చిరస్మరణీయులు, మొదటి భాగం/ఖుదీరాం కి దీది
81
32. ఖుదీరాం కి దీది
(-)
బ్రిటిష్ వలసపాలకుల బానిసత్వం నుండి స్వదేశాన్ని విముక్తం చేసి, స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఉత్సాహంతో యువతరం ఆయుధాలు చేపట్టి విస్పులింగాలై బ్రిటిష్ ప్రబుత్వం, ఆంగ్లేయాధికారుల మీద విరుచుకుపడుతున్న అగ్నియుగం రోజులవి.
విప్లవకారుల అణిచివేతకు పలుచట్టాలను రూపొందించి విప్లవోద్యమాన్ని దుంపనాశనం చేయడానికి అన్నిరకాల అధికారాలను ప్రసాదించి పోలీసు అధికారులను ఆంగ్లేయ ప్రబుత్వం ప్రజల మీదకు ఉసికొల్పింది. విప్లవకారులకు సహాయపడు తున్నారని ఏ మాత్రం అనుమానం వచ్చినా అటువంటి వారిని అక్రమంగా నిర్బంధించి, తీవ్రంగా హింసించి అంతం చేస్తున్నభయానక వాతావరణమది.
బ్రిటిష్ పోలీసుల దాష్టీకాలను భరించలేక కుటుంబ సభ్యులే విప్లవకారులైన తమ బిడ్డాలతో సంబంధాలు వదులుకుంటున్న పరిస్థితులలో పోలీసు చర్య లకు భయపడకుండా విప్లవయోదుడు ఖుదీరాం బోసుకు అండగా నిలవడమే కాకుండా ఆయనకు ఆశ్రయం కల్పించి ఆమె ఆదుకున్న యోదురాలు ఖుదీరాం కి దీది. ఆ ఉద్యమకారుని పట్ల అంతటి సాహసోపేత ఆదరణ చూపినందున ఆమెను ఆయన దీది (అక్కయ్య) అని సంభోదించారు. ఆయన సంబోధన కారణంగా ఆమె ఖుదీరాంకు మాత్రమే కాకుండా అందరికీ ఖుదీరాం
చిరస్మరణీయులు 82
కి దీది ఆయ్యారు. ఆమె అసలు పేరు తెలియదు. చరిత్ర ఆమెను ఖుదీరాంకి దీది (ఖుదీరాం అక్కయ్య) గా మాత్రమే గుర్తించింది. ఆ పేరుతోనే ఆమె స్వాతంత్య్రోద్యమ చరిత్రలో గణుతికెక్కారు. ఆమె ప్రముఖ విప్లవకారులు మౌల్వీ అబ్దుల్ వహీద్ చెల్లెలు. అన్నకు తగ్గ చెల్లెలుగా ఆమె కూడ బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక పోరాటాలలో పాల్గొని ఆనాటి పోరాట యోధులకు అండదండలందించారు. (Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi,1993, Page. 34)
విప్లవ యోధులను పొట్టనపెట్టుకుంటున్న ఆంగ్లేయాధికారులను మట్టుబెట్టాలని ప్రయత్నిస్తున్న భయమెరుగని విప్లవయోధుడు ఖుదీరాంను మీద ఆంగ్లేయాధికారి కెన్నడీ (Kennedy) భార్యను హత్య చేసారన్నది ఆరోపణ. బ్రిటిష్ మహిళను హత్యగావించాడని ఆగ్రహంతో రగిలిపోతున్న అధికారులు ఖుదీరాం బోసు సమాచారం కోసం, ప్రజలపై, విప్లవోద్యమ సానుభూతిపరులపై విరుచుకుపడి, విద్వంసం సృష్టిస్తున్నారు, చిత్రహింసల పాల్జేస్తున్నారు. ఆ పరిస్థితులలో ఆమె ఖుదీరాంను రక్షించపూనుకోవటం సాహసం.
ఆ విషయాన్నిపోలీసులు ఏమాత్రం పసిగట్టినా, ఖుదీరాంతోపాటుగా ఆమె కూడా దారుణ చిత్రహింసలకు గురికావటమేకాక ప్రాణాలను కూడా అర్పించాల్సి వచ్చేది. ఆ భయానక వాతావరణంలో కూడా ఆమె భయపడలేదు. అక్కయ్యకు ఏమాత్రం కష్టం- నష్టం కలిగించటం ఇష్టంలేక కొంతకాలం తరువాత ఖుదీరాం ఆమె వద్దనుండి వెళ్ళి పోయారు. ఆ తరువాత అరెస్టయ్యారు. ప్రభుత్వం ఆయనను చాలా కాలం నిర్బంధంలో ఉంచింది. ఆ సమయంలో కూడా జైలులో నున్న ఖుదీరాం క్షేమసమాచారాలను తెలుసుకోడాకి ఆమె ఎంతో తెగింపుతో ప్రయత్నించారని ఆ యోధురాలి సాహసాన్ని వివరిస్తూ చరిత్రకారుడు Santimoy Ray, తన Freedom Movement and Indian Muslims (Page. 34) లో బహువిధాల ప్రశంసించారు.
చివరకు విప్లవ యోధుడు, పిన్నవయస్కుడైన ఖుదీరాంను ముజఫర్‌పూర్ జైలులో 1908 ఆగస్టులో ఉరితీశారు. ఆ యోధుడికి ఉరిశిక్ష విధించిన విషయం తెలుసుకున్న ఆమె బ్రిటిష్ ప్రభుత్వంనుండి ఎదురయ్యే తీవ్ర పరిణామాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రభుత్వాన్ని, పోలీసు వర్గాలను తీవ్రంగా విమర్శించారు.
ఈ విధంగా అత్యంత కష్టకాలంలో విప్లవకారులకు అండగా నిలచి, కోరి తెచుచకున్న కషనష్టాలను చిరునవ్వుతో భరించిన ఆ యోధురాలు భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఖుదీరాం కి దీది గా చిరస్మరణీయమైన ఖ్యాతిని స్థిరపర్చుకున్నారు.
సయ్యద్ నశీర్ అహమ్మద్