చిరస్మరణీయులు, మొదటి భాగం/మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

39

చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf

11. మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌

(1780-1857)

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో అగ్నికణాల్లా ఎగిసిపడుతున్నవీరులను ఉత్సాహపర్చడంలో పత్రికలు, పాత్రికేయులు బహుముఖ పాత్రవహించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల చర్య ల మీద అక్షరాగ్నులు కురిపిసూ,్త తిరుగుబాటు వీరులను ప్రోత్సహించిన ఆనాటి పాత్రికేయులలో మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ అగ్రగామి.

1780లో ముహమ్మద్‌ బాఖర్‌ ఢిల్లీలో జన్మించారు. తండ్రి మొహమ్మద్‌ అక్బర్‌. చిన్ననాటనే ధార్మిక-ప్రాపంచిక విషయాల పట్ల అత్యంత ఆసక్తి చూపిన బాఖర్‌లో స్వతంత్ర భావనలు చిగురించాయి. ప్రసిద్ధ ఢిల్లీ కాలేజీ విద్యార్థిగా ఉన్నత విద్యను పూర్తి చేసిన బాఖర్‌ కొంతకాలం ఉన్నత ఉద్యోగాలు చేసినా చిన్నతనంలోనే హృదయంలో నాటుకున్న సేfiఛ్చా, స్వాతంత్య్ర బీజాలు, స్వజనులు అనుభవిస్తున్న బానిసత్వం, ఆయనను ఆ ఉద్యోగాలలో నిలువరించలేకపోయాయి.

స్వతంత్ర జీవనం మాత్రమే కాకుండా, ప్రజలకు మార్గదర్శకం వహించగల వృత్తిని చేపట్టాలన్న దాక్పధంతో మౌలానా బాఖర్‌ జర్నలిజం వైపు మొగ్గు చూపారు. బ్రిటిషు పాలకుల దుష్ట సంకల్పాన్ని, అధికారుల దాష్టీికాలనూ ఎండగడ్తూ, ప్రజలకు వాస్తవాలు తెలిపి చెతన్యవంతుల్ని చేయాలన్నలక్ష్యంతో 1836లో ఢల్లీ ఉర్దూ అఖ్బార్‌ వారపత్రికను


చిరస్మ రణయులు 40

ఆరంభించారు. ఈ పత్రిక అతి కొద్ది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ప్రముఖ కవులు బహుద్దూర్‌ షా జఫర్‌, మీర్జా గాలిబ్‌, హఫీజ్‌ గులాం రసూల్‌, మీర్జా మొహమ్మద్‌ అతీ భక్త్‌, మీర్జా హైదర్‌ షికో, మీర్జా జీవన్‌ భక్త్‌, మీర్జా నూరుద్దీన్‌ లాంటి ప్రసిద్థ కవులు-రచయితలు ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ కు రాశారు.

1857 మే 10న ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రారంభం కాగానే, మే 17 నుండి బాఖర్‌ పత్రిక సంగ్రామానికి సంబంధించిన అన్ని ప్రాంతాల విశేషాలను 'సంగ్రామ విశేషాలు' శీర్షికన ప్రచురించటం ఆరంభించింది. ఈ సంచికలో 'రాఖిం ఆసిం' అను పేరుతో ఆంగ్లేయుల చర్యలను ప్రశ్నిస్తూ, పోరాటయోధుల చర్యలను సమర్థిస్తూ సుదీర్గ… లేఖను ఆయన ప్రకటించారు. చివరకు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యోధులకు, నేతలకు, తిరుగుబాటును ప్రోత్సహించే ప్రజలకు, కవులు, రచయితలకు ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ వేదిక అయ్యింది. మొగల్‌ పాదుషా బహుదూర్‌ షా జఫర్‌ కూడా ఆ పత్రిక ద్వారా ప్రజలకు సందేశాలు, సమాచారం పంపించారు.

పరాయి పాలకుల మీద విజయం సాధించాలంటే హిందూ-ముస్లిం ఐక్యత అత్యవసరమని ప్రకటిస్తూ,ఆలక్ష్యాన్ని సాధిచేందుకు పురాణాలు, చరిత్రను ఉంటంకిసూ, పురాణ పురుషులు, చారిత్రక వ్యక్తుల ధైర్య సాహసాలను ఉదాహరిస్తూ ఢల్లీ ఉర్దూ అఖ్బార్‌ వ్యాసాలు ప్రచురించింది. ఆంగ్లేయ పాలకులను తరిమి కొట్టల్సిందిగా ప్రజలను, స్వదేశీ సైనిక యోధులను ఉత్తెజపర్చుతూ శరపరంపరగా వ్యాసాలు, వ్యాఖ్యానాలు ప్రచు రించడం వలన అహంకారం దెబ్బతిన్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు బాఖర్‌ను ఢిల్లీలోని తమ ప్రథమ శత్రువులలో ఒకరుగా పరిగణించారు.

చివరకు 1857 సెపెంబరు 18న ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం విఫలం కావటంతో డిసెంబరు 14న మౌలానా మహమ్మద్‌ బాఖర్‌ను ఆంగ్లేయాధికారులు నిర్బంధించారు. ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నపలువుర్ని నిరాయుధులను చేసి నిర్ధాకణ్యంగా కాల్చి చంపిన దుష్టచరిత్ర గల మేజర్‌ హడ్సన్‌ విచారణ పేరుతో మౌలానా బాఖర్‌ను భయానక చిత్రహింసలకు గురిచేసి డిసెంబరు 17న కాల్చివేశాడు.

ఆంగ్లేయుల కబంధహస్తాల నుండి మాతృభూమి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో కలాన్ని ఆయుధంగా చేతపూని అక్షరాగ్నులతో శతృవును దహించివేస్తూ చివరికి ఆంగ్లేయుల దాష్టీకానికి ప్రాణాలు బలిపెట్టిన ప్రప్రథమ పత్రికా సంపాదకుడిగా, మౌలానా ముహ్మద్‌ బాఖర్‌ పత్రికా ప్రపంచంలో నూతన అధ్యాయాన్ని సృష్టించి చిరస్మరణీయ ఖ్యాతిని గడించి భవిష్యత్తు తరాలకు ఆదర్శమయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌