు కులరువిచ్చి అప్పులలో ముంచి పీడించుచుండిరి.రిపబ్లికు రాగానే ఆఅప్పులన్నీ రద్దుచేసినది. సహకార వ్యాపా రము వృద్ధియైనది. వెలుపలి మంగోలియాలో ఉన్నంత జాతీయత లోపలి మంగోలియాలో కాని మంచూకోలో కాని లేదు.ఇక్కడి పాఠశాల

29
60
చీనా-జపాను

లలో మంగోలుభాష, సేనలు మంగోలియా సేనలు, ఉద్యోగస్థులు మంగోలియనులు, వ్యవహారములు మంగోలి యాకు లాభప్రదములు:రెయిల్వేలు మొదలైనవి మంగోలియా స్వాధీనములో ఉన్నవి.రష్యా తూర్పుదేశ అంత ర్వ్యవహారములలో ఎట్టి జోక్యమును కలిగించుకొనదు.పరిశ్రమలు ఆధునిక పద్ధతులతో నడుచుచున్నవి.

దీనికంతకును కారణము రష్యాకు సామ్రాజ్యతత్వదురాశలులేకుండుటయే.1925 లో టర్కీతోను, 1926 లో అప్గనిస్థానముతోను,1927 లోపెర్షియాతోను పరస్పర స్నేహము, ఆక్రమణ విరుద్ధము అయిన ఒడంబడికలను చేసుకున్నది.మంగోలియా రష్యాచేతిలో కీలుబొమ్మ రాజ్యము కాదు.మంగోలియా రష్యాకు లొంగివున్న కంటె స్వతంత్రమై వుంటేనే రష్యాయొక్క తూర్పుదేశవ్యవహారనీతి కెక్కువ అనుకూలము.1933 లో రష్యా బలవంతమై యుంటే జపాను మంచూకోను స్వాధీనము చేసుకొనలేకుండేడిదట.మంచూకో స్వాధీనమైనంత మాత్రమున జపాను మంగోలియా రిపబ్లికుమిాద సులభతరముగా దాడి వెడలగులుగు ననుకొనుట కల్ల.మంగోలియాకు రష్యాపూర్ణముగా అండనిలచి యున్నదిగనుకనే జపాను ఆటలు సాగకున్నవి. మంగోలియా సరిహద్దులో జపాను ఎన్నో పితూరీలు రేపినది కాని దండయాత్రకు పూనుకొనలేకున్నది.జర్మనీ రష్యామిాదికి దాడి వెడలినను, జపాను దక్షిణచీనా, మధ్య చీనాలమిాదికే తగులునుకాని మంగోలియా మిాదికి వెళ్ళగలుగునేమో సందేహమే.
జపాను
♦♦♦చియాంగుకాయ్‌ సంకల్పములు♦♦♦♦

చియాంకుకాయ్‌షేకు నేడు చీనాకు డిక్టేటరు.నాంకింగు రాజ్యస్థాపకుడు.బుర్జువా వర్గమునకధినాధుడు.చీనా ఆయువుపట్టులన్నియు అతని స్వాధీనములో ఉన్నవి, నిజమే.కాని జపాను కతను లొంగిపోవుచుండుట ఆశ్చర్యము.అతనిలో జాతీయతత్వమునకు లోపమున్నదని యెవ్వరును అనలేరు.రష్యా సహాయముతో జపా ను ను కొట్టుటకాని,జపాను సహాయముతో రష్యానోడించుటకాని చీనా జాతీయవాదులకు సరిపడదట. నానా జాతి సమితివారు చీనా నుద్ధరింతురేమో అన్న ఆశ కొంతకాలముండెడిది కాని అది నిరాశయైనది. జపానుతో తాను డీకొనలేనన్న కారణము తప్ప చియాంగుకాయ్‌షేకుకు జపాను పక్షపాతముకాని ఆశకాని యేమిాలేదని చెప్పవచ్చును.అతనికి కావలసినదంతయు స్వతంత్ర చీనారాజ్యము.దీనికి భంగముగా జపాను యెన్ని కార్య ము లొనరించుచున్నదో, రష్యాపక్షపాతియగు చీనా కమ్యూనిష్టుపార్టీ అన్ని అవకతవకలు చేయుచున్నదని అతని విశ్వాసము.ఇల్లు చక్కపడనిదే పై వారిని తడుమలేమని అతని వ్యవహారనీతి.ఈకారణమున అతడు తన ప్రయత్నములను జపాను మిాద కంటె చీనా కమ్యూనిష్టు పార్టీమిాద కూడా యెక్కువగా కేంద్రికరించు చున్నాడు:పోనీ చీనా కమ్యూనిష్టుల దన్నుతో జపాను మిాద తగులుదమన్నను, ఈ కమ్యూనిష్టులు అంతవరకే అత

61
62
చీనా-జపాను

నితో స్నేహముచేసి, తరువాత చీనాను రష్యాకమ్యూనిజంకు ధారపోయుదురని అతని భయము.ఈ కమ్యూని ష్టుల సహాయముతో అతను జపాను నోడించగలుగునా లేదా అన్నది సందేహాస్పదమే యైనను, ఈలోగా చీనా అంతయు కమ్యూనిష్టు అగుట నిశ్చయమని అతని ఉద్దేశము.

ψψψ చీనానట్లు చేయుట అతనికిష్టము లేదు ψψψ
ఈలొసుగు చూచుకొనియే జపాను మంత్రి హిరోటా మూడు విషయములతో కూడిన ఒక డిమాండును పెట్టెను. చీనాలో కమ్యూనిజం లేకుండా చేయుటకు చీనా జపానులు రెండును పూనవలెను. అనగా యీ మిషతో చీనా లో జపాను యెక్కడెక్కడ సేనలు నింపినను అంగీకరించవలెను.ఇది మొదటి విషయము.రెందవది విదేశ ప్రభు త్వములలో నేయొక్కదానినైనను అణచుటకు రెండవదాని సహాయమును చీనా ఆక్షేపించరాదు.దీనికర్థము చీనాఒక్క జపానుతో తప్ప మరియే యుతర ప్రభుత్వముతోను సంబంధముండరాదనియే.అనగా చీనా విదేశ వ్యవహారనీతియంతయు జపాను స్వాధీనములో నుండవలసినదే.మూడవది చీనా జపాను మంచూకోలు పర స్పరార్థిక సహకారముతో వర్తించుచుండుట.అనగా మంచూకో నాణ్యములు తక్కిన చీనా అంతటిలో చలామణి కావలెననియే.ఇట్లు చేసినచో చీనాయెల్లయు అనతి కాలములో జపానుకు వలసరజ్యముకంటెను కనిష్టమగు ను.
జపాను

నానాజాతి సమితి ఆశ చీనాకు లేకున్నచో చీనా దీనినంగీకరించుటా మానుటా యనునదియే చీనా సమస్య.ఈ కారణము వల్లనే జపాను యెన్నిముక్కలు కోసుకొనుచున్నను నాంకింగు ప్రభుత్వము సాధ్యమైనంతవరకు ప్రతి ఘటించి, వీలుతప్పితే అంగీకరించవలసిన గతి పట్టుచున్నది.ఈ పద్ధతి యిష్టము లేకనే ఫ్యూకనులో విప్లవము లేచి కమ్యూనిష్టు ప్రభుత్వము నెలకొల్పబడినది.కాని అది మూడుమాసములు మాత్రమే జీవించి అంతరించిన ది. అయినను 1932 నాటికి అనేక రాష్ట్రములలో శాంతముగా సోవియటుప్రభుత్వము స్థాపించబడినది. చీనా లో యేభాగమునందు సోవియటుప్రభుత్వము స్థాపించబడినను దానినణచివేయుదునని జపాను భీష్మించి నాం కింగు ప్రభుత్వము సహాకారము చేయవలెనని నిర్బంధించుచున్నది.నాంకింగు ప్రభుత్వము ఇందుకు టంగుకూ ఒడంబడిక(1933 మే)ద్వారా అంగీకరించి జపానుకు సహాయము చేయుచున్నట్లే మనము గ్రహించవచ్చును. ఒడంబడికలన్నీ అతిరహస్యముగా జరుగుచున్నవి గనుక యేసంగతిగాని తెలిసికొనుటకు సాధ్యముకాదు.

విద్యార్థి ఉద్యమములు
చీనా విద్యార్థులకు కళాశాలలలో జపాను ప్రతికూల భావములు బోధింపబడుచున్నవి.ఊత్తర చీనా, చీనానుండి స్వతంత్రమగుట కాని జపానుప్రతిభ అక్కడ హెచ్చించుండుట కాని వీరికిష్టము లేదు.పీపింగులో 1500 మంది విద్యార్థులు 64
చీనా-జపాను

సమ్మెకట్టి జపానుకు ప్రతిఘటనమును ప్రకటించినది.టీన్‌స్టిన్‌ నగరవిద్యార్థులు వీరికి తోడైరి.ఇంకెందరో విద్యా ర్థులు కూడ వీరితోకూడిరి.ఈ ఉద్యమము కళాశాలలనుండి హైస్కూళ్లుమిడిలుస్కూళ్లకు కూడా వ్యాపించినది. చీనా అంతటను ఒకటే కేకలు:

(1)ఉత్తర చీనా విడిపోరాదు.

(2)ఉత్తరచీనా పౌరులకు సాయము చేయవలెను.

(3)చీనాకు ప్రతికూలమైన రాయబారములను నిరాకరించవలెను.

(4)నాంకింగు ప్రభుత్వము విదేశముల దాడి నెదుర్కొనవలెను.

(5)చీనాయంతయు సంయుక్తము కావలెను.

(6)చీనాలో ఒక అంగుళము మేరయైనను విదేశీయులలు లోబడరాదు.

1936 జనవరి 15వ తేదిని చియాంగు కాయేషేకు కాలేజి ప్రొపెసర్లు, స్కూలుమేష్టర్లు మొదలగువారిని పిల పించి వారికి సంగతి సందర్భములెల్లయు బోధపరచెను.విద్యార్థులు కొంతవరకు సమాధానపడినట్లు కనిపించిరి. కానివారి ప్రశ్నల కన్నింటికిని చియాంగుకాయేషేకు సరియైన సమాధానములను చెప్పక తనశక్తినంతటిని కమ్యూనిష్టుల నణచుటయందే కేంద్రికరించుచుండుట చేత వారి ద్వేషము క్రమేణా మరింత వృద్ధియైనది-చియాంగు కాయ్‌షేకు సరియైన సమాధానములను చెప్పక తప్పదు.
జపాను
¶¶¶పాశ్చాత్య ప్రభుత్వముల వైఖరి¶¶¶

జపాను ఈవిధముగా చీనా నాక్రమించుచుండగా పాశ్చాత్యప్రభుత్వములేమి చేయుచున్నవి?గ్రేటుబ్రిటను తాను స్వతంత్రముగ నెట్టిచర్యయు తీసుకొనదు. నానాజాతి సమితి ద్వారా మాత్రమే అదియేమైనను చేయగలదు. నానాజాతి సమితిలో తగిన బలము కాని అయికమత్యము కాని లేదనుట విశదము. అమెరికా సంయుక్తరాష్ట్ర ములకు జపాను ఆక్రమణలు ఇష్టము లేదు.అయినను ఈవ్యవహారములను పైసలు చేసుకొనవలసినది చీనా వారే కనుక తాను యెక్కువ ప్రమేయము కలిగించుకొనదు. చీనాపౌరుల మిాదనే అది ఆశపెట్టుకొని కూర్చున్న ది.జర్మనీ జపానులో ప్రత్యక్షముగా సంధియే చేసుకొన్నది.సోవియటు తత్వమునకు ఇవిరెండును సమాన విరోధులు. నాంకింగుప్రభుత్వము బ్రిటను నుండి 200 మిలియనుల పౌనులను ఋణముగాకోరెను.కాని జపాను కిది యిష్ట ములేని కారణమున యేమి కొంపములుగునో అని గ్రేటుబ్రిటను ఇయ్యలేదు.జపాను అంటే బ్రిటనుకు బెదురు లేకపోలేదు.ఆబెదురువల్లనే బ్రిటను పసిఫిక్కుదీవులలో సింగపూరును బలపరచుచున్నది.దీనికి ప్రతిహతముగా జపాను సయాములో క్రాకెనాలును త్రవించి బలపరచుచున్నది. ఇంతవరకు బ్రిటనువైపు చూచుచున్న సయాము 1931 నుండి జపాను వైపు

5
65
66
చీనా-జపాను

తిరిగి పెట్టుబడి, యంత్రచాతుర్యము, పడవలు, సబ్మారెయినులను సేకరించుచున్నది.వాషింగ్టను ఒడంబడిక, కెల్లాగు ఒడంబడికనన్నింటిని జపాను తిరస్కరించినదునుట నిస్సంశయము.అమెరికా మన్రో సిద్ధాంతమునకు ను, జపాను మన్రోసిద్ధాంతమునకును హస్తిమశకాంతరమున్నది.అమెరికా సిద్ధాంతము,ఇతర తెల్లజాతులు లాటిను అమెరికాలోకి రావలదని మాత్రమే శాశించుచున్నది.జపాను సిద్ధాంతము జపాను చీనా నాక్రమింప వచ్చుననియు ఇతరదేశములు అందులో ప్రమేయము కలుగజేసుకొనరాదనియు నిషేధించుచున్నది.

రష్యా కూడా అమెరికా బ్రిటనులకు సహాయము కాకపోతే అవియుద్ధరంగములోనికి దిగవు.రష్యాకు విదేశాక్రమణ వాంఛలేదు.కనుకనే జపాను యెంత తుందుడుకుపడుచున్నను రష్యాఊరకొనుచున్నది.జపానుతో స్నేహము కొరకు రష్యా, చీనా తూర్పురెయిల్వేను జపాను కమ్మివేయుట కంగీకరించెను.జపాను కొనుక్కొనుటకు నిరాక రించి అల్లరులు చేయుచున్నది.జపాన్ ఒక్క రెయిల్వేలయినుతో తృప్తిపొందదు.మంచూకో సరిహద్దులను పొడ గించుటయే దాని సంకల్పము.రష్యా జపానులు రెండు సరిహద్దు రాష్ట్రములలో అనంతమగు సేనలను దింపు చున్నవి.వ్లాడివస్టకు వద్ద కూడ రెండుదేశములను తమనౌకాబలములను కేంద్రికరించుచున్నవి.ఎప్పుడో ఒకనాడు నౌకావైమానిక సైనిక యుద్ధమురాకమానదని పెక్కుఱు ఊహించుచున్నారు.ఇదివరలో
జపాను

ఐరోపాలో యుద్ధము జరిగితే జపాను బాగా జుఱ్ఱు కొనఁగలిగినది. ఇప్పుడు వచ్చేది ఒక్క ఐరోపాయుద్ధమే కాక దూరపు ప్రాగ్దేశ యుద్ధము కూడా అగును గనుక జపాను అందులో మునిగిపోవునని పాశ్చాత్యదేశము లూహిం చుచున్నవి.

♦♦♦1937 యుద్ధము♦♦♦

ప్రస్తుతము ఉత్తరచీనాలో చీనా జపానులకు యుద్ధము నడచుచున్నది. పీపింగు, టీన్సీలను మొదలగు నగర ముల నుండి చీనాసేనలు తొలగిపోవలెనని జపాను ప్రకటించెను.చీనాసేనలట్లు తొలగలేదు.ఆమిష మిాద జపా ను సేనలు చీనాసేనలనెదిరించినవి.చీనా సేనలు పీపింగువద్ద ఒక దేవాలయములోనికి తరుమబడినవి. బ్రిటను రాయబారులు అపాయమునుంది తప్పుకొనుటకు తాపత్రయము పడుచున్నారు.చీనా సేనలకు జనరలు సంగు చయను అధికారి.అతనికి నాంకింగు ప్రభుత్వము కావలసిన సహాయమునెల్లచేయుచున్నది.టంగుచౌ నగర మువద్ద 500 చీనావారు మరణించిరి. టెలిగ్రాముతీగెలు తెంచి వేయబడుటచే అక్కడి వార్తలు స్పష్టముగా బయటకు రాకున్నవి. ఫ్రాన్సు, బ్రిటను,అమెరికాదేశములు శాంతికొరకై ప్రయత్నించవలసినదని చీనా జపాను ప్రభుత్వములకు సందేశముల నంపినవి.అమెరికా జపానుకు తొమ్మొదిరాజ్యముల ఒడంబడిక ప్రకారము వర్తిం చుమని కబురు చేసినది.

67