చిరస్మరణీయులు, మొదటి భాగం/మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

69

చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf

26. మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌

(-1884)

దక్షిణ భారత దేశంలో బలమైన నైజాం సంస్థానంలో ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహించటమే కాకుండా స్వయంగా పోరాటంలో అగ్రభాగాన నిలచిన ధార్మిక నేతలలో మౌల్వీసయ్యద్‌ అల్లావుద్దీన్‌ ప్రముఖులు.

ప్రసుత ఆంధ్ర పదశ్‌ రాష్ట్ర రాజధాని, పూర్వ నెజాం సంస్థాన కేంద్రమైన హెదారాబాద్‌ ఆయన నివాసస్థలం. మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ జననం, తల్లి తండ్రుల వివరాలు, బాల్యం గురించి సమాచారం అందుబాటులో లేదు.

1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం ప్రారంభం కాగానే హైదారాబాద్‌లోని నిజాం నవాబు కూడ బ్రిటిష్‌ వ్యతిరేక పోరులో భాగస్వాములవుతారని స్వేఛ్ఛాపిపాసులైన ప్రజలు, నాయకులు ఆశించారు. ప్రథమ స్వాతంత్య్ర సమరంలో చేరకపోగా తిరుగుబాటును అణిచేందుకు ఆంగ్లేయులకు అండగా నిజాం నిలిచారు. ఆ వాతావరణంలో రంగప్రవశం చేసిన మౌల్వీసయ్యద్‌ అల్లావుద్దీన్‌, తుర్రేబాజ్‌ ఖాన్‌ లాంటి ప్రముఖులతో కలసి హైదారాబాదు కేంద్రంగా తిరుగుబాటు కార్యకలాపాలను ముమ్మరం చేశారు.

నిజాం సంస్థానంలో భాగమైన ఔరంగాబాదులో తిరుగుబాటుకు శ్రీకారం పలికి అక్కడ నుండి హైదారాబాద్‌ వచ్చిన యోధులు చిద్దాఖాన్‌ ఆయన అనుచరుల విడుదల

చిరస్మ రణీయులు 70

చేయాలన్న వినతిని నిజాం మన్నించక పోవటంతో ఖిన్నులైన ప్రజలు 1857 జులై 17న మక్కా మసీదులో పెద్దసంఖ్యలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బ్రిటిష్‌ రెసిడెన్సీ మీద దాడి చేయాలని మౌల్వీ అల్లావుద్దీన్‌ ఇతర నేతలు నిర్ణయించారు.

ప్రసుత కోిటీసెంటరులోని మహిళా కళాశాల భవనం ఆనాటి బ్రిటిష్‌ రాజ్య ప్రతినిధి నివాసం (బ్రిటిష్‌ రెసిడెన్సీ). మక్కా మసీదు నిర్ణయం మేరకు ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల సమయానికల్లా మౌల్వీ అల్లావుద్దీన్‌, పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ల నాయకత్వంలో 5 వందల మంది యోధులు రణనినాదం చేస్తూ ప్రస్తుత సుల్తాన్‌ బజారు నుండి బ్రిటిష్‌ ఆధిపత్యానికి చిహ్నమైన రెసిడెన్సీ మీద దాడికి ఉపక్రమించారు. ఈ దాడి విషయం నిజాం ద్వారా ముందుగా తెలుసుకున్న ఆంగ్లేయాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, అదనపు బలగాల సహాయంతో దాడిని తిప్పికొట్టారు. ఆ రాత్రంతా ఇరుపక్షాల మధ్య కాల్పులు సాగాయి. అనువుగాని వాతావరణం ఏర్పడేసరికి తెల్లవారు జామున స్వదేశీ యోధులు, దాడిని విరమించుకుని రణస్థలం నుండి నిష్క్రమించారు.

దక్షిణాదిలో జరిగిన ప్రధాన సంఘటనగా చరిత్ర ప్రఖ్యాతిగాంచిన ఆ దాడి పట్ల ఆగ్రహించిన నిజాం నవాబు, ఆంగ్లేయాధికారులుస్వదేశీ యోధుల పనిపట్టాలని నిర్ణయించుకున్నారు. నగరంలోని తిరుగుబాటు యోధులు, ప్రజల మీద నిజాం-ఆంగ్ల సైన్యాలు విరుచుకుపడ్డాయి. మౌల్వీ అల్లావుద్దీన్‌ను పట్టిచ్చిన వారికి 4 వేల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. నిజాం సైనికుల కన్నుగప్పి హైదారాబాద్‌ నుండి మౌల్వీతప్పించుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన బెంగళారు తదితర ప్రాంతాలలో రహస్యంగా సంచరిస్తూ ఒకటిన్నర సంవత్సరం పాటు పీర్‌ మహమ్మద్‌ అను సన్నిహితుని వద్ద గడిపారు. స్వంతగడ్డ, స్వజనుల మీద ఆంగ్లేయుల పెత్తనానికి చరమగీతం పాడేందుకు సయ్యద్‌ భిక్కూ, సయ్యద్‌ లాల్‌, మహమ్మద్‌ అలీ లాంటి తిరుగుబాటు నాయకులతో మౌల్వీ అజ్ఞాతంలో కూడా సంప్రదింపులు జరుపుతూ గడిపారు.

బ్రిటిష్‌ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుని సంస్థానంలో జరిగిన తిరుగుబాటు, దాడి పట్ల ఏమాత్రం ఉపేక్ష వహించరాదనుకున్న ఆంగ్లేయాధికారులు మౌల్వీకోసం వేటను ముమ్మరం చేశారు. చివరకు మౌల్వీ అల్లావుద్దీన్‌ను ఆంగ్లేయులు నిర్భంధించ గలిగారు. అనంతరం విచారణ తంతును జరిపించి ఆయనకు ద్వీపాంతరవాస శిక్ష విధించి, 1859 జూన్‌ 28న అండమాన్‌ దీవులలోని సెల్యులర్‌ జైలుకు పంపించారు. ఆ జైలులో పాతికేళ్లు దుర్భర నిర్బంధ జీవితం గడిపిన మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ 1884లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌