చిరస్మరణీయులు, మొదటి భాగం/ముల్లా అబ్దుల్ ఖయ్యూం ఖాన్
79
31. ముల్లా అబ్దుల్ ఖయ్యూం ఖాన్
(1853-1906)
ప్రభువు ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిసినా ప్రజలపక్షం వహించి, జాతీయోద్యామంలో భాగంగా బ్రిటిషు-నిజాం వ్యతిరేక పోరాటాల దిశగా ప్రజల్ని మేల్కొల్పిన తొలితరం వైతాళికులలో ముల్లా అబ్దుల్ ఖయ్యూం ప్రముఖులు. ముల్లా అబ్దుల్ ఖయ్యూం 1853లో మద్రాసులో జన్మించారు. ఆయన ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఆయన తలితండ్రులు హెదారాబాదుకు వచ్చి నైజాం సంస్థానంలో స్థిరపడ్డారు. అబ్దుల్ ఖయ్యూం దారుల్ ఉలూంలో పర్షియన్, అరబ్బీ భాషలను నేర్చుకున్నారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూరు వెళ్ళి ఉన్నత విద్య పూర్తి చేసి వచ్చిన ఆయన 1875లో హైదారాబాద్ సంస్థానంలో ఉద్యోగిగా ప్రవేశించారు. ప్రతిభా సంపన్నుడైన ముల్లా అబ్దుల్ ఖయ్యూం అచిరకాలంలో ఉన్నతాధికారిగా ఎదిగారు. 1880లో సరోజనీ నాయుడు తండ్రి డాక్టర్ అఘోరనాధ్ చోపాధ్యాయతో ఆయనకు కలిగిన పరిచయం హిందూ-ముస్లింల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలచి, హైదారాబాదు సంస్థానంలో ప్రముఖ చారిత్రక సంఘటనలకు, పరిణామాలకు కారణం అయ్యింది. ప్రజోపకర కార్యక్రమాల పట్ల చిన్నతనం నుండి శ్రద్ధ చూపుతూ వచ్చిన ఆయన ప్రబుత్వాధికారిగా బాధ్య తలు నిర్వహిస్తూ ప్రజలలో విద్యావాప్తికి నవ్య చెతన్యానికి
చిరస్మ రణయులు 80 ప్రాధాన్యతనిచ్చి కృషి చేశారు. ఆ దిశగా కృషి సాగించేందుకు పలు సంస్థలను, సంఘాలను స్థాపించారు. ఆ సంస్థలను ఆర్థికంగా ఆదుకున్నారు. డాక్టర్ అఘోరనాధ్‌తో కలసి, 1883 నాటి చందా రల్వే పదకం వ్యతిరేక పోరాటంలో పాల్గొని నైజాం నవాబు ఆజ్ఞలను సామాన్యప్రజలు కూడా వ్యతిరేకించ వచ్చన్న చైతన్యాన్నికల్గించారు. ఈ విధంగా హెదారాబాద్ సంస్థానంలో పునర్వికాస ఉద్యమానికి పదనిర్దేశకు లుగా సుప్రసద్దు లయ్యారు. ఆ కారణంగా నిజాం ఆగ్రహానికి గురైన అబ్దుల్ ఖయ్యూం హైదారాబాదు నగరం వదలి కొంత కాలం మద్రాసులో తలదాచుకోవాల్సి వచ్చింది.
1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరగ్గానే హెదారాబాద్ సంస్థానం నుండి సభ్యత్వంస్వీకరించిన మొట్టమొదటి ముస్లిం నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ సాగిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాన్నిఎదాుర్కొంటూ Safir-e-Deccan అను పత్రికలో వ్యాసాలు రాశారు. 1905లో ఓ కరపత్రం ప్రచురించి తన విమర్శకుల నోళ్ళు మూయించారు. నైజాం నవాబు తాఖీduలను ఖాతరు చేయకుండా ముస్లింలను మాత్రవు కాకుండా సర్వజనులను భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరమన్నారు.
1905లో బెంగాలు విభజన వ్యతిరేకోద్యమంలో ప్రముఖపాత్ర వహించిన ఆయన స్వదేశీ ఉద్యామానికి జవసత్వాలు అందించటంలో తోడ్పడ్డారు. ప్రజా ఉద్యమాల విజయం కోసం హిందూ-ముస్లింల ఐక్యతావసరాన్ని గుర్తించిన ఆయన ఆ దిశగా ముమ్మరంగా కృషి సాగించి, 'ఆయన హిందూ-ముస్లింల ఐక్యతా ప్రవక్త మాత్రమే కాకుండా ఐక్యతకు సజీవరూపం' అని ప్రజలు, ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు.
అబ్దుల్ ఖయ్యూం ధార్మికంగా ఇస్లాం అనురక్తుడైన ముస్లిం అయినప్పటికి ఆయనలో పరిఢవిల్లిన పరోపకార భావనలు, దేశభక్తి సుగంధాలు, విశ్వమానవ సౌభ్రాతృత్వ గుభాళింపులు, ఆయనను 'గొప్ప ముస్లిం, గొప్ప భారతీయుడు, మరియు గొప్ప మనీషి' గా సరోజినీ నాయుడుచే అభివర్ణింప చేశాయి. ప్రజల సంక్షేమాన్ని, ప్రజా చైతన్యాన్ని ఆశిసూ,పునర్వికాసం కోసం అబ్దుల్ ఖయ్యాం వ్యక్తీకరించిన పోరాట రూపాలు ఆయనకు బ్రిటిష్-నిజాం వ్యతిరేక పోరాట యోదులలో ప్రముఖ స్థానాన్ని సంతరింపజేశాయి.
ఈ విధంగా అధికారిగా ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, జీవిత పర్యంతం అటు ప్రజలలో విద్యావ్యాప్తికి, నవ చైతన్యానికి, ఇటు జాతీయోద్యమానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న ముల్లా అబ్దుల్ ఖయ్యూం ఖాన్ చివరివరకు ఆ మార్గాన ప్రయాణం చేస్తూ 1906 అక్టోబరు 27న చివరిశ్వాస విడిచారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్