Jump to content

చీనా - జపాను/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

చీనాదేశము బహు విశాలమైనది.దాని విస్తీర్ణము 11,000,000 చదరపు మైళ్లు.వైశాల్యములో దీనికన్న కాస్త పెద్దది ఒక రష్యా మాత్రమే.జనసంఖ్యలో దీనికి ఈడైన దేశమే లేదు.చీనాజనాభా 450,000,000 అనగా ఐరోపా దేశాలన్నీ కలిపినా దీనికి సరికావు.ఇంచుమించుగా బ్రిటిషు సామ్రాజ్యమంతా కలసిన యెంత వైశాల్య ము,యెంత జనాభావుండునో ఒక్కచైనాలోనే అంత వైశాల్యము అంత జనాభా వున్నవి.

చీనా సభ్యత,విజ్ఞానము,ఉత్పత్తి,వాణిజ్యము మొదలైనవి నిన్నటివి,నేటివి కావు.5000 సంవత్సరముల క్రింద టనే ఇది అనన్య సామాన్యఖ్యాతి గాంచినది.గ్రంథములు,పాండిత్యము మాట తరువాత చూతము.తుపాకి మందు నావిక దిగ్దర్శని(magnatic compass),కాగితములు,ముద్రణము మొదలగు నవనాగరిక పరికరము లుకూడ ఐరోపీయులకు కంటె కొన్ని వేలయేండ్లు ముందర నుండియే చీనావారికి తెలిసియుండెనట.

ఎన్ని యుండిననేమి,ప్రాచీన విశాల దేశములకెల్ల యెట్టిగతి పట్టినదో చీనాకును అట్టిగతియే పట్టినది.నవనా
V

గరికత, యంత్రపటిమ, సైనిక శిక్షణము, నౌకానిర్మాణము, వాణిజ్య కౌశల్యము ,మొదలగు వలలనుపన్ని చీనా ఇండియాలవంటి దేశములను పిండుకొని తినగలశక్తి చిన్నచిన్న చీలిక దేశములకు కలిగినది. ఈమహా ఖండముల వైశాల్యమే నేడు వీటికిముప్పు అయినది.వీని జనబాహుళ్యమే వీని బలహీనతకు కారణమైనది. ప్రాచీన విజ్ఞానస్మృతియే నవనాగరికత యెక్కకుండుటకు హేతువైనది.ఈదేశము రెండునువర్థిల్లవలెనంటే ఇవి చిన్నచిన్న రాష్ట్రములుగ చీలి,జాతులు జాతులుగా తూలి, ప్రతపద్ధతులను మరచి, క్రొత్త సంఘటనమును మరగి పశ్చమ దృష్టితో విజృంభించక తప్పునా యనిపించును.ఈపనికై యివిపూనుకోనన్నినాళ్ళు వీనిని గ్రహిం చుచున్న విదేశదాస్యము వీనికి తప్పదు.

బ్రిటిషు ప్రభుత్వము హిందూదేశమునునకు ఈశ్వర విలాసమనియు వరప్రసాదమనియు మితవాదులెల్లరును పొగడుచుందురు.ఒక్క అర్ధములోమాత్రమే ఇది సత్యముకావొచ్చును.చీనాదేశము స్వతంత్రదేశమను పేరబరగు చున్నది గనుక దానిని పిండుకొని పెక్కుదేశములు వర్ధిల్లుచుందగా మనము ఒక్క బ్రిటిషువారి బారిలో మాత్ర మే ఉన్నాము.చీనాను వివిధదేశములు వాణిజ్యము,వాణిజ్యసౌకర్యములు అనుపేరులతో మాత్రమే పీకుచున్న వి కాని, మనము బ్రిటిషు వారికి వలసిన వాణిజ్య సౌకర్యములన్నియును మాత్రమే కాక
VI

మనల నొంచుచున్న ప్రభుత్వ వ్యయమునకగు భారమునెల్ల వహించవలసి వచ్చుచున్నది. చీనాకు ఆర్ధిక దాస్యమే కాని రాజకీయదాస్యము లేనందువలన అక్కడ స్వాతంత్ర్యోద్యమములేచి,సేనలను తయారుచేసి, విదేశ స్వదేశ శత్రువుల మెదరించుటకు తగిన అవకాశములు కనిపించుచున్నవి. కాని మన రాజకీయ దాస్యము మనలను నిర్వీరులుగను,నిరాధుయులు నిరుద్యోగులుగ జేసినది గనుక సాత్విక నిరోధము,సత్యపధము, సర్వసహనములే, మనకు శరణ్యములగుచున్నవి.చీనా తనను పీడించుచున్న విదేశపు శక్తుల నొకదాని మిాదికి వేరొక దానిని లేపి ఆడించుదామని ప్రయత్నించుచున్నది.కాని పదిమంది బలవంతుల మధ్య నిలచిన ఒక్కబక్కదాని వలె దాని ఆటలు సాగకున్నవి.మనకు బ్రిటిషువారి సుహృద్భావమో ఈశ్వరుని విలాసమో తప్ప అన్య విధముల స్వరాజ్యము లభించు మార్గము కానరాకున్నది.

అయినను చీనాకును మనకును కొన్ని సామాన్యపోలికలు ఉన్నవి.రెండును విశాల వ్యవసాయకదేశములు. రెండింటి యందును యంత్రపరిశ్రమ లిప్పుడిప్పుడే తలయెత్తుచున్నవి.రెండును పాశ్చాత్య సంపత్పిపాస కెఱలై శల్యములుగా చేయబడినవి.రెండును తెప్పరిల్లుటకై తన్నుకొనుచున్నవి.రెండింటికిని పాశ్చాత్యవాసనలు వచ్చినవి.ప్రతపద్ధతులను కూలదన్ని క్రొత్తవిధనములకు పూనకున్నచో ఈదారిద్య్రము
VII

పోదు,ఈదాస్యము నశించదు,ఐకమత్యము కుదరదు, ఐశ్వర్యము లభించదు అని నిశ్చయము చేసుకున్నవి. రెండింటియందును పట్టణములు యంత్రపరిశ్రమలును తలయెత్తినవి.కొన్ని స్వదేశీ పెట్టుబడుదారులవి,మరికొన్ని విదేశి కంపెనీల వారివి.

ఫ్యాక్టరీలు యెవ్వరివైనను, కార్మికుల నోళ్ళలో కరక్కాయే,వినియోజకుల నెత్తికి దెబ్బలే,ఒక్క పూంజీదారుల యెుడులలో మాత్రము అనంతమైన లాభములు.ఆధునిక నగరములు,యంత్రములు,ఉత్పత్తి, లాభములు అవతల ప్రారంభించగానే,ఇవతల కార్మిక సంఘములు యెక్కువకూలి తక్కువ గంటలకై డిమాండులు, సమ్మెలు, కార్మికరాజ్య స్థాపనకై ప్రయత్నములు, సాంఘిక తత్వబోధనలు వెనువెంటనే రాకమానవు.కార్మిక ప్రబోధముతో కర్షక ప్రబోధము కూడ వెంటనే కలుగును.బీడు భూములన్నీ సాగుకావలెననీ, మంచి యెరువులు వేయవలెననీ, భారీమిాద యంత్రపద్ధతులతో వ్యవసాయము చేయవలెననీ, కష్టపడిన వారికే ఫలమంతా దక్కవలెననీ, సోమరిపోతు భూస్వాములను అణిచి వేయవలెననీ రైతు రాజ్యం స్థాపించవలెననీ ఆందోళన బయలుదేరుతుంది. కర్షక కార్మికు లేకముకాకుంటే వారికష్టములు తీరవని వారికి నిశ్చయం కలుగుతుంది. రాజకీయంగా ఆర్ధికంగా, సాంఘింగా, ఆవసరమైతే సైనికంగా ఇరువున్నూ ఒక్కటే
viii

తరగతియై మరియొక తరగతి భూమిమోద లేకుండ మిాద లేకుండా పోయే వరకూ పోరాడుతారు.రష్యాలో సోవియటు రాజ్యమట్టిది. చీనాలో దినదిన ప్రవర్థమానమగుచున్న కమ్యూనిష్టు పార్టీ ప్రయత్నము లారీతిగానే పరిణమించుచున్నవి.మనదేశము నందలి సాంఘిక తత్వప్రచారము ఈదెసకేపరుగిడుచున్నది. దీని నెదిరించుటకై అనేక ఫ్యాసిస్టు ప్రయత్నములు లేచును;కానివానికి అర్ధాయున్నె కాని పూర్ణాయుర్దాయము దక్కదు.

మైలపూరు-మద్రాసు

1-8-1937 గరిమెళ్ళ సత్య నారాయణ.